NaReN

NaReN

Saturday, May 14, 2022

విజయం అంటే ఏమిటి

 *💥విజయం అంటే ఏమిటి?*

    🕉️🌞🌎🏵️🌼🚩 

    

 *మన దేశం నుండి    ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీ     లో విద్యార్థులతో మాట్లాడుతూ….    “విజయం అంటే ఏమిటి?” అని అడిగితే ఒక యువతి “విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం!”అన్నది.* 

 *అపుడు ఆ ప్రొఫెసర్* 

 *“అయితే ఇరవైఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో చెప్పండి?” అంటే ఎవరూ చెప్పలేదు.* 

 *[ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి]* 


 *బ్రతకడానికి కొంత డబ్బు కావాలి కానీ , డబ్బే బ్రతుకు కాదు!*                

 *అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట.* 

   

 *మరో యువకుడు లేచి “విజయం అంటే బలం / శక్తి”  అన్నాడు.* 


 *అలా అయితే    అలెగ్జాండర్ , నెపోలియన్, ముస్సొలిని, హిట్లర్ , స్టాలిన్ , బిన్ లాడెన్ ... వీళ్ళంతా* *బలవంతులు, ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా, వీళ్ళు జీవితం లో సంతోషంగా వుండగలిగారా ?  వీళ్ళ జీవితాలు ఎలా గడిచి , ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా ! తన బలంతో , తన ముష్టిఘాతాలతో మహా బలవంతులను మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్ , తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల  కాఫీకప్పును కూడా పట్టుకోలేక* *పోయాడు. అయితే విజయమంటే బలం / శక్తి సంపాదన కాదు అన్నమాట.* 


 *మరో యువతి “విజయమంటే ప్రఖ్యాతి, అందం!” అంది. అయితే కేట్ మోస్ , జీన్ ష్రింప్టన్ , సోఫియాలారెన్ , మార్లిన్ మన్రో ...లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు.  భారత్ విషయానికొస్తే , పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే , అమితాబ్ బచ్చన్ తో సహా , ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకొనని హిందీ సినిమా హీరో నే లేడు. డానీ, కబీర్ బేడీ , మహేష్ భట్ లతో ఆమె ప్రేమ , పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర , రాజేష్ ఖన్నా , అమితాబ్ బచ్చన్ .. ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే. కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి , నమ్మిన వాళ్ళు మోసం చేస్తే , తాగుడుకు బానిస అయ్యి , ఒక దశలో కాలికి కురుపు లేచి , అది ఒళ్ళంతా ప్రాకి , ఏ శరీరం కోసం అయితే అంతమంది మగ వాళ్ళు పిచ్చిక్కెపోయారో , అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే , ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని , జనం ఆమెను తాళ్ళతో కట్టి  , ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని కంప్లైంట్ చేస్తే , కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు. అయితే అందం , ప్రఖ్యాతి అనేవి విజయం *కావన్నమాట!* 

 *మరోసారి మరొకరు* *“విజయమంటే అధికారం” అని అన్నారు.* 


 *”అయితే కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి!” అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు.* 


 *మా అనంతపురంలో  ఒకప్పుడు రాష్ట్రపతి గా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి , పందులు దొర్లుతున్నాయి. విజయం అంటే అధికారం కాదు అన్న మాట.* 


 *చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీ లో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు  - “విజయం అంటే ఏమిటి?”  అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు , “మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా?” అందరూ 'తెలుసు’ అన్నారు. “వాళ్ళ అవ్వ , తాతల పేర్లు తెలుసా?” అని అడిగితే అయిదారుమంది “తెలుసు” అన్నారు. “వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా?” ‘తెలియదు’ అన్నారు.* 

 *అపుడు ప్రొఫెసర్ గారు “శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , బుద్ధుడు , ఆదిశంకరుడు , అందరూ…?”* 


 *” *ఓ , తెలుసు!” అని ముక్తకంఠం తో బదులిచ్చారు.* 


 *”మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు?”అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి , ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు తిరుగుతుండగా ఇలా అంది : “సార్ , మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం , రాముడు , కృష్ణుడు , బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం ఇదే….   తమ కోసం , తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది , ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే!”* 


 *నా గురించి నేను దు:ఖించక పోవడమే నా ఆనందానికి కారణం!” అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట , “ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు , అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క* 


🕉️🌞🌎🏵️🌼🚩

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE