NaReN

NaReN

Friday, May 20, 2022

ప్రకృతితో సావాసం మరిచామా.....

 ప్రకృతితో సావాసం మరిచామా.....




చక్కగా ఆవు పేడ తో కళ్ళాపి జల్లిన ఆ తెలుగింటి లోగిల్లు... 

హాయిగా బయట నవ్వారు మంచాల మీద ఉతికి ఉతికి అరిగిపోయి శుభ్రంగా తెల్లగా ఉండే దుప్పట్ల మీద నిద్రలు... 

మంచం కింద రాగి చెంబులో నీళ్లు.....

తెలతెల్లవారుతుండగా ఆ చీపుల్లతో వాకిలి ఊడుస్తున్న శబ్దాలు....

ఆ పెడ కళ్ళాపి జల్లుతుంటే మంచం జరిపి మళ్ళీ ఓ కునుకు తీసిన రోజులు...

10 గంటలకల్లా వేడి వేడి అన్నం పప్పు కూరతో అంత ఘుమఘుమ లాడే నెయ్యి వేసుకొని వేళ్ళు పళ్లెం తో సహా నాకేసి తిన్న రోజులు...

మండుటెండలో ఇంటి పెరట్లో వేప చెట్టు కింద ఆటలు...

సాయంత్రం 7 గంటలకల్లా శుభ్రంగా స్నానం చేసి అమ్మ అన్నం తినిపిస్తే కడుపు నిండా తినేసిన రోజులు...

వరుసగా వాకిలిలో వేసిన మంచాల మీద నిద్రకు ముందు పెద్దోళ్ల కబుర్లు...కథలు..

అలా ఆకాశంలోకి చూస్తూ చుక్కలు లెక్కపెడుతూ నిద్రలోకి జారుకున్న రోజులు...

అర్ధరాత్రి దారి తప్పిన పక్షుల అరుపులు....

అప్పుడప్పుడు గాలికి ఊగే కొబ్బరి చెట్టు ఆకుల శబ్దాలు....

ఆహా...ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండు....

ఎంత సాంకేతికంగా ముందుకు పోతే అంత వింత జబ్బులు...

మనిషి ప్రాణానికి భద్రత లేని ఏ సాంకేతిక అభివృద్ధి అయిన ఎం ఉపయోగం...

ప్రకృతి అవసరాలు తీర్చే రోజుల నుండి అత్యవసరాలకు...సుకాలకోసం దోచుకోవడం..దుర్వినియోగం చేయడం ఈ విపత్కర రోగాలకు కారణం...

మారాలి మనం...

ప్రకృతిని కాపాడాలి...

అదే మనిషి ఉనికికి జీవనాధారం...

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE