NaReN

NaReN

Sunday, May 15, 2022

కుటుంబం

కుటుంబం

జీవన తరంగాలు ఎగసి పడుతున్నాయి.

అంతరంగాలను దూరం చేస్తున్నాయి.

జీవనశైలి ఏనాడో మారిపోయింది. 

విదేశాలలో ఉద్యోగాలకోసం కొందరు,

జీవనోపాధికోసం, పట్టణాలకు వలసలు కొందరు,

ఉమ్మడికుటుంబాలకు దూరమైనవారే.

ఓ వైపు,అధిక ధరలు,పెరిగిన పన్నులు,

ఆర్ధిక స్థోమతను కృంగదీస్తుంటే,

స్వార్థపూరిత ప్రయోజనాలు మరోవైపు.

కుటుంబ వ్యవస్థను చిన్నా,భిన్నం

చేసాయి.

గౌరవ మర్యాదలకు,సంస్కృతి సాంప్రదాయాలకు,

ఓ పాఠశాల కుటుంబ వ్యవస్థ.

అమ్మనాన్న,అన్నదమ్ములు,అక్కాచెల్లెళ్లతో,

ఆనందంతో,కళ కళలాడిన లోగిళ్ళు ఏవి.

ఇరుకు గదులతో,మనసును ఇరుకు చేసారు.

నాకు నువ్వు, నీకు నేను.

మనిద్దరికి ఓ శిశువు.

అమ్మనాన్నలు,అత్తమామలు 

మనిద్దరికి బరువు.

వృద్ధాశ్రమంలో చేర్చేద్దాం అంటూ..

కుటుంబ వ్యవస్థను ఏనాడో బ్రష్షు పట్టించారు.

అనురాగం,ఆప్యాయతలకు అది ఒక నిలయం.

సంస్కారం,సాంప్రదాయాలకు అది ఒక ఆలయం.

కుటుంబ వ్యవస్థ బాగుంటేనే,

సమాజాభివృద్ది చెందుతుంది.

               🙏🙏🙏

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE