NaReN

NaReN

Monday, May 2, 2022

పండ్లు తింటున్నారా..

 ✍🏼💧


పండ్లు తింటున్నారా..🥭🍌

అవి స్వచ్ఛమైనవేనా..?


ప్రకృతి మనకు అందించిన వరం ఫలాలు, ఆరోగ్యం కోసం, ప్రతిరోజూ ఒక పండు తినాలని వైద్యులు సూచిస్తారు, ఇక సీజనల్ పండ్ల గురించి చెప్పనవసరమే లేదు, వేసవిలో మార్కెట్లో అందుబాటులో ఉండే పండ్లలో *మామిడిది*  ప్రత్యేక స్థానం ఉంది

మధుర ఫలం, అమృత ఫలంగా పిలువబడే మామిడి అంటే ఇష్టపడని వారంటూ ఉండరు, అయితే ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న తొంభై శాతం పండ్లు రసాయనాలతో మగ్గపెట్టినవే, రసాయనాలతో కృత్రిమంగా మగ్గపెట్టి, మార్కెట్ లో అమ్మెటప్పుడు గడ్డి *//* మామిడి ఆకులలో పెట్టి అమ్ముతున్నారు, ఇలాంటి పండ్లు తినటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు

ఇక నగరంలోని ఫ్రూట్ మార్కెట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసినప్పుడు చాలా చోట్ల ప్రమాదకర రసాయనాలతో మగ్గపెడ్తున్నట్లు తేలటం ఆందోళనకు గురి చేస్తుంది ...

సహజంగా పండే పండ్లు ఆరోగ్యానికి హాని కలిగించవు, కానీ ప్రమాదకర రసాయనాలతో మగ్గిన పండ్లు ఆరోగ్యానికి చాలా ప్రమాదం, సరిగ్గా ఇప్పుడు పట్టణంలో ఇదే జరుగుతోంది, ఏ ఫ్రూట్ మార్కెట్లో చూసినా ప్రమాదకర రసాయనాలతో పండ్లను మగ్గించటమే కనిపిస్తోంది ...

ఇప్పుడు పట్టణంలో ఎక్కడ చూసినా బంగారం వర్ణంతో మెరిసిపోతున్న మామిడి పండ్లే దర్శనమిస్తున్నాయి, ఫ్రూట్ మార్కెట్లతోపాటు, తోపుడు బండ్లులలో మామిడి పండ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి, మెరిసేదంతా బంగారం కాదన్నట్లు, ఇప్పుడు మార్కెట్లో చూడగానే బంగారం వర్ణంతో కనిపిస్తూ, తియ్యని వాసనను వెదజల్లుతున్న మామిడి పండ్లు అంత మంచివి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ...

*ఇక సహజంగా పండే పండ్లు ఎక్కువగా బంగారు వర్ణంలో ఉండవని మరియు ఎక్కువగా తియ్యని వాసనను వెదజల్లవని, ఇలా ఉన్నాయంటే అవి కచ్చితం రసాయనాలతో మగ్గిన పండ్లు అర్థం చేసుకోవాలి*


*ఇలాంటి పండ్లు తిని భయంకరమైన రోగాలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, ప్రకృతి సహజంగా మగ్గించిన పండ్లును తినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి*

🍐🍊🥭🍌🥭🍊🍐

🌳🌳🌳💎🌳🌳🌳

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE