NaReN

NaReN

Tuesday, May 31, 2022

అమ్మవారి చీరెను భక్తులు ధరించవచ్చా ?

 🕉 అమ్మవారి చీరెను భక్తులు ధరించవచ్చా ? 🕉


🕉 సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి అలంకరింప చేసిన చీరె(శేష) వస్త్రాన్ని భక్తులు(మహిళలు) ధరించవచ్చా..? 

అందులో  లాభాలేంటి ? 

పాటించాల్సిన నియమాలేంటి? 

ఈ విషయాలను తెలుసుకోవాలంటే మనం ఈ వార్త చదవాల్సిందే.


👉శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కొలువుదీరి ఉంటారు. పురుషులకంటే ఎక్కువగా మహిళలు ఆ దేవాలయాలకు క్యూ కడుతుంటారు.


👉పూలు, కుంకుమ, గాజులు, చీరె, రవికెలను కానుకలుగా సమర్పిస్తుంటారు. ఆ చీరెను విశేషమైన రోజుల్లో ఆ చీరను మూలమూర్తికి అలంకరింప చేయమని పూజారులకు చెబుతుంటారు.


👉ఆ తరువాత ఇలాంటి చీరెలను ఆలయ నిర్వాహకులు భక్తుల సమక్షంలో వాటిని వేలం వేస్తుంటారు. ఆ చీరె దక్కితే చాలని చాలా మంది భక్తులు వేలంలో కొనుక్కుంటుంటారు.


👉అయితే అసలు అమ్మవారి చీరె(శేష వస్త్రం)ను సాధారణ మహిళలు ధరించవచ్చా ? 

అనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది. అమ్మవారి చీరెలను ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి.


👉కానీ, ధరించినప్పుడు పాటించాల్సిన నియమాలేమిటి? 

ఎంత సంతోషంగా వేలం పాటలో సొంతం చేసుకుంటామో.. ఆ చీరెను ధరించినప్పుడు కూడా అంతే పవిత్రంగా ఆ మహిళలు ఉండాలి. 

అందుకు కొన్ని నియమాలను పాటించాలని అంటున్నాయి.


👉అమ్మవారి శేష వస్త్రాన్ని ధరించే ముందు తిథి – వర్జ్యం చూసుకుని “శుక్రవారం” రోజున అమ్మవారి చీరను ధరించవచ్చు. అది కూడా ఉదయం వేళలో కొంతసేపు మాత్రమే ధరించాలి.


👉ఈ చీరెను ధరించినంత సేపు ప్రశాంతత కలుగుతుంది. అలాగే మనం కూడా ప్రశాంతంగా ఉండాలి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. రాత్రి సమయాల్లో ఈ చీరెను ధరించ కూడదు. ఆ చీరెను ఎప్పుడు ఉతికినా ఆ నీటిని ఎక్కడపడితే అక్కడ కాకుండా మొక్కలకు పోయవలసి వుంటుంది.


👉అప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలా కాకుండా నియమాలను పాటించకపోతే, ఫలితం ఉండదు. ఆ పవిత్రత మనకు దక్కదు. ... *✒️ * 🙏

నీ ఆరోగ్యం తెలుసుకో

 నీ ఆరోగ్యం తెలుసుకో...


ప్రతి మానవుని జీవితంలో ముఖ్యమైన వైద్య సంబంధిత వివరాలు. ప్రత్యామ్నాయ మార్గాలు.


 1. రక్తపోటు: 120/80

 2. పల్స్: 70 - 100

 3. ఉష్ణోగ్రత: 36.8 - 37

 4. శ్వాసక్రియ: 12-16

 5. హిమోగ్లోబిన్: పురుషులు (13.50-18)

  ఆడవారు ( 11.50 - 16 )

 6. కొలెస్ట్రాల్: 130 - 200

 7. పొటాషియం: 3.50 - 5

 8. సోడియం: 135 - 145

 9. ట్రైగ్లిజరైడ్స్: 220

 10. శరీరంలో రక్తం మొత్తం:

 Pcv 30-40%

 11. చక్కెర: పిల్లలకు (70-130)

  పెద్దలు: 70 - 115

 12. ఐరన్: 8-15 మి.గ్రా

 13. తెల్ల రక్త కణాలు: 4000 - 11000

 14. ప్లేట్‌లెట్స్: 150,000 - 400,000

 15. ఎర్ర రక్త కణాలు: 4.50 - 6 మిలియన్లు..

 16. కాల్షియం: 8.6 - 10.3 mg/dL

 17. విటమిన్ D3: 20 - 50 ng/ml (మిల్లీలీటర్‌కు నానోగ్రామ్‌లు)

 18. విటమిన్ B12: 200 - 900 pg/ml


   50 ఏళ్ళు చేరుకున్న వారికి చిట్కాలు:*

    


  *మొదటి చిట్కా:*

  మీకు దాహం అనిపించకపోయినా లేదా అవసరం లేకపోయినా  నీరు త్రాగండి ... అతి పెద్ద ఆరోగ్య సమస్యలు మరియు వాటిలో ఎక్కువ భాగం శరీరంలో నీరు లేకపోవడం.  రోజుకు కనీసం 2 లీటర్లు (24 గంటలు)


 *రెండవ చిట్కా.              క్రీడలు ఆడండి... శరీరాన్ని కదిలించవలసి ఉంటుంది, కేవలం నడవడం ... లేదా ఈత కొట్టడం ... లేదా ఏ  క్రీడలు అయినా.  🚶 నడక ప్రారంభానికి మంచిది... 


  *మూడవ చిట్క

 విపరీతమైన ఆహార కోరికలను వదిలేయండి... ఎందుకంటే అది ఎప్పుడూ మంచిని తీసుకురాదు.  ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ల ఆధారిత ఆహారాలను ఎక్కువగా ఉపయోగించండి.


  *నాల్గవ చిట్కా*

  వీలైనంత వరకు, అత్యవసరమైతే తప్ప కారును ఉపయోగించవద్దు... మీకు కావలసిన దాని కోసం (కిరాణా, ఎవరినైనా  దగ్గర ఉన్నవారిని కలవడం...)  చేరుకోవడానికి నడకతో ప్రయత్నించండి.  ఎలివేటర్, ఎస్కలేటర్‌ను ఉపయోగించడం కంటే మెట్లు ఎక్కి వెళ్ళండి


 *ఐదవ చిట్కా*

   కోపాన్ని వదలండి..

  చింత విడిచిపెట్టండి.అవన్నీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి సానుకూలంగా ఉన్న వ్యక్తులతో మాట్లాడండి.


 *ఆరవ చిట్కా*

  మీ చుట్టూ ఉన్నవారిని పరిమితం చేయకండి.ఎల్లప్పుడు కలసి ఉండటానికి ప్రయత్నం చేయండి


 *ఏడవ చిట్కా*

  ఎవరి పట్ల లేదా మీరు సాధించలేని వాటిపైన మీరు విచారించకండి, దానిని  మరచిపోండి;


 *ఎనిమిదవ చిట్కా*

 డబ్బు, పలుకుబడి, అధికారం, ... అవన్నీ అహంకారాన్ని కలిగిస్తాయి. కాని వినయం  ప్రజలను మీకు దగ్గర చేస్తుంది.  


 *తొమ్మిదవ చిట్కా*

 మీ జుట్టు బూడిద రంగులోకి మారితే, దీని అర్థం జీవితం అంతం కాదు.  మెరుగైన జీవితం ప్రారంభమైందనడానికి ఇది నిదర్శనం.   ఆశావాదంగా ఉండండి,  ఆనందించండి. 🙏🏻


Monday, May 30, 2022

📣📣 LPG సిలిండర్ వినియోగదారు లందరూ

 📣📣 LPG సిలిండర్ వినియోగదారు లందరూ  ఈ విషయాన్ని గమనించాలి.అన్ని గ్రూపులకు తెలియ జేయండి.

ఒకరి వాస్తవానుభవం తెలిపిన వైనం....

గత ఆదివారం నాకు ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది.నేను గ్యాస్ సిలిండర్ మార్చవలసి వచ్చింది.నేను కొత్తది సరిచేయడానికి ప్రయత్నించినప్పుడు, నేను గ్యాస్ వాసన వచ్చి, అది లీక్ అవుతుందని గ్రహించాను. వెంటనే నాబ్ ఆఫ్ చేసాను.

నేను ఒకటి లేదా రెండు ఏజెన్సీలకు ఫోన్ చేసాను, కానీ ఆదివారం కావడంతో ఎవ్వరూ స్పందించలేదు.సోమవారం హాజరవుతారని తెలిపారు.ఏదైనా ఎమర్జెన్సీ నంబర్ ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాను, కాబట్టి 

Googleని ప్రయత్నించాను.


Google *1906*ని పిలవాలని సూచించింది.


నేను ప్రయత్నించాను.ఒక మహిళ ఫోన్ తీసి హిందీలో మాట్లాడింది.నేను ఆమెకు నా సమస్యను వివరించాను.ఒక వ్యక్తి గంట

లోపు వస్తారని, పనికి హాజరవుతారని ఆమె చెప్పారు.సందర్శనకు ఎటువంటి రుసుము లేదు, కాబట్టి నేను చెల్లించాల్సిన ట్యూబ్ చెడిపోయినట్లయితే తప్ప నేను అతనికి చెల్లించాల్సిన అవసరం లేదని ఆమె తెలిపింది.నాకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక యువకుడు అరగంటలోనే కనిపించాడు, తనిఖీ చేసి, సిలిండర్‌కి కొత్త వాషర్‌ని వేసాడు. 

ఇది చాలా చిన్నపని అని అన్నాడు.అతను ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు.

*కేంద్ర ప్రభుత్వం* నుండి ఏ సమయంలోనైనా సేవ అందించబడుతుంది.

మహిళ ఒక గంట తర్వాత మళ్లీ ఫోన్ చేసి, పనికి హాజరయ్యారో లేదో తనిఖీ చేసింది.

_______________


దయచేసి ఈ టెలిఫోన్ నంబర్‌ని మీకు తెలిసిన బంధువులు మరియు స్నేహితులకు షేర్ చేయండి.ఇది *1906*.

*వాస్తవ తనిఖీ కోసం

 Googleని ప్రయత్నించండి.

అదే సమాచారం.ఇది మిమ్మల్ని *services.india.gov.in*కి తీసుకెళ్తుంది

ఇది 24x7 సేవ, అన్ని LPG కంపెనీలను కవర్ చేస్తుంది.


*అందుకున్నట్లుగా ఫార్వార్డ్ చేయబడింది మరియు ఇది మనందరికీ ఉపయోగకరమైన సమాచారం అని భావించాను.*🙏

జీవితం అంటే.. రెండున్నరగంటల సినిమా కాదు...

 జీవితం అంటే.. రెండున్నరగంటల సినిమా కాదు... 

అన్నీ అయ్యాక శుభం కార్డు పడడానికి....

--==--==((((:•:))))==--==--


ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒకామె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జిగారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది. "మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు ఒక పాప ఉంది. నేను అందరి ఇళ్లలో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అందరినీ అడుక్కుని ఎలాగోలా నా కూతురికి మంచి చదువు చెప్పించాను. మా అమ్మాయిని ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి... అనుకునే లోపు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసంచేసి ఎత్తుకుపోయారేమో".... అని చెప్పింది.


జడ్జిగారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా, ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది. బోనులో ఎదురెదురుగా తల్లి కూతుర్లు. ఆ అమ్మాయి కళ్ళలో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపమూ లేదు.


ఆ అమ్మాయి... "నన్ను ఎవరూ మోసం చేయలేదు. నన్ను ఎవరూ ఎత్తుకుని పోలేదు. నేను మేజర్ ని నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను" అనిచెప్పింది.


ఇంట్లో వాళ్లకు ఒక్కమాటైనా చెప్పాలి కదా!.... అని అడగాలని అనుకున్నా, కోర్టులో ఇలాంటి సంభాషణలు ఉండరాదు. కనుక ఒక గంటసేపు తల్లి కూతుర్లు మాట్లాడుకోవలసిందిగా జడ్జిగారు తీర్పు ఇచ్చారు.


జడ్జిగారి ఆశ ఏంటంటే... ఒకవేళ ఆ తల్లీకూతుళ్ళు కలిసి మాట్లాడుకుంటే, ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలచి ఆమె మారుతుందేమో అని. ఆయనకూ మనసు ఉంది కదా! అందుకే ఆలోచించి అలా చెప్పారు.


ఒక గంట తరువాత మళ్ళీ వచ్చిన తల్లి కూతుర్లు ఎదురుగా నిలబడ్డారు. కానీ, ఎటువంటి మేజిక్కూ జరగలేదు.


అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, "ఇక అమ్మాయి ఇష్టం అండీ... తను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. ఒక్కమాట... వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమనండి. ఆయనకు ఆ పిల్లంటే ప్రాణం" అని తల్లి చెప్పింది.


"వాళ్ళ నాన్న ఎక్కడ?" అని అడగగా... అతను ఒక మూలన కూర్చుని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతను వికలాంగుడు (physically handicapped.) అతనిని ఒకరు ఆసరాగా పట్టుకుని ఉన్నారు.


అయినా ఏమాత్రం మనసు కరగని ఆ అమ్మాయి "ఇక నేను వెళ్లొచ్చా"... అని అడిగి బయట తన భర్త వేచిచూస్తున్న కార్ ఎక్కి వెళ్లిపోయింది.


ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకి అధికారం లేదు. 'ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలి' అని చెప్పడానికి ఇంకా చట్టాలు రాలేదు.


జడ్జిగారు ఆ అమ్మను ఉద్దేశించి... "ఇప్పుడెలా వెళతారు?" అని అడిగితే... "బస్టాండ్ లో నలుగురి దగ్గర అడుక్కుని మా ఊరువెళ్ళిపోతాం. అక్కడ మళ్ళీ ఇళ్లలో పనిచేసుకుని మా బతుకులు ఈడ్చేస్తాం." అని అంటుంటే అక్కడ అందరి కళ్ళలో కన్నీళ్లు.


కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జిగారు ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వగా, అక్కడ ఉన్నవారంతా తోచిన సాయం చేసి పంపారు.


సినిమాల్లో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు.

తప్పు చేశామేమో అనే పశ్చాతాపం ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి అంతే.


మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు.

ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి. అప్పుడు కాసింత మానవత్వంతో మనుషులుగా మిగిలిఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి, ప్రేమగా పెంచిన మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా గాలికొదిలేసి ఎటో వెళ్ళిపోతారు.

 

      """****"""       

ఇదీ నేటి జనరేషన్ ఆలోచన

----------------------------

Friday, May 27, 2022

ఉడుపి హోటల్ ఎందుకంత పేరుగాంచాయో తెలుసా....

 ఉడుపి హోటల్ ఎందుకంత పేరుగాంచాయో తెలుసా....


ఇంట్లో మనం నలుగురికి లేదా 5గురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి.


మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి,,రెండవది బలరాముడు.ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి.

 

  దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది.ఉడిపిరాజైన నరేషుడు

  సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు. 


అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు.

మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.


అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది,

నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు.

 అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము.వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు  చెపుతాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది,50 లక్షల మందికి భోజనం వండటం

 అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది,అందరికీ భోజనాలు తయారుచేయమని చెపుతాడు.


50 లక్షల మందికి భోజనాలు వండాలంటే  

 భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం

 భీముడు కు ముఖ్యం.అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు.అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు.


నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న  సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేష్ ఎలా 

వండేవాడు అంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా,వృధాకాకుండా వండేవాడు.


రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది.

అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా 

వండేవాడు నరేశుడు.

ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు.

 ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు,అది కూడా ఒక్క మెతుకు కూడా

 మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు.

 అసలు నరేశునికి ఎలా తెలుస్తుంది?

 ఈ రోజు  ఇంతమంది మాత్రమే చనిపోతారని,మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?..


ఇలా18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు.పట్టాభిషేకం జరుగుతుంది.అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు.కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు.ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు.


అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు.

అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి చెందుతుంది అని చెప్తాడు.

 అప్పుడు నరేష్ మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం.కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణుని కే చెందుతుంది అని చెప్తాడు.

  ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు.

  ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా

  కారణం అని నరేషుడుని అడుగుతారు. 

అప్పుడునరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు...


శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.నేను లెక్క పెట్టి పెట్టే వాడిని.

శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని...

 శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలుఅయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటే

 శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు.

  దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు.

  ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు.

  ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు.

ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు.

"హరిసర్వోత్తమ"

"వాయు ఉత్తమ*"

🕉️🕉️🕉️🕉️🕉️🕉️

స్వర్గం - నరకం.

 స్వర్గం - నరకం


 *వాకింగ్ కి నడుచుకుంటూ వెళ్లినప్పుడు, అలసిపోయి కూర్చున్నాప్పుడు, నా పక్కన ఉన్న వ్యక్తి, ఈరోజు ఏదైనా మంచి విషయాలు చెప్పండి అన్నాడు, ఒకతను, కాసేపు ఆలోచించి ..* 


*స్వర్గానికి ప్రవేశం ఉచితం, నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి, అన్నాను..*


 *ఆశ్చర్యంగా!!* 

 *అతను నా వంకచూసి అదెలా?* *అన్నాడు, నేను చిన్నగా నవ్వి, ఇలా అన్నాను,* *జూదం ఆడటానికి డబ్బు కావాలి, మత్తు పానీయాలు త్రాగడానికి డబ్బు కావాలి, సిగరెట్ త్రాగడానికి డబ్బు కావాలి, పాపాలతో పయనించడానికి* *డబ్బుకావాలి, ఇలా ఇంకా, ఇంకా ..* 


కానీ, *ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు, దేవుణ్ణి ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు, సేవచేయడానికి డబ్బు అవసరం లేదు, అప్పుడప్పుడు ఉపవాసం (ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం) ఉండడానికి డబ్బు అవసరం లేదు, క్షమించమని అడగడానికి డబ్బు అవసరం లేదు, మన చూపులో కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి పెద్దగా డబ్బు ఆవసరంలేదు ..*

 

 *దేవుణ్ణిపై నమ్మకం ఉండాలి, మనపై మనకు ప్రేమ, విశ్వాసం ఉండాలి, ఇప్పుడు చెప్పండి ..* 


*డబ్బు ఖర్చు చేసి నరకాన్ని వెళ్ళడానికి ఇష్టపడతారా ? ఉచితంగా లభించే స్వర్గం సుఖభోగాలకు ఇష్టపడతారా ? ఆలోచించండి ..*


 *సత్సంగత్వే నిస్సంగత్వం !* 

 *నిస్సంగత్వే నిర్మోహత్వం !!* 

 *నిర్మోహత్వే నిశ్చలతత్వం !* 

 *నిశ్చలతత్వే జీవన్ముక్తి: !!* 


*సత్పురుషులు ..*  *మార్గదర్శనం* 

*సత్సంగత్యం ..* *సహవాసం* 

*సత్ప్రవర్తన ..* *జీవించడం* 

*మించి, ఈ  భౌతిక  ప్రపంచంలో  ఇంకొకటి,  మరొకటి  లేదు ..*💐🌹💐🌹💐🪴🌱🌴☘️🌿😊🤝👍

Thursday, May 26, 2022

మనం చేస్తున్న పెళ్లిళ్ళు కరెక్టేనా?

 మనం చేస్తున్న పెళ్లిళ్ళు కరెక్టేనా?


మనం ప్రస్తుతం చేస్తున్న పెళ్లిళ్ళు సాంప్రదాయ బద్ధమైనవేనా ?అసలు పెళ్లి పేరుతో మనం చేసే పనులు కరెక్టేనా? ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి. 

కాలంతో పాటు మన పద్ధతులు కూడా మారాలి అనే చట్టుబండ కబుర్లు కాదు.. మనస్ఫూర్తి గా చెప్పండి కరెక్టేనా? 


ముందు ప్రస్తుతం మనం చేస్తున్న పెళ్లిళ్ళకు అనుకరణలు,ఆర్భాటాలు, అట్టహాసములు మానుకోవాలి! 

కాలంతో పాటు మనం కూడా మారాలి అనే వింత పోకడ లో పెళ్లి లో మనం చేస్తున్న తప్పులు 👇

**************

👉*నిశ్చయ తాంబూలానికే జంటను కలపడం,

👉*పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్లు చేయటం,

👉*గొప్ప కోసం ఈవెంట్స్ చేయటం,

👉*ఆర్భాటంగా మండపాలు కట్టడం,

👉*మెహిందీ పేరుతో,సంగీత్ పేరుతో తాగి తందనాలాడడం..

👉*డిజైనర్ శారీస్ కు వేలకు వేలు ఖర్చుపెట్టడం,

👉*బ్రైడల్ మేకప్పంటూ బలిసినట్టు రెచ్చిపోవడం,

*👉పట్టెడన్నానికి ప్లేటు రేటు పెంచుతూ పోవటం ,ఆప్యాయత అన్న పదానికి అర్ధమే లేకుండా పోవడం.. 

👉*దావత్ పేరుతో మద్య, మాంసాలను సేవించి,వికృత నాట్యాలు చేయడం, 

👉*కడుపు కట్టుకుని దాచింది హారతిచేయటం,

*మధ్యతరగతి మనిషికి అవసరమా?


👉*ఒకడిని చూసి ఒకడు,

*👉ఒకడ్నిమించి ఒకడు

వెర్రెక్కి పోతున్నారు

నేటి కాలంలో.


*ఎంత తింటాడు మనిషి?

*దేంట్లో దొరుకుతుంది వినోదం?

*ఎలా చేయాలి వేడుక?

*ఎలా ఖర్చు పెట్టాలి కష్టార్జితం?

*ఏ రకంగా పెరుగుతుంది ఆప్యాయత?

*ఏది కడితే వస్తుంది హుందాతనం?

*ఏ విధంగా ఇనుమడిస్తుంది అందం?

*ఎలా పెరుగుతుంది ఆకర్షణ?

👉*ఏ విధంగా బలపడుతుంది బంధం?

ఒక్కసారి, ఆలోచించి ఆచరిస్తే,

పెళ్ళితో వస్తుంది జీవితంలోకి కళ.


*పదిమందితో పట్టెడన్నం తింటే,

*మనసు విప్పి హాయిగా మాట్లాడుకుంటే,

*కార్యం జరిగే ఇంట చేతనైనంత సాయం చేస్తే,

*సహజమైన అందానికి పెద్దపీట వేస్తే, 

*సాంప్రదాయం విధానానికి కట్టుబడి ఉంటే,

*దాచిన సోమ్ము సద్వినియోగ పడితే,

కార్యం చేసినవాడి బతుకు చీకటి కాదు. మధ్య తరగతి బతుకుల్లో వెలుగు పోదు.


*👉ముహూర్తం చూసి పారేసే కార్డుకి,

*పెళ్ళయిన వెంటనే తీసేసే పందిరికీ,

*చెమటపడితే కారిపోయే రంగుకీ,

*పెళ్ళినాడు మాత్రమే కట్టే వలువలకీ,

*నాలుగు మెతుకు తింటే నిండిపోయే కడుపుకీ,

*సరదాగా కబుర్లు చెపితే వచ్చే నవ్వుకీ,

*ఒక్కరోజులో ముగిసిపోయే వేడుకకీ,

ఉన్నదంతా ఊడ్చిపెడితే

పదికాలాలు బతకడానికొచ్చే 

కొత్తమనిషికి

తర్వాత పెట్టేది ఏమిటి?


*👉అప్పు చేసి ఖర్చుచేసే,

వెర్రితనం కాదు పెళ్ళంటే!

*ఇంటికి దీపాన్ని తెచ్చుకునే

ఇంగితమైన పని వివాహ మంటే!

*శక్తికి మించి ఎగరటం,

*అప్పుచేసి ఆర్బాటం చేయటం


*ముమ్మాటికీ తప్పు👌*.


*కళ్యాణానికి కాస్త ఖర్చు చాలు, కలిసుండటానికే కావాలి ధర్మ,అర్ధములు*. *ఇది తెలుసుకున్ననాడు ప్రతినిత్యం బ్రతుకులో శ్రీరస్తు! శుభమస్తు! అవిఘ్నమస్తు*

***********

Tuesday, May 24, 2022

రోహిణి కార్తె అంటే ఏంటీ ?

 ______________________________

రోహిణి కార్తె అంటే ఏంటీ ? 

ఈరోజు నుండి రోహిణి కార్తే ప్రారంభం

 మే 25 న ప్రారంభమై జూన్ 8  వరకు

ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి ?


   ••••••••••••••••••••••••••••••••••••••••


రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి.


మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఏలా ఉంటుందో గమనిద్దాం. తేదీ.  ఈ సంవత్సరం రోహిణి కార్తే మే 25 న ప్రారంభమై జూన్ 8  వరకు రోహిణి కార్తె ఉంటుంది.


రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు , ఎండ తీవ్రతలు , అగ్ని ప్రమాదాలు , ఉక్కపోతలు ఉంటాయి.


ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావునా ఆరోగ్య రీత్య తగు శ్రద్దలు తీసుకోవాలి. ఎక్కువ మట్టికుండ నీళ్ళు త్రాగడం , మజ్జిగా , పండ్ల రసాలు , కొబ్బరినీళ్ళు , నిమ్మరసం , రాగి జావ , ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది కొంత ఉపశమనం లభిస్తుంది. మసాలాకు సంబంధించిన ఆహార పదార్ధాలు , వేపుళ్ళు , పచ్చళ్ళు , ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదు.

నీళ్ళ సౌకర్యం ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయండి. అన్నిరకాల వయస్సు వారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి , తెల్లని రంగు కల్గినవి , తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. శారీరక తాపం తగ్గుతుంది. చిన్నపిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో తుడిచి బట్టలు మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమం.

ముఖ్యంగా సాటి జీవులైన పశు , పక్ష్యాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటికి నీళ్ళను ఏర్పాటు చేయండి. బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన వాళ్ళ దాహాన్ని తీర్చెందుకు వారికి త్రాగడానికి చల్లటి నీళ్ళను అందివ్వండి. ఇలాంటి సంఘ సేవా కార్యక్రమాలు చేయడం వలన మీకున్న గ్రహభాదలు నివారణకు మార్గమై కొంత ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యఫలం దక్కి అంతా మంచి జరుగుతుంది.

_____________________________

పర్సులో డబ్బులు

 పర్సులో డబ్బులు


*రెండువేల రూపాయల నోటు*,

*ఒక్కరూపాయి నాణెం ఒకే పర్సులోకి చేరాయి*.

ఈ రెండిటి సంభాషణ.                                     

   *రూపాయి నాణెం*...

రెండువేల నోటుతో కలిసిన

తన్మయత్వంతో కూడిన ఆనందంలో

అలాగే చూస్తూ ఉండి పోయింది.


దాంతో రెండువేల నోట్....

రూపాయినాణెంతో ఇలా అంది

*ఏంటి మిత్రమా నన్ను అంతలా తదేకంగా చూస్తున్నావ్*? అని.....


అప్పుడు రూపాయి నాణెం అంది 

ఏమీలేదు మిత్రమా!

*నీవిలువ నాకంటే రెండువేలరెట్లు ఎక్కువ కదా*!


నీవు నీ జీవితకాలంలో

ఎంతో మంది కష్టాలు తీర్చి

కన్నీళ్లు తుడ్చి ఉంటావు.

ఎంతో మంది ఆకలి తీర్చి

ఆదుకొని ఉంటావు అని

అందుకే అలా చూస్తున్నా......


దానికి రెండువేల నోటు

బాధపడుతూ.... లేదు మిత్రమా

*నాకు ఎవ్వరి కన్నీళ్లు తుడిచి*....

*కడుపునిండా అన్నం పెట్టే అవకాశం రాలేదు*.


ఎందుకంటే నేను *పెద్ద ఉద్యోగి ఇంట్లో ఉంటిని* వాడు నన్ను

*తన లాకర్లో దాచాడు*.

*టాక్స్ ఎగ్గొట్టాడనే కారణం చేత*

ఈమధ్య జరిగిన ఐటీ దాడులలో

నేను బయటకు వచ్చాను.


జైల్లో నుండి బయటపడిన ఆనందం

కాస్తా కొన్ని రోజులు కూడా లేదు.

ఐటీ దాడులలో పట్టుబడిన

సొమ్ములో నుండి లంచం రూపంలో

ఐటీ అధికారికి ఇచ్చారు.


*లంచం తీసుకున్న అధికారి మళ్ళీ నన్ను బ్యాంక్ లాకర్ లో పడేస్తే*

కొన్ని రోజుల తరువాత బయట కొచ్చినా నా జీవితం మొత్తం జైళ్లోనే(లాకర్లో)నే గడిచి పోయింది.


కానీ నీసంగతి చెప్పు మిత్రమా... అంటూ *రూపాయి వంక చూస్తుంది.*


అప్పుడు రూపాయినాణెం

ఇలా అంది.

మిత్రమా నాజీవితంలో

ఎక్కడెక్కడ తిరిగానో చెప్పలేను.


*భిక్షగాడి పళ్ళెంలోపడివాడి ఆకలి తీర్చాను*.

*ఏడుస్తున్న పిల్లాడికి చాక్లెట్ ఇప్పించి వాడి మొహంలో చిరునవ్వులు చూసాను*. 


*పూజారి హారతి పళ్ళెంలో*...

*దేవుడి హుండీలో* అక్కడి నుండి

*భగవంతుని చరణాలు తాకి* అలా ఒక్క చోట ఏంటి?

*నేను తిరగని చోటేలేదు మిత్రమా*!


*భగవంతుని పాదాల నుండి* మొదలుకొని *పేదోని అంతిమయాత్రల* వరకు నేను *ప్రతిచోట ఉన్నా అంటూ ధీమాగా చెప్పింది*.


అపుడు రెండువేల నోటు ఇలా అంది


ఎంత *విలువైనది* అన్నది

కాదు మిత్రమా! 

*ఎంతమందికి చేరువై* వారి 

*ఆకలి తీర్చామన్నదే ముఖ్యం* అంటుంది.


ఎంత *ఉన్నతంగా బ్రతికామన్నది* కాదు,

ఎంత మందిని *అక్కున చేర్చుకున్నామన్నదే ముఖ్యం*

నిజమేకదా?      🙏

Monday, May 23, 2022

మీ బాల్యం మీకు ఏం నేర్పింది??

 మీ బాల్యం మీకు ఏం నేర్పింది?? 


పొలం గట్లపై నడిపించి, తడబడకుండా *నిలదొక్కుకోవటం*

నేర్పింది.


*వాగు పక్కన నీటి చెలిమలు తీయించి,

*శోధించే తత్వం* 

నేర్పింది.


*సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి,

*అన్వేషణ* 

నేర్పింది.


*తుమ్మ ముల్లు, పల్లేరు గాయాల గుచ్ఛులతో,

*జీవితం* 

పూలపాన్పు కాదని నేర్పింది.


*చిన్న చిన్న దెబ్బలు తగిలితే,

నల్లాలం ఆకు పసరు పోయించి,

చిన్న చిన్న ఇంటి వైద్యం *చిట్కాలు* 

నేర్పింది.


చెట్టుమీద మామిడికాయ

గురిచూసి కొట్టడం, లక్ష్యాన్ని 

*ఛేదించడం* 

నేర్పింది.


*నిండు బిందెను 

నెత్తి మీద పెట్టి, 

నీళ్లు మోయించి,

జీవితమంటే 

బరువు కాదు..

*బాధ్యత* 

అని నేర్పింది.


*బావి నుండి బొక్కెనతో నీళ్లు తోడించి,

బాలన్స్ గా 

*బరువు* 

లాగటం నేర్పింది.


*ఇంటి ముంగిటకు అతిథి దేవతలు

హరిదాసులు గంగిరెద్దులను రప్పించి,

ఉన్న దాంట్లో కొంత *పంచుకునే* 

గుణం నేర్పింది.


*విస్తరిలో,

అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా 

తినే

*ఒద్దికను*

నేర్పింది.


ఒక్క పిప్పర్మెంట్ ను, బట్ట వేసి కొరికి ముక్కలు చేసి,

కాకి ఎంగిలి పేరుతో

స్నేహితులతో

*పంచుకోవటం* 

నేర్పింది.


ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్కటొక్కటిగా రేక్కాయలు తెంపే *ఓర్పును* 

నేర్పింది.


దారంతో విల్లును చేయించి, వస్తు తయారీ *మెళకువలు* 

నేర్పింది.


*అత్తా, మామా, అన్నా వదినా, అమ్మమ్మా, నాయనమ్మా, తాతయ్యా వరుసలతో,

ఊరు ఊరంతా ఒక కుటుంబమనే *ఆత్మీయత* 

నేర్పింది.


ధైర్యంగా 

బ్రతికే పాఠాలను నేర్పిన


మన బాల్యానికి


*జీవితాంతం* 

*రుణపడి ఉందాం*

Saturday, May 21, 2022

Ship Mechanic

 Ship Mechanic


Ship లో Mechanic గా విశేష అనుభవం కలిగిన వ్యక్తి... ఒక పెద్ద ship ని చూపించి.. ఈ ship కి క్రింద ఒక రంద్రం పడితే.. నీళ్లు రాకుండా.. ఆ రంద్రాన్ని ఒక్కడినే కష్టపడి పూడ్చాను! అన్నాడు.


Wow.. ఎలా చేస్తారు ఆ పని? నాకు చెప్తారా?? తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా వుంది.. అని ప్రశ్నించిన బ్రహ్మి తో...

చెప్తాను...

వీలు చూసుకుని ఓపికగా చెప్తాను అని విషయం చెప్పకుండా దాటవేస్తూ..

రెండు సంవత్సరాలు వెనక తిప్పించుకున్నాడు!


ఇక ఓపిక పోయిన బ్రహ్మి..

గట్టిగా పట్టుబట్టి అడిగితే..


బిరియాని..

వగైరా.. Food items ని

బ్రహ్మి ఖాతాలో order పెట్టించి..

అంతా తిన్నాక..


Ship Mechanic విషయం చెప్పాడు..

అదెలాగంటే..


Ship ఒడ్డు మీద ఉన్నపుడు

రంద్రం పూడ్చాను అని! 😜😜😜

చిన్ననాటి తీపి గుర్తులు ......

   చిన్ననాటి తీపి గుర్తులు ......


*చేతులు షర్ట్ లోపల ఉంచి, నా 'చేతులు పోయాయి' అనేవాళ్ళం*


*4 రంగుల్లో ఒక పెన్  ఉంటే, అన్నీ బటన్స్ ఒకేసారి నొక్కేసేవాళ్ళం  ఏం జరుగుతుందో చూసేందుకు*


*భయపెట్టడానికి తలుపు చాటున నిల్చునే వాళ్ళం*

*లోపలకి వచ్చేవారిని *భౌ* అని భయపెట్టే వాళ్ళం*


*నిద్రపోయినట్టు నటించేవాళ్ళం ,అమ్మ నాన్న ఎవరో ఒకరు మంచం వరకు ఎత్తుకొని తీసుకు వెళ్తారు కదా అని.*


*బస్సులో వెళ్తుంటే , పైనున్న చందమామ మనల్ని follow అవుతున్నదని గుడ్డి నమ్మకం.*


*రెండు చేతులు చాచి గుండ్రంగా తిరుగుతూ వర్షంలో తడిచేవాళ్ళం*


*పండులో గింజ మింగి, లోపల చెట్టు మొలుస్తుందేమోనని భయపడేవాళ్ళం*


*రూమ్ బయటకు పరుగెత్తుకువచ్చి, మరిచింది గుర్తొచ్చి మరల లోనికి పరుగెత్తేవాళ్ళం*


*గుర్తుందా ! మనం చిన్నప్పుడు ఎంత త్వరగా ఎదిగి పెద్దవుతామా అని కుతూహల పడేవాళ్ళం*


*పెరిగి పెద్దయిన తరువాత, చిన్నతనం ఎంత బావుండేది అని బాధ !!*


*బాల్యం జీవితపు అతి మధురమైన జ్ఞాపకం.*


*ఎందుకంటే మనం ఈ మెసేజ్ చదువుతున్నపుడు తప్పనిసరిగా మన మోహం పై చిరునవ్వు విరిసి ఉంటుంది.*


*దేవుడు వరం ఇస్తే మరల ఒకసారి మన బాల్యం లోకి పంపు అని కోరుకుంటాము*


*school జీవితం !!*


*కేరింతలు కొట్టే స్నేహ సమూహం !!*


*రంగు రంగుల యూనిఫామ్ !!*


*చిన్న చిన్న ఫైటింగ్ లు !!*


*ఆప్యాయంగా చూసే టీచర్లు !!*


*First love experience లు...!!*

*Friends పుట్టించే పుకార్లు!*


*గ్రూప్ ఫోటోలు !!*


*combined స్టడీలు !!*


*ఎప్పటికి తరగని Boring పీరియడ్స్*

*తొందరగా అయిపోయే drill పీరియడ్!!*


*రోజూ ఉదయం 7-8 అయినా గానీ నిద్ర లేవని నేను, జెండా పండుగ రోజు మాత్రం ఉదయం 4 గంటలకే నిద్ర లేవడం!!*


*ఎడతెగని వాదోపవాదాలు !!*


*మిత్రులతోనే చిలిపి తగాదాలు!!*


*మరిచిపోలేని మార్కుల కాగితాలు !!*


*భయపెట్టే progress report లు !!*


*సొంతంగా చేసిన "నాన్న సంతకం"*


*తప్పుని correct అని వాదించే సొంత ప్రయత్నం !!*


*అబ్బో.... అదొక గొప్ప ప్రయాణం, మరిచిపోలేని మన బాల్యం!!*

*ప్రతి మనసులో కరిగి, కన్నీరుగా మారే మధుర జ్ఞాపకం !!*


*మీ స్నేహితుల మొహంలో చిన్ని నవ్వు కోసం... మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి ..*


😄😄😄

Friday, May 20, 2022

ఆశ్ఛర్య పరచే మన దేవాలయల విశేషాలు

 ఆశ్ఛర్య పరచే  మన దేవాలయల విశేషాలు


*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయo** 

 *హాసంబా దేవాలయం* ,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.


*నీటితో దీపం వెలిగించే దేవాలయం* 


మధ్యప్రదేశ్. ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,   అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇకనుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.


 *స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయం* 


1.  కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.

2. బృందావనం రాధాకృష్ణ శయన మందిరం.


*12 ఏళ్లకు ఒకసారి*

 **పిడుగుపడే తిరిగి అతుక్కునే*దేవాలయం*


 బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.


*సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:* 

1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 

2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 

3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 

4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 

5. మొగిలీశ్వర్.

6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా

7. బ్రమరాంబికా సమేత సిద్దేశ్వర ఆలయం చెన్నారావుపేట.


*నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు:* 

1. మహానంది

2. జంబుకేశ్వర్ 

3. బుగ్గరామలింగేశ్వర్

4. కర్ణాటక కమండల గణపతి.

5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.

6. బెంగళూర్ మల్లేశ్వర్ 

7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం

8. సిద్ధగంగా


*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.* 

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 

2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్.  

3. మంజునాథ్.


*శ్వాస తీసుకునే* 

కాళహస్తీశ్వర్


*సముద్రమే వెనక్కివెళ్లే


1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్.


2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.


*స్త్రీవలె నెలసరి అయ్యే 

1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  


2. కేరళ దుర్గామాత.


*రంగులు మారే ఆలయం.* 


1. ఉత్తరాయణం,  దక్షిణాయనంలో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.


2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.

పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.


*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు* 


 1. కాణిపాకం,  

2. యాగంటి బసవన్న,  

3. కాశీ తిలభండేశ్వర్,  

4. బెంగుళూరు బసవేశ్వర్

5. బిక్కవోలు లక్ష్మీగణపతి


*స్వయంభువుగా* 

సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.

*ఆరునెలలకు ఒకసారి తెరిచే* 


1. బదరీనాథ్,  


2. కేదారనాథ్ ( *ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది* )


3. గుహ్యకాళీమందిరం. 


*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు* 

హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.


*ఒంటి స్తంభంతో

యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.


*రూపాలు మారే

ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.


*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు


1. హేమాచల నరసింహ స్వామి.


2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి


*మనిషి వలె గుటకలు*  

వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.


*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.* 


*ఛాయా విశేషం* 


1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.


2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.


3. బృహదీశ్వరాలయం


*నీటిలో తేలే విష్ణువు (టన్నుల బరువుంటుంది ),  నేపాల్


*ఇంకా...* 

తిరుమల వెంకటేశ్వరస్వామి, అనంత పద్మనాభస్వామి, రామేశ్వరం , కంచి, 

చిలుకూరి బాలాజీ,  పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం .


*పూరీ* 


పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడపడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమఘుమలాడే  పూరి ప్రసాదం.


ఇవి నాకు తెలిసిన కొన్ని మహిమాన్వితదేవాలయాలు మాత్రమే*


ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి నమ్మండి దేవుడు నడయాడే నేల ఇది.

*ఈ దేవాలయములు అన్ని భారత దేశములుమాత్రమే ! 

జై శ్రీరామ్ శుభోదయం

కాస్సేపు నవ్వుకుందామా...

 కాస్సేపు నవ్వుకుందామా....


*అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు:-


*ప్రశ్నికుడు*:- 


1 . రైలు పట్టాలకూ,

     కాలి పట్టాలకూ 

     అనుబంధం ఏమిటి?


*అవధాని:-*


రైలు పట్టాల మీద వుంటుంది,

కాలి మీద పట్టాలుంటాయి.


*ప్రాశ్నికుడు:-*


2 . కనలేని స్త్రీమూర్తి ఎవరు?


*అవధాని:-*


న్యాయస్థానములో వున్న

న్యాయదేవత. కళ్ళకు *గంతలు* కట్టి వుంటారు కదా!


*ప్రా:-*


3 . సోమవారాన్ని 'మండే'       అనెందుకంటారు?


*అవ:-*


ఆదివారం హాయిగా భోంచేసి పడుకుంటాము కదా సోమవారం పొద్దున్నే

పనికెళ్లాలంటే ఒళ్ళు మండుతుంది కదా! 

అందుకని 'మండే' అంటారు.


*ప్రా:-*


4 . ఒక పిల్లవాడు ఇంటినుండి పారిపోతే కనిపించుటలేదు అని ప్రకటిస్తారు కదా! దానికి పిల్లాడి స్పందన ఏమిటి?


*అవ:-*


*కని-పెంచుట* లేదు .


*ప్రా:-*


5 . ఈ రోజుల్లో పిల్లలు 

     తల్లిని Head Cook గా

     చూస్తున్నారు . 

     మరి తండ్రిని

     ఎలాచూస్తున్నారు?


*అవ:-*


*ATM* లాగా చూస్తున్నారు.


*ప్రా:-*


6 . సభలో ఎవరైనా 

      ఆవులిస్తే మీరేమి చేస్తారు?


*అవ:-*


పాలిచ్చేవైతే అవధానం

అయ్యాక యింటికి తోలుకెళ్తా .


*ప్రా:-*


7 . మనిషికి 

      ఆనందాన్నిచ్చే సిటీ ఏది?


*అవ:-*


*'పబ్లిసిటీ '*


*ప్రా:-*


8 . తుద+ తుద = తుట్టతుద,

      కడ  + కడ = కట్టకడ

      అవుతుంది కదా! 

      అరటి + అరటి 

      ఏమవుతువుంది?


*అవ:-*


అర టీ + అర టీ 

*ఫుల్ టీ* అవుతుంది.


*ప్రా:-*


9 . క్రికెట్ ప్లేయరుకీ, 

     అవధానికీ 

     సామ్యం ఉందా?


*అవ:-*


వాళ్ళు  *world play* కి వెళ్తారు , 

మేము  *words play* కి వెళ్తాము.


*ప్రా:-*


10 . 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అన్నాడు వేమన, ఇప్పుడు మీరేమంటారు? 


*అవ:-*


"పురుషులందు

పుణ్యపురుషులు 

*ఏరయా?* అంటాను.


*ప్రా:-*


11 . దేవుని గుడికి 

        తాళం వెయ్యాలా?


*అవ:-*


భజన జరిగే చోట 

*తాళం* తప్పనిసరి.


*ప్రా:-*


12 . అద్దం ముందున్న

        ఆడువారికీ,

        మైకు ముందున్న

        అమాత్యులకీ 

        తేడా ఏమిటి?


*అవ:-*


_ఇద్దరికీ *సమయం* తెలియదు!_


 చదివి ఆనందించండి - పద ప్రయోగ వినోదాన్ని పదిమందికీ పంచండి......స్వచ్ఛమైన.నవ్వు నవ్వండి మన భాషను అందులోని గాంభీర్యాన్ని సోభగలను తెలుసుకోండి.👏

ప్రకృతితో సావాసం మరిచామా.....

 ప్రకృతితో సావాసం మరిచామా.....




చక్కగా ఆవు పేడ తో కళ్ళాపి జల్లిన ఆ తెలుగింటి లోగిల్లు... 

హాయిగా బయట నవ్వారు మంచాల మీద ఉతికి ఉతికి అరిగిపోయి శుభ్రంగా తెల్లగా ఉండే దుప్పట్ల మీద నిద్రలు... 

మంచం కింద రాగి చెంబులో నీళ్లు.....

తెలతెల్లవారుతుండగా ఆ చీపుల్లతో వాకిలి ఊడుస్తున్న శబ్దాలు....

ఆ పెడ కళ్ళాపి జల్లుతుంటే మంచం జరిపి మళ్ళీ ఓ కునుకు తీసిన రోజులు...

10 గంటలకల్లా వేడి వేడి అన్నం పప్పు కూరతో అంత ఘుమఘుమ లాడే నెయ్యి వేసుకొని వేళ్ళు పళ్లెం తో సహా నాకేసి తిన్న రోజులు...

మండుటెండలో ఇంటి పెరట్లో వేప చెట్టు కింద ఆటలు...

సాయంత్రం 7 గంటలకల్లా శుభ్రంగా స్నానం చేసి అమ్మ అన్నం తినిపిస్తే కడుపు నిండా తినేసిన రోజులు...

వరుసగా వాకిలిలో వేసిన మంచాల మీద నిద్రకు ముందు పెద్దోళ్ల కబుర్లు...కథలు..

అలా ఆకాశంలోకి చూస్తూ చుక్కలు లెక్కపెడుతూ నిద్రలోకి జారుకున్న రోజులు...

అర్ధరాత్రి దారి తప్పిన పక్షుల అరుపులు....

అప్పుడప్పుడు గాలికి ఊగే కొబ్బరి చెట్టు ఆకుల శబ్దాలు....

ఆహా...ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండు....

ఎంత సాంకేతికంగా ముందుకు పోతే అంత వింత జబ్బులు...

మనిషి ప్రాణానికి భద్రత లేని ఏ సాంకేతిక అభివృద్ధి అయిన ఎం ఉపయోగం...

ప్రకృతి అవసరాలు తీర్చే రోజుల నుండి అత్యవసరాలకు...సుకాలకోసం దోచుకోవడం..దుర్వినియోగం చేయడం ఈ విపత్కర రోగాలకు కారణం...

మారాలి మనం...

ప్రకృతిని కాపాడాలి...

అదే మనిషి ఉనికికి జీవనాధారం...

2000 రూపాయల కట్టలు నోట్ల బ్యాగు

 

2000 రూపాయల కట్టలు నోట్ల బ్యాగు


*తెల్లవారుజామున 4 గంటలకు సూర్యాపేట నుండి హైద్రాబాద్ కి .... వస్తుండగా దారిలో నాకు ఒక పెద్ద బ్యాగ్ దొరికింది🙂🙂🙂.*


*ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అన్ని 2000 రూపాయల కట్టలు నోట్లు మాత్రమే ఉన్నాయి.*


*ఒక్క రెండు వేల రూపాయలు కట్టాను చేత్తో పట్టుకుందామని ఎంతో ఆశపడి ఆవేశంతో చేయి బ్యాగ్ లో పెట్టాను......*

.

.

అంతే

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

..

.

.

.

.

.

.

.

.

.

..

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.


*తీరా...... చూస్తే తెల్లవారి పొయింది.....*

😥😥😄😄😄😄😥😥😥

Thursday, May 19, 2022

INDIANS

🇮🇳Indians🇮🇳


🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳


Brushing with *Colgate*


Shaving with *Gillette*


Bathing with *Pears*


Aftershave with *Old Spice*


Wearing *Allen Solly* shirt


Wearing a *Levis* pant


Eating *Maggi* and 


Drinking *Nescafe*


Watching on a *SONY* 


Using *Vodafone*


Wearing a *Ray-ban*


Seeing time on *RADO*


Travelling in a *Toyota*


Using *Apple computer*


with *Coke* on the side


Finishing lunch at , 

*McDonald's* 


Buying Pizza  for the 

wife from *Dominos*


Drinking *Johnny Walker & Chivas Regale*


Shopping on *Amazon*

And...,


Then asking a question,

*"WHY IS THE INDIAN*

*RUPEE GOING DOWN*

*AGAINST THE DOLLAR*


Eye opener Message for all intelligent Indians.


 BE INDIAN, BUY INDIAN PRODUCTS

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Tuesday, May 17, 2022

అధిక రక్తపోటు

 అధిక రక్తపోటు ప్రపంచవ్యాప్తంగా 30% కంటే ఎక్కువ మంది జనాభాను ప్రభావితం చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు అథిక రక్తపోటుతో భాధపడుతున్నారు.  ఇది హృదయ సంబంధ వ్యాధులకు మూల కరణం , ముఖ్యంగా  హార్ట్ఎటాక్, HEART FAILURE, మరియు పక్షవాతానికి ప్రధాన కారకం, అంతే కాకుండ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి,  వంటి వాటికి  కూడా ప్రధాన కారకం. 


కాబట్టి సాధారణ ప్రజలకు అధిక రక్తపోటు గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 17న తేదీన ప్రపంచ రక్తపోటు దినోత్సవం(WORLD HYPERTENSION DAY)గా జరుపుకుంటాము. దీనిలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్ ను విడుదల చేస్తుంది.,  "MEASURE YOUR BLOOD PRESSURE ACCURATELY, CONTOL IT, LIVE LONGER!" ("మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి, దానిని నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి!")  అనేది ఈ సంవత్సరం థీమ్.


హైపర్‌టెన్షన్ యొక్క సరైన రోగ నిర్ధారణ మరియు నిర్వహణకు ఖచ్చితమైన బ్లడ్ ప్రెషర్(B.P) కొలత అవసరం. బ్లడ్ ప్రెషర్ ను రీక్షించేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు. B.P పరీక్షించుకునే ముందు ఒక అరగంట లోపల smoking చేయటం,టీ, కాఫీ లు తాగటం, ఆహారం తీసుకోవటం, వ్యాయామం చెయ్యడం వంటివి చేయకూడదు.


చాలా వరకు, రక్తపోటు 85% మందిలో జన్యుపరంగా ఉంటుంది, కానీ దాదాపు 15% మందిలో SECONDARY HYPERTENSION ఉంటుంది. యుక్త వయస్కులలో (<40 సంవత్సరాలు) SECONDARY HYPERTENSION యొక్క ప్రాబల్యం సుమారు 30% వరకు ఉంటుంది.


సాదారణంగా Secondary hypertension ను, చిన్న వయసులో అధిక రక్తపోటు వచ్చిన వారిలో, మరియు అనియంత్రిత రక్తపోటు అకస్మాత్తుగా రావడం, గతంలో బాగా నియంత్రించబడిన రక్తపోటు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోవడం వంటి వారిలో చూడవచ్చు.


Secondary hypertension  కు‌ ముఖ్యమైన కారణాలు కిడ్నీ సమస్యలు మరియు హార్మోన్ సమస్యలు. హార్మోన్ సమస్యలు ముఖ్యంగా హైపోథైరాయిడిజం(HYPOTHYROIDISM), క్యూషింగ్'స్ సిండ్రోమ్(Cushing's Syndrome), PHEOCHROMOCYTOMA, PRIMARY ALDOSTERONISM వంటి ఎడ్రినల్ సమస్యలు సెకండరీ హైపర్‌టెన్షన్(SECONDARY HYPERTENSION) కి దారితీస్తాయి.


ఈ హార్మోన్ సమస్యలను కిడ్నీ సమస్యలు నయం చేయడం ద్వారా మనం రక్తపోటును సులభంగా కంట్రోల్  చేయవచ్చు, అలాగే జీవితాంతం B.Pమందులు వాడాల్సిన అవసరం ఉండదు.

ఎవరైతే అధిక రక్తపోటుతో బాధపడుతున్నారో వారందరూ క్రమం తప్పకుండా ECG,2D-ECHO,CREATININE వంటి పరిక్షలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది.


ఈ అధిక రక్తపోటును జీవనశైలిలోని మార్పుల ద్వారా సులభంగా నియంత్రించవచ్చు. రోజూ వ్యాయామం చేయటం, బరువు తగ్గటం, స్మోకింగ్ ని ఆపటం,మద్యం తీసుకోవటం మానివేయటం, రోజు ఉప్పు తక్కువ మోతాదులో తీసుకోవడం (రోజుకి 2.3 గ్రాములు మించకుండా),కొవ్వు తక్కువ ఉన్న ఆహారం తీసుకోవటం,తాజా పండ్లు కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవడం లాంటి జీవనశైలి మార్పుల ద్వారా అధిక రక్తపోటు (B.P) ని చాలామంది మందుల సహాయం లేకుండానే తగ్గించుకోవచ్చు.


జీవనశైలి నిర్వహణ అనేది హైపర్‌టెన్షన్ చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం ఎందుకంటే ఇది రక్తపోటును తగ్గిస్తుంది, కొన్ని యాంటీహైపెర్టెన్సివ్ ఔషధాల (ANTI HYPERTENSIVE DRUGS) ప్రభావాన్ని పెంచుతుంది.


ఇవన్నీ పాటించిన తర్వాత కూడా ఎవరికైతే అధికరక్తపోటు ఉంటుందో అలాంటి వారు క్రమం తప్పకుండా B.P మాత్రలు వాడాల్సి ఉంటుంది, అలా చేయడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలు రాకుండా నివారించవచ్చు ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, పక్షవాతం,మరియు గుండె సమస్యలు రాకుండా కొంతవరకు నియంత్రించవచ్చు.

Monday, May 16, 2022

The Negative people @ Work Place

 _*The Negative people @ Work Place*_

-----------------------


*మనం పనిచేసే వాతావరణంలో అనేక మనస్తత్వాలున్న అనేకమంది పనిచేస్తుంటారు. పైకి అంతా నవ్వుతూ ఆనందంగా కనబడుతుంటారు కానీ అంతర్గతంగా రకరకాలుగా ఉంటారు. అందులో సానుకూల దృక్పథం ఉన్నవారితో కలిసి పనిచేయడం ఎంత ఆనందమో వ్యతిరేక దృక్పథం ఉన్న వాళ్ళతో సర్దుకు పోవడం అంత సులభం కాదు. వీరందరితో సర్దుకుపోతూ పనిచేయడం అంత సుళువైన విషయం కాదు. ముందుగ విభిన్న రకాల వ్యతిరేక దృక్పథం ఉన్న మనుష్యులను ముందుగా అర్ధం చేసుకుందాం.*

 *1.COMPLAINERS( ఫిర్యాదిగాళ్ళు*):

-----------------------

 *వీరు తరుచూ అన్ని విషయాల పట్ల, అందరివ్యక్తులపై తీవ్ర అసంతృప్తితో ఉండి వారిలోని లోపాలను నిత్యం కనబడే ప్రతీవారికి ఫిర్యాదు చేస్తుంటారు. కోడిగుడ్డు పై వెంట్రుకులుతీసే పనిలో నిత్యం ఆనంద పడుతుంటారు.*


*2, BACKSTABBERS* *(వెన్నుపోటుగాళ్ళు)*

-----------------------

 *వీరు మన ఎదుట చాలా మంచిగా నటిస్తూ ఉంటారు కాని సమయం చూసి మన అంచనాకు ఏ మాత్రం అందకుండా దొంగదెబ్బ తీస్తారు. వీరి వినమ్రత, నక్క వినయాలు చూసి వీరిపై పూర్తిగా ఆధారపడ్డామా అడ్డంగా దొరికిపోతాం.*


*3.CONTROLLERS*: *(రిమోట్ గాళ్ళు)*: 

-----------------------

 *మన స్వంత విషయాల్లో గాని ఇతర విషయాల్లో గాని అధికంగా జోక్యం చేసుకుంటూ మనపై ఆధిక్యం చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందరూ తమ నియంత్రణలో ఉండాలనే భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు.*


*4.CLAMS* : *(దాగుడుమూతగాళ్ళు)*

-----------------------

 *వీరు ప్రతీ పని చాలా రహస్యంగా చేస్తుంటారు. తమ విషయలు ఎవరితో పంచుకోవడం గాని నలుగురికి చెప్పడం గాని ఎప్పుడు చేయరు. ఆఖరికి వాళ్ళ అబ్బాయి పెళ్ళి నిర్ణయించబడిన విషయం పక్కింటివారికి కార్డు ఇచ్చినంతవరకు కూడా తెలియనీయరు.*


*5.SLUFFERS* *(పనిదొంగలు)* -----------------------

*వీరు ఏ మాత్రం అనుకున్న సమయనికి లేదా వస్తామన్న సమయానికి ఎప్పుడూ రారు. పని చేయాల్సివస్తే ఇలా కనబడి అలా మాయమైపోతారు. పనిపూర్తయ్యాక తప్పనిసరిగా కనబడతారు. వీరిని నమ్ముకొని ఏ పని మొదలెట్టినా పనంతా మనం చేసుకోవలసి వస్తుంది లేదా అనుకున్న పని వీరి మూలంగా వాయిదా పడే పరిస్థితి తలెత్తుతుంది.*


*6. GOSSIPERS :( పుకారుగాళ్ళు)*

-----------------------

*వీరికి లేనిపోని, పనికిమాలిన అనవసర కబుర్లతో కాలక్షేపం చేయడమంటే  వీరికి చాలా ఇష్టం. నిత్యం ఎవరిగురించో గాలికబుర్లు ప్రచారం చేస్తుంటారు. ఎవరినైనా ఎత్తెయ్యాలన్నా, ముంచెయ్యాలన్నా వీరికి క్షణంలో పని.*


*7.WALKING WOUNDED: ( క్షతగాత్రులు):* 

-----------------------

*జీవితంలో అనేక విషయాల్లో ఎదురుదెబ్బలు తినడం వలన ప్రపంచం లోని సమస్యలన్నీ వీరికే ఉన్నట్టు తల వేలాడేసుకుంటూ పనిచేస్తుంటారు. తాము ఎన్ని బాధల్లో ఉన్నప్పటికీ ఒక్కరే పనిభారం తమపై వేసుకొని ఒకరితో సంబంధం లేకుండా పనిచేస్తుంటారు.*


*8.NEGATIVES*: *(రంధ్రాన్వేషణగాళ్ళు):*

-----------------------

*వీరు ప్రతీ విషయంలో నెగటివ్ ఏముందో దానిని వెతకడానికి ప్రయత్నిస్తుంటారు. నిరాశవాదంతో తెగ నలిగిపోతూ ఎవడూ సుఖంగా లేకుండా అందరిలో గాలి తీస్తుంటారు.*


*9.BROWN NOSERS* *(చంచాగాళ్ళు)*

----------------------- *ఎలాంటివారినైనా  పొగడ్తలతో తెగ పొగిడి తమ పని కాకా పట్టి చేయించుకుంటుంటారు. పని పూర్తయినంత వరకు తెగ పాలిష్ చేస్తుంటారు.*


*10.SNIPPERS ( దొంగదెబ్బగాళ్ళు )*

-----------------------

*పైకి మంచిగా కనబడినా చాటుగా గోతులు తెగ తీస్తుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికీ దొరకరు. అకస్మాత్తుగా దాడిచేయడంలో సిద్ధహస్తులు.*


*11.WHINERS ( ఏడుపుగొట్టు గాళ్ళు) :*

----------------------- *ఎప్పుడు ఇతరుల ఉన్నతిని, విజయాలను చూసి ఏడిచేవాళ్ళు. అందరూ బాగున్నారు కాని తాము మాత్రమె ఎదగలేకపోతున్నాం అంటూ తెగ బాధపడుతుంటారు. ఎపుడు ఇతరుల పై అసూయ తో ఉంటూ ఉండేవాళ్ళు.*


*12. EXPLODERS (పటాష్ గాళ్ళు)*

-----------------------

*వీరికి వ్యతిరేకంగా ఏమి జరిగినా వీరు అనుకున్నట్టు వీరికి ఏ మాత్రం అనుకూలంగా జరగకపోయినా పటాష్ లా ఫట్ మని బద్దలై బీభత్సం సృష్టిస్తారు. వీరితో పెట్టుకోవడం చాలా ప్రమాదం అని అందరూ అనుకునేలా నోరు వేసుకొని మీద పడుతుంటారు.*


*13. PATRONIZERS* *(వకల్తా గాల్లు)*

-----------------------

*వీరు ఎప్పుడు తమ గురించి కాకుండా ఇతరుల గురించి వకల్తా తీసుకొని మాట్లాడుతుంటారు. వారికి సంబంధం లేకపోయినా ఇతరుల గురించి వీరు తెగ ఫీలైపోతుంటారు.*


*_👆ఈ పై మనస్తత్వంతో ఉన్న వీరిని  ఎలా  సంస్కరించాలనే ఆలోచనలొద్దు. వీరినుండి మనం మనల్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచిద్దాం. దారిలో ముళ్ళుంటే అవన్నీ ఏరుకొని కూర్చుంటామా, కాళ్ళకు మంచి చెప్పులు వేసుకుంటే సరిపోలా?_...*

*విష్ యూ ఆల్ ది బెస్ట్.*

తస్మాత్ జాగ్రత్త

 తస్మాత్ జాగ్రత్త

🚫❌️⛔️🚫❌️⛔️🚫❌️⛔️


ఒక బస్సు 🚌  సూర్యాపేట నుండి హైదరాబాద్ కు ప్రయాణికులతో   వెళుతుంది. అందులో చాలామంది ప్రయాణికులు ఎక్కారు!!


ఆ బస్సు బయలు దేరుతుంది, కండక్టర్ టికెట్లు తీసుకుంటుండు. అందర్నీ టికెట్ తీసుకోవాలని  కోరుతూ ముందుకు వస్తున్నాడు!!


అలా సగం మంది టికెట్లు తీసుకోగా ఒక ఆయన దగ్గరికి వచ్చాడు... 

ఓ పెద్దాయన టికెట్ తీసుకో అని చెప్పాడు!!


ఆ పెద్దమనిషి తన జేబులు అన్ని తడుముకొని చూసి అరే అరే నా జేబులో ఐదు వందల రూపాయల నోటు ఉండాలి అది ఎక్కడో పడిపోయింది అని ఆ పెద్దమనిషి చెప్పాడు!!


కండక్టర్ లేదు నువ్వు కచ్చితంగా టికెట్ తీసుకోవాలి లేదంటే నిన్ను ఈ మధ్యలోనే బస్సులో నుంచి దింపి వేయడం జరుగుతుంది అంటూ ఆ పెద్దమనిషిని తిట్టసాగాడు కండక్టర్!!


ఆ పెద్దమనిషి అయ్యా నేను ఒక ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను. నేను ఈ క్షణాన అక్కడికి వెళ్లకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. నేను కచ్చితంగా నేను వెళ్ళాలి అని కండక్టర్ ని వేడుకుంటూ ఉన్నాడు!!


ఇంతలో ఆ బస్సులోనే ఇంకొక రెండవ పెద్ద మనిషి అయ్యా అతని టికెట్ నేను తీసుకుంటాను, అతన్ని తిట్టొద్దు అంటూ రెండవ పెద్ద మనిషి మొదటి పెద్ద మనిషిని టికెట్ తీసుకున్నాడు!!


మొదటి పెద్దమనిషి ఆ టికెట్ తీసుకున్న రెండవ పెద్ద మనిషిని చూసి అయ్యా నువ్వు నిజంగా దేవుడవయ్యా అన్ని మొక్కడం మొదలుపెట్టాడు.

నాకు ఈ ప్రయాణం ఎంతో ముఖ్యం. అందరిలోనూ నువ్వు నాకు టికెట్ తీసుకున్నందుకు నువ్వు దేవుడవయ్యా!!


అని తను బస్సు దిగి ఇంటికి పోయిన తర్వాత కూడా బస్సులో ఒక పెద్ద మనిషి నాకు టికెట్ తీసుకున్నాడు అంటూ ఇంకా మనసులో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇలా సాయం చేసినందుకు జీవితాంతం ఆ పెద్దమనిషిని మరవకుండా కొలవడం ఈ పెద్దమనిషి పని అయింది!!


అయితే తన దగ్గర ఉన్న 500 రూపాయలు ఎక్కడో పడిపొయింది అనుకున్నాడు మొదటి పెద్దమనిషి.

కానీ రెండో పెద్ద మనిషే అతని దగ్గర ఉన్న 500 రూపాయలను దొంగలించింది. !!


*ఐదు వందల రూపాయలు దొంగలించి 50 రూపాయల బస్సు టికెట్ తీసుకుని దేవుడవయ్యా అనిపించుకున్నాడు ఆ రెండవ దొంగ పెద్దమనిషి!!*


*"#రాజకీయాలలో ఉన్న పెద్ద మనుషులు అందరూ తమ సొంత కష్టార్జితం సంపాదించి తన ఇంట్లో నుంచి ఇస్తున్నట్టుగా ప్రజలని నమ్మించి ఈ క్రింది విధంగా దోపిడీ చేస్తున్నారు!!*


పించన్ ఇస్తున్నాం

రేషన్ ఇస్తున్నాం

ఉచిత వైద్య ఇస్తున్నాం

ఉచిత విద్య ఇస్తున్నాం

ఉచిత కరెంటు ఇస్తున్నాం

ఉచిత భూములు ఇస్తున్నాం

ఉచిత త్రాగునీరు ఇస్తున్నాం

ఉచిత ఇండ్లను ఇస్తున్నాం

మరెన్నో ఇంకా... 

ఉచితం... 

ఉచితం...

ఉచితం...


ఇవి మొత్తం ఉచితం అయితే సమాజంలో ప్రజలపై

టాక్సెస్ ఎందుకు పెరిగినాయి?

పెట్రోలు ఎందుకు పెరిగింది?

బస్సు చార్జీలు ఎందుకు పెరిగాయి?

కరెంటు చార్జీలు ఎందుకు  పెరిగాయి?

రాష్ట్రంలో దేశంలో అప్పులు ఎందుకు పెరిగాయి?

జీతాలు టైం కి ఇయ్యాలేని దుస్థితి కి తెచ్చారు..

ఇలా చాలా చాలా దోపిడీ చేస్తోంది ఈ రాజకీయ అవినీతి పాలకులు!!


మేలుకోండి ప్రజలారా...!!!

ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు చేదు నియమాలు

 *ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు చేదు నియమాలు* 


*1.ప్రకృతి యొక్క మొదటి నియమం* : 


ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది. 


అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరు కుంటాయి. 


*2. ప్రకృతి యొక్క రెండవ నియమం* :  


ఎవరివద్ద ఏమిఉంటుందో వారు దానినే పంచు కోగలరు. 


సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచ గలరు. 


దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచ గలరు. 


జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు. 


భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు.


భయస్తులు భయాన్నే పంచగలరు.


*3. ప్రకృతి యొక్క మూడవనియమం* : 


మీకు మీజీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోండి. 


ఎందుకంటే ....


భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి. 


ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది. 


మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి. 


ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది. 


నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది. 


అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది. 


దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది. 


సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది. 


*విషయం చేదుగా ఉన్నా ఇది నిజం.*

సొంత ఇంటి కల నెరవేరాలంటే... పరిష్కారాలు

 🌹సొంత ఇంటి కల నెరవేరాలంటే...

పరిష్కారాలు🌹


శివుడ్ని సన్నజాజులతో పూజించండి.


తొమ్మిది మంగళవారాలు మీ దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లి తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అర్చన గాని అభిషేకంగాని చేయించుకోండి.


9 మంగళవారాలు మీ ఇంట్లో యాక్షిని దీపం పెట్టండి


🪔యక్షిణి దీపం🪔


 తొమ్మిది మంగళవారాలు ఉదయం గాని సాయంత్రం గాని దక్షిణదిక్కున పెట్టేది యాక్షిని దీపం.


ఒక పీట శుభ్రంగా కడిగి దానిమీద బియ్యప్పిండితో త్రికోణం 🔼ముగ్గువేసి, త్రికోణం మధ్యలో  నువ్వుల నూనెలో కుంకమ కలిపి ఆ కుంకమతో  "హ్రూం" అనే అక్షరం రాసి దాని మీద రెండు ప్రమిదలు పెట్టీ నువ్వుల నూనెతో 9 వత్తులు వేసి ( 3,3 వత్తులుగా లేదా 9 వత్తులు కలిపి గానీ ) దీపం వెలిగించి మాకు స్వగృహం అమరాలి అని సంకల్పించుకోండి. మధ్యలో break రాకుండా 9 రోజులు దీపం వెలిగించండి, మీకు ఏదైనా ఆటంకమైతే మీ పిల్లలతో కానీ, మీవారితో కానీ యాక్షిని దీపం పెట్టించండి. తప్పకుండ మీ స్వగృహ సంకల్పం నెరవేరుతుంది.


(శుచి శుభ్రతగా దీపం పెట్టండి, తలస్నానం అనేది మీ ఓపిక / శారీరక ఆరోగ్యాన్ని బట్టి చేయవచ్చు)


మీ దగ్గర్లో ఎక్కడైనా కాళీ ప్రదేశం ఉంటే, ఆ ప్రదేశంలో ఒక రావి చెట్టు పాతి నీళ్లు పోసి రండి, మీకు ఇల్లు అమరకుండా ఏమైనా గ్రహ దోషాలు ఉంటే పోతాయి, త్వరగా స్వగృహం అమరుతుంది..👍🏻🚩💐

సార్థకత చేసుకోగలవా?

 *🍃🥀సార్థకత చేసుకోగలవా?*


*🍃🥀పూవులుగా పుట్టామని తెలియకున్నా*

*పరిమళాలను పంచుతాయి*

*మనిషిగా పుట్టావని తెలిసినా*

*మమతలను మాత్రం పంచలేవు*


*🍃🥀ఎందుకు పుట్టాయో విరులకు తెలియకున్నా*

*ఆనందాన్నే పంచుతాయి*

*బుద్ధిజీవిగా పుట్టి కూడా*

*నీ సంతోషమే చూసుకుంటావు*


*🍃🥀ఏ వర్ణమో తమకు తెలియకున్నా*

*స్వచ్ఛతను పంచుతాయి*

*అన్ని వర్ణాలు తెలిసినా*

*రుధిర వర్ణాన్నే కోరుకుంటావు*


*🍃🥀అల్పాయువని తెలిసినా*

*జన్మ సార్ధకం చేసుకుంటాయి*

*కలకాలం బ్రతకవని తెలిసినా*

*జన్మ నిరర్ధకం చేసుకుంటావు*


*🍃🥀అందుకే నీవు "మనిషి"వయ్యావు*

*స్వార్ధమే పరమావధిగా బ్రతుకుతున్నావు*

*నా రాత నేనే రాసుకుంటానంటావు*

*ఏ ప్రాణికీ సంతోషం అందివ్వలేనంటావు*


*🍃🥀ఇకనైనా మారవోయ్...ఓ..మనిషి*

*మంచితనంతో పరిమళించవోయ్*

*మానవత్వంతో గుబాళించావోయ్*

*మనిషంటే....."ఇలా"...ఉండాలని*

*నిరూపించవోయ్...*


            

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE