NaReN

NaReN

Tuesday, June 7, 2022

_తరతరాల పరిశీలన.. కార్తెల పరిజ్ఞానం.

 *_తరతరాల పరిశీలన.. కార్తెల పరిజ్ఞానం..._* 

*☁️🌞🌝🌥️🌦️🌈🌧️🌨️*

*===================*

_ఉపగ్రహ సమాచారం అందుబాటులో లేని కాలంలోనే నిత్యపరిశీలనతో వాతావరణాన్ని అంచనావేస్తూ వ్యవసాయం చేశారు రైతులు._ 

_ఏడాది 27 నక్షత్రాలను 27 కార్తెలుగా_ 

_(ఒక కార్తె సుమారు 14రోజులు ఉంటుంది)_ _విభజించి ఆయా కార్తెల్లో వాతావరణం తీరు, దానికనుగుణంగా చేయాల్సిన పనులను, చేయకూడని పనులను సామెతలుగా చెప్పారు._ 

_ఈ కార్తెలలోని వర్షపాతాన్ని బట్టి ఆ ఏడు అతివృష్టా, అనావృష్టా లేక సామాన్యమా అనేది చెప్పగలిగేవారు._ 


*తొలకరి వానలు* _ఆషాఢంలో మృగశిరకార్తె 

(సుమారు జూన్‌ 8- 21)లో ప్రవేశిస్తాయి._ 


*_‘మృగశిర కురిస్తే ముంగిళ్లు చల్లబడతాయి,'_* *_'మృగశిర చిందిస్తే మిగిలిన కార్తులు కురుస్తాయి,'_* 


*మృగశిర వర్షిస్తే మఖ గర్జిస్తుంది,'_* 

_మృగశిరలో తొలకరి వర్షిస్తేనే మఖలో వర్షాలు పడతాయి,_ 

*_'మృగశిర చిందిస్తే ముసలెద్దు రంకె వేస్తుంది,'_* 

*_'మృగశిరలో వేసిన పైరు మేలు చేస్తుంది’_* 

_తదితర సామెతలు సేద్యంలో మృగశిర  ప్రాధాన్యాన్ని చెబుతాయి._


      _ఆరుద్ర (జూన్‌ 22- జూలై 5) కార్తెలో వర్షాలు ఎక్కువ పడడం పంటకు చాలా అవసరం. ఆ అవసరాన్ని తెలిపేవే..._ 


 *_‘ఆరుద్ర వాన అదను వాన,'_* 

*_'ఆరుద్ర కురిస్తే దారిద్య్రం ఉండదు,_* 

*_'ఆరుద్రకార్తె విత్తనానికి- అన్నం పెట్టిన ఇంటికి చెరుపు లేదు,_* 

*_'ఆరుద్రలో అడ్డెడు చల్లితే సులువుగా పుట్టెడు పండుతాయి’_*   _లాంటి సామెతలు. _


      _తరువాత కార్తెలు పునర్వసు (జూలై 6- 19) పుష్యమి (జూలై 20- ఆగష్టు 02)._ 


*_'పునర్వసు, పుష్యములు వర్షిస్తే పూరెడుపిట్ట అడుగైనా తడవదు’_* 


_అనే సామెత ఆ రోజుల్లో వానలు తక్కువ అనే అంశాన్ని తెలుపుతుంది. ఆపై వచ్చే..._ 


_ఆశ్లేష కార్తె(ఆగష్టు 3- 16)లో నాన్పుడు వర్షం కురుస్తుంది. నాట్లు కూడా త్వరగా సాగుతాయి._ 

_అధిక వర్షం సాగు పనులకు ఆటంకం కలిగిస్తుంది._ _అరికాలు తడి అయ్యేంత వర్షం నాట్లకు అనుకూలం. అందుకే..._ 

*_‘ఆశ్లేషలో ఊడిస్తే అడిగినంత పంట*, .

*_'ఆశ్లేషలో అడుగునకొక చినుకు అయినా అడిగినన్ని పండలేను అందట వరి'_*, 

*_' ఆశ్లేషలో అడ్డెడు చల్లడం మేలు’_* 

_మొదలైనవి ఆశ్లేష కార్తెకు సంబంధించిన సామెతలు._


 _మఖ (ఆగష్టు 17- 30) శ్రావణంలో వస్తుంది. వానలు ఎక్కువ._ 

*_‘మఖలో మానెడు చల్లడం కన్నా ఆశ్లేషలో అడ్డెడు చల్లడం మేలు, మఖలో చల్లిన విత్తనాలు మచ్చలు కనబడతాయి,_* 


*_మఖ ఉరిమితే వెదురు మీద కర్రయినా పండుతుంది’_* 

_లాంటివి ఈ కార్తెలో చేయాల్సిన వ్యవసాయ పనుల గురించి తెలియచేస్తాయి._ 

      _ముందు వచ్చే కార్తెలలో వర్షాలు అంతగా కురవకపోయినా వర్ష రుతువులో వచ్చే మఖ, పుబ్బ (ఆగష్టు 31- సెప్టెంబరు 13) కార్తెలలో తప్పక కురవాలి. లేకపోతే క్షామం తప్పదు._ 

*_‘మఖ పుబ్బలు వరుపయితే మహా ఎత్తయిన క్షామం_*,

 *_మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు’_*

 _(పుట్టగొడుగులు మఖలో పుట్టి పుబ్బలో మాడిపోతాయి. ఏదైనా స్వల్పకాలంలోనే అణగిపోతే దీనిని వాడతారు) సామెతలు దీన్ని సూచిస్తాయి._ *_‘పుబ్బలో చల్లడం దిబ్బ మీద చల్లినట్లే’_* 

_అనేది పుబ్బలో విత్తడం మంచిది కాదని చెబుతుంది._


*_ఉత్తర చూసి ఎత్తరగంప_*


_ఉత్తర కార్తె సెప్టెంబరు మధ్యలో వస్తుంది. ఖరీఫ్‌ పంట ఒకదశకు చేరుతుంది. ఈ కార్తె ప్రవేశించే నాటికి వానలు సరిగా పడకపోతే సాగు కష్టం అని చెప్పడమే ఈ సామెత ఉద్దేశం. దీన్ని సూచించేందుకే గంపను ఎత్తి పక్కన పెట్టమని చెప్పారు జానపదులు._ 

_ఉత్తరలో వరినాటడానికి ఆలస్యం అవుతుంది. వేరుశనగ, సజ్జ, పప్పు ధాన్యాలు కూడా ఈ కార్తెలో విత్తకూడదు. జొన్న మాత్రం కొన్ని ప్రాంతాలకు అనుకూలం. ఉలవ అన్ని ప్రాంతాలలో చల్లడానికి మంచి అదును. అందుకే..._ 

*_'ఉత్తర పదును ఉలవకే అదును’_* 

_అనే సామెత పుట్టింది._ 

*_‘ఉత్తర ఉరుము తప్పినా, రాజుపాడి తప్పినా, చెదపురుగుకి రెక్కలొచ్చినా కష్టం, విశాఖ చూసి విడవర కొంప_*,   

*_ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం’_*

_లాంటి సామెతలూ ఇలాంటివే._ 


      _ఉత్తర తరువాత వచ్చేది హస్త (సెప్టెంబరు 27- అక్టోబర్‌ 11)._ 

_ఆశ్లేషలో నాటిన వరిపంట హస్తకార్తె వచ్చే సరికి అనాకుపొట్ట దశకు వస్తుంది._ 

_చిత్తకార్తెలో (అక్టోబరు 11- 23) చిరుపొట్ట వస్తుంది. వెన్ను చిరుపొట్టతో ఉంటుంది. ఈ సమయంలో నీరు చాలా అవసరం._ 

_అప్పుడు వర్షం లేకపోతే పంట చేతికి రావడం కష్టం._ 

*_‘హస్త కురవక పోతే విత్తినవాడూ, విత్తని వాడూ ఒక్కటే_*, 

*_హస్తకు అనాకుపొట్ట, చిత్తకు చిరాకు పొట్ట_*, 

_హస్త, చిత్తలు ఒక్కటైతే అందరి సేద్యం ఒక్కటే, చిత్త కురిస్తే చింతలు కాస్తాయి,_    *_చిత్త స్వాతులు కురవకపోతే చిగురుటాకులు మాడిపోతాయి...’_*   _లాంటి సామెతలు చాలా ఉన్నాయి._


*_యథా చిత్త తథా స్వాతి_*


_చిత్తలో వర్షం ఎలా ఉంటుందో, స్వాతిలో కూడా అలాగే ఉంటుంది. ఈ కార్తెలో సాధారణంగా గాలివానలు వస్తాయి._   *_‘స్వాతివాన చేనుకు హర్షం_* (మెట్ట ప్రాంతం), *_చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే వీసానికి పుట్టెడు పండుతానంటుంది జొన్న’_* 

_లాంటి సామెతలు తెలుగులో ఎన్నో ఉన్నాయి._ 


_విశాఖ కార్తె వచ్చేప్పటికి వరి కోతకు సిద్ధంగా ఉంటుంది. వర్షం అవసరం ఉండదు._ 

_ఈ అనుభవంతో వచ్చిన సామెత...._ 

*_‘విశాఖ కురిస్తే పంటకు విషమే’_*. 

_అయితే.. మఖ, పుబ్బల్లో చల్లిన ఆముదాలు విశాఖలో పొట్టమీద ఉంటాయి. అప్పుడు వాటికి వర్షం అవసరం. అందుకే...._ 

*_‘విశాఖ వర్షం ఆముదాలకు హర్షం’_*! 


_ఇక 'భరణి' (ఏప్రిల్‌ 27- మే 10),_ 

_'కృత్తిక' (మే 11- 24), 'రోహిణి '(మే 25- జూన్‌ 7)లపై...._ 


*_‘భరణి కురిస్తే ధరణి పండును, కృత్తికలో విత్తితే కుత్తుకలు నిండవు,_* 

*_రోహిణిలో విత్తితే రోటిలో విత్తినట్లే’_* 

_లాంటివి రైతుల ప్రకృతి పరిశీలనా దృష్టికి నిదర్శనాలు._


*_ఊరిముందరి చేను... ఊళ్లో వియ్యం అందిరావు_*


_ఊరికి సమీపంలో చేను ఉంటే ఊళ్లో ఉండేవారు, వచ్చిపోయే వారు, పశువుల బెడద... ఇంత కష్టం ఉంటుంది._ 


_ఇక ఊళ్లో వియ్యం సంగతి... భార్యా భర్తలిద్దరిది ఒకే ఊరయితే ఆ ఇంట్లో విషయం ఈ ఇంట్లో,_ 


*_ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో తెలిసి సంసారం ఇబ్బందికరంగా సాగుతుంది._* 


_ఈ సామెత పుట్టుకకు కారణం ఇదే._ *‘కర్ణునితో భారతం సరి కార్తీకంతో వానలు సరి, ఫాల్గుణమాసపు వాన పది పనులకు చెరుపు’* _ఇలా ఎన్నో సామెతలు జీవితానుభవం నుంచి పుట్టాయి._ 


      *వందల ఏళ్లుగా ఈ విజ్ఞానం రైతులకు దారిదీపంగా నిలిచింది. ఇప్పుడు ఈ విజ్ఞానం రూపుమాసిపోతోంది. ఇప్పటి వారికి చాలా సామెతలు, ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించినవి తెలియవు. వీటిని పాఠ్యప్రణాళికలో భాగం చేయాలి. అప్పుడే మనదైన విజ్ఞానం ముందుతరాలకు భద్రంగా అందుతుంది.*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE