NaReN

NaReN

Wednesday, June 22, 2022

ప్రవర్తనా నియమావళి-1964 నియమ - నిబంధనలు:

 ప్రవర్తనా నియమావళి-1964 నియమ - నిబంధనలు:


👉Rule 3(a):-

*ఏ ఉద్యోగియైన దేశ భద్రతకు, రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించే ఉద్దేశ్యం గల సంస్థలతో సంబంధాలు కలిగిన సభ్యునిగా ఉండకూడదు.*


👉Rule 3(b):-

*విధి నిర్వాహణలో గాని ఇతరత్రా గాని ప్రజలతో సమంజసమైన రీతిలో ప్రవర్తించాలి. అసభ్యంగా ప్రవర్తించకూడదు. తనకు కేటాయించిన పనిని దురుద్దేశ్యంతో గాని మరి ఇతరత్రా కారణాల వల్లగాని, అదేపనిగా ఆలస్యం చేయకూడదు.*


👉Rule 3(c):-

*ఏ ఉద్యోగియైన సరే తన విధినిర్వాహణలో ఉద్యోగినుల విషయంలో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలి. అమర్యాద పూర్వకంగా గాని, అసభ్యంగా గాని ప్రవర్తించకూడదు. అదే విధంగా లైంగిక వేధింపులు గురి చేయకూడదు.*


👉Rule 4:-

*ఏ ఉద్యోగి కూడా సమ్మెలు, తదితర రెచ్చగొట్టే కార్యక్రమాలలో పాల్గొనకూడదు.*


👉Rule 5:-

*రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు భంగం కలిగించే ప్రదర్శనల (Demonstrations) లో పాల్గొనకూడదు.*


👉Rule 7:-

*ప్రభుత్వ పూర్వానుమతి లేనిదే ఏ కార్యక్రమానికైనా చందాలు వసూలు చేయటం కాని తీసుకొనటం కాని చేయకూడదు.*


👉Rule 10:-

*ఏ ఉద్యోగస్థుడు కూడా ప్రయివేటు వ్యాపారములు తదితరములు చేయకూడదు. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అట్టి పనులు చేయకూడదు. అదే విధంగా భీమా ఏజెంటు గా గాని, కమిషన్ ఎజెంటు గా గాని పనిచేయకూడదు.*


👉Rule 11:-

*ఏ ఉద్యోగస్థుడు కూడా  వ్యక్తిగత హోదాలో బ్యాంకులు గాని, రిజిస్టర్డు కంపెనీలు గాని పెంచి పోషించకూడదు. కాని సామాజిక సేవా దృక్పధంతో రిజిస్టర్డు కాబడిన సహకార సంస్థల కార్యకలాపాలలో పాలు పంచుకోవచ్చును.*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE