NaReN

NaReN

Tuesday, June 7, 2022

చుట్టరికం

 *🎪చుట్టరికం

    💦🌹🌈⛳  

          

 *🍁గతంలో* 

 *నాలుగు జతల బట్టలు సర్దుకొని* 

 *నాలుగు రోజులు చుట్టరికం చేసి రావడం* 

 *ఒక గొప్ప మధురానుభూతి* !


 *ఊరి పొలిమేరలనుండి* *స్వాగతం పలికే* 

 *ఉమ్మడి బంధువుల చిరునవ్వు* 

 *మనసును ఎంతగానో* *మురిపించేది !* 


 *పలకరింపులు పూర్తయ్యేక* 

 *మా యోగక్షేమాలడిగి* *ఆనందించేవారు !* 


 *పూటపూటకో కొత్త వంట రుచి* *చూపించి* 

 *మాటమాటకో కొత్త విషయాన్ని*  

 *చెవిలో వేసేవారు !* 


 *మా ఊరి విషయాల మూటలు* 

 *నేను ఒక్కొక్కటిగా* *విప్పుతుంటే* 

 *బంధువుల హృదయాలు* *పులకించిపోయేవి !* 


 *సాయంత్రం వేళల్లో టూరింగ్* *టాకీసులో* 

 *సినిమాలు చూపించి* *సంబరపడిపోయేవారు !* 


 *రాత్రిపూట కబుర్ల దుప్పటి కప్పి* 

 *వెచ్చని మమతలు* *మిగిల్చేవారు !* 


 *మా ఇంటికి చుట్టాలొచ్చినా* 

 *అదే కథ యథాతథం !* 


 *బంధాలు బలపడటం* *చుట్టరికం ప్రత్యేకత.* 

 *వివాహ బంధాలు* *ముడివడటం* 

 *చుట్టరికాల ఘనత.* 

 *పరస్పరం భరోసా* *కల్పించుకోవడం* 

 *చుట్టరికాల్లో గొప్ప విశిష్టత !* 


 *ఆధునీకరణ, నగరీకరణ,* 

 *ఆర్ధిక సంబంధీకరణ కారణంగా* 

 *నేడు కనుమరుగైపోయిన* 

 *చుట్టరికాల వ్యవస్థను*  

 *ప్రభుత్వాలు చట్టరికం చేస్తే* 

 *విచ్చిన్నమైపోతున్న ఉమ్మడి* *కుటుంబాలు* 

 *మరల ఊపిరి* *పోసుకుంటాయి !* 

 *మానవ సంబంధాలు* 

 *మరింత పటిష్టంగా* *పెనవేసుకుంటాయి* !


 *ఉండండి* 

 *మరలా  నిత్యనూతనంగా* 

 *నాలుగు రోజులు చుట్టరికం* *చేయడానికి* 

 *నాలుగు జతల బట్టలు సర్దుకొని వస్తాను !* 


🍀🪷🌹🍁🦜🦚

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE