NaReN

NaReN

Tuesday, June 7, 2022

ఒక తండ్రి ఆరాటం

 పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న ఒక తండ్రి ఆరాటం...!!        


*యువత తప్పక చదవాల్సినది ఒక యథార్థ గాథ👍* 

         సాయత్రం⏲️ 4గంటల టైం...!!!  కర్నూల్ జాతీయ రహదారి  NH-44 కు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కోసం వెళ్లి బైక్ ఆపాను... అక్కడే పెట్రోల్ బంక్ లో పని చేసే వ్యక్తి వచ్చి ఎంత వేయాలి సార్...!!!అని అడిగారు... 

నేను ₹1010/- రూపాయలు అని చెప్పగానే... అప్పుడే ఒక టీచర్ ఫ్రెండ్ కాల్ వచ్చింది... అప్పుడు నా మాటల సంభాషణ విన్న ఆయన మీరు హెడ్మాస్టరా సార్ అని అడిగాడు... అవును అని సమాధానం ఇచ్చాను...

ఎక్కడ సార్...!!! ఏ ఊరు జాబ్..?  ఎప్పుడు వచ్చింది సార్...!! లాంటి పలు ప్రశ్నలు చాలా ఆసక్తిగా అడిగాడు... ఆ వ్యక్తి అలా అడుగుతున్నప్పుడు నాకు అనిపించింది...  ఒక ఉద్యోగి పట్ల ఆయనకున్న గౌరవం... అందుకు గల ఎదో భావోద్వేగ అంశం ఎదో ఒకటి ఉంటుందని...మనసులోనే అనుకుంటూ నేను కూడా మాట కలిపి మీరు ఏ ఊరు...? మీ పిల్లలు ఏమి చేస్తున్నారు...? మీ డ్యూటీ టైమింగ్స్ ఏంటి అని అడిగాను. ఆయన నాకు ఇద్దరు పిల్లలు సార్...!! నా కొడుకు B.Sc అగ్రికల్చర్ జైపూర్ లో చేసాడు.... కోర్స్ ముగించుకొని ఇంటికి వచ్చి  మూడు రోజులు అయ్యింది సార్...! *నా కొడుక్కి ఏమైనా ఉద్యోగం వస్తదా..?? సార్..!!*  అని అమాయకంగా అడగడం చూసి... ఒక తండ్రి తన కొడుకు భవిష్యత్ పై ఉండే ఆరాటం ఎంత ఉందో నాకు అర్థం అయ్యింది.... తన కొడుకు ఎందరి లాగానో ఉద్యోగం సాధించాలని కంటున్న కలలు ఆ తండ్రి కళ్ళు చూసి నాకు ఒక ఆయనలో ఉన్న తపన కనిపించింది...నేటి యువత తల్లిదండ్రుల కలల కోసం, వారి కలలు తీర్చటానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి...?? అని నా మైండ్ లో ఎన్నో ప్రశ్నలు  మెలిగాయి... ఇక కొనసాగింపుగా ఉద్యోగం రావాలంటే నా కొడుకు ఇంకా ఏమి చదవాలి సార్...!! ఎలా చదవాలి సార్...!! అని పలు ప్రశ్నలు అడిగాడు...! నేను ఆ రంగంలో ఉన్న అవకాశాలు గురుంచి చెప్పాను.


అలాగే కూతురు ఏమి చేస్తుంది అని అడిగాను...? MBA చేస్తుంది సార్..! పాపకు ఇష్టం అంటే చేర్పించాను అన్నాడు... అప్పుడు నాకు ఒక పెట్రోల్ బంక్ లో పని చేస్తూ ఉన్నత చదువులు చదివిస్తూ తన పిల్లల భవిష్యత్తు కోసం ఇంతలా తాపత్రయ పడుతూ ఒక బాధ్యతాయుతమైన తండ్రి నాకు అనిపించాడు. 

అప్పుడు  మీకు జీతం ఎంత వస్తుంది?? ఇంత టైం వరకు పని చేయాలి...?? మరి మీరు పెట్రోల్ బంక్ లో ఎప్పటి నుండి పని చేస్తున్నారు అంటే...???


*25 సంవత్సరాలు నుండి పెట్రోల్ బంక్ లోనే* పని చేస్తున్నా..!! అని గద్గద స్వరంతో చెప్తూ... డ్యూటీ టైం  *24 గంటలు* పనిలోనే ఉండాలి  సార్...!! ఒక రోజు వర్క్ ఒకరోజు సెలవని *నెలకు ₹10,000/- జీతం* ఇస్తారని  నా జీవితం మొత్తం పిల్లల చదువుకే పెడుతున్న సార్...!! అని అన్నాడు... కొంత నెమ్మదిగా....☺️!! ఆగి

కొద్దిగా పొలం ఉంది ఆవిధంగా పిల్లల భవిష్యత్ కోసం జీవిస్తున్నాము.. సార్..!! అని అన్నాడు... నేను కూడా పెట్రోల్ పోయించుకొని ₹1,020/-రూపాయలు ఇవ్వగా ₹10/-  రిటర్న్ ఇస్తుంటే ఉంచుకోండి అన్నా...!! అని చెప్పి...  నీవు కోరుకున్న విధంగానే *మీ పిల్లలు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాల్లో* ఉంటారు...సంతోషంగా ఉండండి అని చెప్పి... బయలుదేరాను.. 

      ఆయన తో నేను గడిపిన పది నిమిషాల సమయం పిల్లల భవిష్యత్ కోసం... శ్వాస ధ్యాస గా జీవిస్తున్న ఎందరో తల్లిదండ్రుల కలలను అర్థం చేసుకొని భవిష్యత్తు కోసం కష్టపడుతున్న యువత ఎంత మంది ఉన్నారో...!! అని... అనిపించింది. 

అది కొనివ్వలేదు ఇది కొనివ్వలేదు అంటూ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే యువత కు నేను ఇచ్చే ఒకే ఒక్క సలహా...!!

_*ప్రాథమిక అవసరాలు మాత్రమే తల్లిదండ్రులతో తీర్చుకోవాలి... విలాసలు స్వతహాగా (పార్ట్ టైం జాబ్స్ చేస్తూ) సంపాదించుకోవాలి.*_

     ఇక్కడ *ప్రాథమిక అవసరాలు* అంటే కాలేజిస్ ఫీజులు, హాస్టల్ లేదా రూమ్ చార్జెస్, ఫుడ్, తగినన్ని బట్టలు. *విలాసాలు* అంటే ఫ్రెండ్స్ తో షికారులు, సినిమాలు, బ్రాండెడ్ ఫోన్స్ ఎలక్ట్రికల్ పరికరాలు లాంటివి. 

*యువత మీరు చదివే చదువుకు క్రమశిక్షణ తోడైతే...!!బంగారానికి పరిమళం అద్దినట్టు అవుతుంది.*

ఈ జీవితం నీది.. తదనుగుణంగా దీని నువ్వే రూపుదిద్దికోవాలి... మీ *విజయంమే🎯* నిన్ను కనిపెంచిన తల్లిదండ్రులకు , నిన్ను నమ్ముకున్న వారికి మీరు ఇచ్చే ఒక గొప్ప బహుమతి🎁

జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని ముఖ్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిత్యం డ్రీమ్స్ కోసం పరితపిస్తూ..... 

సమయం వృధా చేసే సోషల్ మీడియాకు, అతి నిద్ర కు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సూర్యోదయానికి 🌤️ముందే నిద్ర లేచి ప్రతిరోజు జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తే బంగారు భవిష్యత్తు మీదే.....👍


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE