NaReN

NaReN

Saturday, June 4, 2022

రాత్రి నిద్ర పట్టాలి అంటే ఏమిచెయ్యాలి?

 రాత్రి నిద్ర పట్టాలి అంటే ఏమిచెయ్యాలి?

అవగాహనా కోసం కొన్ని సలహాలు


       ప్రతి మనిషికి ప్రతి రోజూ 8 గంటల నిద్ర అవసరం. అంతేకాకుండా పగటి పూట ఒక అరగంట నిద్ర పోయి నట్లయితే మళ్లీ బాడీ రీచార్జ్ అవుతుంది ...

రాత్రిపూట బాగా నిద్ర పట్టాలంటే శరీరానికి తగినంత వ్యాయామం అవసరం.

*రాత్రి ఒక రెండు గంటల ముందు నుంచి టీవీలు లాప్ టాప్ కంప్యూటర్లు సెల్ఫోన్లు వెలుతురు కి సంబంధించిన అన్ని వస్తువులకు దూరంగా ఉండాలి*.పడుకునే ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేసి పడుకుంటే మరింత బాగా నిద్ర పడుతుంది.


*వేకువ జామున నిద్ర లేవడానికి సహాయపడే కొన్ని పద్ధతులు, అలవాట్లు:*


*అతి ముఖ్యమైన అలవాటు:- 1.-రాత్రి త్వరగా పడుకోవడం (తొమ్మిది- పది గంటల మధ్యలో) .చాలా మందికి రాత్రి త్వరగా పడుకున్నా నిద్ర రాదు. పడుకోగానే నిద్ర వచ్చేటట్లు చేయడానికి సాయంత్రం పూట 2.-వ్యాయామం, ఆటలాడటం వంటి శారీరక శ్రమ తో కూడిన పనులు చేస్తే, ఆ అలసట తోనే రాత్రి త్వరగా నిద్ర పడుతుంది. 3.- నీద్రకు ఉపక్రమించే కొంత సమయం ముందు నుంచి సెల్ ఫోన్, టీవిలను కట్టేయాలి.

4.- మీకు పిల్లలుంటే, వాళ్ళ కి కథలు చెప్పండి. ఎక్కడలేని నిద్ర ముంచుకొస్తుంది.పిల్లల కంటే ముందు మీరు నిద్రపోయినా ఆశ్చర్యం లేదు! 5.- పడక గదిలో నిద్రకు భంగం కలిగించేలా ఎక్కువ వెలుతురు, శబ్దాలు లేకుండా చూసుకోండి.

                 ఇవన్నీ చేసి మీరు తొమిదిన్నరకల్లా పడుకుని, ఒక ఎనిమిది గంటలసేపు హాయిగా నిద్రపోయినా, పొద్దున ఐదున్నరకు అలార్మ్ మోగినప్పుడు లెయ్యాలనిపించదు.


*అప్పుడు పనిచేసే కొన్ని కిటుకులు:*


1.-అలార్మ్ ఫోనులో పెట్టుకున్నట్లయితే దాన్ని మనకు పడుకుని అందనంత దూరంలో పెట్టాలి. ఒకటి కంటే ఎక్కువ కూడా మొదట్లో పెట్టుకోవాల్సి రావచ్చు.


2.-ఇక మీ మనసులో " లేవలా.. వద్దా? ఆ చదవాల్సినది/ చెయ్యాల్సిన పని, ఇంకొంచెం సేపు నిద్రపోయి తర్వాత చేద్దాం" ఇలాంటి ఆలోచనలు తథ్యం.


3.- మెళకువ రాగానే మీ బుర్ర మీకు చెప్పే సంగతులు: " నేను ఇప్పుడు లెయ్యాలి, లేసి ఫ్రెషప్ అయి, ఇంత చదవాలి/ ఈ పని పూర్తి చేయాలి/ ఇంత సేపు వ్యాయామం చేయాలి". కానీ ఇదంతా మీ మనసులో అనుకోవడంతోటే, "అమ్మో ఇంత చేయాలా? అవసరమా? ఇంకొంచెం సేపు పడుకుందాం" అనిపిస్తుంది. కాబట్టి మెళకువ రాగానే, తరువాతి ఒకే ఒక పని ( first step) గురించి మాత్రమే ఆలోచించండి. అంటే " లేసి, మంచం మీద నుంచి దిగాలి" అంతే! అదొక్కటి చేసిన తర్వాత, " బాత్రూమ్ లోకి వెళ్ళాలి" అని అనుకోండి. ఆ step అయిన తర్వాత next step గురించి ఆలోచించాలి. 3.-మీకు తెలియకుండానే మీరు చదవాల్సిన పుస్తకం ముందో లేక మీరు అనుకున్న gym లోనో ఉంటారు!

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE