NaReN

NaReN

Wednesday, June 15, 2022

మనిషిని మనిషిగా చూడాలి


మనిషిని మనిషిగా చూడాలి

*నిలబెట్టగల్గినవి ఆలోచనలే, సంకల్ప వికల్పాలకు మనస్సే ఆధారం, ఆలోచన సాత్వికమైతే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది, రాజసమైతే తనకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది, తామసికమైతే అందరికీ ఇబ్బందులుకు గురిచేస్తోంది*

*అందుకే మనస్సు మీద అదుపు ఉండాలి, మనస్సు వశంలో ఉన్న వారు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు*


_ఆలోచించడం, సంకల్పించడం,_ 

_అనేవి మనిషికి గొప్ప వరాలు, వాటిని సాధించాలంటే జీవితాన్ని క్రమశిక్షణ మార్గంలో నడిపించాలి, క్రమశిక్షణ పుట్టుకతోనే రావాలని ఏమి లేదు, ఎవరై ఒకరి క్యారెక్టర్ ను ఆదర్శంగా తీసుకున్నపుడు కూడా సాధ్యమవుతుంది_


*తల్లిదండ్రులు, గురువు, స్నేహితుడు ఇలా ఎవరైనా కావచ్చు, క్రమశిక్షణతో కూడిన జీవితం మనిషిని మహోన్నత శిఖరాలకు అధిరోహింపజేస్తుంది, ఒక సదాలోచన బుద్ధున్ని సత్యాన్వేషకున్ని చేసింది, అంబేద్కరును రాజ్యాంగ నిర్మాతను చేసింది*


_మంచి ఆలోచనలు చేసేవారే మంచి పనులు చేస్తుంటారు, మంచి ఆలోచనలు మంచి పనికి దారి తీస్తుంది, మంచిపని మంచి ఫలితాన్ని ఇస్తుంది, జీవితంలో గొప్పగా ఎదగాలంటే, కుళ్ళు కుతంత్రలతో ఉన్న ఆలోచనలు నుండి మనస్సును దూరంగా ఉంచాలి, అయితేనే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడే సరైన నిర్ణయం తీసుకోడానికి విలౌతుంది, ఇది ముమ్మాటికీ నిజం అని పెద్దలు చెబుతారు_

🌳🌳🌳💎🌳🌳🌳

1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE