NaReN

NaReN

Sunday, June 12, 2022

పాఠశాలకు వెళ్ళే పిల్లల తల్లిదండ్రులకు అభ్యర్ధన

 

పాఠశాలకు వెళ్ళే పిల్లల తల్లిదండ్రులకు అభ్యర్ధన




1. రాత్రి 8 గంటలకు టీవీ స్విచ్ ఆఫ్ చేయండి, 8 తర్వాత TV లో మీ బిడ్డ కంటే ముఖ్యమైనది ఏదీ లేదు.

2. 30-45 నిముషాలు మీ బిడ్డ హోం వర్క్ తనిఖీ చేసి అతనికి సహాయం చేయండి

3. రోజు అతని చదువుని పరిశీలించి వెనకబడిన సబ్జెక్టులో సహాయం చేయండి.

4. 5 వ/10 వ తరగతి లోపు చదివే ప్రాథమిక విద్య వారి జీవితానికి ములస్తంభం అని గుర్తించండి.

5. ఉదయం ఉదయం 5:30 గంటలకు మేల్కొవడం వారికి అలవాటు చేయండి. ధ్యానం చేయడం నేర్పండి.

6. మీరు ఏ పార్టీలు లేదా పెళ్లిళ్లకు హాజరు అయి ఆలస్యంగా మీ పిల్లలు నిద్రిస్తే మీ బిడ్డకు మరుసటి రోజు విశ్రాంతి ఇవ్వండి. లేదా మీరు వారిిని తరువాతి రోజు పాఠశాలకు వెళ్లాలని కోరుకుంటే కనీసం ఇంటికి 10:00 గంటలకు ఇంటికి రండి.

7. చెట్లను నాటడానికి మరియు వాటిని పెంచే అలవాటును పిల్లలకు నేర్పండి.

8. మీ పిల్లల పంచతంత్ర, అక్బర్ బిర్బల్, తెనాలి రాము వంటి కథలు పడుకునే సమయంలో చెప్పండి.

9. ప్రతి సంవత్సరం వేసవి సెలవులు మీ బడ్జెట్ ప్రకారం ఒక పర్యటనకు ప్లాన్ చేయండి. (ఇది వేర్వేరు వ్యక్తులకు మరియు ప్రాంతాలకు అలవాటుపడే యోగ్యతను వారిలో మెరుగుపరుస్తుంది)

10. మీ బిడ్డలో ప్రతిభను కనుగొని, దానిని మరింతగా మెరుగపర్చడానికి అతనికి సహాయపడండి (ఏదైనా విషయం, సంగీతము, క్రీడలు, నటన, డ్రాయింగ్, నృత్యం మొదలైన వాటికి ఆసక్తి ఉండవచ్చు) ఇది వారి జీవితాన్ని అందంగా చేస్తుంది

11. ప్లాస్టిక్ వాడకూడదని నేర్పండి (కనీసం ప్లాస్టిక్ లో వేడి పదార్థాలు వాడకూడదని)

12. ప్రతి ఆదివారం వారికి ఇష్టమైన వంట తయారు చేసేందుకు ప్రయత్నిoచండి. మరియు తయారుచేయడంలో సహాయం చేయమని వారిని అడగండి (వారు ఆనందిస్తారు)

13. ప్రతి శిశువు జనమతః ఒక శాస్త్రవేత్త. వారు మనం జవాబు ఇవ్వలేని అనేక ప్రశ్నలను అడుగుతారు. కాని మా అజ్ఞానం తో వారిపై మన కోపాన్ని చూపించకూడదు (సమాధానాలను కనుగొని, వారికి తెలియజేయండి)

14. వారిని క్రమశిక్షణ మరియు మంచి జీవన విధానాన్ని బోధించండి (తప్పుచేస్తే శిక్షించండి).

15. పాఠశాల విద్య లేదా పాఠశాలలో పాస్ పెర్సెంటేజ్ ఆధారంగా లేదా మీ సహోద్యోగులు, మీ పొరుగువారు లేదా స్నేహితులు చెప్పారని లేదా ప్రయివేటు స్కూళ్ల ప్రచారం చూసి  అత్యుత్తమ పాఠశాలగా నిర్ణయించకండి. మీ బడ్జెట్కు సరిపోయేదే మీ పిల్లలకు సరైన పాఠశాల అని గుర్తించండి. ఏ రోజుల్లో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగా పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో మీ పిల్లల విద్య కోసం మీరు మరింత ఖర్చు చేయాలి, ఈరోజు మీరు కొంత డబ్బును ఆదా చేసుకోవాలి, నేడు మీ కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడం, మీ ప్రస్తుత బాధ్యతలు. కాబట్టి తదనుగుణంగా ప్లాన్ చేయండి.

16. తమను తాము చదవడం మరియు నేర్చుకోవడo అలవాటు చేయండి.

17. ముఖ్యంగా మొబైల్ ఫోన్లను వారికి ఇవ్వకండి. (ఎందుకో ప్రతి ఒక్కరికి  తెలుసు)

18. మీ పనుల్లో మీకు సహాయపడమని మీ బిడ్డను అడగండి. (వంట చేయడం, ఇంటిని/బైక్/కార్ కడగడం, బట్టలు ఉతకడం లాంటివి)

విద్యా సంవత్సర ఆరంభ శుభాకాంక్షలతో ......

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE