NaReN

NaReN

Saturday, June 4, 2022

సరదాగా నవ్వుకోండి కాసేపు

 *సరదాగా నవ్వుకోండి కాసేపు...*

======================


*ఆఫీసర్:* బామ్మగారూ... నేను జనాభా లెక్కల సేకరణకు వచ్చిన  అధికారిని. దయచేసి మీ ఇంట్లో వాళ్ళని పిలవండి...


*బామ్మ:* ఏమిరా భడవా నేను మనిషిని కానా? నన్ను పని మనిషి అనుకొంటున్నావా? లేక ఇంకేమనుకుంటున్నావో చెప్పురా త్రాష్టుడా? 

 

*ఆఫీసర్:* అయ్యో బామ్మగారూ నన్ను క్షమించండి. ఈ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు? 


*బామ్మ:* ఒక డజన్ మంది...


*ఆఫీసర్:* డజనా? ఓహో పన్నెండు మందా! సరే, పెద్దాయన ఏంచేస్తుంటారు? 


*బామ్మ:* జైలు కెళ్ళాడు...


*ఆఫీసర్:* జైలు కెళ్ళారా? ఏం నేరం చేసారు? ఎన్నేళ్ళు శిక్ష పడింది? కఠిన శిక్షా లేక సాధారణ శిక్షా?


*బామ్మ:* నీ మెుహం మండా... ఆయన జైలు అధికారి...


*ఆఫీసర్:* ఓహో !  అలానా ! ఆయనకు ఎంతమంది పిల్లలు?


*బామ్మ:* ఓక పోతు, రెండు పెట్టలు...


*ఆఫీసర్:* పోతు, పెట్ట ఏంటండీ?


*బామ్మ:* వెధవా! అదికూడా తెలియకుండా ఎలా ఆఫీసరు అయ్యావు? ఆఫ్రాచ్రుడా ! 

ఒక మగ, ఇద్దరు ఆడ...


*ఆఫీసర్:* అబ్బాయి ఏం చేస్తుంటాడు? 


 *బామ్మ:* కొంపలార్పుతూ ఉంటాడు...

 

*ఆఫీసర్:* అదేం పనండీ ! మీరైనా చెప్పలేక పోయారా? 


*బామ్మ:*  నువ్వు పరీక్ష పాసయ్యేవా? దొడ్డిదారిన అధికారి అయ్యావా ! బడుద్దాయ్? వాడు ఫైర్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నాడురా అరకాణీ వెధవా ! 


*ఆఫీసర్:* బామ్మ గారు... మీరు సరిగ్గా చెప్పండి. ఇలా డొంకతిరుగుడు నాకర్థంకాదండీ...


*బామ్మ:* ఈ మాత్రం తెలియని వాడివి నువ్వేం ఆఫీసరువిరా? పింజారీ వెధవ !


*ఆఫీసర్:* బామ్మ గారూ! మరి ఆడపిల్లలు ఏం చేస్తారో సూటిగా చెప్పండి దయచేసి... 


*బామ్మ:* ఒకత్తేమో ఊడబెరుకుతూ ఉంటుంది. ఇంకోకత్తేమో తైతక్కలాడుతూ ఉంటుంది...


*ఆఫీసర్:* బామ్మగారూ ఊడబెరకడం, తైతక్కలాడడం ఏమిటండీ? 


*బామ్మ:* ఒకతి పళ్ళ డాక్టర్, ఇంకోతి భరతనాట్యం మాస్టర్ రా నెలతక్కువ వెధవా! 


*ఆఫీసర్ స్ప్రుహ కోల్పోయాడు...*


*బామ్మ:* అయ్యో పాపం స్ప్రుహ తప్పేట్టున్నావే ! ఇలా కూర్చుని తగలడు... ఇంత చద్దన్నం, రవ్వంత ఆవకాయ పెడతాను. తిని అఘోరించు...


😅🤣😇😂😄😭

1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE