NaReN

NaReN

Sunday, June 12, 2022

నాడు - నేడు

 నాడు - నేడు


మన తాతల కాలంలో పిల్లలపై

" ప్రేమ" ఉండేది

మన తండ్రుల కాలంలో అది 

" పిచ్చి ప్రేమ" గా మారింది 

మన తరంలో అది 

"గుడ్డి ప్రేమ" గా రూపాంతరం చెందింది 


దాని పర్యవసానమే  ...


"మందుల" విందులు 

"మత్తుల" చిందులు 

"రేపుల" పొందులు 

"పబ్బుల" పసందులు 


లేకపోతే ....


ఆడ పిల్లల్ని ఏడిపించేవాడికి 

"ఆడి" ఎందుకు !

బేవార్సుగా తిరిగేవాడికి 

"బెంజ్" ఎందుకు !!

బ్రతుకు విలువ తెలియనివాడికి 

"బి యం డబ్ల్యు" ఎందుకు !!!


మీరు మీ పిల్లలకు ఇచ్చామనుకుంటున్న 

"సుఖం" ఇంకొకరి జీవితంలో "దు:ఖానికి" కారణమవుతుంది. 

ధనం మత్తులో , అధికార గమ్మత్తులో 

మీ పిల్లలు చేసే "పాపాలు" వేరొకరికి "శాపాలు" గా మారుతున్నాయి.


మీకు 


డబ్బుంటే దానం చెయ్యండి 

అధికారం ఉంటే అభాగ్యులను అక్కున చేర్చుకోండి 

ఆస్తులు ఉంటే ఆపన్నులను ఆదుకోండి 

మనసుంటే మంచి పనులు చేయండి 


అంతే కాని 


అర్ధంలేని ఆస్తులు , అంతస్తులు , అధికారాలు, హంగులూ, ఆర్భాటాలు చూపించి పిల్లల్ని చెడగొట్టొద్దు .మీ వేళ్లతో మీ కళ్లను మీరే పొడుచుకోవద్దు. 


తండ్రి చనిపోతే "పితృ వియోగం" 

తల్లి చనిపోతే "మాతృ వియోగం” 

భర్త దూరమైతే " పతి వియోగం" 

భార్య దూరమైతే "సతి వియోగం" 

అంటారు .


అదే కన్న బిడ్డలు దూరమైతే " గర్భ శోకం" "కడుపు కోత" అంటారు. 


భాషే అంత బాధగా భేదం చూపిస్తుంది .గొప్పలకు , భేషజాలకు పోయి పిల్లల జీవితాలను బలి చేయొద్దు .మీరూ బలి కావద్దు. 


        

1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE