NaReN

NaReN

Monday, June 6, 2022

మన(మానవ)జీవితంలోని అద్భుతాలు

 

     మన(మానవ)జీవితంలోని అద్భుతాలు


_మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ..._ _ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం!!_        

      ...... *_కాని_*......

_మన చుట్టూ ఉన్న ఏడు(7) అద్భుతాలు ఉన్నాయి. అవి..._


🌷 *_1_* . *_తల్లి_* 


_మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన...  👩‍🦱తల్లి మొదటి అద్భుతం._


🌷 *_2_* . *_తండ్రి_* 


_మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీళ్లను దాచేస్తాడు_


_మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు_ 


_దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ..😎 సంతోషాన్ని  మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం._


🌷 *_3_* . *_తోడబుట్టిన_*  *_వాళ్ళు_* 


_మన తప్పులను వెనుకేసుకురావాడానికి..._


_మనతో పోట్లాడడానికి...  మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు...  అందుకే....._


_తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం 😥🥴☺_


🌷 *_4_* . *_స్నేహితులు_*  


_మన భావాలను పంచుకోడానికి.._


_మంచి, చెడు అర్థం అయ్యేలా చెప్పడానికి..._


_ఏది ఆశించకుండా..  మనకు దొరికిన స్నేహితులు  నాలుగో  అద్భుతం. 🌚🌝👨‍✈️🕺_


 🌷5* . *_భార్య_* / *_భర్త_* 


_ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా  చేస్తుంది_


_కలకాలం తోడు ఉంటూ...🌛_ _ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే...  ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది  🌜_

_భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే  ఐదో అద్భుతం మన సొంతం_


🌷 *_6_* . *_పిల్లలు_* 


_మనలో స్వార్థం మొదలవుతుంది.._


_మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది..._  


_వారి ఆలోచనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి.._


_వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ  ఉంటుంది.._


_వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు  అసలు ఉండరు..._

_పిల్లలు ఆరో అద్భుతం_


_అన్ని అయిపోయాయి ఇంకా ఏడో అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?_


🌷 *_7_* . *_మనవళ్ళు_* *_మనవరాళ్లు_* 


_వీరికోసం ఇంకా కొన్నిరోజులు  బతకాలనే  ఆశపుడుతుంది.._


_వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి,  మళ్ళీ పసిపిల్లలం కావడం ఏడో అద్భుతం..._🏃🏃‍♀️👩‍🔧👨‍💼👨‍🎓👩‍🎓   జీవితంలో _అందరూ_ _అనుభవించే_ _అద్భుతాలు ఇవే._ _వీటిలో ఏ ఒక్కటి అనుభవించకున్నా వారి జీవితం పరిపూర్ణం కాజాలదు._ 


_జైశ్రీరామ్🙏🏾జైహనుమాన్🙏🏾_


_వీరు మన జీవితానికి  దొరికిన.. ఏడో అద్భుతం 🌹🌺🌷🥀_



_🌹ఇలా అద్భుతాలన్నీ  మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం... _


_కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి_


_చిన్న పలకరింపు  చాలు... మనల్ని ఆ అద్భుతంగా  చూడడానికి._


_అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి  మరో అద్భుతాన్ని  సృష్టించేద్దాం ..._



_ఇప్పుడు మన మధ్య ఉన్న మనిషి తెల్లవారేసరికి వుంటాడో లేదో తెలియని కాలం ఇది అందుకే ఉన్న దానిలో సర్దుకుపోయి ఆయిగా జీవించడం లోనే ఆనందం...🌹🌹🌹_

1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE