NaReN

NaReN

Wednesday, June 29, 2022

కాకి_కాలజ్ఞాని

 కాకి_కాలజ్ఞాని' అంటారు..


 ఎందుకో కాస్త పరిశోధనాత్మకంగా మననం చేసుకుందాం👇👇


🌹🌿  వేకువ జామునే '(బ్రహ్మ ముహూర్తంలో)' మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి.


🌹🌿  'కావు కావు' అంటూ నీ బంధాలు సిరి సంపదలు ఏవీ నీవి కావు అని  అందరికీ గుర్తు చేస్తూ 'బోధిస్తూ'  అందరినీ తట్టి లేపేది కాకి.


🌹🌿  ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న 'అన్ని కాకులకు' సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి  ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి.


🌹🌿 శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి 'సంఘటితంగా పోరాటం' చేపట్టేవి కాకులు.


🌹🌿 ఆడ కాకి - మగ కాకి కలవడం కూడా 'పరుల కంట' పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం.


🌹🌿  ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేసి స్నానమాచరించి గూటికిచేరే మంచి ఆచరణ కాకులదే.


🌹🌿  సూర్యాస్తమయం సమయానికి గూటికిచేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే.🌺


🌹🌿  అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా.


🌹🌿  కాకులు లేని ప్రదేశం లేదు ఈ భువిపై. కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే. అందుకే  'కాకులు దూరని కారడవి' అంటారు.


🌹🌿  కాకులు అరుస్తోంటే  ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తోంది అనేవారు పెద్దలు.


🌹🌿 అంతేకాదు పకృతి వైపరీత్యాలు వచ్చే ముందు (భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు) కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి.


🌹🌿  సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక  స్నానమాచరించి బయట ఎగురుతాయి.  అందుకే కాకి కాలజ్ఞాని అంటారు.


🌹🌿  దానధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు.


భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు.


మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తు పెట్టుకునే సాక్షీభూతంగా ఉండే పక్షి కాకి.


ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకై కలకాలం జీవించడం శాస్త్రం లో కూడా విశదీకరించారు.!


🌹🌿 కూజలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకి....!!


🌹🌿 సెల్ టవర్ రేడియేషన్ వల్ల అంతరించిపోతున్న ఈ కాకి గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ  కాకి బావ కధలు బిడ్డలకు చెప్పండి అని  తల్లి తండ్రులను పెద్దలను కోరుతూ...!!👏👏🙏


సపోటాతో ఎన్ని ప్రయోజనాలో

 * సపోటాతో ఎన్ని ప్రయోజనాలో..*

〰〰〰〰〰〰〰〰

☛ సపోటాలో A, C విటమిన్ లభిస్తుంది. కంటి చూపుకు మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

☛ తక్షణ శక్తిని ఇస్తుంది.

☛ రక్తపోటును నియంత్రించే గుణం ఉంది.

☛ ఇందులో లభించే ఫైబర్ మలబద్దకం సమస్యను నివారిస్తుంది.

☛ జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది.

☛ స్థూలకాయ సమస్యకు సపోటా విరుగుడుగా పనిచేస్తుంది.

☛ జుట్టు రాలే సమస్యను అరికడుతుంది.


*. గోధుమ గడ్డి జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో..*

〰〰〰〰〰〰〰〰

► గోధుమ గడ్డిలో ప్రొటీన్, ఫ్లేవనాయిడ్స్, క్లోరోఫిల్, విటమిన్ సి, ఇ, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజు గోధుమ గడ్డి జ్యూస్‌ తాగితే పోషకాల లోపం తీరుతుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు వస్తాయి. కాలేయం సక్రమంగా పనిచేసి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.


గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా?*

〰〰〰〰〰〰〰〰

☛ అరటిపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గ్యాస్ ను నియంత్రణలో ఉంచుతుంది. అరటిపండ్లు తినడం వల్ల ఎసిడిటీ రాదు.

☛ పుచ్చకాయ తినడం వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

☛ దోసకాయ తీసుకుంటే కడుపులో మంట తగ్గుతుంది.

☛ గ్యాస్ నుంచి ఉపశమనం పొందడంలో అంజీర్ కీలక పాత్ర పోషిస్తుంది.


 ఒత్తిడి, ఆందోళన చెందుతున్నారా?*

〰〰〰〰〰〰〰〰

☛ ఎప్పుడెప్పుడు ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారో డైరీలో నమోదు చేసుకోండి.

☛ ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటి మానసిక విశ్రాంతి కలిగించే పద్ధతులు పాటించండి.

☛ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

☛ సమయానికి పడుకుని కంటి నిండా నిద్రపోండి.

☛ కాఫీ, కూల్‌డ్రింకులు తాగటం మానెయ్యండి.

*సమస్యను అర్థంచేసుకొని, బయటపడటానికి తోడ్పడే స్నేహితుల సహకారం తీసుకోండి.


 జొన్న రొట్టెలతో ఎంతో మేలు*

〰〰〰〰〰〰〰〰

☛ పూర్వం ప్రతి ఒక్కరూ జొన్న రొట్టెలు తినేవారు. అందుకే ధృడంగా ఉండి అలసిపోకుండా పనులు చేసేవారు.

☛ జొన్నల్లో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ బీ3 ఉంటాయి.

☛ వీటితో చేసిన రొట్టెలు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ పనితీరు మెరుగుపడుతుంది. ఎముకలు బలపడతాయి. బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను పెంచి మలబద్దకం దూరమవుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.



. లిచీ పండ్లు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో..*

〰〰〰〰〰〰〰〰

☛ ఈ పండులో పొటాషియం చాలా ఎక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది.

☛ లిచీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

☛ పక్షవాతం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

☛ జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.

☛ చర్మం రంగు మెరుగుపడుతుంది.

☛ జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి వ్యాధులను తగ్గిస్తుంది.



 ఉదయాన్నే ఇలా చేస్తే రోజంతా హ్యాపీనే*

〰〰〰〰〰〰〰〰

► ఉదయాన్నే టీ, కాఫీలు కాకుండా నిమ్మరసం/మంచినీళ్లు ఆరోగ్యానికి మంచివి. కనీసం 45నిమిషాలు వ్యాయామం చేయండి. పోటీ పరీక్షల సమయం కాబట్టి న్యూస్ పేపర్ చదివితే నాలెడ్జ్ పెరుగుతుంది. వీలైతే పుస్తకాలు కూడా చదవండి. మైండ్ రిలాక్స్ అవుతుంది. టిఫిన్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఉదయాన్నే కొంత జ్ఞానం సంపాదించుకున్నామన్న ఆలోచనే మిమ్మల్ని రోజంతా హ్యాపీగా ఉంచుతుంది.



చేపలను తినడం వల్ల కలిగే లాభాలు*

〰〰〰〰〰〰〰〰

✶ అల్జీమర్స్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు

✶ జ్ఞాపకశక్తి పెరుగుతుంది

✶ గుండె జబ్బులను నివారిస్తుంది

✶ డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్స్‌ను తగ్గిస్తాయి

✶ కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి

✶ స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా జరుగుతుంది

✶ రక్తాన్ని శుద్ధి చేస్తాయి

✶ పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ సహా పలు క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.



. హ్యాపీ హార్మోన్ కోసం ఇవి తినండి*

〰〰〰〰〰〰〰〰

► ఒత్తిడికి లోనవడం, మానసిక కుంగుబాటు, పనులపై ఆసక్తి తగ్గిందంటే.. శరీరంలో ఉత్పత్తయ్యే హ్యాపీ హార్మోన్ 'సెరటోనిన్' స్థాయి తగ్గినట్లు గుర్తించాలి. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు తీసుకుంటే వీటిలో ఉండే అమినో యాసిడ్.. సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఉదయం వేళ సూర్యరశ్మిలో నిల్చోవడం, B విటమిన్, మెగ్నీషియం ఉండే కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, అరటి పండ్లు తింటే హ్యాపీ హర్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది.

Tuesday, June 28, 2022

ఆషాఢమాసం

 *30.06.2022 ఆషాఢమాసం ప్రారంభం, ఆషాఢమాసం విశిష్టత*


ఆషాఢమాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక ప్రతి వారానికి , ప్రతి 15 రోజులకొకసారైనా ఏదో ఒక పండుగ,  వ్రతం, పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి *చాతుర్మాస్య వ్రతం* ప్రారంభిస్తారు.

దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాడమాసంలో అందరు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు.

ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ. వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవాడు గురువైతే , లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు.

తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన(బోనం) తీసుకెళ్ళి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే.

అమ్మలుగన్న అమ్మ , ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో *శాకంబరీ నవరాత్రులు* కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు, మహిషాసుర మర్దిని, దుర్గా దేవిని, భైరవ, వరహా, నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి.

కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి తీసుకువెళ్ళేది ఆషాఢ మాసంలోనే. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఆషాఢమాసంలో స్త్రీ నెలతప్పితే, 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో(మార్చి నుంచి మే మధ్య కాలంలో) ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంభిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడివాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢమాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. మాతశిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలి మెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన. అందుకే ఈ సంప్రదాయం.

ఆషాఢమాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి. ఇంట్లో అందరు వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్ళినా, కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపటానికి ఇష్టపడతారు. వ్యవసాయ కుటుంబాల్లో అందరు కలిసి పని చేయకపోతే, చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది.

శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు, శాస్త్రీయ కారణాల వల్ల ఆషాడాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు పెద్దలు.🙏

వెళ్ళేలోగా ఖాళీ అయిపోదాం!

 వెళ్ళేలోగా ఖాళీ అయిపోదాం!

Die Empty”.


పెద్ద నీతితో కూడిన ఈ చిన్నపుస్తకాన్ని - టాడ్ హెన్రీ (Todd Henry) రాశారు.

ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ వుంది.

టాడ్ హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్నవేస్తాడు.

‘ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?’ అనేది ఆ ప్రశ్న.

‘గల్ఫ్ దేశాలు అని ఒకరు, వజ్రాల గనులు ఉన్న ఆఫ్రికా’ అని మరొకరు - ఇలా జవాబులు చెబుతారు.

అప్పుడా డైరెక్టర్ , అందర్నీ ఆశ్చర్యచకితులను చేసే సమాధానం చెబుతాడు.

‘ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం - స్మశానం!’

ఎందుకంటే...

అంటూ ఆయనే వివరణ ఇస్తాడు.

‘ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్లమంది పుట్టారు, మరణించారు.

ఇంకా పుడుతూనే వున్నారు, ఇంకా చనిపోతూనే వున్నారు.

పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు.

కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢ౦గా వున్న మేధస్సును, అనేక ఆలోచనలను, అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు.

అవేవీ వెలుగు చూడలేదు.

వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కకుండా పోయింది.

అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి.

అంతటి విలువైన సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ వుంటుంది చెప్పండి?’

డైరెక్టర్ చెప్పిన మాటలు టాడ్ హెన్రీ మనస్సులో గట్టిగా నాటుకుని పోయాయి.

ఆ ప్రేరణతోనే టాడ్ హెన్రీ Die empty అనే పుస్తకం రాసి అద్భుతమైన రచయితగా పేరు పొందాడు.

ఆయన ఈ పుస్తకంలో అంటాడు ఇలా ఒకచోట...

‘మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి.

అవేవో ఈ ప్రపంచానికి పంచేసి వెళ్ళండి!’

నిజానికి టాడ్ హెన్రీ చెప్పదలచుకున్నది ఏమిటంటే...

‘మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్ళండి.

మీ దగ్గర మంచి ఆలోచన వుంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి.

‘మీలోని జ్ఞానాన్ని నలుగురికీ పంచండి.

మీకేదైనా లక్ష్యం వుంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి.

‘ప్రేమను పంచండి మీలోనే దాచుకుని వృధా చేయకండి’

వున్నది నలుగురికీ పంచడం ఈనాటి నుండే మొదలు పెడదాం.

మన మంచితనంలో ఉన్న ప్రతి అణువునూ అందరికీ ఇచ్చేద్దాం!*

‘అప్పుడు హాయిగా ...ప్రశాంతంగా....

“Let us Die Empty!”

Download with the below Link....

https://drive.google.com/file/d/18MWXD1NPOWu0kpJgAeAS70a1SS3MEJPh/view?usp=drivesdk


Friday, June 24, 2022

అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు

 అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు


కారు మేఘాలు కమ్ముతున్నాయి 

ఏక్షణంలో అయినా... 

వర్షం విపరీతంగా కురుస్తుంది...! 

వేసే ముగ్గు..వర్షంలో కలుస్తుంది !అయినా..ఆమె ముగ్గువేస్తోంది... !

      *అదీ..సంప్రదాయం!* 

             ....................


అంతర్జాతీయ ఖ్యాతినార్జించి

అమెరికాలో ఉంటున్న వైద్యుడు. సొంతూరు వచ్చినప్పుడల్లా 

పాఠాలు చెప్పిన పంతులుకు 

పాదాభివందనం చేస్తాడు…! 

        *అదీ .. సంస్కారం !* 

              .....................


ఖగోళ శాస్త్రాన్ని 

నమిలి మింగిన నిష్ణాతుడు.  

నిష్టగా ఉంటూ

గ్రహణం విడిస్తేగానీ... 

ఆహారం గ్రహించడు…! 

       *అదీ .. నమ్మకం  !* 🙏

             ....................


పరమాణు శాస్త్రాన్ని 

పిండి పిప్పిచేసిన పండితుడు. 

మనవడి పుట్టు వెంట్రుకలు 

పుణ్యక్షేత్రంలో తీయాలని 

పరదేశం నుండి పయనమై వస్తాడు…! 

        *అదీ .. ఆచారం !* 

            ..............................


అంతరిక్ష విజ్ఞానాన్ని

అరచేతబట్టిన  అతిరధుడు. 

 అకుంఠిత నిష్ఠతో

పితృదేవతలకు 

పిండ ప్రదానం చేస్తాడు…!

 *అదీ .. సనాతన ధర్మం!* 

           ........................


అత్తింటికి వెళ్లేముందు 

ఇంటి ఆడబడుచు 

పెద్దలందరికీ 

పాదాభివందనం చేసి 

పయనమవుతుంది…! 

       *అదీ .. పద్ధతి !* 

         ........................


పెద్ద చదువులు చదివినా 

పెద్ద కొలువు చేస్తున్నా 

పేరు ప్రఖ్యాతులున్నా 

పెళ్లి పీటలమీద .. వధువు

పొందికగా ఉంటుంది…!

     *అదీ .. సంస్కృతి!*

       ...........................


భార్య పక్షవాతానికి లోనయ్యింది. 

మంచం దిగలేని పరిస్థితి 

తనంతట తానుగా.. 

తనువీడ్చలేని స్థితి.

భర్త భరోసాగా నిలచి..భారమంతా మోస్తాడు-అన్నీతానై .. అలిని  సాకుతాడు…!

       *అదీ .. దాంపత్యం!*

             .....................


బ్రతికే అవకాశం తక్కువ

వెంటిలేటర్ పై వేచిచూస్తే

బ్రతికితే బ్రతకొచ్చు!

లక్షల ఖర్చు భరిస్తూ

వెంటిలేటర్ పై పెడతారు… !

          *అదీ .. అనుబంధం!*                                                                                                                                                                                                                ఎవరో చెప్పింది  మనకు నచ్చలేదు.                                                                                                                                                                                                                          కానీ ముఖం మీద వ్యతిరేఖించరు.                                                                                                                                                                                                             మనసు నొచ్చుకుంటారని.                                                                                                                                                                                                         *అదీ.............. బంధుత్వం*

🌳

*ఇవి భారతీయుల తరతరాల ఆచారాలు, సంప్రదాయలు, విలువలు, ఔన్నత్యం కొన్ని మాత్రమే* 🌳

జీవిత పాటలు

 జీవిత పాటలు


*బిడ్డ పుట్టినప్పుడు:*

------------------

"లాలీ  లాలీ లాలీ లాలీ... 

లాలీ లాలీ లాలీ లాలీ... 

వటపత్రసాయికి 

వరహాల  లాలీ 

రాజీవనేత్రునికి రతనాల లాలీ 

 మురిపాల కృష్ణునికి ముత్యాల  లాలీ..."


 *16 ఏళ్ళకి:*


"పదహారు ప్రాయంలో 

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. 

నేటి సరికొత్త  జాజిపువ్వల్లె 

 నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి..." 


 *18 ఏళ్ళకి:*


"ఎక్కడ ఉన్నా పక్కన  నువ్వే  ఉన్నట్టుంటుంది 

చెలీ ఇదేం అల్లరీ.. 

నా  నీడైనా అచ్చం  నీలా  కనిపిస్తూ  వుంది..

అరే ఇదేం గారడీ..

నేను  కూడా  నువ్వయానా 

 పేరుకైనా  నేను  లేనా..."


  *25 ఏళ్ళకి:*


"My Love is Gone 

My Love is Gone 

My Love is Gone 

My Love is Gone 

పోయే  పోయే లవ్వేపోయే 

పోతే పోయిందే .. 

its gone, its gone, 

 its gone, my love is gone."


*35 ఏళ్ళకి:*


"ఎందుకే  రవణమ్మా పెళ్ళెందుకే రవణమ్మా

ఎందుకే రవణమ్మా పెళ్ళెందుకెే రవణమ్మా

తాను  దూర సందు లేదు 

తాను  దూర సందు లేదు 

తాను  దూర సందు లేదు 

మెడకేమో డోల రవణమ్మా 

సతాయించాకే రవణమ్మా 

బాగోదే రవణమ్మా

 ఛీ ఛీ అంటారే రవణమ్మా"


*45 ఏళ్ళకి:*


"జన్మమెత్తితిరా.. 

అనుభవించితిరా.. 

జన్మమెత్తితిరా.. 

అనుభవించితిరా.. 

బ్రతుకు సమరములో..  

పండిపోయితిరా..

బ్రతుకు సమరములో..  

పండిపోయితిరా..

 మంచి తెలిసి మానవుడిగా మారినానురా...."


*55 ఏళ్ళకి:*


"సంసారం  ఒక చదరంగం 

అనుబంధం  ఒక రణరంగం 

స్వార్ధాల మత్తులో సాగేటి ఆటలో 

ఆవేశాలు రుణపాశాలు తెంచే  వేళలో 

సంసారం  ఒక చదరంగం 

 అనుబంధం  ఒక రణరంగం.." 


*65 ఏళ్ళకి:*


(పురుషుడు)

"కాశీకి  పోయాను  రామాహరి

గంగ తీర్థమ్ము  తెచ్చాను  రామాహరి

గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి.."

(స్త్రీ)

"కాశీకి పోలేదు రామాహరి 

ఊరి కాల్వలో నీళ్ళండి రామాహరి

 మురుగు  కాల్వలో నీళ్ళండి రామాహరి.."


*75 ఏళ్ళకి:*


"జగమంత  కుటుంబం నాది 

ఏకాకి  జీవితం నాది 

సంసారం సాగరం నాదే

 సన్యాసం శూన్యం నాదే"


*85 ఏళ్ళకి:*


"రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే

తోటమాలి నీ తోడు  లేదులే 

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే... 

 లోకమెన్నడో చీకటాయెలే..."


*100 ఏళ్ళకి:*


"చుక్కలో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికీ చిక్కనోడు. 

చుక్కలో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికి ఎవ్వరికీ చిక్కనోడు. 

తల్లడిల్లి పోతుంది తల్లి అన్నది..."


😄😄😄😄😄 మిత్రులారా Just నవ్వు కోండి. కాని ఇదే జీవిత రహస్యం.

Thursday, June 23, 2022

తల్లి సాత్వికురాలైనా పిల్లలు ఆవేశపరులౌతున్నారు ఎందుకు...?

 *తల్లి సాత్వికురాలైనా పిల్లలు ఆవేశపరులౌతున్నారు ఎందుకు...?*


ఇది  మన సనాతన  ధర్మం  చెబుతున్నది..

మనవారు దీన్ని ఎప్పుడో మరిచారు .


 వంట చేయడం..  వడ్డించడం ఒక వరం.. 


అయితే అది ఇప్పుడు ఒక కళగా  మారింది.. 


వంట ఇల్లు ఒక దేవాలయం.. 


పొయ్యి  వెలిగించడం అంటే  అగ్నిహోత్రం  వెలిగించడమే..  అది భక్తిగా..  భగవంతుని  తలుస్తూ  నేను  చేయబోయే పదార్థాలు మా ఇంట్లో సభ్యులందరికీ ఆకలి తీర్చి ఆరోగ్యం  చేకూర్చాలని భగవంతుని  ప్రార్థిస్తూ చేయాలి  అని పెద్దలు చెబుతారు.. 


అందుకే  మన  పూర్వీకులు ఏదో  ఒక  పారాయణం (గణేశ పంచకం , హనుమాన్ చాలీసా) చేస్తూ వంట చేసేవారు.. 


 వంట  చేసిన వారి  మన:స్థితి తిన్న వారిపై  కూడా ప్రభావం చూపుతుంది  అంటారు.. 


దీనికి అమ్మ చెప్పిన ఒక కథ కూడా ఉంది.. 


ఒక  ఊరిలో ఒక  బ్రాహ్మణుడు ఉండేవాడు.. 

అతను మహా నిష్టాగరిష్ఠుడు..  అతనింట్లో  దేవతార్చన, అతని  కుల వృత్తి తప్ప అతనికి 

ఏం తెలియదు.. 


ఒక రోజు ఆ ఊరి జమీందారు గారు ఈ బ్రాహ్మణుడిని తమ  ఇంటికి  భోజనానికి  పిలిచారు..


పాపం.. ఎప్పటి లాగే ఆయన భోజనానికి  వెళ్ళారు.. 


ఏనాడు లేనిది ఆరోజు ఆయనకు తాను  భోంచేస్తున్న అరిటాకు పక్కన పెట్టిన వెండి గ్లాసు మీదకు మనసు పోయింది.. 


భోంచేస్తున్నాడన్న మాటే కానీ.. చూపు గ్లాసు  మీదే ఉంది.. 


చివరకు భోజనం చేయడం  పూర్తి అయ్యింది.. 

చేయి కడుక్కోవడానికి గ్లాస్ తీసుకుని వెళ్ళి  చేయి కడుక్కుని  ఆ గ్లాస్ ని తన చేతి సంచీలో వేసుకున్నాడు.. 


ఆ తరువాత  జమీందారు గారు ఇచ్చిన దక్షిణ తాంబూలాదులు తీసుకుని ఇంటికి తిరిగి  వచ్చాడు.


కాళ్ళు కడుక్కని లోపలికి  వెళ్ళి కూచున్నాక 

భార్య ఇచ్చిన దాహం పుచ్చుకున్న  వెంటనే  అతను స్ప్రుహలోకి వచ్చాడు..


తాను చేసినది దొంగతనం అని తనను ఎవరో  ఛెళ్ళున కొట్టినట్టు అయ్యింది.. 


వెంటనే చేతి సంచీ భుజాన వేసుకుని భార్యతో కూడా చెప్పకుండా పరుగు పరుగున  జమిందారు గారింటికి  వెళ్ళాడు.. 


ఇప్పుడే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన బ్రాహ్మణుడిని ఆశ్చర్యంగా చూస్తున్న  జమీందరుని చూసి.. 


"అయ్యా..  మీ ఇంట్లో వండిన పదార్థాలకు  కావలసిన  వస్తువులను కూరగాయలతో సహా  ఎలా సేకరించారు. మీ వంట మనిషి ఏమయినా మారారా.? వేరే వంటవారు  వచ్చారా?" అని  అడిగాడు.. 


ఆయన భార్యను పిలిచి అడిగాడు .


"అవునండి..  నెల రోజులయ్యింది "అని  చెప్పింది. 


"ఆర్యా! ఏం జరిగింది? " అనడిగిన  జమీందారుకు.. "అయ్యా! ఎన్నడూ లేనిది మీ ఇంట నేను దొంగతనం  చేసాను.. నాకు ఎందుకు ఆ బుద్ధి  పట్టిందో తెలీదు. ఇంటికి  వెళ్ళి నా భార్య  చేతి మంచినీరు తాగాక నేను  స్ప్రుహలోకి వచ్చి జరిగిన తప్పు తెలుసుకుని  వచ్చాను.. "


"మీ వంట మనిషి  మీ ఇంట దొంగతనం  చేస్తున్నదేమో  గ్రహించండి..  అటువంటి  మనిషి చేతి వంట తిన్న నా బుద్ధి  వక్రీకరించింది." అని  చెప్పడంతో..  వారు  వంట మనిషిని పిలిచి గట్టిగా అడగడంతో  ఆమె తప్పు ఒప్పుకుని వంట సరుకులను, కూరగాయలను తన ఇంటికి దొంగతనంగా  చేరవేస్తుండడం ఒప్పుకుంది.. 


వెంటనే వారు ఆమెను పని నుండి  బహిష్కరించారు. 

బ్రాహ్మణుడు  తాను దొంగిలించిన  వస్తువును  వారికి తిరిగి ఇచ్చి క్షమించమని అడిగి తిరిగి  ఇంటికి వెళ్ళాడు. 


వంట చేసే వారి ప్రభావం వారి మీద ఎంత  ఉంటుందో  తెలుసుకోవాలి..


అతిథి దేవో భవ..  అన్నారు.. 


ఏదో అలా వంట చేసి అందమైన టేబుల్ మీద,  అందమైన పాత్రలలో సర్దడం కాదు .  నేల మీద అరిటాకులో  వడ్డించినా మంచి మనసుతో వండి వడ్డించడం అవసరం.. 


అలాగే చాలా మంది ఇంట్లో ఎంగిళ్ళకు ప్రాధాన్యత ఇవ్వరు. తిన్న  కంచంలో మిగిలినది కూడా వంటలో కలపడం , తింటున్న కుడి చేత్తో  మారు వడ్డించుకోడం.. ఒకరి పళ్ళెంలో నుండి ఒకరు తీసుకుని తినడం, ఫ్రిజ్ లో  బాటిల్ ని నోటికి కరిచి పెట్టుకుని తాగడం ఇలా చాలా ఉంటాయి.. 


నేను కళ్ళతో చూసాను..  


వచ్చే వారు నిష్టా గరిష్టులైతే వారికి ఎంగిలి  పెట్టిన పాపం ఊరికే పోదు.. అందుకే  నియమంతో  ఉండేవారు ఎవరూ వేరే వారి  ఇంట్లో వేరే వారి చేతి మీద వీలైనంత వరకు  తినక పోవడమే మంచింది.. 


నేడు రోడ్డు మీద ఎవరు వండినదో తినడం  ఎక్కువయ్యింది..  అందుకే ఇంత గందరగోళం.. 


అందుకే తల్లి  సాత్వికురాలైనా..  పిల్లలు  ఆవేశపరులు అవుతున్నారు.. 


అది గమనించుకుని పిల్లలను పెంచండి....🌷

ఆలోచన - స్థిరత్వం

 ఆలోచన - స్థిరత్వం


*ఒక స్త్రీ పదికిలోమీటర్లు ఒక గంట నడిస్తే* 

*ఒక పురుషుడు అదే పదికిలోమీటర్లు నడవడానికి ఒకటిన్నర గంట తీసుకున్నాడు*


*ఇప్పుడు ఇక్కడ ఎవరు వేగంగా నడిచారు  అంటే స్త్రీ అనిపిస్తుంది*


*స్త్రీ చక్కగా ఉన్న దారిలోను, పురుషుడు ఎత్తుపల్లాలు కొండలు గుట్టలు ఉన్న దారి ద్వారా వచ్చాడు. ఇప్పుడు ఎవరు వేగంగా అంటే పురుషుడని అనిపిస్తుంది*


*ఆ స్త్రీ కి 60 ఏళ్ళని, పురుషుడికి 40 ఏళ్ళని చెప్పి* 

*ఇప్పుడెవరు వేగంగా నడిచారు ?*

*అంటే స్త్రీ అనిపిస్తుంది*


*అదే పురుషుడు 140 kg అని, స్త్రీ 60kg అని చెబితే, పురుషుడు వేగంగా నడిచాడు అనిపిస్తుంది*


*ఇలా ఒక్కో విషయం తెలుస్తున్నప్పుడు మన అభిప్రాయలు మారిపోతూ ఉన్నాయి. స్థిరమైన అభిప్రాయలు ఉండడం లేదు*


*అందుకే ఏమీ తెలియకుండా ఎవరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా అసలు అభిప్రాయం చెప్పకూడదు.*


*ఇదే జీవితం.*

*మనం ఒకరి గురించి ఆలోచించకుండా త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. పూర్తిగా తెలిసాక అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటాము*


*అందరిని మనతో పోల్చుకోవడమో, మనల్ని వాళ్ళతో పోల్చుకోవడమో చేస్తాము.*


*జీవితం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. వారికి దొరికే అవకాశాలు వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన శక్తి ఉంటుంది. వారు ఎదుర్కోవలసిన సమస్యలు వేరువేరుగా ఉంటాయి. వాటి పరిష్కార మార్గాలు వేరుగా ఉంటాయి.*


*జీవితం ఎప్పుడూ అనుభవిస్తే కానీ పూర్తి అవగాహనో లేక అర్థమో తెలియదు. మరొకరితో పోల్చుకుని ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోకండి*


*మీ జీవితానికి మీరే కథానాయకుడు మీరు మాత్రమే నాయకుడు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండండి. నిదానంగా ఉండండి. తృప్తిగా ఉండండి.*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*చిరునవ్వుతో పలకరిస్తూ ఉండండి.*

*ప్రశాంతంగా ఉండండి.*


పసుపులేటి నరేంద్రస్వామి

సీనియర్ సిటిజన్స్ కోసం

 *సీనియర్ సిటిజన్స్ కోసం :*

 *మాడిపోయిన బల్బ్ లు*                                                                                                                                  

                  *****

       ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీ లోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్టుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజూ ఆ కాలనీ లో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది. 


     ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి, తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు. ఒక రోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు.

  

     “చూడు నాయనా! విద్యుత్ బల్బు లు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో  ఐదు సంవత్సరాల నుండి నివస్తున్నాను, నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా. 

                                                                                                            అంతే .. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి.


     ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. "నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వే లో జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న సింగ్ గారు ఆర్మీలో మేజర్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న మెహ్రా గారు ఇస్రో ఛైర్మన్ గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను" 

"మాడిపోయిన బల్బ్ లు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. జీరో, 10, 20, 40, 60,100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటి కి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్, ట్యూబు లైట్, లెడ్, సి. ఎఫ్. ఎల్., హలోజెన్, డెకోరేటివ్ బల్బ్.. ఏది  అయినా ఒకటే. 


     అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బ్ లమే. 

ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా! ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. 


       మనం చేస్తున్న, ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటి కి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే.. ఏదో ఒక రోజు అవి మనలను వదలి పోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి. 

చదరంగం ఆటలో రాజు, మంత్రి.. వాటి విలువలు ఆ బోర్డు పై ఉన్నంత వరకే.. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బా లో వేసి మూత పెడతాము. 


     ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు..

 

     మన జీవితంలో ఎన్ని సర్టిఫికట్లు పొందినా.. చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే.. 

అదే డెత్ సర్టిఫికేట్. 


  (ఎంత గొప్ప సందేశమో కదా!)

క్షమాపణ


                  క్షమాపణ


ఒక గ్రామంలో ఓ చిరు వ్యాపారి ఉండేవాడు. అతని కొడుకులు గ్రామానికి వచ్చిన ఓ సాధువు దగ్గర శిష్యులుగా చేరారు. వారు అతని బోధనల్లో మునిగిపోయి, అతను చెప్పిన పద్ధతులు ఆచరిస్తూ ప్రశాంతంగా ఉంటున్నారు.


తన కొడుకులు బాగా సంపాదించాలని వ్యాపారి కోరిక. వారిని ఎందుకూ పనికిరానివారిగా చేస్తున్నాడని వ్యాపారికి ఆ సాధువుపై కోపం పెరిగిపోయింది. ఓ రోజు కోపంతో ఆ సాధువు దగ్గరికి వెళ్లాడు. అతణ్ని ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అక్కడికి వెళ్లగానే కోపం మరింత పెరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడున్న పేడను తీసి అతని ముఖంపై విసిరాడు.


సాధువు ముఖమంతా పేడతో నిండిపోయింది. శిష్యులకు కోపం వచ్చింది. సాధువు మాత్రం చిరునవ్వు నవ్వాడు.


ఆ వ్యాపారి అక్కడ ఉండలేక గబగబా ఇంటికి వెళ్లిపోయాడు. అతని మనసు నిండా ఆలోచనలు. ముఖం మీద పేడ వేసినా చిరునవ్వుతో ఉన్న వ్యక్తిని జీవితంలో తను మొట్టమొదటిసారి చూశాడు. రాత్రంతా నిద్రపట్టలేదు. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తప్పు చేశాననే భావన అతని మదిలో నిండిపోయింది.


మర్నాడు పొద్దున్నే వెళ్లి సాధువు పాదాలపై పడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు తాను క్షమించలేనని చెప్పాడు.


అందరూ విస్తుపోయారు. ‘క్షమించవలసినంత తప్పు నువ్వేం చేయలేదు’ అన్నాడు సాధువు.


కానీ వ్యాపారి పశ్చాత్తాపంతో తాను నిన్న వచ్చి అతని ముఖంపై పేడ వేసిన విషయాన్ని గుర్తుచేశాడు.


అప్పుడు సాధువు చిరునవ్వుతో ‘నిన్న ఆ పని చేసిన వ్యక్తి ఈ రోజున లేడు. అంటే ఆ గుణం ఈ రోజున నీలో లేదు. ఈ రోజు నువ్వు ఏ అపకారమూ చేయలేదు. కాబట్టి నిన్ను క్షమించ వలసిన అవసరం లేదు’ అన్నాడు.

అదీ క్షమాగుణం!


ఒక వ్యక్తిని మొదట తప్పు చేశావని నిరూపించి, తర్వాత క్షమించడం క్షమ అనిపించుకోదు. ఆ క్షమించిన విషయం సైతం ఆ వ్యక్తికి తెలియకుండా జరిగిపోవాలి. వారిలో తప్పు చేశామనే భావనే రాకూడదు.

అది సరైన క్షమ.


వారి తప్పును ఎత్తి చూపిస్తున్నావంటే వారిని ఇంకా క్షమించడం లేదని తెలుసుకోవాలి. తప్పు చేశామనే భావన పెద్ద శిక్ష. సాధనతో సంపాదించుకున్న జ్ఞానం ఈ భావన నుంచి తప్పించి జీవితాన్ని విశాల దృక్పథంతో చూసేలా చేస్తుంది.

అదే అసలైన జ్ఞానం.


అవతలి వ్యక్తుల తప్పులను ఎత్తిచూపడమే పనిగా పెట్టుకునేవారు లోకంలో కోకొల్లలు కనిపిస్తుంటారు. వారంతా ఒకసారి తమ తప్పులను గుర్తించగలిగితే, ఎదుటివారిని అర్థం చేసుకోగలుగుతారు.


అంటే, తప్పును సమర్థించాలని కాదు, తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయాలే కానీ, దాన్ని చేస్తున్న వ్యక్తిని తప్పుబట్టకూడదు.


పై కథలో సాధువు అనుసరించిన విధానం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అంతటి సహనశీలత ఉండకపోవచ్చు. కానీ, అభ్యాసంతో అన్నీ సాధ్యమే!


మన మనసు పారదర్శకంగా ఉంటే, అవతలి వ్యక్తి మనసూ అంతే పారదర్శకంగా కనిపిస్తుంది. మనలో మాలిన్యాలు ఉంటే, ఎదుటివారిలోనూ అవే కనిపిస్తాయి

Wednesday, June 22, 2022

ప్రవర్తనా నియమావళి-1964 నియమ - నిబంధనలు:

 ప్రవర్తనా నియమావళి-1964 నియమ - నిబంధనలు:


👉Rule 3(a):-

*ఏ ఉద్యోగియైన దేశ భద్రతకు, రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించే ఉద్దేశ్యం గల సంస్థలతో సంబంధాలు కలిగిన సభ్యునిగా ఉండకూడదు.*


👉Rule 3(b):-

*విధి నిర్వాహణలో గాని ఇతరత్రా గాని ప్రజలతో సమంజసమైన రీతిలో ప్రవర్తించాలి. అసభ్యంగా ప్రవర్తించకూడదు. తనకు కేటాయించిన పనిని దురుద్దేశ్యంతో గాని మరి ఇతరత్రా కారణాల వల్లగాని, అదేపనిగా ఆలస్యం చేయకూడదు.*


👉Rule 3(c):-

*ఏ ఉద్యోగియైన సరే తన విధినిర్వాహణలో ఉద్యోగినుల విషయంలో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలి. అమర్యాద పూర్వకంగా గాని, అసభ్యంగా గాని ప్రవర్తించకూడదు. అదే విధంగా లైంగిక వేధింపులు గురి చేయకూడదు.*


👉Rule 4:-

*ఏ ఉద్యోగి కూడా సమ్మెలు, తదితర రెచ్చగొట్టే కార్యక్రమాలలో పాల్గొనకూడదు.*


👉Rule 5:-

*రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు భంగం కలిగించే ప్రదర్శనల (Demonstrations) లో పాల్గొనకూడదు.*


👉Rule 7:-

*ప్రభుత్వ పూర్వానుమతి లేనిదే ఏ కార్యక్రమానికైనా చందాలు వసూలు చేయటం కాని తీసుకొనటం కాని చేయకూడదు.*


👉Rule 10:-

*ఏ ఉద్యోగస్థుడు కూడా ప్రయివేటు వ్యాపారములు తదితరములు చేయకూడదు. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అట్టి పనులు చేయకూడదు. అదే విధంగా భీమా ఏజెంటు గా గాని, కమిషన్ ఎజెంటు గా గాని పనిచేయకూడదు.*


👉Rule 11:-

*ఏ ఉద్యోగస్థుడు కూడా  వ్యక్తిగత హోదాలో బ్యాంకులు గాని, రిజిస్టర్డు కంపెనీలు గాని పెంచి పోషించకూడదు. కాని సామాజిక సేవా దృక్పధంతో రిజిస్టర్డు కాబడిన సహకార సంస్థల కార్యకలాపాలలో పాలు పంచుకోవచ్చును.*

Service Book Registers ( SR )

 

Govt Employee's andTeacher's Service Book Registers ( SR ) Maintenance Procedures, Rules, Methods, Entries, Points Etc Full Details in Telugu

👉 _*Govt Employee's andTeacher's Service Book Registers ( SR ) Maintenance Procedures, Rules, Methods, Entries, Points Etc Full Details in Telugu*_

👉 *ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగుల సేవా గ్రంధముల ( సర్వీస్ బుక్ ) రిజిష్టర్ నిర్వహణ – నియమాలు, పద్దతులు,  సర్వీస్ బుక్  రిజిష్టర్ నందు ఉండవలసిన నమోదులు ( ఎంట్రీలు )  మరియు సూచనలు మొదలగునవి పూర్తి వివరాలు తెలుగు లో..*

👉 *సర్వీస్ బుక్  రిజిష్టర్ నందు ఉండవలసిన నమోదులు ( ఎంట్రీలు ):*

 1. అపాయింట్మెంట్ ఆర్డర్ వివరాలు
 2. జాయింనింగ్ తేది వివరాలు
 3. శాశ్వత స్వస్థలం.
 4. చదువు ( పూర్తి అర్హతలు హాల్ టికెట్ నంబర్ తో
    సహా ).
 5. పుట్టుమచ్చలు.
 6. సర్వీస్ పుస్తకం 8వ కాల-మ్ లో ఉద్యోగి
     సంతకం,తేది.
 7. చేతి వెలి ముద్రలు
 8. ఉద్యోగి ఫోటో మరియు ఫోటో పై DDO సంతకం
 9. ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్.
10. సరెండర్ లీవ్ ల ప్రొసీడింగ్స్.
11. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం. వివరాలు
12. CPS / PRAN నంబర్.
13. సంపాదిత సెలవు, హాఫ్ డే లీవ్ , జీత నష్ట
       సెలవుల వెరిఫికేషన్.
14. LTC other then హోం టౌన్ , హోం టౌన్ ఎంట్రీ.
15. LTC డిక్లరేషన్.
16. లీవ్ ఎకౌంటు.
17. హాఫ్ పే లీవ్ ఎకౌంటు.
18. పే ఫిక్షేషన్ ఎంట్రీలు.
19. నామినీ సహా కుటుంబ సభ్యుల వివరాలు.
20. స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ 6 - 12 -18 - 24         
       మంజూరు ఉతర్వులు ఎంట్రీలు.
21. స్పెషల్ పే ఎంట్రీలు.
22. బదిలీ సమయంలో రిలీవ్ ఎంట్రీ.
23. సర్వీస్ వెరిఫికేషన్ ఎంట్రీ.
24. ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంటు నెంబర్.
25. APGLI /TSGLI నెంబర్.
26. కుల ధృవీకరణ నమోదు.
27. ఎంప్లాయ్ ID నెంబర్.
28. ట్రెజరీ ID నెంబర్.(G.O.Ms.No.80 తేది:
      19-3-2008)
29. 610 జి ఓ ప్రకారం లోకల్ స్టేటస్ నమోదు.
30. సర్వీస్ క్రమబద్ధీకరించబడిన మరియు
       ప్రోహిబిషన్ ఎంట్రీ.
31. పుట్టిన తేదీ ( అక్షరాలలో రాయాలి )
32. బోనాఫైద్ సర్టిఫికెట్ లు అంటించాలి.
33. హెల్త్ కార్డ్ నెంబర్.
34. ఎత్తు.
35. పితృత్వా, మాతృత్వ సెలవులు ( ఇద్దరు పిల్లలు
        వరకు )
36. తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్,
37. ప్రమోషన్ వివరాలు,
38 . మొదటి సారి ఉద్యోగం లోకి చేరిన అప్పుడు
        ఉద్యోగం రకం.
39. ఆధార్ కార్డు నంబర్.
40. జీతం ను పొందే బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ పేరు

41.డిపార్ట్మంట్ టెస్ట్ లు

👉 *సర్వీస్ బుక్  రిజిష్టర్ నిర్వహణ – నియమాలు, సూచనలు, పద్దతులు:*

⏩1)  అనివార్య కారణాల వల్ల ఏవైనా తప్పులు జరిగినట్లు అయితే వాటిని దిద్ద కూడదు,వైట్ నర్ వాడ కూడదు, రౌండ్ అప్ చేసి పైన రాసి DDO గారు సంతకం చేయాలి.

2)  కొన్ని కారణాల వల్ల  ఏదైనా నమోదు ను మార్చ వలసివస్తే  రౌండ్ అప్ చేసి పైన రాసి, మార్చిన చోట DDO సంతకం చేయడం తప్పనిసరి.

3)  సర్వీస్ రిజిష్టర్ లో ఎక్కడైనా చిరిగి పోతే అక్షరాలు కన పడే విధంగా సెల్లో టేప్ తో అతికించాలి. అట్ట లాంటివి అక్షరాలు లేని చోట చిరిగితే గం తో ఎప్పటికప్పుడు అతికిస్తు ఉండాలి.

⏩4)  ప్రతి సంవత్సరపు సర్వీస్ వెరిఫికేషన్ చేసి వివరాలు నమోదు చేయాలి. 01- 04 ( ఏప్రిల్ ) నుండి 31- 03 ( మార్చ్ ) వరకు సర్వీస్ వెరిఫికేషన్ నమోదు చేయాలి.

⏩5) నెల మొదటి తేదిన జాయిన్ అయినవారు అ ముందు నెల ఆఖరు తేదిన రిటైర్ అయిన ఇంక్రిమెంట్ కలపాలి.

⏩6) డూప్లికేట్ సర్వీస్ పుస్తకం అధికారికంగా ఉంచుకోవచ్చు.  ఇందులో ప్రతి నమోదు యందు DDO తో సంతకం చేయాలి. ఒరిజినల్ పోయినప్పుడు దీని ఆధారంగా కొత్త ది రాయబడును. లేదా ఒరిజినల్ రిజిష్టర్ నీ Xerox తీసుకుని ఉంచుకోవచ్చు కానీ DDO గారి అటేస్తేషన్ తప్పని సరి. ఈ సర్వీస్ బుక్ పై డూప్లికేట్ అని తప్పకుండా రాయాలి.

7) ఈ రిజిష్టర్ లో స్కెచ్ పెన్ గాని జెల్ పెన్ గాని మరియు ఇంక్ పెన్ గాని వాడకూడదు. కేవలం బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలి. నల్ల రంగు బాల్ పాయింట్ పెన్ వాడడం ఉత్తమం. DDO లు సహితం జెల్ పెన్ తో సంతకాలు చేయకూడదు. ఖచ్చితంగా ఆకు పచ్చ బాల్ పాయింట్ పెన్ తో నే సంతకాలు చేయాలి.

⏩ 8) ఏ కారణం చేత దీర్ఘకాలం సెలవులు పెట్టి డ్యూటీ లో జాయిన్ అయిన తరవాత లీవ్ మంజూరు చేసినప్పుడు నిల్వ ఉన్నoత వరకు ముందుగ EL తదుపరి HPL మిగిలినదానికి EOL మంజూరు చేస్తారు EOL పీరియడ్ ను తప్పనిసరిగా సర్వీస్ వెరిఫికేషన్ ఎంట్రీ వేయాలి.

⏩ 9 ) రిజిష్టర్ రాయాల్సిన పని మరియు భాధ్యత పూర్తిగా DDO లదే. పని భారం అయినప్పుడు ఎవరి తో నైన రాయించవచ్చు కానీ DDO గారు భాధ్యత వహిస్తారు. కాబట్టి అంతా క్షుణ్ణంగా అధ్యయనం చేసి సంతకం చేయాలి .

⏩ 10 ) భార్య భర్తల బదిలీల వాడుకున్నపుడు ఖచ్చితంగా ఆ వివరాలు రిజిష్టర్ లో నమోదు చేయాలి. గజిటెడ్ ఉద్యోగులకు ఐదు సంవ్సరాలకు ఒకసారి మిగతా వారికి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి వాడుకోవచ్చు.ఇరువురికి ఇచ్చే పాయింట్లు పది.

⏩ 11 ) ఒక వేళ ఉద్యోగి సర్వీసు పుస్తకం పోయినట్లు అయితే DDO గారే పూర్తి భాధ్యత వహిస్తారు. కొత్తది ఓపెన్ చేయాలి అంటే పోలీస్ రిపోర్ట్ ఇవ్వవలసి ఉంటుంది. డూప్లికట్ బుక్ గాని Xerox సహాయం తో కొత్తది ఓపెన్ చేయవచ్చు.

12 ) ఒక ఆఫీస్ లో చాలా మంది ఉద్యోగులు ఉంటే, వారి యొక్క సర్వీసు పుస్తకాలు ను వారి ఇంక్రీ మెంట్ ల నెల ప్రకారం బీరువా లో పెట్టుకోవడం వల్ల పని సులభం అవుతుంది.

13 ) ఎప్పుడైనా ఉద్యోగికి సర్వీసు పుస్తకం ఇవ్వ వలసిన అవసరం ఏర్పడితే, ఉద్యోగి నుండి ఒక అర్జి పత్రం ( అప్లికేషన్ ఫారం ) తీసుకోవడం తప్పని సరి మరియు అతనికి ముట్టినట్టుగా డిక్లరేషన్ తీసుకోవాలి.

⏩ 14 ) ఉద్యోగులు సర్వీస్ రిజిష్టర్ యందు క్లుప్త సంతకాలు కాకుండా పూర్తి సంతకాలు పెట్టాలి , ఒక వేళ పట్టక పోతే చిన్నగా రాయాలి .

⏩ 15 ) అని వార్య కారణాల వల్ల ఏదైనా ప్రొసీడింగ్స్ లో తప్పులు జరిగినట్లు అయితే సర్వీస్ రిజిష్టర్ లో రాయబడిప్పుడు దానిని కొట్టివేయకూడదు. మళ్ళీ తప్పులు సరి చేస్తూ మరొక ప్రొసీడింగ్స్ తీయాలి.

⏩ 16 ) ఉద్యోగులు తమ సర్వీస్ రిజిష్టర్ ను తాము స్వతహాగా రాసుకోపోవడం మంచిది. ఎవరైనా నియమాలు తెలిసిన వారితో గాని లేదా వారి సమక్షంలో రాసుకోవడం మంచిది. తప్పులు దొర్లకుండా ఉంటుంది.

⏩ 17 ) ఉద్యోగులు తమ అర్హతలను హాల్ టికెట్ నంబర్ తో సహా సర్వీస్ రిజిష్టర్ లో నమోదు చేయించుకోవాలి.

⏩ 18 ) బీరువాలో ఉన్న ఉద్యోగి సర్వీస్ రిజిష్టర్ ను సులభంగా గుర్తు పట్టుటకు బుక్ సైడ్ కు ఉద్యోగి పేరు ఎంప్లాయ్ ID రాయడం మంచిది .

⏩ 19 ) ఉద్యోగి తన ఉద్యోగం లోకి చేరిన తర్వాత అనగా అర్హతల కు మించి చదివినచో ఆ అర్హత వివరాలను హాల్ టికెట్ నంబర్ తో సహా అన్ని రిజిష్టర్ లో నమోదు చేయాలి.

⏩ 20 ) ప్రతి సంవత్సరం గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం లో ఎంత కట్ అయ్యింది ఎపుడు మినహాయింపు వివరాలను నమోదు చేయాలి.

⏩ 21 ) భవిష్యత్లో ఒకసారి సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేసిన పుట్టినతేది మార్చుటకు వీలులేదు.
(G.O.Ms.No.165 F&P తేది:21-4-1984)

⏩ 22 ) మొదటిసారి ఉద్యోగంలో నియమించబడు సందర్భంలో డాక్టరుచే జారీచేయబడిన Physical Fitness Certificate వివరాలు సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.
(G.O.Ms.No.03 Fin తేది:08-01-1969)

⏩ 23 ) ప్రతి ఉద్యోగి తన Home Town (LTC కొరకు) డిక్లేరేషన్ ఇవ్వాలి.అలాంటి వివరాలను కార్యాలయాధిపతి సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.
(APLTC Rule.No.8 of clause (b)(i)

⏩ 24 ) ఉద్యోగి CCA Rules-1991 ప్రకారం ఏ విధమైన శిక్షలకు గురైన పక్షమున అట్టి పూర్తి వివరములను సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.
(Govt.Memo.No.51073 తేది:19-12-2002)

⏩ 25 ) ఉద్యోగి గుణగణాలు, శీలము (character) గురించి సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయకూడదు.
 
⏩ 26 ) ఉద్యోగికి సంబంధిoచిన అతని సర్వీసు రిజిస్టరు ప్రతి సం॥ పరిశీలించి నమోదుకాబడిన వివరాలు సరియైనవే అని ఉద్యోగి ధృవపరుచుకొనుటకు అతనికి కార్యాలయాధిపతి ఇవ్వాలి.
(G.O.Ms.No.152 Fin తేది:20-5-1969)

⏩ 27 ) NGO అయిన ఉద్యోగి బదిలీ అయిన సందర్భంలో సంబంధిత ఉద్యోగి సర్వీసు రిజిస్టరు బదిలీ అయిన కార్యాలయ అధికారికి పొస్ట్ ద్వారా పంపించాలి.బదిలీ అయిన ఉద్యోగికి సర్వీసు రిజిస్టరు ఇచ్చి పంపకూడదు.
(G.O.Ms.No.722 తేది:30-07-1966)
(G.O.Ms.No.391 తేది:07-11-1978)

⏩ 28 ) సర్వీసు రిజిస్టర్ లో విషయాలు పెన్సిల్ తో నమోదు చేయరాదు.
(Govt.Memo.No.72246 తేది:30-07-1966)

⏩ 29 ) ఒక వేళ ఉంటే రివర్షన్ వివరాలు ( 2009 లో కొన్ని జిల్లాలలో ప్రమోషన్ ఇచ్చి తర్వాత పోస్ట్ లు లేనందున తిరిగి రివర్షన్ లు ఇచ్చారు ).

⏩ 30 ) ఒక వేళ ఇంక్రిమెంట్ లు నిలుపుదల చేస్తే ఆ వివరాలు నమోదు చేయాలి.

⏩ 31 ) చైల్డ్ కేర్ సెలవులను తీసుకున్నా ప్రతిసారీ నమోదు చేయాలి మరియు బ్యాలెన్స్ గా ఉన్న సెలవులు నమోదు చేయాలి.

⏩ 32 ) దీర్ఘ కాలిక సెలవులు తేదీ లతో పాటు నమోదు చేయాలి.

⏩ 33 ) ఉన్నత విద్య కోసం తీసుకున్న సెలవులు తేదీ లతో పాటు నమోదు చేయాలి. ( SC, ST లకు కుటుంబంలో మొదటి తరం వారికి ఉన్నత విద్య కోసం రెండు సం ల ఆన్ డ్యూటీ ఇస్తారు )

⏩ 34 ) అడ్వాన్స్ డిటైల్స్ ( ఇంటి నిర్మాణం, కార్ లోన్, కంప్యూటర్, పెళ్లి కొరకు తీసుకొనే అడ్వాన్స్ వివరాలు, ఈ అడ్వాన్స్ లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మంజూరు చేయబడును )

⏩ 35 ) రాష్ట్ర స్థాయి లో గాని లేదా జాతీయ స్థాయిలో గాని ప్రభుత్వం నుంచి ఏదైనా అవార్డ్ లు గాని, రివార్డ్ లు గాని ప్రశంసా పత్రాలు గాని, సేవా పథకాలు గాని మెడల్స్ గాని పొందినట్లు అయితే ఆ వివరాలు నమోదు చేయాలి

మంచి ఆరోగ్యానికి అలవాట్లు

 మంచి ఆరోగ్యానికి అలవాట్లు


1➕ నిలబడి నీళ్ళు త్రాగే వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. నిలబడి నీళ్ళు త్రాగే వారి మోకాళ్ళ నొప్పిని ప్రపంచంలో ఏ డాక్టర్ బాగు చేయలేడు. కాబట్టి,  కూర్చుని త్రాగండి.

2➕ వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి క్రింద లేదా A. C.లో పడుకుంటే శరీరం పెరిగి లావై పోతారు.          

 3➕ 70% నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్ళు చేసే మేలు నొప్పి తగ్గించే మాత్రలు ఏవీ కూడా అంతగా చేయవు.

4➕ కుక్కర్లో పప్పు మెదుగు తుంది, ఉడకదు. అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది.

5➕ అల్యుమినియం పాత్రల ప్రయోగం బ్రిటీష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలని అనారోగ్యం పాలు చేయటానికి వాడేవారు.

6➕ షర్బతు మరియు కొబ్బరి నీళ్ళు ఉదయం 11 గం. లోపు త్రాగితే అమృతం వలే పనిచేస్తాయి.

7➕ పక్షవాతం వచ్చిన వెంటనే రోగి ముక్కు👃లో దేశవాళి ఆవు నెయ్యి వేస్తే 15 నిమిషాల్లో  బాగవుతారు.

8➕ దేశవాళి ఆవు శరీరం పైన చేతి✋ తో నిమిరితే 10 రోజుల్లో బ్లడ్ ప్రెషర్ నయమౌ తుంది. పక్షవాతం రాదు.

9➕ ఈ మంచి మాటలు, మంచివారికి, తమకు ఇష్టమైన మిత్రులకు, బంధువులకు మరియు గ్రూపులో తప్పక షేర్ చేయండి. ఈ విధంగా నైనా మనం ఒకరి జీవితం రక్షించిన వారమవుతాం. ......

*ధన్యవాదములు* 

మీ శ్రేయోభిలాషి*```

దేశం బాగుండాలి అంటే ఎవరు మారాలి?

 దేశం బాగుండాలి అంటే ఎవరు మారాలి?


*🏹🏹🏹ఈ దేశంలొ తప్పు చేసినోడు " బాబా " అవుతాడు.*


*🏹🏹🏹హత్యలు చేసినోడు " నాయకుడు " అవుతాడు.*


*🏹🏹🏹అవినీతి చేయగల్గినోడు " అధికారి " అవుతాడు*


*🏹🏹🏹పంట పండించేవాడు " అడుక్కు " తినలేక ఆత్మహత్య చేసుకుంటాడు.*


*🏹🏹🏹కష్టపడి చదివేవాడు " నిరుద్యోగి " అవుతాడు*


*🏹🏹🏹న్యాయoగ ఉండేవాడు " నాశనం " అవుతాడు.*


🏹🏹🏹ఇదే మన 75 ఏళ్ల స్వాతంత్ర దేశం🙏🙏🙏🙏


*🏹🏹🏹ఇంకా చెప్పాలంటే ఈ దేశంలొ పేదవారు ఉన్నారు కాని " పేద " దేశం కాదు*


🏹🏹🏹అభివృద్ధి ఉంది అలాగని అభివృద్ధి చెందిన దేశం కాదు....కారణాలు ఇవే


*🏹🏹🏹 మనం అంబులెన్స్ కి phone చేస్తే దానికంటే ముందు pizza మన ఇంటికి వస్తుంది..*


*🏹🏹🏹కారు loan కి వడ్డీ 5% అయితె, చదువుకోవడానికి మాత్రం bank లు వసూలు చేసేది 12% వడ్డి..*


🏹🏹🏹  మనం కాళ్లకు వేసుకునె చెప్పులు a/c room లొ కొంటున్నాం,


*🏹🏹🏹అదె తినే ఆహార పదార్థాలు మాత్రం రోడ్డుపైన కొంటున్నాం..*


🏹🏹🏹 పర్యావరణం కాలుష్యం చేసె ఫ్యాక్టరీలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం.


*🙏🙏🙏కాని అన్నం పండించే రైతన్నకు 7 గంటలు కరెంట్ ఇస్తున్నాం..*


*🏹🏹🏹75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలొ నేటికి రూపాయికి కిలో బియ్యం & 5 రూపాయలకు అన్నం కోసం line లొ నిలపడుతున్నారు అంటె నా దేశంలొ పేదరికం ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోండి...🙏🙏🙏*


*🏹🏹🏹లిక్కర్ కి ఆశపడి మగవాళ్ళు, కాసులకు కుక్కర్ కి ఆశపడి ఆడవాళ్లు ఓట్లు వేస్తే*


*🏹🏹🏹చివరికి నిక్కర్ కూడ మిగులకుండ చేస్తారు . మన పాలకులు.*

Saturday, June 18, 2022

ప్రేమించేతండ్రి ఉన్నంతకాలం ఏ కూతురైన ధనవంతురాలే..

 🌹ప్రేమించేతండ్రి ఉన్నంతకాలం

 ఏ కూతురైన ధనవంతురాలే..🌹

 ప్రేమించే_తండ్రి_వున్నంతకాలం_ఏ_కూతురయినా_ధనవంతురాలే...


అనుకోకుండా తన ఇంటికి వచ్చిన తండ్రిని చూసి కూతురు ఎంత సంతోషించిందో .....

అంత ఖంగారు పడింది! 


దూరం నుంచి వచ్చిన తండ్రి భోజనం చెయ్యకుండా ఎలా వెళతాడు .....?

కానీ ఇంట్లో బియ్యంలేవు, 


డబ్బాలోంచి వూడ్చి వూడ్చి తీస్తే 

సోలెడు కూడా లేవు, 


తన అడుగంటిన సంసారం 

కన్నతండ్రి కంట పడక తప్పేట్టు లేదు! 

కూతురి ఆందోళన తండ్రి గమనించాడు! 


ఏదో పనున్నట్టు వంటింట్లోకి వెళ్ళి 

అన్ని డబ్బాలూ మూతలు తీసి చూశాడు.


 బాధతో ఆయన మనసు కృంగిపోయింది.. 

ఎంత గారంగా పెంచాడు పిల్లని!! 

అల్లుడు నిక్షేపం లాంటి ఉద్యోగం మానేసి..


వ్యాపారంలోకి దిగి నష్టాల పాలయి 

సంసారం ఈ స్తితికి తెచ్చాడు! 


" ఇప్పుడే వస్తా తల్లీ " అని బైటకి వెళ్ళాడు, 


తండ్రి వచ్చాక ఏం సంజాయిషీలు చెప్పుకోవాలా అని కూతురు దిగులుగా ఆలోచిస్తోంది! 


"ఇక్కడే అబ్బీ ఆపు " రిక్షా దిగిన నాన్న సామానంతా ఇంట్లోకి చేర్పించాడు బియ్యం బస్తా తో సహా! 


ఏమీ అనలేక కూతురు గుడ్లనీళ్ళు కుక్కుకుంది ..


" ఊరుకో తల్లీ , ఓర్చుకుంటే ఓరుగల్లు పట్టణమవుతుందంటారు , ఓర్పుగా వుండు , నీకూ మంచిరోజులొస్తాయి "ఓదార్చాడు! 


ఆయన అన్నట్టే జరిగింది, మంచి రోజులొచ్చాయ్! 


కూతురి ఇంటినిండా దేనికీ లోటు లేకుండా ఓ మూల బియ్యం బస్తాలూ, వంటింట్లో నిండుగా సరుకులు.. కన్న తండ్రి హృదయం, కడుపూ రెండూ నిండిపోయాయి, అయినా కూతురి తృప్తి కోసం నాలుగు మెతుకులు తిని లేచాడు !


 వెళ్ళేటప్పుడు నాలుగొందలు చేతిలో పెడుతోంటే " ఎందుకు నాన్నా , ఇప్పుడు మా పరిస్తితి బాగానే వుంది " అంది మొహమాటంగా .


 " బాగాలేదని కాదమ్మా ! నా సంతృప్తికోసం ఇస్తున్నా , పండక్కి చీర కొనుక్కో " అన్నాడు


 చెమ్మగిల్లిన కళ్ళు కూతురు లచూడకుండా కండువాతో తుడుచుకుంటూ! 


(ప్రేమించే తండ్రి వున్నంతకాలం ఏ కూతురయినా ధనవంతురాలే !!)

నాన్నలందరికీ వందనాలు

 **నాన్నలందరికీ వందనాలు*🙏

నడకను నేర్పేది నాన్నే

నడతను నేర్పేది నాన్నే

చెమటచిందించేది నాన్నే

సంతోషమందించేది నాన్నే

ఆశ్రయం కలిపించేది నాన్నే

అశ్రువు రాకుండా చేసేది నాన్నే

అలుపెరగని శ్రమజీవి నాన్నే

బిడ్డ కలుపులేకుండా చూసేది నాన్నే

అవసరాలు తీర్చేది నాన్నే 

ఆనందాలు పంచేది నాన్నే

అవస్థలు పడేది నాన్నే

వ్యవస్థలను తెలిపేది నాన్నే

ఆప్యాయత పంచేది నాన్నే

ప్రోత్సాహం ఇచ్చేది నాన్నే


ఇలాంటి నాన్నలందరికీ వందనాలు🙏*🙏

నడకను నేర్పేది నాన్నే

నడతను నేర్పేది నాన్నే

చెమటచిందించేది నాన్నే

సంతోషమందించేది నాన్నే

ఆశ్రయం కలిపించేది నాన్నే

అశ్రువు రాకుండా చేసేది నాన్నే

అలుపెరగని శ్రమజీవి నాన్నే

బిడ్డ కలుపులేకుండా చూసేది నాన్నే

అవసరాలు తీర్చేది నాన్నే 

ఆనందాలు పంచేది నాన్నే

అవస్థలు పడేది నాన్నే

వ్యవస్థలను తెలిపేది నాన్నే

ఆప్యాయత పంచేది నాన్నే

ప్రోత్సాహం ఇచ్చేది నాన్నే


ఇలాంటి నాన్నలందరికీ వందనాలు🙏

ఒక్కో తండ్రికి ఆకాశమంత చరిత్ర ఉంది

 *అయ్య, బాపు, నాన్న, తండ్రి, డాడీ, ఫా, అబ్బాజాన్‌, పప్పా ఇలా పిలడవానికి ఎన్ని పేర్లున్నా ఒక్కో తండ్రికి ఆకాశమంత చరిత్ర ఉంది. 


కని పెంచి కడుపు చూసేది అమ్మైతే.. నడిపించి భవిష్యత్తుని చూసేవాడే నాన్న..


అమ్మ కనిపించే వాస్తవమైతే.. నాన్న ఓ నమ్మకం.. 


లాలించేది అమ్మ ఒడి.. నాన్న భుజం లోకాన్ని చూపే బడి. 


అమ్మ జోల పాట ఎలాగో.. నాన్న నీతి పాఠం కూడా అలాగే ఉంటుంది. 


తమ కన్నా మిన్నగా బిడ్డ తయారు కావాలని కలలు కనేది కన్నవారే.

 

నాన్న మనకోసం తన జీవితాన్ని త్యాగంచేసే త్యాగమూర్తి. 


మనం ఓడినప్పుడు నేనున్నా అంటూ ఓదార్చే ఎమోషన్ నాన్న.. 


మనం గెలిచినప్పుడు పదిమందితో చెప్పుకునేవాడే నాన్న…


 మన నుంచి కృతజ్ఞతలు ఆశించని అమాయక చక్రవర్తి నాన్న.. 


ప్రపంచంలో అమ్మకు ఎంత గొప్ప స్థానం ఉందో 

నాన్నకు కూడా అంతే గొప్ప స్థానం ఉంది. 

అటువంటి నాన్నకు ప్రతీఒక్కరు రుణపడి ఉండాలి.🍁

నాన్నకు కన్నీళ్లు వున్నాయి

 *🙏నాన్నకు కన్నీళ్లు వున్నాయి 👨‍👧‍👦*


        *నాన్నలందరికి అంకితం* 


*నాన్న మనకోసం ఏం చేశాడో*

*ఏం కోల్పోయాడో  మనకు తెలియదు..!*


*జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ, వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి. తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు తండ్రి. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు.*

 

*ఎందుకంటే.. నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్యకి అసలు చెప్పడు. అమ్మలా ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు.*

 

*‘ఎప్పుడూ పనేనా? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.*

 

*మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. వృద్ధాప్యం ఇంకా రాలేదు.. మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న డాక్టర్‌ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు.*

 

*తన పిల్లలు గొప్ప వాళ్లు అవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు. మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ.*

 

*ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు. ఎక్కడ, ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు. కొన్ని వందలసార్లు అమ్మ ఏడ్వడం చూశాం కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా?.. నాన్న కూడా ఏడుస్తాడు. కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు.*

 

*పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. నాన్న అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం మొదలు పెడతారు. ‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, నేను ఎవరి కోసం బతికాను?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. ‘నా కోసం నేను ఏదీ దాచుకోలేదే..’ అనుకుంటాడు.*

 

*నిజానికి ‘నేను’ అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి. ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్నను ఏడిపిస్తాడు. నాన్న గుండెలపై తంతాడు. అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు. అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి.*

 

 *కొడుకు ఎంత మంచివాడు * ప్రయోజకుడైతే తండ్రి అంతే ఎక్కువ బాధ్యతగా సమస్యలు ఎదుర్కొంటాడు. అతడికి ఎంత సక్సెస్‌ వస్తే.... అంత ఎక్కువగా తండ్రిని ఏడిపిస్తాడు.( పాజిటివ్ గా ఆలోచించండి) ఇది నిజం. మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి. బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం. కానీ, మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు. అసలు మీ నాన్న పుట్టిన రోజు కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు. నాన్న మీ భవిష్యత్తు కాదు. కానీ నాన్నకు మీరే భవిష్యత్తు.** 

 

*మీ కోసం రిస్క్‌ తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది. ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది నాన్నలు జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీగా మిగిలిపోయారు..’*


 *ప్రతీ నాన్నకు సెల్యూట్*


Once again🙏 HappyFathersDay 🙏



Thursday, June 16, 2022

నవ్వుకోండి

 నవ్వుకోండి😂😂😂

---------------------------------


Godavari Express కి ఇంకా చాలా time ఉంది. ఎక్కబోతూ ఒకసారి Chart లో నాపేరు, Berth Number చెక్ చేసుకున్నా! అసంకల్పితంగా క్రిందనున్న పేరు మీద నా దృష్టి పడింది. చెత్తకుప్పల చిట్టిబాబు.... వయస్సు 45. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఔను! అతనే ఇతను అయి ఉంటాడు. ఇంత విచిత్రమయిన పేరు ఇంక ఎవరికి ఉంటుంది.  అతనికి ముందు పుట్టిన పిల్లలు బ్రతక్కపోతే ఇతను పుట్టగానే చెత్తకుప్ప మీద పడుకోబెట్టి, మొక్కుకున్నారని విన్నాం అప్పట్లో. పేరు అలా ఉంది గానీ చూట్టానికి smart గా, active గానే ఉండేవాడు. నా మనసు గతం లోకి జారిపోయింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను తెగ ప్రేమించిన వీర ప్రేమికుడు అతను. *(అప్పట్లో నేను కాలేజ్ బ్యూటీ లెండి 😎)* కాలేజీకి వెళ్లినా, ట్యూషన్ కి వెళ్లినా, గుడికి వెళ్లినా body gaurd లా వచ్చేవాడు. భలే కోపం వచ్చేది. ఇంట్లోవాళ్ళకి తెలుస్తే చదువు మానిపిస్తారని భయం. చిట్టిబాబు కాదు జిడ్డుబాబు అని తిట్టుకునేదాన్ని, నిజానికి మూడు సంవత్సరాల డీగ్రీ లో propose చేసి చావలేదు, అతను ఏ రోజు అయినా కనిపించకపోతే నాకు కూడా ఏదో వెలితి గానే ఉండేది.  నేనో రెండ్రోజులు ఏ ఊరన్నా వెళ్లి, కనబడకపోతే నిద్రాహారాలు మానేసి బాధ పడేవాడని ఫ్రెండ్స్ చెప్పేవారు. అతన్ని నేను  ప్రేమించక పోయినా మనసులో ఏ మూలో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్.... బహుశా ప్రేమని వ్యక్త పరచడానికి అప్పట్లో మా ఇద్దరికీ ధైర్యం కూడా లేదేమో.  ఆ తర్వాత మా నాన్నగారికి transfer అవటం....

మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. ఇపుడు దాదాపు 25 ఏళ్ళ తర్వాత నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతాడో. నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. నాకు పెళ్లి అయిన ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారికి కూడా పిల్లలు ఉన్నారు. అయినా ఒకప్పుడు నన్ను అంతగా ఆరాధించి, అభిమానించిన చిన్ననాటి స్నేహితుడిని చూడాలంటే... *exitement తో నా హృదయం బరువెక్కింది, అసంకల్పితంగా నా పెదాలమీద చిరునవ్వు వచ్చేసింది. మెల్లిగా ట్రైన్ ఎక్కాను నా బెర్త్ వెదుక్కుంటూ వెళ్తే.... Yes అతనే, సీరియస్ గా Suit Case సర్దుకుంటున్నాడు. అప్పుడు ఎలా ఉండే వాడో ఇప్పుడూ అలాగే కత్తి లాగ ఉన్నాడు.* నీట్ గా ట్రిమ్ చేసిన salt & pepper గెడ్డం, full sleeves సగం fold చేసి, పైన రెండు షర్ట్ బటన్స్ వదిలేసి in-shirt చేసాడు, అసలు పెళ్లి అయిందో లేక నన్ను మర్చిపోలేక అలా ఉండిపోయాడో పాపం అనుకుంటూ సంతోషంతో తన్నుకొస్తున్న చిరునవ్వుని బిగబట్టుకుంటు చూస్తున్నా. 

ఇంతలో చెత్తకుప్పల చిట్టిబాబు వెనక్కి తిరిగి నా వైపు చూసాడు. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది, BP పెరిగింది.


ఒకటి....రెండు.... అంకెలు లెక్క పెడుతున్నా హఠాత్తుగా అన్నాడు అతను....


 *Aunty, మీరు పెద్దవారు. పై బెర్త్ ఎక్కలేకపోతే నా lower బెర్త్ తీసుకోండి*


దొంగ సచ్చినోడు

చెత్త వెధవ

పండు గెడ్డం గాడు

వాడి గుడ్లు పీకా

వాడికి Carona రానూ                             


----😆😆😆😆

Wednesday, June 15, 2022

మనిషిని మనిషిగా చూడాలి


మనిషిని మనిషిగా చూడాలి

*నిలబెట్టగల్గినవి ఆలోచనలే, సంకల్ప వికల్పాలకు మనస్సే ఆధారం, ఆలోచన సాత్వికమైతే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది, రాజసమైతే తనకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది, తామసికమైతే అందరికీ ఇబ్బందులుకు గురిచేస్తోంది*

*అందుకే మనస్సు మీద అదుపు ఉండాలి, మనస్సు వశంలో ఉన్న వారు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు*


_ఆలోచించడం, సంకల్పించడం,_ 

_అనేవి మనిషికి గొప్ప వరాలు, వాటిని సాధించాలంటే జీవితాన్ని క్రమశిక్షణ మార్గంలో నడిపించాలి, క్రమశిక్షణ పుట్టుకతోనే రావాలని ఏమి లేదు, ఎవరై ఒకరి క్యారెక్టర్ ను ఆదర్శంగా తీసుకున్నపుడు కూడా సాధ్యమవుతుంది_


*తల్లిదండ్రులు, గురువు, స్నేహితుడు ఇలా ఎవరైనా కావచ్చు, క్రమశిక్షణతో కూడిన జీవితం మనిషిని మహోన్నత శిఖరాలకు అధిరోహింపజేస్తుంది, ఒక సదాలోచన బుద్ధున్ని సత్యాన్వేషకున్ని చేసింది, అంబేద్కరును రాజ్యాంగ నిర్మాతను చేసింది*


_మంచి ఆలోచనలు చేసేవారే మంచి పనులు చేస్తుంటారు, మంచి ఆలోచనలు మంచి పనికి దారి తీస్తుంది, మంచిపని మంచి ఫలితాన్ని ఇస్తుంది, జీవితంలో గొప్పగా ఎదగాలంటే, కుళ్ళు కుతంత్రలతో ఉన్న ఆలోచనలు నుండి మనస్సును దూరంగా ఉంచాలి, అయితేనే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడే సరైన నిర్ణయం తీసుకోడానికి విలౌతుంది, ఇది ముమ్మాటికీ నిజం అని పెద్దలు చెబుతారు_

🌳🌳🌳💎🌳🌳🌳

Sunday, June 12, 2022

పాఠశాలకు వెళ్ళే పిల్లల తల్లిదండ్రులకు అభ్యర్ధన

 

పాఠశాలకు వెళ్ళే పిల్లల తల్లిదండ్రులకు అభ్యర్ధన




1. రాత్రి 8 గంటలకు టీవీ స్విచ్ ఆఫ్ చేయండి, 8 తర్వాత TV లో మీ బిడ్డ కంటే ముఖ్యమైనది ఏదీ లేదు.

2. 30-45 నిముషాలు మీ బిడ్డ హోం వర్క్ తనిఖీ చేసి అతనికి సహాయం చేయండి

3. రోజు అతని చదువుని పరిశీలించి వెనకబడిన సబ్జెక్టులో సహాయం చేయండి.

4. 5 వ/10 వ తరగతి లోపు చదివే ప్రాథమిక విద్య వారి జీవితానికి ములస్తంభం అని గుర్తించండి.

5. ఉదయం ఉదయం 5:30 గంటలకు మేల్కొవడం వారికి అలవాటు చేయండి. ధ్యానం చేయడం నేర్పండి.

6. మీరు ఏ పార్టీలు లేదా పెళ్లిళ్లకు హాజరు అయి ఆలస్యంగా మీ పిల్లలు నిద్రిస్తే మీ బిడ్డకు మరుసటి రోజు విశ్రాంతి ఇవ్వండి. లేదా మీరు వారిిని తరువాతి రోజు పాఠశాలకు వెళ్లాలని కోరుకుంటే కనీసం ఇంటికి 10:00 గంటలకు ఇంటికి రండి.

7. చెట్లను నాటడానికి మరియు వాటిని పెంచే అలవాటును పిల్లలకు నేర్పండి.

8. మీ పిల్లల పంచతంత్ర, అక్బర్ బిర్బల్, తెనాలి రాము వంటి కథలు పడుకునే సమయంలో చెప్పండి.

9. ప్రతి సంవత్సరం వేసవి సెలవులు మీ బడ్జెట్ ప్రకారం ఒక పర్యటనకు ప్లాన్ చేయండి. (ఇది వేర్వేరు వ్యక్తులకు మరియు ప్రాంతాలకు అలవాటుపడే యోగ్యతను వారిలో మెరుగుపరుస్తుంది)

10. మీ బిడ్డలో ప్రతిభను కనుగొని, దానిని మరింతగా మెరుగపర్చడానికి అతనికి సహాయపడండి (ఏదైనా విషయం, సంగీతము, క్రీడలు, నటన, డ్రాయింగ్, నృత్యం మొదలైన వాటికి ఆసక్తి ఉండవచ్చు) ఇది వారి జీవితాన్ని అందంగా చేస్తుంది

11. ప్లాస్టిక్ వాడకూడదని నేర్పండి (కనీసం ప్లాస్టిక్ లో వేడి పదార్థాలు వాడకూడదని)

12. ప్రతి ఆదివారం వారికి ఇష్టమైన వంట తయారు చేసేందుకు ప్రయత్నిoచండి. మరియు తయారుచేయడంలో సహాయం చేయమని వారిని అడగండి (వారు ఆనందిస్తారు)

13. ప్రతి శిశువు జనమతః ఒక శాస్త్రవేత్త. వారు మనం జవాబు ఇవ్వలేని అనేక ప్రశ్నలను అడుగుతారు. కాని మా అజ్ఞానం తో వారిపై మన కోపాన్ని చూపించకూడదు (సమాధానాలను కనుగొని, వారికి తెలియజేయండి)

14. వారిని క్రమశిక్షణ మరియు మంచి జీవన విధానాన్ని బోధించండి (తప్పుచేస్తే శిక్షించండి).

15. పాఠశాల విద్య లేదా పాఠశాలలో పాస్ పెర్సెంటేజ్ ఆధారంగా లేదా మీ సహోద్యోగులు, మీ పొరుగువారు లేదా స్నేహితులు చెప్పారని లేదా ప్రయివేటు స్కూళ్ల ప్రచారం చూసి  అత్యుత్తమ పాఠశాలగా నిర్ణయించకండి. మీ బడ్జెట్కు సరిపోయేదే మీ పిల్లలకు సరైన పాఠశాల అని గుర్తించండి. ఏ రోజుల్లో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగా పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో మీ పిల్లల విద్య కోసం మీరు మరింత ఖర్చు చేయాలి, ఈరోజు మీరు కొంత డబ్బును ఆదా చేసుకోవాలి, నేడు మీ కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడం, మీ ప్రస్తుత బాధ్యతలు. కాబట్టి తదనుగుణంగా ప్లాన్ చేయండి.

16. తమను తాము చదవడం మరియు నేర్చుకోవడo అలవాటు చేయండి.

17. ముఖ్యంగా మొబైల్ ఫోన్లను వారికి ఇవ్వకండి. (ఎందుకో ప్రతి ఒక్కరికి  తెలుసు)

18. మీ పనుల్లో మీకు సహాయపడమని మీ బిడ్డను అడగండి. (వంట చేయడం, ఇంటిని/బైక్/కార్ కడగడం, బట్టలు ఉతకడం లాంటివి)

విద్యా సంవత్సర ఆరంభ శుభాకాంక్షలతో ......

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE