NaReN

NaReN

Sunday, July 31, 2022

జీవన పాఠం

 🙏జీవన పాఠం🙏 


ఒక దారుణమైన సంఘటన మీలో ఎవరికైనా గుర్తుందా?


8 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన  దాదాపుగా 46 మంది విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ కోసం హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు.. 


అక్కడ 8-06-2014 సాయంత్రం 5:30 గంటలకు బియాస్ నదీ తీరాన ఫోటోలు తీసుకుందామని వెళ్లారు.. 


అప్పుడు నదిలో నీళ్లు లేవు. కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి.


ఆ నది ప్రవహించే చోటున మధ్యలో ఒక పెద్ద బండరాయి వీళ్ళను ఆకర్షించింది. దానిపై నిలబడి, ఫోటోలు దిగుదామని వెళ్లారు.


సరిగ్గా 6 గంటల సమయంలో ఒక సైరన్ మ్రోగింది.. అదేంటో వీళ్లకు అర్థం కాలేదు.. 


వీళ్ళున్న ప్రాంతానికి ముందు ఓ dam గేట్లు ఎత్తివేసి, నదీ జలాలను విడుదల చేశారు.. ఆ నదీ ప్రవాహం వీళ్ళ వైపుగా రావడాన్ని ఒడ్డున ఉన్న కొందరు చూశారు.. వీళ్ళను alert చెయ్యడానికి కేకలు వేశారు.. కానీ, వీళ్ళు పట్టించుకోలేదు.. ఆ నీళ్ళ మధ్యన నిలబడి, ఫోటోలు దిగుతూ enjoy చేస్తున్నారు.. (వాళ్ళ చివరి ఫోటోలు అవే)


అంతలో నీటి మట్టం స్థాయి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.. ఒడ్డుకు దగ్గరలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు చిన్నగా వచ్చేశారు.. అందులో ఒక అమ్మాయి తన చెప్పులు బండ మీద మర్చిపోయాను అని చెప్పుల కోసం మళ్ళీ నది మధ్యలోకి వెళ్లి పోయింది..


ఉన్నట్లుండి, నది ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. నీటి మట్టం ఎత్తు దాదాపుగా 5 అడుగుల వరకూ చేరుకుంది..


రాళ్ళ మీద నిలుచున్న విద్యార్థులు నిస్తేజంగా నిలబడిపోయారు..


అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కళ్లెదుటే కొట్టుకునిపోయారు..


తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు..

ఇక్కడ మనం గమనించవలసింది, top college లో చదివిన వీళ్లకు, 


ప్రకృతి ఎంత శక్తివంతమైనది అని తెలియకపోవడం..

వీళ్ళలో ఎవరికీ ఈత రాకపోవడం..

"చెప్పుల" కోసం ప్రాణాలను పోగొట్టుకోవడం..


ఈ post చదువుతున్నవారిలో, 


ఎందరు పిల్లలకు ఈత వచ్చు? 


ఈత అని మాత్రమే కాదు, 


ఉన్నట్లుండి మీ ఇంట్లో electrical short circuit ఏర్పడితే, ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు?


ఎవరైనా పెద్దలకు heart attack, ఊపిరి ఆడకపోవడం, చెయ్యి తెగితే, రక్తం ధారగా కారుతున్నపుడు ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు?


 కనీసం FIRST AID ఎలా చేయాలో తెలుసా?



పిల్లలకు మనం నేర్పిస్తున్నది ఏమిటో తెలుసా?


చదువు, చదువు, చదువు, మార్కులు, ర్యాంకులు, engineering, medicine, GRE, G-MAT, IELTS, TOEFL, US, UK.. డాలర్లు..


వాళ్ళను shopping malls లో branded dresses వేసుకోమనడం, Reebok, Nike shoes కొనివ్వడం,  పిజ్జాలు, బర్గర్లు, చికెన్ టిక్కా ముక్కలు, బిర్యానీలు...ఇవి మాత్రమే కాదు..


ప్రకృతి అందాలే కాదు, ప్రకృతి కన్నెర్రజేస్తే, ఎలా ఉంటుందో చూపించాలి..


రాజ్యాంగం లోని మన హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించాలి.. 


ఎదుటి వాడు దాడి చేస్తే 

రక్షించుకోవడం నేర్పించాలి..


సమాజంలో ఉన్న అన్ని రకాల మనుషులతో సమయస్పూర్తిగా మెలగడం అలవాటు చెయ్యాలి....


అప్పుడే వాళ్ళకి మంచి , చెడు గురించి అవగాహన వస్తుంది..


అన్నింటికంటే ముందు "common sense"   ఇంగిత జ్ఞానము  అనేది లేకుండా పిల్లలను పెంచుతున్నాం... దాన్ని నేర్పకుండా.. చదువుకో, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు సంపాదించు.. అంటూ ఒక యంత్రంలా తయారు చేస్తే,


ఇదుగో.. ఫలితాలు.. ఇలాగే ఉంటాయి.....


గమనించండి....


ఆలోచించండి....


ఈ దిశగా కూడా ప్రయత్నం చేయండి..


కొంతమందికి అయినా అవగాహన కల్పించి  మన విద్యార్థుల విలువైన జె జీవితాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.



No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE