NaReN

NaReN

Friday, July 29, 2022

నాన్న... ప్రేమలో❤️

 *💎నాన్న... ప్రేమలో❤️✨* 


*పదమూడవ రోజు పెద్ద కర్మ పూర్తి అయిన తర్వాత మొదటి సారి గా నాన్న రూం లోకి అడుగుపెట్టాను.. రూంలోకి వస్తూనే నాన్న రోజూ తినే దినచర్యలో భాగంగా పేపర్ చదవడానికి కూర్చొనే కుర్చీనీ కోపంతో ఒక్క తన్ను తన్నాను.. చాలా దూరంగా పడిపోయింది.*


 *డెస్క్ మీద వున్న పుస్తకాలన్నీ నా వంక చూస్తూ వుంటే చేతికందిన పుస్తకాలు ను చింపుకుంటూ దూరంగా విసిరేస్తున్నా.. కాసేపటికి అలసట రావటం తో అక్కడే నిద్రపోయాను.. కొన్ని గంటల తర్వాత మనసు స్థిమితంగా వుండటం తో చెల్లాచెదురుగా పడివున్న పుస్తకాలు ను ఒక్కొక్కటి గా సర్దుతూ వుండగా వాటిల్లో నాన్న తన దస్తూరీ తో వున్న ఓ పాతకాలపు నోట్ పుస్తకం నన్ను ఆకర్షించింది..*


 *నెమ్మదిగా తెరిచి ఒక్కో పేజీ చదువుతూ వుంటే అప్రయత్నంగా నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి.. నాన్న ను సరిగ్గా అర్థం చేసుకోలేనందుకు నా మీద నాకు అసహ్యంగా ఉంది..వున్న ఇంటిని అమ్మి ఇద్దరు అక్కలు ను పెద్ద చదువులు చదివించి  పెళ్ళిళ్ళు చేసి పంపించేసరికీ నా వరుకు ఏం మిగిల్చింది లేదు..అమ్మ నా చిన్నతనంలోనే చనిపోవడంతో* 


*నాన్న మరో పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని పెంచాడు..అక్కలు గారాబం వలనేమో నాకు చదువు అబ్బలేదు.. ఏదో డిగ్రీ పూర్తి చేసాను.. దానికి తగ్గ ఉద్యోగాన్ని పొందడానికి చాలా ప్రయత్నాలు చేశాను.. కానీ దొరకలేదు ఇంతలో నాన్న చనిపోయాడు.. అక్కలు, పిల్లలు బంధువులు అందరూ వెళ్ళిపోయారు.. నాన్న నాకు ఏం మిగిల్చింది ఏం లేదు కాబట్టి నాకు అంత కోపంగా వుంది.ఇక నాన్న ఉత్తరం సారాంశం ఏమిటంటే తన పేరన రెండు లక్షల రూపాయల పాలసీ వుంది.నామినిగా నా పేరు వుంది.. కాకపోతే వచ్చిన రెండు లక్షల రూపాయలు తన పనిచేసే పెంకులు ఫ్యాక్టరీ లో యజమాని దగ్గర అప్పు తీసుకున్నట్లు గా, ఆ అప్పును ఆయన కొడుకు గా నేను తిరిగి ఇచ్చేయాలని వుంది..* 


 *నాకంటూ మిగిల్చింది ఏం లేదు ఈ ఒక్క అవకాశం కూడా నాన్న అలా చేయడం బాధాకరమని మొదటనిపించిన ఆయన నీతి నిజాయితీ ముఖ్యం గా భావించాను..* 


 *మర్నాడు ఆయన డెత్ సర్టిఫికెట్,తదితర కాగితాలు సమర్పించిన వారం తరువాత నా పేరున చెక్ వచ్చింది.. రెండు లక్షల కీ పదివేలు తగ్గాయి.. ఇద్దరు అక్కలు కు ఫోన్ చేశా, చెరో ఐదువేలు అడుగుదామని కానీ మనసు ఎందుకనో ఒప్పుకోలేదు..కుశల సమాచారం అడిగి ఫోన్ పెట్టేసాను.. ఉద్యోగ వేటలో ఎక్కడెక్కడో తిరుగుతూ వుండగా నాన్న స్నేహితుడు ద్వారా ఓ నర్సరీలో సూపర్ వైజర్ ఉద్యోగం దొరికింది..* 


 *రెండు నెలల గడిచిన తర్వాత పదివేలు కలిపి రెండు లక్షల రూపాయలు పెంకుల ఫ్యాక్టరీ యజమానికి ఇవ్వడానికి వెళ్ళాను..* 


 *ఫ్యాక్టరీ లో కొత్త భాగస్వామి రాబోతున్నాడని అందరూ ఎదురు చూస్తున్నారు.. నేను యజమాని దగ్గర కు వెళ్లి నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి నాన్న విషయం చెప్పి బయలుదేరపోతుండగా కొత్త భాగస్వామి వస్తున్న సందర్భంగా ఓ చిన్న టీ పార్టీ వుంది పార్టీ పూర్తి అయ్యిన తరువాత వెళ్ళమని చెప్పడం తో ఆగి అక్కడ జరిగే తంతు చూస్తూ ఓ మూలన నిలబడ్డాను.యజమాని రావడం తో అందరూ నిశ్శబ్దంగా వున్నారు...*


*తన ఫ్యాక్టరీ విషయాలు చెబుతూ నాన్న ముప్పై ఏళ్ల సేవ గురించి చెబుతూ ఆ ఫ్యాక్టరీ కీ నాన్న కూడా ఓ భాగస్వామి అని చెప్పడం తో నేను ఆశ్చర్యపోయాను..* 


 *నేను తిరిగి ఇచ్చిన డబ్బులు గురించి చెబుతూ నాన్న పోతూపోతూ నాకీ పరీక్ష పెట్టాడని,ఆ కొత్త భాగస్వామి నేనేనని ఆయన చెబుతుండగా... నాన్న నాన్న ..ఒక్క సారి  నా కోసం కనపడవా..* 

 *కంటినిండా నీరుతో... హృదయం నిండా నాన్న రూపం...* 


 *నాన్న కుర్చీ తుడిచి ఓ ఆర్డర్ లో  పెట్టాను.. ప్రతి రోజూ దాని ముందున్న టీపాయ్ మీద పేపర్ పెడుతూనే వున్నా..ఏ క్షణమైనా నాన్న పేపర్ చదవడం కోసం వస్తాడని..* 

 *ఆరుబయట వెన్నెలలో పడుకుని ఆకాశంలోకి చూస్తూ  వుంటే అప్పుడప్పుడు ఓ నక్షత్రం నాతో పలకరింపు లా..* *కనపడుతుంది.. బహుశా నాన్నేమో* 



No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE