NaReN

NaReN

Thursday, July 28, 2022

జీవితం ఆనందంగా

 *🎊జీవితం ఆనందంగా

 


   *ఒకసారి ఒక కాకి🦅 నేను సంతోషంగా లేను ఎందుకంటే నా రూపం అందంగా లేదు, నా స్వరం వినసొంపుగా లేదు.*

 *అందుకే నేను ఆనందంగా లేను అనుకుంటుంది. అప్పుడే ఆ కాకి ఒక🐧 కోకిలను చూసి , ఆ కోకిల గొంతు ఎంతో మధురంగా వినసొంపుగా ఉంటుంది* *అందుకే అది అంత ఆనందంగా ఉంది అని అనుకుంటూ, ఆ కోకిల దగ్గరికి వెళ్లి* *అడుగుతుంది.*

 *కోకిల నీ స్వరం చాలా మధురంగా ఉంటుంది కదా నువ్వు అందుకే అంత ఆనందంగా ఉంటావా అని అడిగింది. అపుడు కోకిల🐧 నేను ఆనందంగా ఉండడం ఏమిటి , నేను ఆనందంగా లేను నా రూపం అందంగా ఉండదు, అందుకే నేను ఆనందంగా లేను , అక్కడ ఆ కొంగను చూడు దాని రూపం ,గొంతు రెండు అందంగా ఉంటాయి అందుకే అది ఆనందంగా ఉంది అని అంటుంది.* 

        *అప్పుడు ఆ కాకి 🦩కొంగ దగ్గరకు వెళ్లి , కొంగ నీ రూపం అందంగా ఉంటుంది కదా అందుకే నువ్వు ఆనందంగా ఉంటావా అని అడుగుతుంది. అప్పుడు కొంగ నేను ఆనందంగా లేను , నా  రూపం మొత్తం ఒకటే రంగు ఉంటుంది, కానీ ఆ 🦜చిలుకను చూడు రెండు మూడు రంగులతో ఎంత అందంగా మరియు మంచి స్వరంతో ఎంత ఆనందంగా ఉందో అని* *అంటుంది. అప్పుడు కాకి , 🦜చిలుక దగ్గరికి వెళ్లి , చిలుక నీ రూపం రెండు, మూడు రంగులతో అందంగా, నీ స్వరం* *మధురంగా ఉంటుంది కదా అందుకే నువ్వు ఆనందంగా ఉంటావా అని అడుగుతుంది. అప్పుడు చిలుక , నేను ఆనందంగా ఉండడం ఏమిటి? నాకు ఉన్నవి రెండే రెండు రంగులు , ఆ 🦚నెమలిని చూడు ఎన్ని రంగులతో ఎంత అందంగా ఉందో, దానిని చూడడం   కోసం ఎంతమంది* *ఎదురుచూస్తున్నారో, అందుకే నెమలి చాలా ఆనందంగా ఉంటుంది అని అంటుంది.*

        *అప్పుడు కాకి , నెమలి దగ్గరికి వెళ్లి , 🦚నెమలి నువ్వు చాలా అందంగా ఉంటావు కదా అందుకే నువ్వు ఆనందంగా ఉంటావా అని అడుగుతుంది. అప్పుడు నెమలి , నా జీవిత అనుభవంలో నేను ఎన్ని జూ లను చూసాను , ఏ ఒక్క జూలో కూడా కాకి బందించి కనబడలేదు, అందుకే అన్నింటికంటే ఎక్కువ ఆనందంగా కాకి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అని అంటుంది.* 

        *అప్పుడు కాకి🦅 అనుకుంటుంది , ఓహో అందమైన రూపం, స్వరం ఉండటం కాదు, స్వేచ్ఛగా జీవించగలగడంలోనే నిజమైన ఆనందం ఉంది, ఆ స్వేచ్ఛ నాకు ఉంది, నేను ఆనందంగా ఉన్నాను అని అనుకుంటుంది.* 

        *దీనిని బట్టి చూస్తే చాలామంది తమ జీవితాన్ని వేరే వాళ్ళతో పోల్చుకొని వాళ్లకు అన్ని ఉన్నాయ్ నాకు లేవు, వాళ్ళు అందంగా ఉన్నారు నేను లేను అని తమ దగ్గర ఉన్నవాటిని లెక్క చేయకుండా జీవితాన్ని బాధతో గడుపుతారు. అలా కాకుండా మన దగ్గర ఉన్న దాంట్లో ఆనందాన్ని వెతుక్కోవటం లోనే నిజమైన ఆనందం ఉంది అని గ్రహించాలి. ఇలా తెలుసుకోవడం వల్ల మన🎊 జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.* 


 

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE