NaReN

NaReN

Friday, July 22, 2022

విచిత్ర సంఘటన

 *తల్లి కొరకు కోర్టు మెట్లు ఎక్కిన అన్నదమ్ములు - కేసును చూసి షాక్ కు గురి అయిన జడ్జి*


*విచిత్ర సంఘటన*


*సౌదీ  రియాద్ హై కోర్ట్ లో ఒక కేసు బెంచ్ ముందుకొచ్చింది.  జడ్జి కేసు చదువుతుండగా కేసు వేసిన వారు అన్న దమ్ములు.  అన్న వయస్సు 80 సం. రాలు తమ్ముని వయస్సు 70 సం. రాలు.  బహుశా ఇది ఆస్తి కి సంభందించిన కేసు ఏమో! ఇంత పెద్ద వయస్సులో వీరికి ఆస్తి ఎందుకో అనుకుంటూ కేసు పూర్తిగా చదివాకా జడ్జి కి దిమ్మ దిరిగింది.  ఇంత వరకు ఇటువంటి కేసు తన ముందుకు రాలేదు.*  *వారికి ఆస్తి పాస్తులు కూడ ఎక్కువ లేవు.  కేసు పూర్వ పరాలు ఏమిటంటే తన  అన్న వద్ద తల్లి ( 110 సం. రాలు. ) గత 40 సం. రాలుగా ఉంటుంది*.  *ఆలనా పాలన బాగానే చూసుకుంటాడు.  తమ్ముని బాధ ఏమిటంటే తన తల్లి కి తన వద్ద పంప మని* *సంవత్సరాల తర బడి ప్రదేయ పడ్డ కూడ తన అన్న తల్లిని తమ్ముని వద్దకు పంపడం లేదు. జడ్జి ఇద్దరినీ పిలిచి విడి విడి గా అడిగాడు ఇద్దరు కూడ తల్లి తన వద్దనే ఉండాలని పట్టు బడ్డారు.*  *తుదకు తల్లిని స్టేచర్ లో కోర్టులో హాజరు పర్చారు.  జడ్జి తల్లిని అడిగాడు ఎవరి వద్ద ఉంటావు అని.  తల్లి తన ఇద్దరు* *కుమారులు సమానమే. ఆమె ఏమి చెప్పలేదు మీరు ఏం చెప్తే నేను అక్కడే ఉంటాను కానీ నేను ఎవరి మనసును గాయ పరిచ లేను అంది.*

*జడ్జి ఇద్దరన్నదమ్ముల ఆరోగ్య సమాచారం సేకరించి తల్లిని తమ్ముని వద్ద ఉండాలని ఆదేశించాడు. ఆ ఆదేశాలతో అన్న అక్కడే కూలి పోయాడు. ఇది ప్రేమ అంటే.*

*ఈ రోజుల్లో తల్లి తండ్రులను పోషించ లేక కొట్టి చంపడమో, లేక వృద్ధ శ్రమం లో చేర్పించడమో లేక వంతుల వారిగా పోషించడమో చూస్తున్నాము కానీ ఇటువంటి కేసు వినలేదు.  తల్లి తండ్రుల పాదాల కింద స్వర్గం ఉంటుందని ఎంత మందికి తెలుసు.  అందుకే తన పిల్లలకు చిన్నప్పటి నుండి  ఇంట్లో మరియు బడులలో వారి విలువలను గుర్తించి నట్లు బోధించాలి.*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE