NaReN

NaReN

Sunday, July 31, 2022

భార్య❤️భర్త వారి డైరీలు

 భార్య❤️భర్త వారి  📚డైరీలు 



తమ వివాహ వార్షికోత్సవ  సందర్భాన, భార్యాభర్తలు ఇద్దరూ  కలిసి  కూర్చుని  కాఫీ తాగుతూ  కబుర్లు చెప్పుకుంటున్నారు.  ప్రపంచానికి, వారొక ఆదర్శమైన జంట.  నిజానికి  వారిద్దరి మధ్య చాలా ప్రేమ ఉండేది, కానీ కాలక్రమేణా వారిద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి.


వారి సంభాషణలో.......భార్య ఒక ప్రతిపాదన చేసింది, “నేను మీతో చాలా చెప్పాలి, కానీ మనకు ఒకరి కోసమొకరికి సమయం దొరకడం లేదు. అందుకే నేను రెండు డైరీలు కొన్నాను. ఈ సంవత్సరం  మొత్తం మన మనసులో ఒకరి మీద ఒకరికి  ఉన్న వాటిని వీటిలో రాద్దాం. 

వచ్చే ఏడాది పెళ్లి రోజున, మన లోపాలను తెలుసుకోవడం కోసం ఒకరి డైరీని మరొకరు చదువుదాం, వాటిని  సరిదిద్దుకోడానికి  కలిసి  ప్రయత్నిద్దాం,”  ఆలోచన నచ్చి భర్త వెంటనే దానికి అంగీకరించాడు. 


 ఇద్దరూ తమ తమ డైరీలు  తీసుకున్నారు.


 ఒక  సంవత్సరం వేగంగా  గడిచిపోయింది.  మరుసటి  సంవత్సరం  వివాహవార్షికోత్సవం  సందర్భంగా, భార్యాభర్తలిద్దరూ  ముందుగా నిర్ణయించుకున్న విధంగా  తమ  డైరీలను  మార్చుకున్నారు.

మొదట.......భార్య  తనను  ఉద్దేశించి  వ్రాసిన  డైరీని భర్త  చదవడం  ప్రారంభించాడు.


మొదటి పేజీలో, "ఈ రోజు మన వివాహ వార్షికోత్సవం.  మీరు  నాకు  మంచి బహుమతి ఇవ్వలేదు" అని,


రెండవ పేజీలో - "మీరు నన్ను భోజనానికి రెస్టారెంట్ కి తీసుకెళ్లలేదు."

మూడవ పేజీలో - "నన్ను సినిమాకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, కానీ అలసిపోయానని చెప్పి చివరి క్షణంలో రద్దు చేసారు."


 " నా తరఫు బంధువులు వచ్చారు  కానీ మీరు వారితో సరిగ్గా మాట్లాడలేదు."


"చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు మీరు నా కొక డ్రెస్ కొన్నారు, కానీ అది చాలా పాత ఫ్యాషన్ ది !"


 ఇలా భర్త మీద ఎన్నో పనికిమాలిన ఫిర్యాదులు  ఆమె తన డైరీలో రాసుకుంది. అది చదవడం పూర్తికాగానే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.


 భర్త, “ఓ  ప్రియా, నన్ను క్షమించు!  ఇప్పటి వరకు నా తప్పుల గురించి నాకు తెలియదు.  భవిష్యత్తులో వాటిని పునరావృతం కాకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.” అని చెప్పాడు.


 ఇప్పుడు తన కోసం భర్త రాసిన డైరీని చదివడం భార్య వంతు...........


 మొదటి పేజీ - ఖాళీ

 రెండవ పేజీ - ఖాళీ

 మూడవ పేజీ - ఖాళీ

 ... ఖాళీ


 భార్య 50-60 పేజీలు తిరిగేసింది, కానీ అన్నీ ఖాళీగానే ఉన్నాయి!  


భార్య కలత చెంది, “నా ఈ చిన్న కోరిక కూడా మీరు తీర్చలేరని నాకు తెలుసు.  నా మనసులో ఉన్నదంతా వ్రాయడానికి నేను చాలా కష్టపడ్డాను, ఈ సంవత్సర కాలంలో నేను పడిన బాధ అంతా మీకు తెలియాలని నేను కోరుకున్నాను, కానీ మీరు నా కోసం ఇంత కూడా చేయలేకపోయారు!" అని వాపోయింది.


భర్త చిరునవ్వు నవ్వి, “చివరి పేజీలో అంతా రాశాను ప్రియా” అన్నాడు.


 భార్య ఆత్రంగా చివరి పేజీ తెరిచింది. 

అందులో ఇలా ఉంది - “ ఎదురుగా ఉండి ఎంత  కసురుకున్నా, ఇన్నాళ్లూ నువ్వు నాకు, నా కుటుంబానికి అందించిన అపరిమితమైన ప్రేమ ముందు, ఈ డైరీలో వ్రాయడానికి నీలోని ఏ లోపాన్ని నేను గుర్తించలేకపోయాను.  


అలాగని నీలో ఏమి లేవని కాదు. కానీ నీప్రేమ, అంకితభావం, మా కోసం నీ త్యాగం ఆ బలహీనమైన లోపాలన్నింటినీ అధిగమించేలా చేశాయి.  


నాలో లెక్కలేనన్ని క్షమించరాని  తప్పులు  ఉన్నప్పటికీ, నా  జీవితంలోని  ప్రతి దశలో నాకు నీడలా  ఉన్నావు.  ఆ నీడలో లోపాన్ని ఎలా కనుగొనగలను?!" అని వ్రాసాడు.


అది చదివిన భార్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి.  ఆమె తన భర్త చేతిలో నుండి తన డైరీని తీసుకొని, రెండు డైరీల తో పాటు తన విభేదాలు , ఫిర్యాదులను మంటల్లో కాల్చివేసింది..  మళ్లీ వారి జీవితాలు కొత్తగా పెళ్లయిన జంటలా ప్రేమతో వికసించాయి!


 వివాహం మనందరికీ ఎదగడానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి, ప్రేమించడం నేర్చుకోడానికి అవకాశం ఇస్తుంది.  మనం ప్రమాణానికి కట్టుబడి ఉంటే, మరింత ఎక్కువగా ఇవ్వడం గురించి వివాహం మనకు నేర్పుతుంది. 🙏🙏🙏🙏



🌼🌼

లగ్జరీ అంటే ఏమిటి

 *లగ్జరీ అంటే ఏమిటి?*


 USA లోని అత్యంత ఖరీదైన ఆసుపత్రి నుండి చికిత్స పొందడం కాదు.


 లగ్జరీ  అంటే *ఆరోగ్యంగా ఉండటం*


 విలాసవంతమైన విహారయాత్రకు వెళ్లడం లేదా  ప్రఖ్యాత చెఫ్ తయారు చేసిన ఆహారాన్ని తినడం కాదు.


 లగ్జరీ అంటే *మీ స్వంత పెరట్లో పెరిగిన తాజా సేంద్రీయ ఆహారాన్ని తినడం*.


 లగ్జరీ అంటే మీ ఇంట్లో లిఫ్ట్ ఉండటం కాదు.


 లగ్జరీ అంటే *3-4 అంతస్తుల  మెట్లను ఇబ్బంది లేకుండా ఎక్కే సామర్ధ్యం.*


 లగ్జరీ అంటే భారీ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేసే సామర్థ్యం కాదు.


 లగ్జరీ అంటే *తాజాగా వండిన ఆహారాన్ని రోజుకు 3 సార్లు తినే సామర్ధ్యం.*


  హోమ్ థియేటర్ సిస్టమ్  లో  హిమాలయ యాత్రను చూడటం కాదు


 *లగ్జరీ హిమాలయాల యాత్రను భౌతికంగా అనుభవించగలగటం*.


 60 వ దశకంలో ఒక కారు ఒక విలాసవంతమైనది.


 70 వ దశకంలో టెలివిజన్ ఒక విలాసవంతమైనది.


 80 లలో టెలిఫోన్ ఒక విలాసవంతమైనది.


 90 వ దశకంలో, కంప్యూటర్ ఒక విలాసవంతమైనది ...


 ఇప్పుడు లగ్జరీ అంటే ఏమిటి ??


     ఆరోగ్యంగా ఉండటం, సంతోషంగా ఉండటం,  సంతోషకరమైన వివాహంలో ఉండటం, ప్రేమించే కుటుంబం ఉండటం, ప్రేమించే స్నేహితులతో ఉండటం, కలుషితం కాని ప్రదేశంలో నివసించడం*


 ఈ విషయాలన్నీ అరుదుగా మారాయి,

ఇవే నిజమైన " *లగ్జరీ (విలాసం)*"


                  

జీవన పాఠం

 🙏జీవన పాఠం🙏 


ఒక దారుణమైన సంఘటన మీలో ఎవరికైనా గుర్తుందా?


8 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన  దాదాపుగా 46 మంది విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ కోసం హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు.. 


అక్కడ 8-06-2014 సాయంత్రం 5:30 గంటలకు బియాస్ నదీ తీరాన ఫోటోలు తీసుకుందామని వెళ్లారు.. 


అప్పుడు నదిలో నీళ్లు లేవు. కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి.


ఆ నది ప్రవహించే చోటున మధ్యలో ఒక పెద్ద బండరాయి వీళ్ళను ఆకర్షించింది. దానిపై నిలబడి, ఫోటోలు దిగుదామని వెళ్లారు.


సరిగ్గా 6 గంటల సమయంలో ఒక సైరన్ మ్రోగింది.. అదేంటో వీళ్లకు అర్థం కాలేదు.. 


వీళ్ళున్న ప్రాంతానికి ముందు ఓ dam గేట్లు ఎత్తివేసి, నదీ జలాలను విడుదల చేశారు.. ఆ నదీ ప్రవాహం వీళ్ళ వైపుగా రావడాన్ని ఒడ్డున ఉన్న కొందరు చూశారు.. వీళ్ళను alert చెయ్యడానికి కేకలు వేశారు.. కానీ, వీళ్ళు పట్టించుకోలేదు.. ఆ నీళ్ళ మధ్యన నిలబడి, ఫోటోలు దిగుతూ enjoy చేస్తున్నారు.. (వాళ్ళ చివరి ఫోటోలు అవే)


అంతలో నీటి మట్టం స్థాయి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.. ఒడ్డుకు దగ్గరలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు చిన్నగా వచ్చేశారు.. అందులో ఒక అమ్మాయి తన చెప్పులు బండ మీద మర్చిపోయాను అని చెప్పుల కోసం మళ్ళీ నది మధ్యలోకి వెళ్లి పోయింది..


ఉన్నట్లుండి, నది ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. నీటి మట్టం ఎత్తు దాదాపుగా 5 అడుగుల వరకూ చేరుకుంది..


రాళ్ళ మీద నిలుచున్న విద్యార్థులు నిస్తేజంగా నిలబడిపోయారు..


అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కళ్లెదుటే కొట్టుకునిపోయారు..


తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు..

ఇక్కడ మనం గమనించవలసింది, top college లో చదివిన వీళ్లకు, 


ప్రకృతి ఎంత శక్తివంతమైనది అని తెలియకపోవడం..

వీళ్ళలో ఎవరికీ ఈత రాకపోవడం..

"చెప్పుల" కోసం ప్రాణాలను పోగొట్టుకోవడం..


ఈ post చదువుతున్నవారిలో, 


ఎందరు పిల్లలకు ఈత వచ్చు? 


ఈత అని మాత్రమే కాదు, 


ఉన్నట్లుండి మీ ఇంట్లో electrical short circuit ఏర్పడితే, ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు?


ఎవరైనా పెద్దలకు heart attack, ఊపిరి ఆడకపోవడం, చెయ్యి తెగితే, రక్తం ధారగా కారుతున్నపుడు ఏమి చెయ్యాలి అన్నది ఎందరు పిల్లలకు తెలుసు?


 కనీసం FIRST AID ఎలా చేయాలో తెలుసా?



పిల్లలకు మనం నేర్పిస్తున్నది ఏమిటో తెలుసా?


చదువు, చదువు, చదువు, మార్కులు, ర్యాంకులు, engineering, medicine, GRE, G-MAT, IELTS, TOEFL, US, UK.. డాలర్లు..


వాళ్ళను shopping malls లో branded dresses వేసుకోమనడం, Reebok, Nike shoes కొనివ్వడం,  పిజ్జాలు, బర్గర్లు, చికెన్ టిక్కా ముక్కలు, బిర్యానీలు...ఇవి మాత్రమే కాదు..


ప్రకృతి అందాలే కాదు, ప్రకృతి కన్నెర్రజేస్తే, ఎలా ఉంటుందో చూపించాలి..


రాజ్యాంగం లోని మన హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించాలి.. 


ఎదుటి వాడు దాడి చేస్తే 

రక్షించుకోవడం నేర్పించాలి..


సమాజంలో ఉన్న అన్ని రకాల మనుషులతో సమయస్పూర్తిగా మెలగడం అలవాటు చెయ్యాలి....


అప్పుడే వాళ్ళకి మంచి , చెడు గురించి అవగాహన వస్తుంది..


అన్నింటికంటే ముందు "common sense"   ఇంగిత జ్ఞానము  అనేది లేకుండా పిల్లలను పెంచుతున్నాం... దాన్ని నేర్పకుండా.. చదువుకో, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు సంపాదించు.. అంటూ ఒక యంత్రంలా తయారు చేస్తే,


ఇదుగో.. ఫలితాలు.. ఇలాగే ఉంటాయి.....


గమనించండి....


ఆలోచించండి....


ఈ దిశగా కూడా ప్రయత్నం చేయండి..


కొంతమందికి అయినా అవగాహన కల్పించి  మన విద్యార్థుల విలువైన జె జీవితాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.



నా జీవనయానం-212/22

 నా జీవనయానం-212/22



నిన్న వనస్థలిపురంలో  నేనొక పెళ్ళి ఫంక్షన్ కి అటెండ్ అయ్యా...


దాదాపు 100 మంది అతిథులు కుర్చీల్లో ఆశీనులయ్యారు.


 నేను ముందు వరుసలో కూర్చున్నా. 

ఆకలిగా అనిపించింది...


  కాసేపయ్యాక ఒకామె ట్రేలో స్నాక్స్  🍿తెచ్చి వెనుక వరుస నుండి అతిథులకు అందించడం ప్రారంభించింది.


 ముందుకి కూర్చున్న నా వరకు వచ్చేసరికి స్నాక్స్ అయిపోయాయి. 🤨


చిరాగ్గా అనిపించింది.😕


 తిన్నగా లేచివెళ్లి వెనుక వరుసలో కూర్చున్నా.


 ఈలోగా మరొక ఆమె లిక్విడ్స్  🧋తెచ్చి ముందు వరుస నుండి పంపకం మొదలెట్టింది.


అనుమానించినట్టే ...

వెనక్కు వచ్చేలోపు అవికూడా అయిపోయాయి. 😧


కోపం పట్టలేక 😡వెళ్లిపోదాం ...

అని లేచి నిల్చున్నా. 


సరిగ్గా అదే టైమ్ కి ....


ముగ్గురు  మహిళలు ట్రే లలో ఘుమ ఘుమలాడే వంటకాలను తీసుకువచ్చారు. 


స్మార్ట్ గా ఆలోచించి 🤔ఈసారి మధ్య వరుసలో కూర్చున్నా.


ఒకామె ముందునుండి, మరొకామే వెనుక నుండి అందించడం మొదలెట్టారు. 


థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు టెన్షన్ గా అనిపించింది. 🥹


ఊహించరాని విధంగా ...

మధ్య వరుస వచ్చేసరికి సమాప్తం.🤪


అందరూ తింటుంటే ...

ఏం చేయాలో తోచక ,

అయోమయంగా తలదించి , కోపంగా నా చేతులవైపు చూసుకుంటున్నా !👀


 సరిగ్గా అదే సమయంలో 

మూడవ మహిళ నా వద్దకు వచ్చి....😍


 తన చేతిలో ఉన్న బౌల్ ని చూపించి , 🤷🏻‍♀️

తీసుకోమన్నట్టు సైగ చేసింది.


 ఆతృతగా బౌల్ లో 🍵 చెయ్యిపెట్టి బయటకు తీసా. 



అదేంటో తెలుసా???


    *టూత్ పిక్.*🥢


 పళ్ళసందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని తీసే కర్రపుల్లలు. 


ఏమిటిరా ఆ రోజు .😓


*నీతి:*👌🏼


జీవితంలో  -

మీ పొజిషన్ ని తరచుగా మార్చడానికి  😵‍💫ప్రయత్నించొద్దు.


దేవుడు -   మీరు ఎక్కడుంటే మంచిదో ....🤘🏼

అక్కడే ఉంచుతాడు.


కాదూ, కూడదు అని....


 తొందరపడితే దొరికేది *టూత్ పిక్* లే......      😳😳😞

Friday, July 29, 2022

211 - స్నేహితుల రోజు

211 - స్నేహితుల రోజు


*భాష లేనిది బంధం వున్నది..సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే.*


*మిత్రులందరికీ హృదయపూర్వక స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు.*🤝🤝


*ఒక వస్తువుని కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తారు దురదృష్టం ఏమిటంటే,ఇదే పద్ధతి స్నేహితుల మీద ఉపయోగిస్తున్నారు...


ఎవరూ రాయలేని విలువైన పుస్తకం 'స్నేహం' ...

అందరికీ అరుదుగా దొరికే అదృష్టం స్నేహం...

కాలక్షేపం కోసం చేసే కొన్ని వేల స్నేహాల కన్నా మన కోసం ఆరాటపడే మంచి హృదయమున్న స్నేహం ఒక్కటైనా చాలు.


*ప్రేమ అనేది ఒక కల..*


*పెళ్లి అనేది ఒక వల..*


*స్నేహం అనేది మాత్రం ఒక నీడ..*


*కల చెదిరిపోవచ్చు.. వల తెగిపోవచ్చు..*


*కానీ నీడ మాత్రం నిన్ను వీడిపోదు..*


*ఇదే స్నేహం యొక్క గొప్పతనం..*


*విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ*


*గడిస్తే తెలుస్తుంది కాలం విలువ*


*స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది, స్నేహితుడి విలువ.*


*స్నేహం గొప్పదనం, విలువ తెలిసిన నా స్నేహితులకు హృదయపూర్వక "  స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు*


💐💐💐💐💐💐💐💐💐💐💐


       మీ....

   పసుపులేటి నరేంద్రస్వామి

🤝🤝🤝🤝🤝🤝🤝🤝*

నాన్న... ప్రేమలో❤️

 *💎నాన్న... ప్రేమలో❤️✨* 


*పదమూడవ రోజు పెద్ద కర్మ పూర్తి అయిన తర్వాత మొదటి సారి గా నాన్న రూం లోకి అడుగుపెట్టాను.. రూంలోకి వస్తూనే నాన్న రోజూ తినే దినచర్యలో భాగంగా పేపర్ చదవడానికి కూర్చొనే కుర్చీనీ కోపంతో ఒక్క తన్ను తన్నాను.. చాలా దూరంగా పడిపోయింది.*


 *డెస్క్ మీద వున్న పుస్తకాలన్నీ నా వంక చూస్తూ వుంటే చేతికందిన పుస్తకాలు ను చింపుకుంటూ దూరంగా విసిరేస్తున్నా.. కాసేపటికి అలసట రావటం తో అక్కడే నిద్రపోయాను.. కొన్ని గంటల తర్వాత మనసు స్థిమితంగా వుండటం తో చెల్లాచెదురుగా పడివున్న పుస్తకాలు ను ఒక్కొక్కటి గా సర్దుతూ వుండగా వాటిల్లో నాన్న తన దస్తూరీ తో వున్న ఓ పాతకాలపు నోట్ పుస్తకం నన్ను ఆకర్షించింది..*


 *నెమ్మదిగా తెరిచి ఒక్కో పేజీ చదువుతూ వుంటే అప్రయత్నంగా నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి.. నాన్న ను సరిగ్గా అర్థం చేసుకోలేనందుకు నా మీద నాకు అసహ్యంగా ఉంది..వున్న ఇంటిని అమ్మి ఇద్దరు అక్కలు ను పెద్ద చదువులు చదివించి  పెళ్ళిళ్ళు చేసి పంపించేసరికీ నా వరుకు ఏం మిగిల్చింది లేదు..అమ్మ నా చిన్నతనంలోనే చనిపోవడంతో* 


*నాన్న మరో పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని పెంచాడు..అక్కలు గారాబం వలనేమో నాకు చదువు అబ్బలేదు.. ఏదో డిగ్రీ పూర్తి చేసాను.. దానికి తగ్గ ఉద్యోగాన్ని పొందడానికి చాలా ప్రయత్నాలు చేశాను.. కానీ దొరకలేదు ఇంతలో నాన్న చనిపోయాడు.. అక్కలు, పిల్లలు బంధువులు అందరూ వెళ్ళిపోయారు.. నాన్న నాకు ఏం మిగిల్చింది ఏం లేదు కాబట్టి నాకు అంత కోపంగా వుంది.ఇక నాన్న ఉత్తరం సారాంశం ఏమిటంటే తన పేరన రెండు లక్షల రూపాయల పాలసీ వుంది.నామినిగా నా పేరు వుంది.. కాకపోతే వచ్చిన రెండు లక్షల రూపాయలు తన పనిచేసే పెంకులు ఫ్యాక్టరీ లో యజమాని దగ్గర అప్పు తీసుకున్నట్లు గా, ఆ అప్పును ఆయన కొడుకు గా నేను తిరిగి ఇచ్చేయాలని వుంది..* 


 *నాకంటూ మిగిల్చింది ఏం లేదు ఈ ఒక్క అవకాశం కూడా నాన్న అలా చేయడం బాధాకరమని మొదటనిపించిన ఆయన నీతి నిజాయితీ ముఖ్యం గా భావించాను..* 


 *మర్నాడు ఆయన డెత్ సర్టిఫికెట్,తదితర కాగితాలు సమర్పించిన వారం తరువాత నా పేరున చెక్ వచ్చింది.. రెండు లక్షల కీ పదివేలు తగ్గాయి.. ఇద్దరు అక్కలు కు ఫోన్ చేశా, చెరో ఐదువేలు అడుగుదామని కానీ మనసు ఎందుకనో ఒప్పుకోలేదు..కుశల సమాచారం అడిగి ఫోన్ పెట్టేసాను.. ఉద్యోగ వేటలో ఎక్కడెక్కడో తిరుగుతూ వుండగా నాన్న స్నేహితుడు ద్వారా ఓ నర్సరీలో సూపర్ వైజర్ ఉద్యోగం దొరికింది..* 


 *రెండు నెలల గడిచిన తర్వాత పదివేలు కలిపి రెండు లక్షల రూపాయలు పెంకుల ఫ్యాక్టరీ యజమానికి ఇవ్వడానికి వెళ్ళాను..* 


 *ఫ్యాక్టరీ లో కొత్త భాగస్వామి రాబోతున్నాడని అందరూ ఎదురు చూస్తున్నారు.. నేను యజమాని దగ్గర కు వెళ్లి నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి నాన్న విషయం చెప్పి బయలుదేరపోతుండగా కొత్త భాగస్వామి వస్తున్న సందర్భంగా ఓ చిన్న టీ పార్టీ వుంది పార్టీ పూర్తి అయ్యిన తరువాత వెళ్ళమని చెప్పడం తో ఆగి అక్కడ జరిగే తంతు చూస్తూ ఓ మూలన నిలబడ్డాను.యజమాని రావడం తో అందరూ నిశ్శబ్దంగా వున్నారు...*


*తన ఫ్యాక్టరీ విషయాలు చెబుతూ నాన్న ముప్పై ఏళ్ల సేవ గురించి చెబుతూ ఆ ఫ్యాక్టరీ కీ నాన్న కూడా ఓ భాగస్వామి అని చెప్పడం తో నేను ఆశ్చర్యపోయాను..* 


 *నేను తిరిగి ఇచ్చిన డబ్బులు గురించి చెబుతూ నాన్న పోతూపోతూ నాకీ పరీక్ష పెట్టాడని,ఆ కొత్త భాగస్వామి నేనేనని ఆయన చెబుతుండగా... నాన్న నాన్న ..ఒక్క సారి  నా కోసం కనపడవా..* 

 *కంటినిండా నీరుతో... హృదయం నిండా నాన్న రూపం...* 


 *నాన్న కుర్చీ తుడిచి ఓ ఆర్డర్ లో  పెట్టాను.. ప్రతి రోజూ దాని ముందున్న టీపాయ్ మీద పేపర్ పెడుతూనే వున్నా..ఏ క్షణమైనా నాన్న పేపర్ చదవడం కోసం వస్తాడని..* 

 *ఆరుబయట వెన్నెలలో పడుకుని ఆకాశంలోకి చూస్తూ  వుంటే అప్పుడప్పుడు ఓ నక్షత్రం నాతో పలకరింపు లా..* *కనపడుతుంది.. బహుశా నాన్నేమో* 



బొజ్జ తగ్గించుకోనే చిట్కా

 *_⛑️ # బొజ్జ తగ్గించుకోనే అద్భుతమైన చిట్కా" ⛑️_*




*_బొజ్జ మధుమేహం దగ్గరనుండి గుండె జబ్బుల వరకు.. ఊపిరితిత్తుల సమస్య నుండి అధిక రక్తపోటు వరకు .. ఇలా ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది._*


*_మరి ఏం చేస్తే పొట్ట తగ్గుతుంది? ఎలాంటి వ్యాయామం చేయాలి? యోగా చేస్తే ఫలితం ఉంటుందా?_*


*_ఇలా మన ఆలోచనలన్నీ మన బరువు చుట్టూ తిరుగుతుంటాయి. మీరు మీ బరువును సులభంగా తగ్గించుకోవాలనుకుంటే న్నారా? అధిక వ్యాయామం మరియు ఆహార నియమాలు లేకుండానే సులభంగా మీ పొట్ట చుట్టూ ఏర్పడ్డ కొవ్వు నుండి మీరు బయటపడొచ్చు. మరి ఇంకెందుకాలస్యం అదేంటో చూద్దాం రండి._*


*_"సబ్జా గింజలు..."_*


*_అధిక బరువు తగ్గించడంలో, పొట్ట చుట్టూ ఏర్పడ్డ కొవ్వును కరిగించడంలో ఇది సాటిలేనిది. ఇది శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. పీచుపదార్థం ఎక్కువ ఉండటం వల్ల దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది ఐరన్, కాపర్, క్యాల్షియం మరియు పాస్పరస్ ఖనిజాలను కలిగి ఉంటుంది. డయాబెటిక్ ను అరికడుతుంది. బరువును తగ్గించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది._*


*_ఒక కప్పు సబ్జా గింజలను అరగంట పాటు నీటిలో నానబెట్టండి. తర్వాత బాగా నానిన సబ్జా గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని దానికి కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగండి. ఇలా రోజూ చేయడం వల్ల కొద్ది రోజులలోనే మీ పొట్ట చుట్టూ వుండే కొవ్వులు కలగడమేకాక బరువు కూడా తగ్గుతారు._*

Thursday, July 28, 2022

జీవితం ఆనందంగా

 *🎊జీవితం ఆనందంగా

 


   *ఒకసారి ఒక కాకి🦅 నేను సంతోషంగా లేను ఎందుకంటే నా రూపం అందంగా లేదు, నా స్వరం వినసొంపుగా లేదు.*

 *అందుకే నేను ఆనందంగా లేను అనుకుంటుంది. అప్పుడే ఆ కాకి ఒక🐧 కోకిలను చూసి , ఆ కోకిల గొంతు ఎంతో మధురంగా వినసొంపుగా ఉంటుంది* *అందుకే అది అంత ఆనందంగా ఉంది అని అనుకుంటూ, ఆ కోకిల దగ్గరికి వెళ్లి* *అడుగుతుంది.*

 *కోకిల నీ స్వరం చాలా మధురంగా ఉంటుంది కదా నువ్వు అందుకే అంత ఆనందంగా ఉంటావా అని అడిగింది. అపుడు కోకిల🐧 నేను ఆనందంగా ఉండడం ఏమిటి , నేను ఆనందంగా లేను నా రూపం అందంగా ఉండదు, అందుకే నేను ఆనందంగా లేను , అక్కడ ఆ కొంగను చూడు దాని రూపం ,గొంతు రెండు అందంగా ఉంటాయి అందుకే అది ఆనందంగా ఉంది అని అంటుంది.* 

        *అప్పుడు ఆ కాకి 🦩కొంగ దగ్గరకు వెళ్లి , కొంగ నీ రూపం అందంగా ఉంటుంది కదా అందుకే నువ్వు ఆనందంగా ఉంటావా అని అడుగుతుంది. అప్పుడు కొంగ నేను ఆనందంగా లేను , నా  రూపం మొత్తం ఒకటే రంగు ఉంటుంది, కానీ ఆ 🦜చిలుకను చూడు రెండు మూడు రంగులతో ఎంత అందంగా మరియు మంచి స్వరంతో ఎంత ఆనందంగా ఉందో అని* *అంటుంది. అప్పుడు కాకి , 🦜చిలుక దగ్గరికి వెళ్లి , చిలుక నీ రూపం రెండు, మూడు రంగులతో అందంగా, నీ స్వరం* *మధురంగా ఉంటుంది కదా అందుకే నువ్వు ఆనందంగా ఉంటావా అని అడుగుతుంది. అప్పుడు చిలుక , నేను ఆనందంగా ఉండడం ఏమిటి? నాకు ఉన్నవి రెండే రెండు రంగులు , ఆ 🦚నెమలిని చూడు ఎన్ని రంగులతో ఎంత అందంగా ఉందో, దానిని చూడడం   కోసం ఎంతమంది* *ఎదురుచూస్తున్నారో, అందుకే నెమలి చాలా ఆనందంగా ఉంటుంది అని అంటుంది.*

        *అప్పుడు కాకి , నెమలి దగ్గరికి వెళ్లి , 🦚నెమలి నువ్వు చాలా అందంగా ఉంటావు కదా అందుకే నువ్వు ఆనందంగా ఉంటావా అని అడుగుతుంది. అప్పుడు నెమలి , నా జీవిత అనుభవంలో నేను ఎన్ని జూ లను చూసాను , ఏ ఒక్క జూలో కూడా కాకి బందించి కనబడలేదు, అందుకే అన్నింటికంటే ఎక్కువ ఆనందంగా కాకి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అని అంటుంది.* 

        *అప్పుడు కాకి🦅 అనుకుంటుంది , ఓహో అందమైన రూపం, స్వరం ఉండటం కాదు, స్వేచ్ఛగా జీవించగలగడంలోనే నిజమైన ఆనందం ఉంది, ఆ స్వేచ్ఛ నాకు ఉంది, నేను ఆనందంగా ఉన్నాను అని అనుకుంటుంది.* 

        *దీనిని బట్టి చూస్తే చాలామంది తమ జీవితాన్ని వేరే వాళ్ళతో పోల్చుకొని వాళ్లకు అన్ని ఉన్నాయ్ నాకు లేవు, వాళ్ళు అందంగా ఉన్నారు నేను లేను అని తమ దగ్గర ఉన్నవాటిని లెక్క చేయకుండా జీవితాన్ని బాధతో గడుపుతారు. అలా కాకుండా మన దగ్గర ఉన్న దాంట్లో ఆనందాన్ని వెతుక్కోవటం లోనే నిజమైన ఆనందం ఉంది అని గ్రహించాలి. ఇలా తెలుసుకోవడం వల్ల మన🎊 జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.* 


 

Wednesday, July 27, 2022

మునగాకు

 ‘‘మునగాకు తెచ్చాను తీసుకోండి‘‘ అని ఒక కూరల కొట్టువాడు కొనుగోలుదారుల్ని బతిమలాడడం మాకు కనిపించింది. చాలా మంది మాకు వండుకోవడం రాదు అని అంటే, కొంతమంది మునగాకు కూడా తింటారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేయడం కనిపించింది. చాలా విచిత్రమేమంటే ఆ రోజు తరువాత కూరల కొట్టువాడు మునగాకు తేవడం మానేశాడు.



ఈ ప్రహసనం చూస్తే నాకు గోదావరి జిల్లాలలో ఉన్న ఒక పలుకుబడి గుర్తుకు వచ్చింది.


‘‘ఆషాఢ మాసం ఆషాఢభూతిగాడు పోవాలంటే మునగాకు తెలగ పిండి కలిపి తినాలి.‘‘ ఇది మా గురుపత్నిగారు ప్రతి ఏడాదీ చెప్పేవారు. ఆమె ఆషాఢ మాసంలో ప్రయత్నించేవారు కూడా. అయితే రెండూ దొరికేవి కావు. ఇందులో తెలగపిండి దొరక్కపోవడానికి కారణం ఆధునిక నూనెయంత్రాలు గానుగలను పాతేయడమే.


‘‘మా చిన్నప్పుడు మా నాన్న నువ్వుల బస్తా కొని, గానుగ ఆడించేవారు. గానుగ ఖాళీగా ఉన్నప్పుడు కబురు పంపితే నువ్వులు తీసుకొని వెళ్ళేవాళ్ళం. వెండి కడ్డీలా నువ్వుల నూనె ఉండేది. అతను గానుగ ఆడుతూ కొంచెం బెల్లం వేసేవాడు. ఉండ చుట్టి  అక్కడే కూర్చున్న మా ముందు ఉంచేవాడు. మేము  ఇంకొంచెం కావాలనే వారం. దానికి ఆయన ఇదేం చిమ్మిలి నందికేశ నోము కాదు. నూనె తగ్గితే తాతగారు నన్ను తిట్టి పోస్తారు అనేవాడు.  మా దోవన మేము కూర్చుంటే ఎందుకు రుచి చూపావ్? అని దెబ్బలాడేవాళ్ళం. దానికి అతను నవ్వుతూ మీ నువ్వులూ మీరే తినండి అంటూ మరి కొంత ఇచ్చేవాడు.‘‘


ఆ రోజులు పోయాయి. ఆ అనుభవాలు పోయాయి. అన్నిటికీ మించి ఆ ఆరోగ్యాలు కూడా గానుగనూనె తోనే నాశనం అయ్యాయి. ముఖ్యంగా తెలుక కులస్థులు గోసేవ చేస్తూ తమ కులవృత్తిగా గానుగలు ఆడేవారు. నేడు అవి పూర్తిగా నాశనం అవుతున్నాయి. వెండి కడ్డీల వంటి నూనెల స్థానంలో జంతువుల కళేబరాల నుంచీ వచ్చి చేరిన కొవ్వు నూనెలు గుండె వైద్యులకు బంజారా హిల్స్ లో మేడలు కడుతున్నాయి. 


గానుగ నుంచీ వచ్చే తెలగ పిండిలో అనేక పోషక విలువలు ఉండేవి. ముఖ్యంగా ఫైబర్ అనే పీచు పదార్థం ఉంటుంది. నూనె ఆడించేటప్పుడు వచ్చిన తెలగ పిండిని ఏడాది పొడవునా అనేక వంటల్లో వాడేవారు. నేడు మిల్లు నూనెల వలన కేవలం పిప్పి మాత్రమే తెలగ పిండిలో వస్తోంది. పిప్పి మాత్రమే కనుక దాన్ని పశువులకు వేస్తున్నారు. చెక్క దొరక్కపోవడంతో, మునగాకు కూడా ఉనికి కోల్పోయింది. మునగాకు, తెలగ పిండి గతి తప్పడంతో సర్వ రోగాలూ మనల్ని చుట్టుముడుతున్నాయి. విటమిన్ల పేరుతో రూపాయలు కుమ్మరించి ఆంగ్ల మందులు కొనుక్కుని తరిస్తున్నాము.


ఆషాఢ మాసంలో ఆకలి ఎక్కువ వేస్తుందని అరుగుదల బలంగా ఉంటుంది కనుక ఈ సమయంలో మునగాకు, నువ్వుల తెలగ చెక్క వండుకొని తినే వారు.  ఆయుర్వేదంలో నువ్వులలో ఉన్న పోషకాల విలువలు మరే వస్తువులోనూ చెప్ప లేదు. వస్తుగుణ దీపిక ఎప్పుడూ కంచి పరమాచార్య నాలుకపై ఉండేది.  అలాగే ఆకు కూరల్లో మునగాకు మహత్తరమైందని ప్రపంచాన్ని దోచుకు తింటున్న ఆంగ్ల వైద్యులు గుర్తించారు. కానీ వీటిని తింటే తమ లక్షల కోట్లాది రూపాయల విటమిన్ల మాత్రలు ఎవరు కొంటారు? కనుక ఈ ప్రచారాన్ని తొక్కి పెట్టారు. మా గురుపత్ని వంటి పూర్వ తరాలు పోవడంతో నేడు ఈ ఆరోగ్య రహస్యం తెలిసిన వారు కూడా లేకుండాపోయి మునగాకు తింటారా? ఎలా వండాలనే తరాలు బయలుదేరాయి.

 

చాలా ఆశ్చర్యం ఏమంటే మేము సంన్యాసాశ్రమంలో  భాగంగా ఉత్తరాది యాత్రలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా హిందీభాషా ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు నువ్వులతో చేసిన అనేక తినుబండారాలు షాపుల్లో, తోపుడు బళ్ళమీదా ఉన్నాయి. చిన్న పిల్లల నుంచీ ముసలి వారు వరకూ వాటిని చిరు తిళ్ళ రూపంలో తినడం మాకు కనిపించింది. దీనికి సంపూర్ణ వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో నువ్వుల తినుబండారాలు కేవలం అలంకారానికి మాత్రమే వాడుతున్నారు. నువ్వుల్లో ఇనుము ఉందని, రక్త ధాతువుకు ముఖ్యమని చాలా మంది ఆయుర్వేద వైద్యులు అనేవారు. కనుకనే బాలికలు యుక్త వయస్కలు అయ్యే తరుణంతో పని గట్టుకొని చిమ్మిలి తినిపించేవారని ఇది తినని వారు శూలలకు గురై జీవితాంతం బాధ పడతారని గతించిపోయిన బామ్మలు చెప్పేవారు. ఈ అలవాటు తప్పడంతో అసలు యుక్త వయస్సు రావడంలోనే సమస్యలు మొదలు అవుతున్నాయనే వారు లేకపోలేదు. నువ్వులు సేవించే బాలికలు 100 శాతం ఆరోగ్యంగా ఉండడం పల్లెటూళ్ళలో నేటికీ ఉంది. ప్రభుత్వం పాఠశాల బాలికలకు నువ్వులు బెల్లంతో తినుబండారాలు ఇవ్వడం ప్రారంభించడం శాస్త్ర రీత్యా, ఆరోగ్యరీత్యా మంచిదే. చేయడం కూడా తేలిక.


ఆయుర్వేదం ఉపదేశించిన నువ్వుల నూనె, తెలగ పిండి, మునగాకు సేవించే వారిని రోగాలు సోకవు. అద్భుతమైన రోగ నిరోధక శక్తి, రోగాలు చుట్టుముట్టే ఆషాఢాది వర్షా కాలాలలో కలుగుతుంది. కనుక వీటిని ఎప్పుడు సేవించాలో కూడా ఆయుర్వేదం చెప్పింది. 


అయితే కొందరు మహానుభావుల కృషి వల్ల మరలా ఆయుర్వేదం వెలుగులోకి వస్తోంది. తమ వైద్య విధానం ప్రాచుర్యం పొందడం కోసం ఆంగ్ల వైద్యం  చేసిన సాంస్కృతిక హననంలో ఆయుర్వేదాన్ని మరలా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు.   ఈ ఆయుర్వేద రహస్యాలు తెలియని వారు నేడు సామాజిక మాధ్యమాల్లో వ్యాసాలు రాస్తున్నారు. వాటిని చదువుకొని తరించేవారి వల్ల ఆంగ్ల వైద్యులు బాగుపడుతున్నారు. 


భారతీయ జీవనంలో నువ్వుల కున్న ప్రాధాన్యం ఇంతా అంతా అని చెప్పడానికి వీలు లేదు. సాక్షాత్తూ శ్రీకృష్ణభగవానుడే తిలల మాహాత్మ్యం మహాభారతంలో చెప్పి వాటిని తినండి అని చెప్పారు. ఇదే అనంతసాహితి స్తోత్రపారాయణలో చేర్చింది. మహా మంత్రంగా తిలాన్ తిలాన్ తిలాన్ అని జపం చేయండి అని చెప్పాడు. దీన్ని బట్టీ నువ్వులకు వేదాలు,  ఆయుర్వేదాలు ఇచ్చిన స్థానం గుర్తించవచ్చు. మృతులకు కూడా నివాళులు అర్పించడంలో నువ్వులు ప్రధానమైనవి. పితృ దేవతార్చనకు నువ్వులు, మధ్యాహ్న కాలం, కుమార్తెకు పుట్టిన కుమారుడు అనే దౌహిత్రుడు ముఖ్యం. 


చాలా ఆశ్చర్యం ఏమంటే నేడు మునగాకు పొడి రూపంలో ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతోంది. దీన్ని కూరల్లో వాడితే మంచి ఫలితం ఉంటుంది. మునగాకు దొరికితే, నువ్వులతో వేయించుకొని పొడి చేసుకొని వాడినా మంచి రుచిగా, అంతు లేని ఆరోగ్యం ఇస్తుంది. 

 

గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు అనువదించిన అష్టాదశ మహాపురాణాల్లో ఆయుర్వేదం గురించి ఉంది. నేడు ప్రపంచంలో నెలకొన్న కరోనా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఆయుర్వేదమే అద్భుతమైన నివారణ మార్గం. వైద్యులు పైసా పిశాచులై ప్రజల్ని పీక్కు తింటున్న తరుణంలో ఆయుర్వేద ప్రాభవాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే అనేక వ్యాసాలు ఆయుర్వేదంపై మేము వ్రాశాము. అవి బహుళ జనాదరణ పొందాయి. 


పంచమ వేదం అయిన ఆయుర్వేదాన్ని ఏ విధంగా భారత దేశంలో నాశనం చేశారో? తెలియడానికి ఇటీవల రాందేవ్ బాబా కరోనీల్ అంశంతో మరోసారికి కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా తెలిసి వచ్చింది. రోగాల్ని కూడా వ్యాపారానికి, రాజకీయాలకూ వాడుకునే పిశాచాలు మరోసారి ఆయుర్వేదంపై దాడి చేస్తున్నాయి. దీన్ని అనంత సాహితి తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కరోనిల్ నిషేధాన్ని ఆయుర్వేదంపై దాడిగా మేము భావిస్తున్నాము.


పొరలు కమ్మిన పాము తన గుడ్లు తానే తిన్న చందంగా, ఆయుర్వేదాన్ని పరిరక్షించాల్సిన భారత ప్రభుత్వ రంగ ఆయుష్ సంస్థ కాలకూట విషాన్ని ఆయుర్వేదంపై కక్కుతోంది. భారతీయ విజ్ఞానం తెలియని యువత నేడు అదే నిజం అనుకుంటోంది. ఈ సమయంలో యువతను మేల్కొలిపే దిశలో భాగంగా మహా పురాణాల్లోని ఆయుర్వేదాన్ని పరిచయం చేస్తున్నాము. 


ప్రాణం మీద తీపి ఉన్నవారు, అల్లోపతి అరాజక రాక్షసుల బారీన పడకూడ దనుకునే వారు పురాణ సాహిత్యం ఆధారంగా వస్తున్న వైజ్ఞానిక వ్యాసాలు అనుసరించమని కోరుతున్నాము. ఇది ‘‘పాత చింతకాయ పచ్చడి‘‘ అనుకునేవారిని వారి పంథాలో పొమ్మనటం తప్ప.


ఈ క్షణం మాత్రమే మనది

 ఈ క్షణం మాత్రమే మనది...

 మరుక్షణం అనేది కేవలం ఆశ , ఊహ మాత్రమే.....

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️




చిత్రంలో కనిపించే వ్యక్తి హషీమ్ రజా(hashim raza)... ( పాకిస్తాన్ దేశస్తుడు ) 

పొత్తికడుపు క్యాన్సర్ 4th స్టేజ్ లో ఉన్నాడు....

పాకిస్దాన్ సోషల్ మీడియాలో హషీమ్ రజా అంటే తెలియనివాళ్లు ఉండరు..


కేవలం రెండు,మూడు నెలల వ్యవదిలోనే హషీమ్ ఇలా అయిపోయాడు...


తన ఫ్రెండ్స్ & కమ్యునిటి అందరూ దాదాపు 7,8 కోట్లు ఫండ్స్ వసూలు చేసినా కూడా తనని కాపాడలేకపోతుంది.....

పాకిస్ధాన్ టాప్ డాక్టర్స్ & ఫారెన్ డాక్టర్స్ కూడా ఈ కేస్ డీల్ చేస్తున్నారట.....


మనిషి జీవితం నీటి బుడగ..... డబ్బు , పలుకుబడి కేవలం చావుని రోజుల వరుకు పోస్ట్ పోన్ చేయగలవేమోగాని చావును తప్పించలేవు.....


జస్ట్ మనం ఈ భూమ్మీదకి ట్రావెలర్స్ గానే వచ్చాం... ఎంజాయ్ చేసి తిరిగి వెళ్లిపోవడమే...

ఇక్కడే ఉండిపోవాలనే ఆశలు పెట్టుకుంటే చావు అంటే భయంగా బ్రతకాలి.....

.

.

.

.

#Note:

ఇవాళ చూసిన మనిషి రేపు ఉండడు...( కరోనా టైమ్ లో చూశాం ) అయినా కూడా పక్కనోడి మీద ఏడుపులు , చాడీలు , అసూయ, ఎవరినో ఏదో చేద్దాం అనుకుంటే పొరపాటే, మనిషి వెనుక చెవులు కొరుక్కోవడం మాత్రం ఆపరు.....

ఇంకెప్పుడు మారతాం మనం.....

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Monday, July 25, 2022

చుండ్రు నివారణకు సలహాలు


 చుండ్రు నివారణకు ఆయుర్వేదం లో నిపుణుల సలహాలు అవగాహనా కోసం


చుండ్రు సమస్య చాలా మందిని బాధిస్తు ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తలలో ఉన్న చర్మం పొడి బారి పోతే పొట్టు గా మారి తలపైన ఉండే వెంట్రుక కుదుర్ల లో అతుక్కొని ఉండటం వల్ల ఆ పొట్టు లో బ్యాక్టిరియ చేరి విందు చేస్కుంటాయి. తిన్న తర్వాత అవి విసర్జించే దానిలో నుండి కూడా మళ్ళీ బ్యాక్టిరియ పెరిగి పోతుంది.


2.-అంతే కాకుండా తలలో ఉండే వెంట్రుక కుదుర్లు కొంత మందిలో ఎక్కువ గా ఆయిల్ ని ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల కూడా బ్యాక్టీరియ బాగా పెరుగుతుంది.


3.-సాధ్యమైనంతవరకు రోజు తల స్నానం చేయాలి.


4.-ఈ బ్యాక్టీరియా ను తగ్గించటాని సల్ఫర్ ఉన్న మెడికేటట్ హెయిర్ వాష్ ని వాడవచ్చు. అయితే సమస్య ఏంటంటే సల్ఫర్ ఉన్న షాంపూ వల్ల జూట్టు తెల్లగా అయిపోయె అవకాశాలు ఎక్కువగా.


5.-కుంకుడు కాయ రసం తో పెద్దగా పరిష్కారం ఉండదు.


6.-కానీ ఒక మంచి చిట్కూ తో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.


*7.- మీ జుట్టు ని బాగా చిన్నదిగా చేయించి చిన్న ఉల్లిపాయను బాగా పేస్ట్ లా చేసుకొని తలకు జుట్టు కుదుర్లలో పోయే వరకు రాస్తూ తల మొత్తం బాగా పెట్టు కోవాలి.*


ఇలా చేయాలి అంటే కొంచెం గుండె గట్టిగా చేస్కోండి. ఎందుకంటే గార్లిక్ పేస్ట్ ఇలా వాడితే ఆ మంట భయంకరం గా ఉంటుంది. ఇలా నెలలో 2 సార్లు చేసి చూడండి మంచి ఫలితం కనిపిస్తుంది.


*8.-ఒక వేళ సల్ఫర్ ఉన్న షాంపో వాడాలని అనుకుంటే దాన్ని పరిమితం గానే వాడండి. ఎక్కువ సమయం వాడకండి అలానే ఫాన్సీ గా ఉండే షాంపులను కూడా ఎక్కువగా వాడకండి. సాధ్యమైనంత వరకు తలను శుభ్రంగా ఉంచండి.*


9.-రోజు తప్పించి రోజు ఓ వారం పాటు వాడండి ... చుండ్రు సమస్య పోతుంది .


*10.-తరువాత మాములు KEROGLO-AD*

 షాంపూ బదులు దీన్ని చేర్చుకోండి. స్వీయ అనుభవం ...


Saturday, July 23, 2022

అందమైన జీవితం

 🔴▬▬▬▬ஜ అందమైన జీవితం ஜ▬▬▬▬🔴







ఒక సమావేశంలో ఉపన్యాసం సందర్భంగా.. ఆ గురుాజీ ఓ 30 ఏళ్ల వ్యక్తిని ఓ ప్రశ్న వేశారు.

 

మీరు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో నడుస్తున్నారు. మీ ఎదురుగా ఒక అందమైన అమ్మాయి వస్తున్నట్లయితే, మీరు ఏమి చేస్తారు.? అని అడిగారు.


ఆ యువకుడు - ఆమెనే చూస్తాను. అని సమాధానం చెప్పాడు నిజాయితీగా.


గురూజీ అడిగారు - ఆ అమ్మాయి మిమ్మల్ని దాటుకుని వెళ్ళిపోతుంటే, మీరు వెనక్కి తిరిగి చూస్తారా.?


యువకుడు - అవును, *నా భార్య నా పక్కన లేకపోతే.!* అని చెప్పాడు మరింత నిజాయితీగా.

(సమావేశంలో అందరూ ముసి ముసిగా నవ్వారు)


గురూజీ అప్పుడు అడిగారు - *ఆ అందమైన ముఖాన్ని మీరు ఎంతకాలం గుర్తుంచుకుంటారో చెప్పండి.?*


 ఆ యువకుడు– 10 - 15 నిమిషాలు.. *మరో అందమైన ముఖం కనిపించే వరకు..* అన్నాడు.


గురూజీ ఆ యువకుడితో - 

*ఇప్పుడు ఆలోచించండి,*


మీరు గుంటూరు నుండి హైదరాబాద్ కు వెళుతున్నారు. నేను మీకు ఒక ప్యాకెట్ పుస్తకాలు ఇచ్చి, ఈ ప్యాకెట్‌ ను హైదరాబాద్ లోని ఒక వ్యక్తికి అందజేయమని చెప్పాను.


మీరు ప్యాకెట్ డెలివరీ చేయడానికి హైదరాబాద్ లోని అతని ఇంటికి వెళ్లారు.


మీరు అతని ఇంటిని చూసినప్పుడు, అతను ఓ గొప్ప ధనవంతుడు అని మీకు అర్థమైంది.

 

10 కార్లు, 5 గురు నౌకర్లు ఇంటి బయట నిలబడి ఉన్నారు. మీరు ప్యాకెట్ యొక్క సమాచారాన్ని లోపలికి పంపితే, అప్పుడు వారే స్వయంగా బయటకు వచ్చారు. మీ నుండి ప్యాకెట్ తీసుకున్నారు. మీరు బయలుదేరడానికి సిద్ధమయినప్పుడు, మిమ్మల్ని ఆయన పట్టుబట్టి ఇంటిలోనికి తీసుకువెళ్లారు. మీ దగ్గర కూర్చుని వేడి వేడిగా ఆహారాన్ని వడ్డించారు. బయలుదేరేటప్పుడు, మిమ్మల్ని అడిగారు -

మీరు దేనిలో వచ్చారు.? అని, మీరు స్థానిక రైలులో వచ్చానని చెప్పగా, అతను డ్రైవర్‌ తో, మిమ్మల్ని గమ్యస్థానానికి తీసుకెళ్లమని చెప్పారు.

మీరు మీ గమ్యం చేరుకోగానే ఆ ధనవంతుడు నుండి ఫోన్ - *సోదరా మీరు హాయిగా చేరుకున్నారా.?* అని..

 

ఇప్పుడు చెప్పండి—

*ఆ ప్రముఖుడిని మీరు ఎంతకాలం గుర్తుంచుకుంటారు.?*


 యువకుడు అన్నాడు - *గురూజీ ఆ వ్యక్తిని చనిపోయే వరకు మనం మరచిపోలేము.*


గురూజీ యువకుడి ద్వారా సభను ఉద్దేశించి మాట్లాడుతూ..

*"ఇది జీవిత వాస్తవికత."*


 *అందమైన ముఖం కొద్దిసేపు మాత్రమే గుర్తుకు వస్తుంది.*

 *కానీ.... మన అందమైన ప్రవర్తన జీవితకాలం అందరి హృదయాలలో పదిలంగా ఉంటుంది.*


💕🥰💕🙏🙏🙏💕😍💕

Friday, July 22, 2022

విచిత్ర సంఘటన

 *తల్లి కొరకు కోర్టు మెట్లు ఎక్కిన అన్నదమ్ములు - కేసును చూసి షాక్ కు గురి అయిన జడ్జి*


*విచిత్ర సంఘటన*


*సౌదీ  రియాద్ హై కోర్ట్ లో ఒక కేసు బెంచ్ ముందుకొచ్చింది.  జడ్జి కేసు చదువుతుండగా కేసు వేసిన వారు అన్న దమ్ములు.  అన్న వయస్సు 80 సం. రాలు తమ్ముని వయస్సు 70 సం. రాలు.  బహుశా ఇది ఆస్తి కి సంభందించిన కేసు ఏమో! ఇంత పెద్ద వయస్సులో వీరికి ఆస్తి ఎందుకో అనుకుంటూ కేసు పూర్తిగా చదివాకా జడ్జి కి దిమ్మ దిరిగింది.  ఇంత వరకు ఇటువంటి కేసు తన ముందుకు రాలేదు.*  *వారికి ఆస్తి పాస్తులు కూడ ఎక్కువ లేవు.  కేసు పూర్వ పరాలు ఏమిటంటే తన  అన్న వద్ద తల్లి ( 110 సం. రాలు. ) గత 40 సం. రాలుగా ఉంటుంది*.  *ఆలనా పాలన బాగానే చూసుకుంటాడు.  తమ్ముని బాధ ఏమిటంటే తన తల్లి కి తన వద్ద పంప మని* *సంవత్సరాల తర బడి ప్రదేయ పడ్డ కూడ తన అన్న తల్లిని తమ్ముని వద్దకు పంపడం లేదు. జడ్జి ఇద్దరినీ పిలిచి విడి విడి గా అడిగాడు ఇద్దరు కూడ తల్లి తన వద్దనే ఉండాలని పట్టు బడ్డారు.*  *తుదకు తల్లిని స్టేచర్ లో కోర్టులో హాజరు పర్చారు.  జడ్జి తల్లిని అడిగాడు ఎవరి వద్ద ఉంటావు అని.  తల్లి తన ఇద్దరు* *కుమారులు సమానమే. ఆమె ఏమి చెప్పలేదు మీరు ఏం చెప్తే నేను అక్కడే ఉంటాను కానీ నేను ఎవరి మనసును గాయ పరిచ లేను అంది.*

*జడ్జి ఇద్దరన్నదమ్ముల ఆరోగ్య సమాచారం సేకరించి తల్లిని తమ్ముని వద్ద ఉండాలని ఆదేశించాడు. ఆ ఆదేశాలతో అన్న అక్కడే కూలి పోయాడు. ఇది ప్రేమ అంటే.*

*ఈ రోజుల్లో తల్లి తండ్రులను పోషించ లేక కొట్టి చంపడమో, లేక వృద్ధ శ్రమం లో చేర్పించడమో లేక వంతుల వారిగా పోషించడమో చూస్తున్నాము కానీ ఇటువంటి కేసు వినలేదు.  తల్లి తండ్రుల పాదాల కింద స్వర్గం ఉంటుందని ఎంత మందికి తెలుసు.  అందుకే తన పిల్లలకు చిన్నప్పటి నుండి  ఇంట్లో మరియు బడులలో వారి విలువలను గుర్తించి నట్లు బోధించాలి.*

Thursday, July 21, 2022

ఎదురుచూపులు

 ఎదురుచూపులు




ఆకాశాన మేఘాలు 

అలసి సొమ్మసిల్లినట్లు


నేలమీద కురిసిన వాన

వరదలా ప్రవహిస్తున్నట్లు


వెలుగులు చిమ్మలా వద్దా అని

సూర్యుడు కొండలా చాటున వేచి చూస్తున్నట్లు


మెల్ల మెల్లగా ఆవరించి

అందరినీ  మేలుకొలిపినట్లు..

ఈ విశాల ప్రకృతి...


ఈ జీవన గమనంలో

మరో ఆహ్లాదకరమైన 

ఉదయానికి స్వాగతిస్తునట్లు...

నరేంద్రుడి ఎదురుచూపులు...

జీవిత ఋణం

 🔴జీవిత ఋణం🔴



*“# అప్పు “ అనగానే చప్పున గుర్తొచ్చేది అప్పారావు.*

*అప్పారావంటే మరెవరో కాదండీ…*

*సాక్షాత్తు మన ముళ్ళపూడి వెంకటరమణ గారే.*


♦️మిత్రుడు ‘బాపు ‘ దగ్గర అప్పులు చేసీ,చేసీ అప్పారావు పాత్రను సృష్టించాడు.

అన్నట్టు 💰 డబ్బులు మాత్రమే కాదండోయ్...జీవితానికి సరిపడ 'స్నేహాన్ని ‘

కూడా బాపు నుంచి అప్పుగా తీసుకున్నాడు.అందుకేనేమో?అప్పుల అప్పారావు

పాత్రను అంత సజీవంగా చిత్రీకరించాడు ముళ్ళపూడి.


♦️నవ్వడం భోగం,నవ్వక పోవడం రోగం ‘ ,అన్నారు జంథ్యాల.నవ్వడం,నవ్వించడం మరిచి నవ్వుల

పాలవుతున్న తెలుగోడికి మళ్ళీ నవ్వడం ఎలాగో నేర్పించాడు మన ముళ్ళపూడి.పిల్లల కోసం

♦️బుడుగు “ ను,పెద్దవాళ్ళ కోసం “అప్పారావును “ సృష్టించితెలుగువాళ్ళ రుణం తీర్చుకున్నాడు

.ఆకలేస్తే కేకలేశాడు “ శ్రీ శ్రీ ,

ఆకలేస్తే జోకులేశాడు

ముళ్ళపూడి.వీళ్ళిద్దరిదీ 'ఫుడ్డు ‘ ప్రాబ్లమే.’ ఆకలి ‘ ఇద్దరిలోనూ కామన్.అయితే …స్వభావాల్ని బట్టి

♦️ ఒకరిది ‘ కేక ‘ అయితే..ఇంకొకరిది ‘ జోక్ ‘ అయింది.


♦️తెలుగు సాహిత్యంలో అప్పుల ప్రస్తావన వస్తే ‘ నక్షత్రకుడు ‘ గుర్తొస్తాడు.అయితే నక్షత్రకుడికి

మన రవణ గారికి మౌలికమైన భేదం వుంది.

నక్షత్రకుడు అప్పుల వసూలుకు హరిశ్చంద్రుడి

వెంట తిరిగితే..,..మన అప్పారావు మాత్రం

అప్పులు చేయడానికి జనాన్ని వెంబడిస్తాడు.

♦️అసలీ అప్పారావు పాత్ర సృష్టి హఠాత్తుగా

జరిగింది కాదు!స్వానుభవాన్ని,సమాజాను

భవాన్నీ రోట్లో వేసి రుబ్బి మరీ సృష్టించాడు ముళ్ళపూడి.నవ్వనని భీష్మించుకున్న వాళ్ళను సైతం..

“కొంచెం నవ్వవయ్యా బాబూ,నవ్వితే నీ సొమ్మేం పోదంటూ “ చెప్పి

మరీ మరీ నవ్వించాడు. అందుకే అప్పారావు మనలో

ఒకడై పోయాడు.మనవాడయ్యాడు.


♦️అప్పారావు బలహీనతల్లా అప్పుచేయడమే.

’డబ్బుచేసినోడ్నే’ కాదు,డబ్బులేనోడ్నికూడా

అప్పుతోకొడతాడు.ఆమాటకొస్తే...ఈ సృష్టి లో అప్పుచేయని వాడెవడంటూ ఎదురు ప్రశ్నిస్తాడు.

♦️సూర్యుడి నుండి చంద్రుడు వెలుగును అప్పుగా తీసుకోవడం లేదా?

♦️ కలువపూలు వెన్నెలను అప్పుగా తీసుకోవడం లేదా?

♦️సముద్రం నుంచి నీటిని అప్పుగా తీసుకొని ఆకాశం మేఘాల్ని కూడబెట్టుకోవడంలేదా?

♦️ఆ మేఘాలనుంచి భూదేవి వర్షాన్ని అప్పుగా తీసుకోవడం లేదా?

♦️ ఎండను అప్పుగా తీసుకొని చెట్లు పత్రహరితం తయారు

చేసుకోవడం లేదా?

♦️హిమాలయాలనుంచి నీటినిఅప్పుగా తీసుకొని గంగానది ప్రవహించడం లేదా?

♦️చెట్ల నుంచి మనుషులు ఆక్సిజన్ ను అప్పుగా

తీసుకొని బతకడం లేదా?

♦️ప్రపంచంలోనిదేశాలు అప్పుకోసం ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లడం

లేదా?

♦️ఆమాటకొస్తే....అమ్మా నాన్నల అనురాగాన్ని అప్పుగా తీసుకొని

బిడ్డ పుడుతుంది...ఇలా

చెప్పుకుంటూ పోతే ఈ భూ ప్రపంచంలో అస్సలు అప్పు చేయని వారే లేరంటాడు మన అప్పారావు.


♦️“అప్పు” అంటే చాలామందికి ‘ తప్పు ‘ గా కనిపి

స్తుంది కానీ,అప్పారావుకు మాత్రం అప్పు అన్న

మాట“డప్పు “ గా వినబడుతుంది.

♦️అసలు 'పొగతాగని వాడు గాడిదై పుట్టున్ 'అంటారు

గానీ..అది చాలాతప్పంటాడు అప్పారావు.

♦️”అప్పు చేయని వాడు గాడిదై పుట్టున్ “ ,అంటూ అర్జంటుగా

సవరణ తేవాలంటాడు.అన్నన్నా ! ‘

అప్పుకున్న వెయిట్ ఇంతింత కాదయా !’ అంటూ తత్వం అందుకుంటాడు.

అసలుఈ రుణ భ్రమణం వుంది చూశారూ...


♦️అది దా…’రుణం ‘ గా సాగిపోతోందం

టాడు. “ రుణ దాశరథీ….కరుణా పయోనిథి “

అంటూ సొంత పద్య శతకాన్ని అందుకుంటాడు.


“#ఎవ్వనిచే జనించు రుణ /మెవ్వనిచే భ్రమియించు లోకమం

దెవ్వని బుద్ధి యే రుణ / మెవ్వడు నవ్వుచు నప్పులిచ్చు దా

నివ్వగా జాలనం చనక / నివ్వగ జాలక దిప్పనట్టి వా

డెవ్వడు..? ఆ రుణాత్ము రుణదేశ్వరు/ నేను రుణంబు వేడెదన్ “!!❤


అప్పులు చేసే “ట్రిక్కులు “ తెలుసుకోవాలంటే ‘#రుణానంద లహరిని ‘ చదవమంటాడు


అప్పారావు.అయితే చదివారంతా అప్పారావు

కు ఓ “ఫైవ్ “ అప్పుగా చదివించుకోవడం

మాత్రం మరవొద్దంటాడు.నిద్ర లేస్తూనే


♦️“అప్పు “ డే తెల్లారిందా? అంటూ ఆవులిస్తాడు.

మొఖం కడక్కుండానే పాసి నోటితో అప్పు

కోసం జనం వెంటబడతాడు.అప్పు ఇచ్చారా!

సరే...లేకుంటే‌ మరో మాట మాట్లాడకుండా

మౌనంగా వెళ్ళిపోయే సంస్కారి అప్పారావు.


అయితే ఇక్కడే అసలు ప్రమాదం పొంచివుందన్న సంగతి అప్పడిగించుకున్నోళ్ళకు తెలీదు.

మన అప్పారావు మౌనంగా వెళ్ళిపోయాడంటే పాపం !

వాళ్ళకా సంతోషం ఎంతో సేపునిలువదు

.అప్పారావు మౌనంలో ప్రమాద

ఘంటికలు మోగుతాయన్న సంగతి వాళ్ళకు

ఆతర్వాతగానీ తెలీదు.


అప్పారావు రూపురేఖలు….!!


♦️మన అప్పారావు కొత్త రూపాయి నోటులా

ఫెళ ఫెళ లాడుతూ వుంటాడు.కాలదోషం పట్టిన

పాత దస్తావేజు లాంటి మాసిన గుడ్డలు,బడి

పంతులు గారి చేబదుళ్ళులా చిందరవందరగా

వుండే జుత్తు, అప్పు తెచ్చిన విచ్చు రూపాయిలా మెరిసే పత్తికాయ

లాంటి కళ్ళూ,అప్పులివ్వగల వాళ్ళందరినీ చేపల్లా ఆకర్షించగల ఎ

ర లాంటి చురుకైన చూపులూ...అతను బాకీల

వాళ్ళకి కోపిష్టి వాడి జవాబులా పొట్టిగా టూకీగా వుంటాడు.

మొత్తం మీద అతని మొహం

ముప్పావులా అర్థణాలా వుంటుంది.


♦️(దా ) రుణ స్వభావాలు…!!


*అప్పారావుకు అప్పులు చేయడం ఉగ్గుపాలతో అబ్బిన విద్య.అతని పుటకలోనే వాళ్ళ నాన్న*

*♦️ ఉగ్గు ‘ పొరిగింట నుంచి అప్పు తెచ్చి పట్టించాడట.*

*ఏడేళ్ళొచ్చేసరికి వాళ్ళ నాన్న బళ్ళో వేస్తూ..‘* పలకలు ,’ యెక్కాల బుక్కులూ

సంచి పెట్టబోయేసరికి “ఎందుకయ్యా ఇంత ఖర్చు? “ అన్నాడట.

“నేను గబగబా బడి చదివేసి పెద్ద పోలీసు వాణ్ణయి పోయాకానేమో

బోల్డు రూపాయలు అప్పుసంపాయించి *అప్పు తీర్చేస్తానుగా “ అన్నాడట.*


*“పువ్వు పుట్టగానే పరిమళించింది”.అంటూ తెగ మురిసిపోయారు

*అప్పారావు జనకుడు,అతని*

*మిత్రులు.ఏతావాతా చెప్పేదేమంటే..!*


*♦️అప్పారావు మీకెదురుపడితే ముఖం తిప్పుకొని వెళ్ళొద్దు సుమా..మీకిష్టమున్నా,లేకున్నా…..*

*అప్పారావును “అప్పు”* *తోనేకొట్టండి.కష్టమైనా,*

*నష్టమైనా మీకదే మంచిది.*

♦️

“రుణ రుగ్వేదికి వాదికి / రుణ కారణ జన్ముడైన రుణ భాదికి దా..

రుణ బుద్ధికి రుణ సిద్ధికి / రుణ భ్రమా భ్రమరునకున్ రుణకిన్ ఘృణికిన్ “


*అంటూ ..ఎంత ‘జేబుకు ‘ అంత ‘ అప్పు ‘ అని సరిపెట్టుకోండి.*


*♦️తెలుగు వాళ్ళంతా పదికాలాల పాటు గుర్తుంచుకునేలా*

*“అప్పారావు” ను సృష్టించి ,*

*మన మధ్యవదిలెళ్ళారు ముళ్ళపూడి సారు వారు.*


*(నిజ జీవితంలో ముళ్ళపూడి* *వారికి,అప్పారావు పాత్రకు మధ్య*

*ఎంతో సాన్నిహిత్యం వుంది.ఇది* *యాదృచ్ఛికం కావచ్చు గానీ నిజం.* *ముళ్ళపూడి వారు అప్పులు తీర్చడానికి* *చివరకువున్న ఇంటిని*

కూడా *అమ్మేశారు.అప్పుడు ‘ బాపు ‘ గారు తన ఇంటిపైనే ఓ అంతస్తు వేయించి రవణ గారిని వుండమన్నారు.*

*ఆ రకంగా బాపు నుంచి స్నేహాన్నే కాక,ఇంటిని కూడా*

*రుణంగా పొందారు ముళ్ళపూడి వారు.*


❤❤❣️❣️❣️❤❤

Tuesday, July 19, 2022

యాచకుడి నుండి యాచనా?

 యాచకుడి నుండి యాచనా?


ఒకప్పుడు ఒక మహారాజు అడవికి పోయి అక్కడ ఒకయోగిని కలుసుకున్నాడు. ఆ యోగితో రాజు కొంతసేపు మాట్లాడాక ఆయనలోని పవిత్రత, జ్ఞానానికి ముచ్చటపడ్డాడు. అప్పుడా మహారాజు తన మీద దయ ఉంచి ఏదైనా బహుమతిని స్వీకరించవలసిందిగా ఆ యోగిని ప్రార్ధించాడు.


ఆ యోగి అందుకు నిరాకరిస్తూ, "ఈ అడవిలో లభించే ఫలాలు నాకు సరిపడా ఆహారాన్నిస్తున్నాయి. పర్వత సానువుల నుండి ప్రవహించే సెలయేరు నాకు తగినంత నీటిని సమకూరు స్తుంది. ఇక్కడి చెట్ల బెరళ్ళు నా శరీరాచ్ఛాదనకు సరిపోతున్నాయి. ఈ కొండ గుహలు నా నివాసానికి అనువుగా ఉన్నాయి. ఇంకా నేను నీ నుండి గాని, ఇతరుల నుండి గాని బహుమతులు పొందాల్సిన అవసరం ఏముంది చెప్పు?" అని అన్నాడు.అందుకు ఆ మహారాజు "స్వామీ! అలా అనకండి. నా సంతృప్తి కొరకు నాతో మా భవనానికి వచ్చి నా నుండి ఏదో ఇఒకటి తమరు స్వీకరించాలి. నా ప్రార్థనను మన్నించండి” అన్నాడు. రాజు చాలా ఒత్తిడి చేశాక ఇక తప్పదన్నట్లు అంగీకరించి ఆ యోగి రాజప్రాసాదానికి వెళ్ళాడు. రాజు ఆ యోగిని ఒక గదిలో కూర్చోబెట్టి దైవప్రార్ధన ఇలా చేయసాగాడు."భగవాన్! నాకు మంచి సంతానాన్నివ్వు. ఇంకా అధికంగా సంపద నివ్వు. నా రాజ్యాన్ని విస్తరించు. నాకు తగిన ఆరోగ్యాన్నివ్వు". అతడు ప్రార్థన ముగించేలోపే యోగి దిగ్గున లేచి మౌనంగా గది బయటకు నడవసాగాడు. ఆ చర్యకు రాజు దిగ్భ్రాంతుడై యోగిని అనుసరిస్తూ, బిగ్గరగా "స్వామీ! తమరు వెళ్ళిపోతున్నారేమిటి? నా బహుమానం తమరు స్వీకరించనే లేదు" అంటూ అడిగాడు.అప్పుడా యోగి, రాజు వంక తిరిగి, “నేను యాచకుల నుండి యాచించే వాడిని కాను. నీకు నువ్వే ఒక యాచకుడివి. ఇక, నాకు నువ్వేమి ఇవ్వగలవు? యాచించే వారి నుండి దేన్నైనా స్వీకరించేటంతటి మూర్ఖుణ్ణి కాను నేను" అన్నాడు. రాజు ముఖం జేవురించింది.

పలుకే ..బంగారమాయెరా...

 పలుకే బంగారమాయెరా….🙏

పలకరింపు మనిషి మంచి తనానికి ఆనవాలు !!!



మనుషులకు మాత్రమే వున్న వరమిది. ..


మానవీయ సంబంధాల వారధి. 


మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది.


పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. 


ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. 


పలకరింపు అనేది మనిషితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.


నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. 


ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. 


ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు. 


కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.


ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. 


ఒక బాధని తొలగించవచ్చు. 


ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. 


ఒక ఆశను చిగురింపచేయొచ్చు. 


మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !


పలకరింపుకు అంత శక్తి వుంది. 


పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు. 


తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో వున్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు. 


వారి శ్రమఫలమే వర్తమానపు మన కళ అని మరిచి పోతున్నారు. 


అట్లాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి.


ఒక మాట మాట్లాడాలి. ఒక్కసారి పలకరింపుతో వాళ్ళను కదిపి చూడండి. 


బండెడు అనుభవాలను మీ ముందుంచుతారు. 


ఆ అనుభవాలు ఇప్పటికీ మనకు దివిటీల్లా పని చేస్తాయి.


పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పని చేస్తుంది. 


పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ వుండాలి. 


దాంతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ వుంటుంది. 


ఇవి కేవలం మనుషులు సాధించేవి.


ప్రముఖ కథా రచయిత్రి ఇల్లిందల సరస్వతీ దేవిగారు *"తీయని పలకరింపు"* అని ఒక కథను రాశారు. అందులో ఒక రిటైర్డు పెద్దాయన, పలకరింపులు లేక పడుతున్న బాధను చక్కగా చిత్రించారు. ''నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోగం చేస్తున్నపుడు నన్ను చాలా మంది పలకరించేవాళ్ళు. ఉద్యోగ విరమణ చేసి, ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిలా పలకరింపుకు నోచుకోలేక వృద్ధాశ్రమం చేరాను'' అని ఆ పాత్రలో వివరిస్తుంది.


డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమై పోయి ఈ పరిస్థితులు దాపురించాయి. 


ఇది లాభాల ఆర్జన కోసం సరుకుల మీద వ్యామోహాన్ని పెంచిన సాంస్కృతిక దాడి ఫలితం. 


దీన్ని మార్చకపోతే మనమూ ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం.


లాక్‌డౌన్‌ మూలానా ఇంట్లోనే అందరూ ఉంటున్నప్పటికీ వారి మధ్య దూరాలేవీ తగ్గలేదు. మరింత పెరుగుతూనే వున్నాయి. ఎవరి చేతుల్లో వాళ్ళు సెల్‌ఫోన్‌లతో యియర్‌ ఫోన్లతో తమలో తామే, తమకు తామే గడిపేస్తున్నారు. 


కుటుంబ సంబంధాల్లో విపరీత దూరాలు పెరుగుతున్నాయి.


మనసుల్లో దాగిన భావాలు, అభిప్రాయాలు పలకరించి అడిగితేనే తెలుస్తాయి. 


అలా తెలిసినపుడే వాటిని సరిచేయడమో, చర్చించి మనం వాటిని సరిచేయడమో చేయవచ్చు. అలా కొన్ని అపోహలూ తొలిగిపోనూవచ్చు. 


కుటుంబం లోనే కాదు ఇంటి పక్కన వాళ్ళను, దూరానవున్న మిత్రులను కూడా ఖాళీ సమయం దొరకగానే ఒకసారి పలకరించండి.


పది మందితో గల సంబంధమే జీవితం.


నాకు తెలిసిన ఒక పెద్దాయన అన్ని హంగులు ఉండి కూడా, తాను, తన భార్యాబిడ్డలు, సన్నిహితులతో ఏసి లాంటి సకల సౌకర్యాలు అనుభవిస్తూ, వృద్ధురాలు తన తల్లిని మాత్రం “ఔట్ హౌస్ కొట్టుగది” లో ఉంచాడు. తనని (అతని తల్లి ని పలకరించితేనే భార్య అనుగ్రహానికి దూరమైపోతానేమో అని భావించి, దూరంగానే ఉంచాడా ప్రబుద్ధుడు.


“నాకేమీ పెట్టాల్సిన అవసరం లేదు. నేనేమీ అడగటమూ లేదు. రోజు ఏం చేస్తున్నావమ్మా, ఏం తిన్నావు, బాగున్నావా'' అని నన్ను అడిగితే చాలు అంటూ ఆ ఎనభై యేండ్ల తల్లి  వాపోతూ దు:ఖిస్తూన్నది…


అంటే పలకరింపుల విలువేమిటో అర్థం చేసుకోవచ్చు. 


చివరికి ఆమె పోయిన తరువాత అతను కార్చిన మొసలికన్నీరు’కి ఏ అవార్డు ఇవ్వొచ్చో అర్థం కాలేదు !


అందుకే.. పలకరించండి. పలుకులేమీ బంగారం కాదు. 


పలకరింపు మనిషి మంచి తనానికి ఆనవాళ్ళు !


 కుటుంబ సభ్యులందరికీ విన్నవిస్తున్నాను

Monday, July 18, 2022

జీవిత గణితం


జీవిత గణితం

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️



భారతదేశానికి చెందిన ఒక IT వ్యక్తి యుఎస్‌ వెళ్లాడు. చాలా మంది స్నేహితుల వలె, అతను ఒక మంచి రెస్టారెంట్‌ లో పిజ్జాను ఆస్వాదించాలనుకున్నాడు.


అతను 9 అంగుళాల పిజ్జాను ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటికి వెయిటర్ 5 అంగుళాల రెండు పిజ్జాలతో వచ్చి రెస్టారెంట్‌ లో 9 అంగుళాల పిజ్జా అందుబాటులో లేదని, అందుకే  5 అంగుళాలవి, రెండు పిజ్జాలు ఇస్తున్నానని చెప్పాడు. అందువలన, 1 అంగుళం పిజ్జాను అతను ఉచితంగా పొందుతున్నట్లు చెప్పాడు.


ఆ వ్యక్తి వెయిటర్‌ తో  రెస్టారెంట్ యజమానిని పంపమని మర్యాదపూర్వకంగా అభ్యర్థించాడు.


ఒక వృత్తం యొక్క వైశాల్యాన్ని లెక్కించడానికి ఒక భారతీయుడు అతనికి గణిత సూత్రాన్ని ఇచ్చాడు.


ఒక వృత్తం యొక్క వైశాల్యం = πr²

ఇక్కడ π = 3.1415926,

r అనేది వృత్తం యొక్క వ్యాసార్థం.


కాబట్టి, 9-అంగుళాల వృత్తం యొక్క వైశాల్యం = 63.62 చ.అం.

 కానీ, 5-అంగుళాల వృత్తం యొక్క వైశాల్యం 19.63 చ.అం.


రెండు 5-అంగుళాల వృత్తపు వైశాల్యాలు కలిపి 39.26 చ.అం. 


ఆ వ్యక్తి తనకు మూడు పిజ్జాలు ఇచ్చినా అది తాను ఆర్డర్ చేసిన 9 అంగుళాల పిజ్జాతో సమానం కాదని తేల్చి చెప్పాడు. అలాంటప్పుడు  1 అంగుళం పిజ్జా ఉచితంగా ఇస్తున్నానని ఎలా చెప్పగలవు అన్నాడు.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


ఆ వ్యక్తి వేసిన లెక్కలు చూసి రెస్టారెంట్ యజమాని కంగుతిన్నాడు. చివరికి రెస్టారెంట్ అతనికి 5 అంగుళాలవి, 4 పిజ్జాలు ఇవ్వాల్సి వచ్చింది.


పసుపులేటి నరేంద్రస్వామి

పిల్లల పేర్లా తమాషా నా.....

పిల్లల పేర్లా తమాషా నా.....

ట్రెండ్ ఎలావుందో చూడండి......



నాదగ్గరకి ఆతృతగా పరుగెత్తుకుంటూ వచ్చాడు నాకు తెలిసిన వాడొకడు.

 "మీరే ఎలాగైనా సాయం చేయాలి. ఎంతోమందిని అడిగాను. ఎవరూ నా బాధ అర్థంచేసుకోలేకపోయారు."


 "ఏమిటో నీ కష్టం?"


 "పిల్ల పుట్టి మూడేళ్ళైంది. రేపు స్కూల్లో పడేయాలి, ఇంతవరకూ పేరు పెట్టలేకపోయాం. నెట్‌ సెర్చ్‌ చేశాం, పుస్తకాలు వెతికాం. సరైన పేరు దొరకలేదు. ఎవరో మీ పేరు చెప్పి మీ దగ్గరకెళ్ళమన్నారు. మీరు తెలుసు కనక మీదగ్గరకొచ్చాను."


 "ఎలాంటి పేరు కావాలి?"


 "ఆ పేరు మా పిల్లకు మాత్రమే ఉండాలి. ఇంకెవరూ పెట్టుకోకూడదు."


 "సూర్యకాంతం పెట్టు. అదైతే నాకు తెలిసి ఎవరూ పెట్టుకోరు."


 "కానీ, పేరు విచిత్రంగా ఉండాలి. మా బావ, కూతుళ్ళిద్దరికీ ‘పండు వెన్నెల’, ‘నిండు పున్నమి’ అని పెట్టాడు. అట్లాంటి పేర్లు ఎవరికీ లేవని పొగరుతో విర్రవీగుతున్నాడు. వాటిని తలదన్నే పేరు పెట్టాలి."


 "మీ బావగాడి చెంప మీద కొట్టినట్టుండే పేర్లు చెప్తా రాసుకో. పట్టపగలు, చిమ్మచీకటి, మిట్ట మధ్యాహ్నం."


 "మా పిల్ల పేరు ఫైనలైజ్‌ అయ్యేవరకూ ఈ పేర్లు ఎక్కడా లీక్‌ చేయొద్దు సార్‌, ప్లీజ్‌!"


 "సర్లే, ఎవరికీ చెప్పనులే. అయినా ఎందుకోయ్‌ అంత టెన్షన్‌?"


 "పిల్లకు పేరుపెట్టే ఉద్దేశమేమైనా ఉందా... అసలేమైనా ప్రయత్నం చేస్తున్నావా? - అని రోజూ మా ఆవిడ తిడుతోంది సార్‌!"


 "నీ మాటల్లోనే రెండు పేర్లు దొరికాయి. ‘ఉద్దేశ’, ‘ప్రయత్న’ ఇంతకూ మీ ఆవిడ ఏమని తిడుతోంది నిన్ను?"


 "వేస్టుగాడివంది."


 "వేస్టు అంటే వ్యర్థం. ‘వ్యర్థ’- సూపర్‌ పేరు!"


 "ఇప్పుడు చాలామంది శాన్వి అనీ శ్రాగ్వి అనీ పెడుతున్నారు కదా... వాటికి అర్థం ఏవిటండీ?"


 "మీ ఆవిడ అందని కాదుగానీ, నిజంగానే వేస్టుగాడివోయ్‌. పేరుకు అర్థమేంటీ... పేరుకు అర్థం ఉండకపోవడమే ఇప్పటి ట్రెండ్‌. మా బాబాయి మనవరాళ్ళ పేర్లేవిటనుకున్నావు? పెద్దదాని పేరు ‘శ్మశాన’, చిన్నదాని పేరు ‘వాటిక’. ఎలా ఉన్నాయి?"


 "బ్రహ్మాండంగా ఉన్నాయి సార్‌. కాదేదీ పేరు కనర్హం అన్నమాట!"


 "మరే... ఇప్పుడు నువ్వు మాట్లాడిన దాంట్లో కూడా రెండు పేర్లున్నాయి... బ్రహ్మాండ, అనర్హ."


 "మీరు శూన్యంలో నుండి కూడా పేర్లు తీస్తున్నారు సార్‌!"


 "శూన్య - ఇదేదో బాగుందయ్యా! బుర్రలో ఆ తెలివి ఉండాలి. ఏది చూసినా పేరు తట్టాలి. మా తమ్ముడు ఓ రోజొచ్చి ‘అన్నయ్యా, పిల్లల పేర్లు పెట్టడం విషమ సమస్యైంది’ అన్నాడు. అంతే, పిల్ల పేరు ‘విషమ’, పిల్లాడి పేరు ‘సమస్య్‌’. ఎలా ఉన్నాయి?"


 "బాగున్నాయి సార్‌. మా అమ్మ శివుడి పేరు మీద శివకుమారి అని పెడతానంటోంది."


 "అలా రొటీన్‌ పేరు పెట్టావో, నువ్వూ మీ ఆవిడా కలిసి ఒకే తాడుకు ఉరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది."


 "కోప్పడకండి సార్‌!"


 "రొటీన్‌కు భిన్నంగా ఆలోచించవయ్యా. శివకుమారి కామనే గదా... ‘శవకుమారి’ అని పెట్టు. లేకపోతే 'కళేబరి' "


 "గురువుగారూ, ఇంతకూ మీ పిల్లల పేర్లు ఏవిటండీ?"


 "ఎవరికీ లేని పేర్లు పెట్టాలని అమ్మాయి పేరు ‘సామూహిక’, అబ్బాయి పేరు ‘అత్యాచార్‌’ పెట్టాను. తీరా ఇప్పుడేమో పొద్దున్న లేస్తే పేపర్‌ నిండా అవే. ఆ పేర్లు ఇంకెవరైనా పెట్టుకుంటారేమోనని కంటినిండా నిద్రపోయింది లేదు. అంతా నా ఖర్మ... అరె, ఇదేదో బాగుందే, ‘ఖర్మ’ ఎలా ఉంది?"


 "చాలా బాగుంది గురువుగారూ. కాకపోతే మా వంశానికి నాగదేవత పేరుతో కలిపి పెట్టుకోవాలి. ‘నాగఖర్మ’ అని పెట్టుకోమంటారా?"


 "మళ్ళీ ఇదొకటా?"


 "అవును సార్‌. మా కజిన్ల పేర్లు ‘నాగ బీభత్స్‌’, ‘నాగ డింభక్‌’, ‘నాగ హిడింబ్‌’. మా అన్నయ్య తన పిల్లలకు ‘సర్ప జగదేక్‌’, ‘నాగ అతిలోక్‌’ అని పెట్టాడు. 


 "మళ్ళీ ఇదొక దరిద్రమా? ఒక్క నిమిషం... దరిద్ర... నాగ దరిద్ర అని పెట్టు."


 "కానీ మా ఆవిడ మూడక్షరాల పేరే పెడదామంటోంది."


 "‘కుబుస’ అని పెట్టు, సరికొత్త పేరు. నాగదేవతకు సంబంధించినదే. అక్షరాలూ మూడే."


 "అద్భుతం సార్‌. ఇదే ఫైనల్‌.

 ‘కుబుస’ అని పెట్టేస్తా."

...

చూశారా? 

పిల్లల పేర్ల ఉత్పత్తి ప్రకరణం!...


ఆలోచించండి ఇకనైనా .....

ఒకప్పుడు  చక్కగా తాతల పేర్లు అమ్మమ్మల పేర్లు పెట్టే ఉద్దేశ్యం పూర్వీకులను గుర్తు చేసుకోవడం వారు చూపించిన ప్రేమానురాగాలు వీరిపై చూపించడం మరియు పూర్వీకుల సంప్రదాయాలను ముందు తరానికి అందించడం.



Sunday, July 17, 2022

స్త్రీ....

 *స్త్రీ..........!!*

*మగాడితోసహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు.*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


ఒక రోజూ రెండు రోజులూ కాదు. 

ఏకంగా వారంరోజులు తీసుకున్నాడు..స్త్రీ సృష్టికోసం. 

మిగిలిన పనులన్నీ మానుకుని..తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది...

"స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?". 


ఆప్పుడు దేవుడు.. "ఏం చెయ్యను మరి...

ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా...

ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ..

సృష్టి. వివక్ష తగదు. 

మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. 


చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసులవరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా...

ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా...

ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. 

అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు...

రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. 

ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే...." అన్నాడు.


"ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది. 

"ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది. 


ఆప్పుడు దేవుడు.."ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. 

కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. 

అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, 

ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు. 


ఇష్టం,  కష్టం, ప్రేమ, కోపం, తాపం, అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి. 

అవసరమైతే దిగమింగాలి. 

కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. 

తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు. 

ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను...." అన్నాడు.


"ఓహో. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది.


అప్పుడు దేవుడు.. "ఎందుకాలోచించదు? 

అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు..." అన్నాడు.


దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా....ఏంటిది? " అని అడిగింది.


అప్పుడు దేవుడు.. "అదా...కన్నీరది. 

ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. 


ఆ కన్నీటికున్న  శక్తి అనంతం....

పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు. 


దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే. .." అని చెప్పింది. 


అయితే దేవుడు.. "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా..వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. 

అప్పటివరకూ తెలియనట్టే ఉంటుంది..." 

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*అవసరమైనప్పుడు..ఆ శక్తి ముందూ.. ఎవరూ నిలబడలేరు.. అని చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని...!!*

Dream

 Dream 

👌👌worth reading 

👌👌worthy sharing 


I woke up today , having dreamt early morning at 4 AM . ⏰ 


🏢

I was in the biggest Mall of  India looking to buy a pair of socks 🧦 and a neck tie. 👔


🚶🏻‍♂️As I walked in, I noticed a sweater with a price tag of RS 25,000 .


Next to the sweater were a pair of Jeans 👖for Rs.1,00,000 .


The socks 🧦 were Rs.15,000 ! 

And Tie 👔 for astonishing 20,000 /-_


👉I went looking for a salesperson and found one in the watch Dept.


 He was showing a man a Rs. 225/- Rolex watch. 🥸


I looked in the glass case and there was a 4 carat diamond ring 💍 also on sales for Rs.95/-🧐


Shocked I asked the salesperson "How could a Rolex watch sell for Rs.225/- ? ,and a cheap pair of socks sell for Rs. 15,000/-"?🤔


He said "Someone slid into the store last night and changed the price tag on everything ".🤪


👉👉"Everyone is confused , people are acting like they have lost their sense of value". 


💰 "They are willing to pay lots of money for things of little value ,and very little money for things of great value " 💵 


🤭"Its like they don't know what is really valuable and what's not " .


😥I hope we get the price tags back-on right soon ,I really pity , seeing people paying way too much for things of little value "


🥺I woke up startled & confused and thinking since then ...


👉👉Maybe our life is like this dream.


👉👉Maybe someone slid into our lives and the changed the price on everything.


 👉👉Maybe  they *marked up* the value of  competition, position, titles,  fame , promotion,  show-off , money and power !🤔


👉👉...And put a huge discount on the value of *Happiness , Family , Relationships, Peace of mind , Contentment , Love , Knowledge , Kindness  , Friendships*...🤔🤔


 👉Maybe We are all living this dream...


🥺*I hope...... this message will be a wake up call and we wake up,*

well in-time.


Have a great life ahead 🤝

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE