NaReN

NaReN

Tuesday, October 25, 2022

కోహ్లీ గారు నేర్పిన నీతి

 కోహ్లీ గారు నేర్పిన నీతి

ఆదివారం నాడు జరిగిన మ్యాచ్ లో కోహ్లీ గారు నేర్పిన నీతి:


*టార్గెట్ 160* ఉ‌న్నప్పుడు

*31/4* పరిస్ధితిలో ఉన్నా కూడా గెలవచ్చు అనే ఆశాభావంతో ఉండాలని తెలిసింది...


టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్న టీమ్ మీద *3 ఓవర్స్ కి 48 కొట్టాల్సి* వచ్చినప్పుడు,  *130 కోట్ల ప్రజల కళ్లు* మన మీద ఉంటాయని తెలిసినప్పుడు వంద ఏనుగలు మీద పడేంత ప్రెషర్ ఉన్నా కూడా  మెదడును చురుకుగా, మనసుని శాంతంగా ఉంచుకోవడం తెలిసింది...


*కళ్లముందు టార్గెట్* కొండలా కనబడుతున్నా కూడా ఊహించని ఓ ఫుల్ టాస్ బాల్ ను సిక్స్ కొట్టి , ఆ బాల్ సిక్స్ వెళ్లకముందే అది నో బాల్ అని అప్పిల్ చేసేవిధంగా మెదడు క్విక్ రియాక్షన్ ఉండాలని తెలిసింది...


*ఫ్రీహిట్ బాల్ కి* అవుట్ ఉండదని అందరికి తెలుసు... కోట్లమంది గుండెలు అరచేతిలో పెట్టుకొని ఉన్న సమయంలో ,లక్షమంది క్రౌడ్ గోల మద్య ఫ్రీ హిట్ బాల్  బౌల్డ్ అయితే నాటౌటే కాదు రనౌట్ చేసేవరుకు ఎన్ని రన్స్ అయినా తీయచ్చు అనే విషయాన్ని అరసెకెన్ లేట్ చేయకుండా నాన్ స్ట్రైకింగ్ లో బిత్తరపోయి ఉన్న కార్తిక్ ను అలెర్ట్ చేసి మూడు రన్స్ పరిగెత్తించేంత క్రికెట్ పరిజ్ఞానం, రూల్స్ కచ్చితంగా ప్రతి ఒక్క ఆటగాడికి ఉండాలని తెలిసింది...


కార్తిక్ కి వేసినట్టే తనకి కూడా లెగ్ స్టెంప్ వేస్తాడని అలెర్ట్ గా ఉండాలని అశ్విన్ కి చెప్పిన విధానం చూస్తే చిట్టచివరి అడుగు వేసేటప్పుడు గ్రౌండ్ లో గడ్డిపరక కదిలికని అయినా క్షుణ్ణంగా అంచనా వేయాలని తెలిసింది...


ఏదేమైనా జస్ట్ 2 పాయింట్లు సాధించిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ కాదు *130 కోట్ల మనోభావాలకు* సంబంధించిన మ్యాచ్ లో ఒళ్లు, కళ్లు, మెదడు, మనసు అన్ని ఆధినంలో ఉంచుకుంటే లక్ష్యం నెరవేర్చుకోవచ్చని తెలిపాడు *కోహ్లీ...*


ఇది క్రికెట్ చరిత్రలో ఇదొక్కటే గొప్ప మ్యాచ్ కాదు...కాని చరిత్రలో నిలిచిన గొప్ప మ్యాచ్ లలో ఇది కూడా ఒకటిగా ఉంటుంది...


మొన్న జరిగిన మ్యాచ్ లాంటిదే మన జీవితాలు  కూడా... చాలా ఒత్తిళ్ళు ఉంటాయి... భరించలేని భాదలు  ఉంటాయి... మన  జీవితంలో  కూడా రన్ ఔట్లు...డక్ ఔట్లు ఉంటాయి... నువ్వు సాధించాలిసిన గోల్స్ పెద్దవిగా ఉంటాయి... 

 జీవితంలో నిరాశ నిస్పృహలకు తావివ్వకుండా ధైర్యంతో నీ పనులు నీవు చేసుకుంటూ వెళ్ళు ఫలితాలు వాటంతట అవే నీ వెంట వస్తాయి.




**

1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE