NaReN

NaReN

Monday, October 17, 2022

మన చుట్టూ అద్భుతాలు

 మన చుట్టూ అద్భుతాలు..


మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ...  

ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. 

ఇది చాలా అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం!! 

మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు.         

 *1* . *తల్లి* 

మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన...  👩‍🦱తల్లి మొదటి అద్భుతం. 


 *2* . *తండ్రి* 

మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీళ్లను దాచేస్తాడు  

మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు 

దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ..😎 సంతోషాన్ని  మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం. 


 *3* . *తోడబుట్టిన*  *వాళ్ళు* 

మన తప్పులను వెనుకెసుకురావాడానికి...  

మనతో పోట్లాడడానికి...  మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు... 

తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం 


 *4* . *స్నేహితులు*  

మన భావాలను పంచుకోడానికి..  

మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...

ఏది ఆశించకుండా..  మనకు దొరికిన స్నేహితులు  నాలుగో  అద్భుతం. 


 *5* . *భార్య* / *భర్త* 

ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా  చేస్తుంది 

కలకాలం తోడు ఉంటూ... ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే...  ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది  

భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే  ఐదో అద్భుతం మన సొంతం .


 *6* . *పిల్లలు* 

మనలో స్వార్థం మొదలవుతుంది..  

మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది...  

వారి ఆలోచనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..  

వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ  ఉంటుంది.. 

వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు  అసలు ఉండరు...  🙏

పిల్లలు ఆరో అద్భుతం 

అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?


*7* . *మీరు మరియు మీ ఉనికి.....* 

మీరే మీ జీవితానికి  దొరికిన.. ఏడో అద్భుతం 

ఇలా అద్భుతాలన్నీ  మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం... 

కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి  

చిన్న పలకరింపు  చాలు... మనల్ని ఆ అద్భుతంగా  చూడడానికి.  

అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి  మరో అద్భుతాన్ని  సృష్టించేద్దాం .......

ఇతరులతో ప్రేమను కలిగించె విధంగా మాట్లాడండి,.....

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE