NaReN

NaReN

Monday, October 24, 2022

దీపావళికి కొత్త కారు కొన్నారా

 *Diwali: దీపావళికి కొత్త కారు కొన్నారా? ఇవి మరవొద్దు..*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


పండగలకు కొత్త దుస్తులతో పాటు వస్తువో, వాహనమో కొనడాన్ని శుభసూచకంగా భావిస్తాం. దుకాణదారులు సైతం తగ్గింపు ధరలతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. ప్రస్తుత దీపావళికి ఇలా కార్లు కొనేవారు, ఇప్పటికే వినియోగిస్తున్న వారు సైతం సుఖమయ ప్రయాణానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. కొన్ని విషయాలు చిన్నవే అనిపిస్తాయి.. లేదంటే అలా చేయడమే మంచిదనిపిస్తుంది. కానీ వాటి పర్యవసానాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వివరిస్తున్నారు. కారు ఎక్కగానే విండోలు మూసేసి ఏసీ వేసుకొని బయటి కాలుష్యం నుంచి తప్పించుకుంటున్నామని సంతోషపడుతుంటాం. అదే సమయంలో కారు లోపలి కాలుష్యం గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు ది ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) సీనియర్‌ కౌన్సిలర్‌ సంపత్‌కుమార్‌. ఈ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు..


Diwali: దీపావళికి కొత్త కారు కొన్నారా? ఇవి మరవొద్దు..


వీవోసీ విడుదలతో..


ఎండలో ఎక్కువ సేపు నిలిపి ఉన్న వాహనం ఎక్కితే ఒక రకమైన వాసన రావడం చాలామందికి అనుభవమే. ఈ వాసనల కారణంగా కొందరికి వాంతులు, తలతిరగడం వంటి ఇబ్బందులూ ఎదురవుతుంటాయి. కొత్త కార్లలో ఈ సమస్యలు ఎక్కువే. ఎందుకంటే కారు లోపల ఇంటీరియర్స్‌ అధిక శాతం పాలిమర్స్‌, ప్లాస్టిక్‌ మెటీరియల్‌తో తయారవుతుంటాయి. ఎక్కువ సేపు ఎండలో వాహనం ఉంటే లోపల ఉష్ణోగ్రతలు 80 డిగ్రీల వరకు చేరుకొని, పాలిమర్స్‌ నుంచి వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ (వీవోసీ) విడుదలవుతాయి. కార్ల తయారీ తర్వాత ఎక్కువ రోజులు అద్దాలన్నీ మూసి ఉంచడం వల్ల లెడ్‌ వంటి భార లోహాల వాసనలూ బయటికి పోవు. ఇవి నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. క్యాన్సర్‌ వంటి వ్యాధులకూ దారితీయవచ్చు.


Diwali: దీపావళికి కొత్త కారు కొన్నారా? ఇవి మరవొద్దు..


ఇలా చేయాలి..


* కొత్తగా కారు కొన్నవారిలో చాలామంది.. సీట్లు ఎక్కడ పాడైపోతాయోనని, వాటిపై ఉన్న పాలిథిన్‌ కవర్లను తీయరు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ సమస్య తలెత్తకుండా పాలిథిన్‌ కవర్లను తీసేయాలి.


* ఎండలో ఎక్కువ సేపు నిలిపిన కారుకు.. మొదట అద్దాలన్నీ దించి వేడి గాలి బయటకు వెళ్లి, తాజా గాలి లోపలకు వచ్చేలా 5 నిమిషాలు ఉంచాలి. తర్వాతే కారు ఎక్కాలి. ఏసీ వేసేటప్పుడు మొదట బ్లోయర్‌ పూర్తిగా వేసి ఆ తర్వాత రీసర్క్యులేషన్‌ మోడ్‌లోకి మార్చి ఎయిర్‌ కండిషనర్‌లోకి మారాలి.


* కార్లలో ఆహార పదార్థాలు పడిపోతే.. బ్యాక్టీరియా పెరిగి అలర్జీలకు కారణమవుతుంది. ఈ సమస్య లేకుండా కారు లోపల ఫ్లోర్‌, డాష్‌ బోర్డ్‌, ఏసీ వెంట్స్‌ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE