NaReN

NaReN

Friday, September 16, 2022

అందరూ మనసు పెట్టి చదవాల్సిన కథ

 అందరూ మనసు పెట్టి చదవాల్సిన కథ


ఒకవూరిలో పాడుబడ్డ దేవాలయం గోపురాన్ని నివాసంగా చేసుకొని కొన్ని పావురాలు  

ప్రశాంతంగా జీవిస్తుండేవి..ఒకరోజు ఊరివారందరూ కలిసి ఆ గుడిని బాగుపరిచి ఉత్సవం చెయ్యాలని గుడికి మరమ్మత్తు పనులు మొదులుపెట్టారు.


వెంటనే పావురాలన్నీ గుడి గోపురాన్ని వదిలి కాస్తాదూరంగా వున్నచర్చి మీదికి చేరు కున్నాయి..ఆ చర్చి మీద  

ఎప్పట్నుంచో  నివసించే పావురాలు ఈ పావురలన్నింటికీ స్వాగతంపలికాయి.

తమతో పాటే వుండమన్నాయి.పావురాలన్నీ చక్కగా సర్దుకున్నాయి.కొన్నాళ్ళకు చర్చి గంటలు మ్రోగడం ఎక్కువైంది.క్రిస్మస్ దగ్గర పడిందని జనం తాకిడి ఎక్కువైంది.చర్చికి అలంకరణ చెయ్యాలని అనుకున్నారు. చర్చి అధికారులు.


పావురాలన్నీ మరో దిక్కున వున్న మసీదు పైకి  ఎగిరిపోయాయి.మసీదు మీద వున్న పావురాలు వీటిని సాదరంగా ఆహ్వానించాయి.వచ్చినందుకు సంతోషపడ్డాయి.వివరం తెలుసుకొని మసీదు మీద అందరికీ చోటు సరిపోతుందని చెప్పి వూరడించాయి.ఏ దిగులూ లేకుండా హాయిగా అన్నీ కలిసిమెలిసి  జీవించసాగాయి. 


ఇంతలో  రంజాన్ మాసం వచ్చింది.మసీదుకు రంగులు వెయ్యాలని అనుకున్నారు.పావురాలన్నీ కలిసి ఏమిచెయ్యాలో మాట్లాడుకొని మళ్ళీ పాత గుడి మీదికి చేరుకున్నాయి.అన్నీ చక్కగా సర్దుకున్నాయి.


ఒక రోజు ఆవూరి మార్కెట్ మధ్యలో మతకలహాల విధ్వంసం మొదలైంది.పిల్లలూ,ఆడవాళ్ళూ,ముసలివాళ్ళూ కేకలూ కత్తుల కంటిన నెత్తురు ఎవరిదో  

తెలియడంలేదు.  గోపురం మీది నుంచి చూస్తున్న చిట్టిపావురం అమ్మా ఎవరే వాళ్ళు?అని తల్లి పావురాన్ని అడిగింది.


వాళ్ళను మనుషు లంటారు.తల్లి పావురం చెప్పింది.ఎందుకు కొట్లాడుకుంటున్నారు?అని అడిగింది చిట్టి పావురం..అప్పుడు తల్లి పావురం యిలా అంది.ఈ గుడికి వచ్చేవాళ్ళను హిందువులు అంటారు,చర్చికి వచ్చే వారిని క్రైస్తవులు అంటారు,ఆ మసీదు కు వెళ్ళే వాళ్ళని ముస్లిములు అంటారు.అని యింకా 

వివరించ బోతుంటే గుడి మీదవున్నా, చర్చి మీద వున్నా,మసీదు మీదవున్నా మనల్ని  

పావురాలనే అంటారుకదా మరి వాళ్ళనెందుకు రకరకాలుగా పిలవడం?అందరినీ మనుషులు అని అనరెందుకు?


చిట్టిపావురం అమాయకంగా అడిగింది.తల్లి పావురం నవ్వి దైవం అనే భావన మనలో వుంది కాబట్టి మనం వాళ్ళకంటే ఎత్తులో ప్రశాంతంగా వున్నాం.


ఈ మనుషులకి అంత జ్ఞానం లేదు అందుకే దిగువన వున్నారు.అలా కొట్టుకుంటూ దైవానికి దూరమవుతూనే వుంటారు.అని చెప్పింది.చిట్టి పావురం కువ కువ మంటూ మార్కెట్ వైపు యెగిరి పోయింది.పాపం అదేమీ చెయ్యలేదని దానికి యింకా తెలీదు.



No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE