*(గురువులకు పంగనామాలు*
*పెట్టాలనుకుంటే అంతేమరి!)*
🤔
ఒకసారి ముంబైలోని I.I.T.కి చెందిన నలుగురు విద్యార్థులు అర్థరాత్రి వరకు పేకాట ఆడి మరుసటి రోజు జరగాల్సిన పరీక్ష కోసం చదవలేదు. ఉదయానికి వారు ఒక ఉపాయం ఆలోచించారు! వారు తమ దుస్తులకు దుమ్ము గ్రీజుతో తమను తాము మురికిగా చేసుకున్నారు! అనంతరం డీన్ వద్దకు వెళ్లి తాము నిన్న రాత్రి పెళ్లికి వెళ్లామని, తిరిగి వచ్చేప్పుడు కారు టైరు పగిలి చిన్న ప్రమాదం జరిగి కారును వెనక్కి నెట్టాల్సి వచ్చిందని, అక్కడే తెల్లారిపోవటంతో.. తాము మురికిగా ఉన్నామని చెప్పారు. మూడు రోజుల తర్వాత మీకోసం ప్రత్యేకంగా మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని డీన్ చెప్పారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపి, ఆ సమయానికి తాము సిద్ధంగా ఉంటామని చెప్పారు. మూడవ రోజు వారు డీన్ ముందు హాజరయ్యారు. ఇది _*స్పెషల్ కండిషన్ టెస్ట్*_ కాబట్టి, పరీక్ష కోసం నలుగురూ ప్రత్యేక తరగతి గదుల్లో కూర్చోవాలని డీన్ చెప్పారు. గత 3 రోజులుగా బాగా ప్రిపేర్ కావడంతో అందరూ అంగీకరించారు. పరీక్షలో మొత్తం 100 మార్కులతో రెండు ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి ప్రశ్నలు ఇలా 👇ఉన్నాయి:
Q.1. *ఏ టైరు పగిలింది?*
(50 మార్కులు)
ఎ) ముందు ఎడమవైపు
బి) ముందు కుడివైపు
సి) వెనుక ఎడమవైపు
డి) వెనుక కుడివైపు
Q.2. *కారులో ఎవరు ఎక్కడ కూర్చున్నారు?*
(50 మార్కులు)
ఎ) ముందు ఎడమ: _________
బి) ముందు కుడి: _________
సి) వెనుక ఎడమ : _________
డి) వెనుక కుడి: _________
*గమనిక:* మొత్తం నలుగురూ రెండు ప్రశ్నలకు ఒకే సమాధానంతో సరిగ్గా సమాధానం ఇచ్చినట్లయితే మాత్రమే మార్కులు ఇవ్వబడతాయి!!!
*ఇది I.I.T బొంబాయి 1992 బ్యాచ్ నుండి నిజంగా జరిగిన కథ!*
_*మీ ఉపాధ్యాయులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! ప్రతి యేటా ఇలాంటి కొన్ని వందల మంది తింగర తెలివితేటలున్న విద్యార్ధుల్ని తీర్చిదిద్దుతుంటారని తెలుసుకోండి!*_
😣😀😁😆😜🤣
*(తెలుగు అనువాదం)*
No comments:
Post a Comment