NaReN

NaReN

Sunday, September 11, 2022

మనపై ఉన్న ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు..

*🌅మనపై ఉన్న ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు..*



🌱 1.  రోజూ.. ఒక సమయం లో నీకోసం నీవు... కనీసం 60 నిముషాలు కేటాయించుకో !


🌱2. నీవు ప్రతిస్పందించే తీరును గమనించుకో.  బాధలు, అవమానాలు,ఉద్రేకాల నుండి ఎలా బయట పడాలో... జ్ఞానాన్ని ఆశ్రయించి ఎలా శాంతిలోకి నడవాలో... సాధన చెయ్యి !


🌱3. ప్రతి రోజూ... ధ్యానం చేయడం... నీలో ఒత్తిడిని కలిగించే హార్మోన్ల ను తగ్గించగలదని గుర్తుంచుకో !


 🌱4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో !


🌱 5. *కక్ష* కన్నా *క్షమ* గొప్పది 

క్షమ కన్నా *కరుణ* గొప్పదని  అని తెలుసుకొని, తోటి వారి పట్ల పాటించడం అలవాటు చేసుకో !


🌱 6. ఒక విషయం గురించి నేను ఎంత వరకు ఆలోచించటం అవసరం అని... నిర్ణయించుకుని అంత వరకే ఆలోచించు !


 🌱7. నవ్వుతో పరిస్థితులను ఎదుర్కో ,  ఇతరులతో నీ భావాలు పంచుకో!


🌱 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని...దాని గురించిన జ్ఞాన సాధన చెయ్యి.  


🌱9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుటి వారి గురించి తక్కువ అంచనా వేయడం మానుకో !


🌱 10. పాజిటివ్ గా ఆలోచించటం నేర్చుకో. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం అవుతుంది  !


🌱11. *అసూయ కూ, దురలవాట్ల కూ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో*   *యోగా,ధ్యానం* చేయడం నేర్చుకో!


🌱12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కొంత.. మంచి పనులకు ఖర్చు చెయ్యడం నేర్చుకో!


🌱13. నాకు రాదు, నాకు చేత కాదు.. అనే మాటలను చెప్పడం మానుకో !


 🌱14. బయటి ప్రదేశాలకు వెళ్ళటం, మిత్రులతో  బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం,  సత్సంగం  వలన...నీకు రిలాక్సేషన్ కలుగుతుంది అని తెలుసుకో ! 


🌱 15. *టి వి కన్నా, సెల్ ఫోన్ కన్నా.. నీకు ఇష్టమైన సంగీతం..నీలోని ఒత్తిడి ని తగ్గిస్తుంది అని గ్రహించు* !


🌱16. నీలోని మానసిక ఒత్తిడి.. నీ బలాన్ని చంపగలదు అని తెలుసుకో !


🌱17. సత్ సంబంధాలను కాపాడుకో...ఎక్కువ విను , తక్కువ మాట్లాడు..ఎక్కువ నేర్చుకో !


🌱18. ప్రతీదీ పరిశీలించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో  !


🌱 19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం  చూడడం నేర్చుకో  !


🌱 20. విషయాలను నీ కోణం నుండి కాకుండా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !


🌱21. విషయం పూర్తిగా తెలుసుకొని.. అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!


🌱22. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ , మంచిగా కానీ..పూర్తి కావు అని గుర్తుంచుకో !


🌱23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అని..  ఒక ప్రణాళిక వేసుకో !


🌱24. ప్రతీ రోజూ... భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని సంతోషించు. ఈ అద్భుత ప్రపంచం లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !


🌱 25. *ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి వుండు*.

 *నీకు జ్ఞానాన్ని ఇచ్చే గురువుల పట్ల కృతజ్ఞత కలిగి వుండు* .

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE