NaReN

NaReN

Monday, September 12, 2022

నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా ?

*నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా?*

                 ➖➖➖✍️


*మనలో చాలా మంది నేను… దురదృష్టవంతుడిని, నా తలరాత ఇంతే, నా బ్రతుకింతే ఇలా తమని తామే నిందించుకుంటూ, తక్కువ చేసుకుంటూ, మనసులోనే కుమిలి కుమిలి పోతూ ఉంటారు.* 


*కానీ మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే మనకున్న సగం అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి.* 


*ఎందుకంటే "మన మనసులోని బాధలే మన అనారోగ్యానికి మూల కారణం". మరి ఆ బాధలేమిటో పరిశీలిద్దాం..*


_*(1) ఈ రోజు పొద్దున్నే నువ్వు "ఏ నొప్పులు, బాధలు లేకుండా, నిన్నెవ్వరూ లేపకుండా, నీకు నీవే ఆరోగ్యంగా నిద్రలేచావంటే"..  దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు గొప్ప అదృష్టవంతుడి వన్నమాట.*_


_*(2) నువ్వింత వరకు యుద్దంలో రక్తపాతం కాని, జైల్లో ఒంటరితనాన్ని గాని, కఱువు సమయంలో శరణార్థ శిబిరాన్ని కాని చూడలేదంటే... ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే నీవే గొప్ప అదృష్ట వంతుడివన్నమాట.*_


_*(3) నువ్వీరోజు ఏ భయమూ లేకుండా, ఏ ఆయుధమూ లేకుండా, నీ చుట్టూ పది మంది అనుచరులు లేకుండానే నీవు హాయిగా బయట తిరగ్గలిగావంటే 300 కోట్ల మంది నివసించే దేశాలలో నువ్వు లేవన్నమాట.*_


_*(4) ఈ రోజు నువ్వు కడుపునిండా తిని, ఒంటి నిండా బట్టలు కప్పుకొని,                    ఓ ఇంటి కప్పుకింద కంటినిండా నిద్ర పోగలిగితే...ఈ భూప్రపంచంలోని 50 శాతం మంది కన్నా నీవు అతిపెద్ద ధనవంతుడివి అన్నమాట.*_


_*(5) నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, నీ బ్యాంక్ ఖాతాలో భవిష్యత్తు అవసరాలకు సరిపడా నగదు నిల్వ ఉన్నట్లయితే,ప్రపంచంలో  8 శాతంగా ఉన్న ఆత్యంత ధనవంతుల్లో నీవొకడివన్నమాట.*_


_*(6) నీ తల్లిదండ్రులు బ్రతికి ఉండి, వారింకా విడాకులు తీసుకోకుండా, వారు నీతోనే కలిసి మెలిసి ప్రేమగా, తృప్తిగా జీవిస్తున్నారంటే.. ఈ ప్రపంచపు 15 శాతం మంది "అనాధ కుటుంబాలలో "నువ్వు ఒకడివి కాదన్నమాట.*_


*"జీవితంలో అనాధలు అంటే తల్లిదండ్రులు లేనివారు కాదు, ఉన్న తల్లిదండ్రులను సంతృప్తిగా చూసుకోలేనివాడు అసలైన అనాధలు".* 


_*అయితే కొందరు సాకులు చెబుతూ ఉంటారు, తల్లిదండ్రులు అలాంటి వారు, ఇలాంటి వారు అని. కానీ "నువ్వూ అలాంటి వాడివే " కాకూడదు కదా !*_


_*(7) నువ్వు నీ భార్యపిల్లలు, స్నేహితులు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాయిగా తలెత్తుకొని గర్వంగా సమాజంలో తిరగగలుగుతూ, ఆహ్లాదంగా నవ్వగలిగితే, నీ ప్రవర్తన ద్వారా అందరినీ మెప్పిస్తున్నావంటే, ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట. అదే అసలైన హీరోయిజం.*_


_*(8) నీవు ఈ మాటలు చదువగలుగుతున్నావూ అంటే ప్రపంచంలో.. 50 కోట్ల నిరక్ష్యరాస్యులకంటే నువ్వు అదృష్టవంతుడివన్నమాట.*_


_*(9) నువ్వింకా నాకు అదిలేదు, ఇదిలేదు, ఇంకా ఏదో కావాలని అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న ఆస్తులని, నీ విలువలని, నీ శక్తులని,                      నీ అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట.*_


        _**ఇప్పటికైనా తెలిసిందా ఈ ప్రపంచంలో మీరెంత అదృష్టవంతులో, నాకు తెలిసి మన జీవితంలో "తృప్తికి మించిన సంపద" మరొకటి లేనేలేదు.*_


        _**ఇప్పటికైనా ..మీకు ఏమైనా బాధలు, కష్టాలూ ఉంటే వాటిని తగ్గించుకుంటూ.. ఉన్నంతలో మీరు.. మీతోటి వారిని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను...*_


       _**అందరం అర్థం చేసుకుంటే మరింత కాలం సంతోషంగా బ్రతుకుతాం !!!*_


       _**మనతోపాటు అందరినీ ఆనందంగా బ్రతకనిద్దాం......*_✍️

     

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE