NaReN

NaReN

Friday, September 2, 2022

చాణుక్యుడు చెప్పిన విషయాలు

 చాణుక్యుడు చెప్పిన విషయాలు



*చాణుక్యుడు చెప్పిన విషయాల్లో ఒకటి ఎంత గొప్ప స్నేహితుడైనా సరే కొన్ని విషయాలను పంచుకోకుండా గోప్యంగా ఉంచుకోవాలని.. లేదంటే ఇబ్బందు ఎప్పటికైనా తప్పవని చెప్పాడు.  కొన్ని కొన్ని సార్లు మీకు సంబంధించిన విషయాలు ఎవరితోనైనా పంచుకుంటే మనసు చాలా తేలికగా ఉంటుంది. అయితే కొన్ని విషయాలు మీలో దాచుకుంటే మీకు మంచిది అని  ఆచార్య చాణక్యుడు చెప్పాడు.*


*🌿మీరు ఎప్పుడైనా ఆర్థికంగా నష్టపోతే.. మీ ఇంటి ఆర్థిక పరిస్థితిని ఎప్పుడూ ఎవరితోనూ పంచుకోకండి. మీరు నిజమైన స్నేహితుడు అని భావించేవారికి కూడా ఈ విషయాన్నీ తెలపకండి. కొన్ని విషయాలను గోప్యంగా ఉంచుకుంటూనే  మీకు  గౌరవం ఉంటుంది. బయటి వ్యక్తులు మీ పరిస్థితి గురించి చెప్పినా మీకు సహాయం చేయడానికి ఎవరూ సిద్ధంగా ఉండకపోవచ్చు.*


*🌿చాలా మంది తమ బాధలను ఎవరెవరికో చెప్పుకుని ఓదార్పు పొందాలనుకుంటారు. అయితే తమ బాధలను ఎవరికీ చెప్పకూడదని ఆచార్య చాణుక్యుడు చెప్పారు. మీ బంధువుగా భావించి నీ దుస్థితిని ఎవరికి చెబుతున్నావో.. రేపు మీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంది.*


*🌿మీ భార్య గుణం, మంచి చెడుల గురించి ఎప్పుడు ఎవరి దగ్గర ప్రస్తావించవద్దు. ఇంటి దుస్థితి, ఇంటిలో గొడవలు,  మొదలైన వాటి గురించి ఎవరికీ చెప్పకూడదు. దీని వల్ల భవిష్యత్తులో అటువంటి వారి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.*


*🌿మీరు ఎక్కడైనా అవమానాన్నీ ఎదుర్కొంటే.. ఆ విషయాన్ని మీలో ఉంచుకోండి. ఆ అవమానాన్ని ఎవరితోనూ  చర్చించవద్దు. ఆ విషయం బయటికి వెళితే..  మీ గౌరవంపై తప్పక ప్రభావం చూపిస్తుంది.*


          

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE