NaReN

NaReN

Thursday, September 29, 2022

ప్రామిస‌రీ నోట్ రాసేటప్పుడు ఈ 10 విషయాలు తప్పక గుర్తుపెట్టుకోవాలి…లేదంటే అప్పు ఎగ్గొట్టినా ఏం చేయ‌లేరు.!*

 

*ప్రామిస‌రీ నోట్ రాసేటప్పుడు ఈ 10 విషయాలు తప్పక గుర్తుపెట్టుకోవాలి…లేదంటే అప్పు ఎగ్గొట్టినా ఏం చేయ‌లేరు.!*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️



మనిషి మాట తర్వాత అంతగా విలువ ఇచ్చేది ప్రామిసరీ నోటు కే. ఒకసారి మనిషి ఇచ్చే మాట కంటే కూడా ఎక్కువ విలువ దానికే ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద ఒప్పందాలు ఏమైనా చేసుకునేది ఉంటే ప్రామిసరీ నోటు తప్పనిసరిగా వాడతారు. ఆ నోటు ఉంటే ఇంక తమకు చెందిన దాన్ని వేరే వాళ్ళు చచ్చినా తీసుకోలేరు అనుకుంటారు. కానీ ఆ ప్రామిసరీ నోట్ రాయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు చెప్పబోయే రూల్స్ పాటిస్తేనే ఆ ప్రామిసరీ నోట్ చెల్లుతుంది.

*గుర్తుంచు కోవలసిన వివరాలు:*

అప్పు ఇచ్చే వాళ్ళు అప్పు తీసుకునే వాళ్ళు ఇద్దరికీ కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. లేకపోతే ఆ ప్రామిసరీ నోటు చెల్లదు.ప్రామిసరీ నోటు తయారు చేసేటప్పుడు ఇచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళు కచ్చితంగా అక్కడ ఉండాలి.ప్రామిసరీ నోట్ చెల్లే వ్యవధి మూడు సంవత్సరాలు.నోట్ మీద రెవెన్యూ స్టాంప్ అంటించి దానిపై అడ్డంగా సంతకం చేయాలి.ఆ రెవెన్యూ స్టాంప్ ధర మినిమం ఒక రూపాయి ఉండాలి.ప్రామిసరీ నోట్ పై కోటి రూపాయల వరకు అప్పుగా ఇవ్వచ్చు.అలా ఎక్కువ మొత్తంలో డబ్బు లావాదేవీలు ఉంటే న్యాయవాదిని కచ్చితంగా తీసుకెళ్లాలి.నేను ఫలానా వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాను. తిరిగి ఆ వ్యక్తి కి గాని లేదా తను సూచించిన మరో వ్యక్తి కి గాని అప్పు గా తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేస్తాను. అనే పాయింట్ లేకపోతే ఆ ప్రామిసరీ నోట్ తయారు చేయించినా కూడా ఉపయోగం ఉండదు.మతిస్థిమితం లేని వ్యక్తులు ప్రామిసరీ నోటు రాస్తే ఆ నోట్లు చెల్లదు.ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బును ఇవ్వకపోతే ఆ ప్రామిసరీ నోట్ తో డబ్బును తిరిగి వసూలు చేయవచ్చు.
*ఇవి ప్రామిసరీ నోట్ తయారు చేసేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలు.*

పులిహోర !!(Tiger-Rice.)

 పులిహోర !!(Tiger-Rice.)

Not to be missed!🙏


ముంగిట మామిడాకులు వంటింట పులిహోర గుబాళింపులు చాలు..పండగో, శుభకార్యమో ! వచ్చిందంటానికి గుర్తుగా.


మొన్న శ్రావణ మాసం అయిపోగానే దిగులు. మళ్ళీ ప్రసాదాల రూపంలో పులిహోర కోసం శరన్నవరాత్రులు దాకా ఆగాలి కదా అని!!


ఆంధ్రులు గర్వించే వంటకం పులిహోర..అన్నిహక్కులూ ఆంధ్రులవే. పేటెంట్ తీసుకున్నారో?? లేదో తెలియదు.


ఇప్పుడంటే ఈ పులిహోర "వేరియెంట్స్" మార్చుకుంటూ రకరకాలుగా వచ్చాయి కానీ నా చిన్నప్పుడు రెండే రకాలు.. అవి నిమ్మ పులిహోర, చింతపండు పులిహోర.

చింతపండు పులిహోరతో పోలిస్తే నిమ్మ పులిహోర లో హడావుడి తక్కువ.


రవ్వపులిహోర అని ఉంటుంది గానీ! వీటి సరసన నిలబడే స్థాయి కాదు. దానికి ఆదరణ కూడా తక్కువనే చెప్పాలి


"ఏదో మైనారిటీ స్టేటస్ ఇవ్వచ్చు!"😊


ఇక రాత్రి అన్నం మిగిలితే పొద్దున మతలబు చేసి నిమ్మ పులిహోరగా మార్చి టిఫిన్ గా పిల్లలకి పెట్టి చేతులు దులుపుకునే తల్లులు కోకొల్లలు. అలా చేసింది వాసి, రాశి లో నాసి అనే చెప్పాలి.


అదే అప్పటికప్పుడు వేడి వేడి అన్నం వండి పులిహోర చేసి చూడండి..అ మజా వేరు.

నిమ్మ పులిహోర లో ఆ పలచని పసుపు కాంతి నీరెండలా మెరిస్తూ లేత యవ్వన కన్య లా ఉంటే చింతపండు పులిహోర ఇంత పసుపు పట్టించి స్నానం చేసి గుప్త గాంభీర్యాన్ని పోగేసుకున్న పూర్ణ ముత్తయిదువులా ఉంటుంది.☺️


నాకు బాగా గుర్తు...ఓరోజు స్కూల్ నుంచి రాగానే వాకిట్లోకి తిరగమాత గుబాళింపు వచ్చింది.


" అమ్మ నీ చేతి తాలింపు కమ్మదనము భరత దేశమున గుమ గుమ పరిమళించె ... " అని కరుణశ్రీ గారి పద్యం మా అమ్మ పాడుతోంది. అవిడో సాహితీ పిపాసి.


పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళితే అమ్మ చీర కొంగుకి పసుపు ఆంటి ఉంది. కొత్త చీర కొనుక్కున్నావా?? అని కొంగు ని పట్టుకు అడిగితే అమ్మ నవ్వి పులిహోర చేస్తున్నా రా!! పసుపు చేతుల్తో చెంగు తుడిచా !!అంటింది కాబోలు!! అంది.

ఆ పసుపు కొంగునిండా తిరగమాత సువాసనే..అది మొహాన కప్పుకున్నప్పుడు నాకు తిరుమల శ్రీవారి మేల్ చాట్ వస్త్రం కప్పుకున్న అనుభూతి.


సాధారణంగా మిగిలిన టిఫిన్లన్నీ ఒక దారి అయితే

పులిహోర ఒకటీ వేరే. ఇంట్లో వారినే కాకుండా పనిమనిషి, చాకలి వంటి వారిని కూడా తినే సభ్యుల్లో లెక్కచేర్చాలి. లేదంటే ఆనక ఇబ్బందులు.


మూడుపూట్లా ఇదే తినే కడుపులు

మూడ్రోజులూ తినే గడపలు కూడా ఉన్నాయి.

టిఫిన్గా తిన్నదే కాక కారేజ్ బాక్స్ లోకి, నాన్నగారు ట్రైన్ లోకి..ఇలా అందరి మోజు తీరాలంటే భారీ మొత్తంలో చేయాల్సి ఉంటుంది.


పులిహోరలో కేవలం తిరగమాత ఉంటే అధమశ్రేణి , పల్లీలుంటే మధ్యమశ్రేణి, జీడిపప్పు ఉంటే ఉన్నత శ్రేణి

జీడిపప్పు గుళ్లు ఉంటే ఎగువ ఉన్నతశ్రేణి కింద ఆదాయపు పన్ను శాఖ వారు గుర్తించవచ్చు.

ఇంట్లో బాచిపీటవేసుకుని లుంగీ కట్టి అరిటాకులో తిన్న తృప్తి తో ఏదీ పోల్చలేము. ఒక పంటికింద చింతపండు లో ఊరిన పచ్చిమిర్చి, మరో పంటికింద తాలింపు చేరిన ఎండుమిర్చి నములుతుంటే మనసు " ద్విపద " కావ్యం రాస్తున్నట్టే!!


పులిహోర అంటే పులకరించని మనసుంటుందా?? అనుమానమే!!


రేపు పులిహోర అనగా నిద్ర పట్టని రాత్రులున్నాయి

పులిహోర లో నూనె బాగా పడాలి..చూస్తుంటే అది మెరవాలి.. తిన్న మన కళ్ళు అంతే మెరవాలి.

అలా పెద్ద బేసిన్ నిండా పులిహోర తయారు చేసి పరిస్తే చూడండీ!!!.


అసలు శ్రావణ శుక్రవారం పులిహోర బాగా కుదరటమే మన భక్తికి పరీక్ష అని జెప్పచ్చు.


శ్రావణం, దసరా రోజుల్లో ఈ పులిహోర నాలుగైదు గృహాలనుంచి ప్రసాదాల రూపంలో వస్తూ ఉంటుంది.

ఇక్కడే సాంకేతిక సమస్య నాకు!!


ఎవరిది ఏపులిహోర?? అని గుర్తుంచుకోవడం వాళ్ళ బాక్స్ మళ్ళీ వాళ్ళకి అందచెయ్యడం, పులిహోర పై అభిప్రాయాన్ని సదరు గృహిణికి message పెట్టడం..ఇత్యాది బాధ్యతలు చాలా ఉంటాయి. ఈ విషయంలో మా అబ్బాయి రాటు దేలాడు. నాకు అందరి పులిహోర్లూ ఒకేలా ఉన్నా మా అబ్బాయి ఠక్కున చెప్పగలడు.!!

ఆవులన్నీ ఒకేలా ఉన్నా యజమాని విడివిడిగా గుర్తించినట్టు అన్ని పులిహోరలూ ఒకేలా ఉన్నా ఇది ఫలానా ఆంటీది!!అంటూ వాడు చెప్పగలగడం నాకు పెద్ద ఊరట. కొన్ని పులిహోరలు మనసు కి చివుక్కనిపించినా అది అభిప్రాయం గా మారకుండా నోరు జారకుండా జాగ్రత్తపడతా.

ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ పండక్కి పులిహోర హుళక్కే. ఇప్పటికే అలా ఒకరిద్దరు పులిహోరదాతల్ని పోగొట్టుకున్నా కూడా!😢


ఇక స్థల ప్రభావం అంటారే!!


అలా పులిహోర తినే ప్రదేశాలు కూడా పులిహోర రుచికి సమన్వయమై ఒక్కో అనుభూతిని ప్రసాదిస్తాయి.ఉదాహరణకి ట్రైన్లో వింధ్య గుహల్లోనుంచి ఏ ఢిల్లీ నో వెళ్తు మాంచి జోరు మీదుండగా ఊగుతూ పులిహోర తినడం ఒక అనుభవమయితే, కార్తీకంలో పంచారామాల దర్శనం అప్పుడు మంచు పడుతుండగా పొలాల మధ్య ఏ చిన్న ఆలయంలోనో తినడం మరో అనుభూతి.

స్థల ప్రభావం వల్ల రుచి ఇబ్బడిముబ్బడి గా పెరిగే ఏకైక వంటకం ఇదొక్కటే అనుకుంటా!


ఆలయం అంటే గుర్తొచ్చింది..చిన్నప్పుడు ముత్యాలంపాడు రామాలయం రాజుల అజమాయిషీ. పులిహోర ప్రసాదంఘాటుగా ఉండేది..దాన్ని నేను "క్షాత్ర పులిహోర" అనేవాడిని. అక్కడ రాజులు అరికాలు మంట నెత్తి కెక్కేట్లుగా పచ్చిమిర్చి వేసేవారు..తెలియక ఆబగా నోట్లో పెట్టా ఒకసారి. అంతే వెక్కిళ్ళు తమన్ డ్రం బీట్ లా కన్నీళ్లు జోగ్ జలపాతాల్లా ఉబికిరాగా కుక్కపిల్ల నాలిక బైటపెట్టినట్లు అంగలార్చుకుంటూ ఇంటికొచ్చా. విషయం తెలిసిన అమ్మ పంచదార పెట్టడం తో ఆ ఘాటు స్మృతి కి

స్వీటు ముగింపు.


ఇక తిరుమలలో దర్శనం అయ్యి వస్తుంటే ఉచిత ప్రసాదం ఏమిపెడతారో!! అని టెన్షన్. లడ్డూ , పరమాన్నం అయితే ok..


పులిహోర అయితే మాత్రం! ...ఆ దొన్నె ఏమూలకి? దొన్నె సైజ్ పెంచరు సరికదా!! రెండో దొన్నె ఇవ్వరు.

దద్ధోజనం, కట్టెపొంగలి లాంటివి దొన్నెల్లో పెట్టినా,

పులిహోరకుమాత్రం దొన్నె బదులు గిన్నె ఇవ్వాలి అని నా అభిప్రాయం. ఇక ఖాళీ అయిన గంగాళాల గోడలకు అతుక్కుపోయిన జీడిపప్పులు వేలాడే చంద్రవంకల్లా అగుపిస్తుంటే..అన్ని జీడిపప్పులు వృథాయేనా!! అని బాధ.


ఏది ఏమైనా అరసవిల్లి నుంచి అయినవిల్లి వరకు

అన్ని పులిహోరలూ ఒక ఎత్తైతే తిరుమల పులిహోర మరో ఎత్తు.నేతి పులిహోర బహుశా నాకు తెలిసి చేసే ఆలయం తిరుమలే అనుకుంటా!!

ఆరుచి అందరకూ నచ్ఛకపోవచ్చు. ఆ మిరియాలు, ఘాటైన ఆవ ముఖ్యంగా ఆంధ్రులకు!!


కవిత్వాన్ని ఎందరు ఆస్వాదించగలరు?? దాని విలువదానిదే!! అలాగే తిరుమల పులిహోర కూడా.

అసలు స్వామి వారికి నచ్చింది అండీ..అది చాలు!!


ఇంతకీ పులిహోర, భోజనమా!! ఫలహారమా!! అన్నది నన్ను చాలా కాలం గా వేధిస్తున్న ప్రశ్న??


కొందరు పరగడుపున ఇంత పెరుగేసి కలిపి భోజనంలాగా స్వీకరించి ఇక ఆరోజుకి ఇంకేమీ ముట్టని వారుంటారు. అదేమిటంటే!! పులిహోర, పెరుగు కలయిక మామూలనుకుంటున్నారా?? రెండు అగ్రరాజ్యాల భేటీ ... మోదీజీ, బైడెన్ కలయిక లాంటిది..కడుపులో దండిగా పడుంటుంది అంటారు.


కొందరు మాఇంట్లో ఉదయం పులిహోర టిఫిన్ అంటూండగా

మరికొందరు ఇవ్వాళ ఉపవాసం , ఫలహారం మాత్రమే అని "పులిహోర తప్ప" అని షరతు పెడతారు.

అంటే పులిహోర ప్రభావం చూడండి!!...కొందరి దృష్టిలో ఫలహారం మరికొందరి దృష్టిలో అది భోజన సమానం.

ఇడ్లీ/ దోసెలకు కానీ పూరీ/వడ మరే ఇతర టిఫిన్ కానీ పులిహోరకి లభించిన ఆధ్యాత్మిక స్థాయి లేదు.


నాకు తెలిసి మిగిలిన టిఫిన్స్ మాట ఎలా ఉన్నా పులిహోర మాత్రం స్నానం చేసి కలిపే మహిళలే ఇప్పటికీ మెజారిటీ. అలాగే అది సాధారణ టిఫిన్ గా తీసుకొచ్చినప్పటికీ అప్రయత్నంగా కళ్లకద్దుకొని తినడం సహజ ప్రవృత్తి . అంటే ఆ పులిహోర పట్ల ఏదో తెలియని ఒక

" అసంకల్పిత పవిత్ర భావన " అలా పురిగొల్పుతుందేమో!!


అందుకే నేను


" అన్నం పర బ్రహ్మమయితే "

పులిహోర "ఇహ బ్రహ్మం" అంటాను.!!😊

Wednesday, September 28, 2022

మాస్టారూ !! మాస్టారు !! మాస్టారు !!

 మాస్టారూ !! మాస్టారు !! మాస్టారు !!


*స్కూల్ అంతా జనం..* *తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ రూం ముందర నిల్చొని ఉన్నారు. అందరి మొహాల్లో కోపం ఆవేశం ఉన్నాయి.. కొందరు మాత్రం ఏవేవో గుసగుసలాడుతున్నారు.. సమయం ఉదయం 9:30 గం.. ప్రిన్సిపాల్ రావటానికి ఇంకా అరగంట పడుతుంది.. స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా ఒక్కొక్కరూ వస్తున్నారు.. అక్కడ పోగైన వారందరూ వాళ్ళని కోపంగా చూడటం ఏం జరిగిందో అర్థంకాక వారు మౌనంగా స్టాఫ్ రూం లోకి వెళ్లిపోవడం జరుగుతోంది.. తల్లిదండ్రుల్లో ఒకరు చూడండి ఇక్కడ ఇంతమంది నిల్చొని ఉంటే ఒక్కరైనా ఏం జరిగింది అని అడగడం లేదు.. నెల పడితే జీతాలు వచ్చేస్తున్నాయ్ మాకేంటి అనే గర్వం అని అనడం స్టాఫ్ రూంలో ఉన్న అందరికీ వినబడుతోంది..* *వాళ్ళందరూ ఇంకా ఎవరికోసమో ఎదురు చూస్తున్నారు..*

    *ఇంతలో ప్రిన్సిపాల్ రావడం తన రూం లోకి వెళ్లడంతో జనమంతా ఆయన రూంలోకి చేరిపోయారు.. కొంతమంది స్థలంలేక బయటనే ఉండిపోయారు.. ప్రిన్సిపాల్ అందరివైపు చూసి ఏం జరిగిందని అడిగారు.. అంతే ఉప్పెనలా చెప్పడం మొదలుపెట్టారు అందరూ.. ఇన్ని రోజులు ఏదో గుణవంతుడు మంచివాడు విద్యావంతుడు వివేకి అని ఏదేదో అనుకున్నాం.. ఇప్పుడు తెలిసింది ఆయన భాగోతం అని అంటుంటే ఆగండాగండి ఇంతకీ ఎవరిగురించి. మీరు మాట్లాడేది అని అడిగారు* *ప్రిన్సిపాల్.. ఇంకెవరు మేకతోలు కప్పుకున్న ఆ కామాంధుడు విశ్వనాథం మాస్టారు గురించి.. ప్రిన్సిపాల్ కోపంగానూ ఆశ్చర్యంగానూ చూసారు అందరివైపు...*

*"ఇంకొక నెలలో రిటైర్డ్ అవ్వబోతున్నాడు ఈ వయసులో ఏం పోయేకాలం ఆయనకి" వెనకనుంచి వినబడిందో గొంతు..*

*"పైగా రాష్ట్రపతి నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు వొకటి.. ఉత్తమ కామాంధుడిగా ఇవ్వాల్సింది" వెటకారంగా మరొక గొంతు..*

*"ఎంతైనా మగాడు కదా ఎక్కడ పోతాయ్ మృగజాతి బుద్ధులు" మరొకరు..*

*"ఆయనకీ ఆడపిల్లలు ఉన్నారు కదా.. వాళ్ళని కూడా ఇలా ఎవరైనా అడిగితే సరి" మరొక కంఠం..*

*ఇలా ఎవరికి వారు నోటికొచ్చినట్లు తిడుతున్నారు..*

*విశ్వనాథం మాస్టారు స్కూల్ లో చేరి ముప్పై ఐదు సంవత్సరాలయ్యింది.. తనకున్న విద్యతో తెలివితేటలతో మంచితనంతో ఓర్పుతో అందరికీ అతి కొద్దిరోజుల్లోనే చాలా దగ్గరయ్యారు.. ఎవరినీ నొప్పించే మనస్తత్వం కాదు.. ఇంతవరకూ ఏ విద్యార్థిని కూడా దండించగా చూసినవారు గానీ విన్నవారుగానీ లేరు.. చుట్టుపక్కల వూరివాళ్లు కూడా విశ్వనాథం మాస్టారు ఉన్నారనే ఆ స్కూల్లో చేర్పించేవారు.. ఆయనకు భార్య ఇద్దరు ఆడ పిల్లలు.. భార్య ఇద్దరు ఆడపిల్లల్ని కని చనిపోయింది.. తర్వాత మాస్టారు పెళ్లి చేసుకోలేదు.. ఇద్దరు ఆడపిల్లల్ని బాగా చదివించి పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపించేసారు.. అల్లుళ్ళు కూడా ఆయన మనస్తత్వానికి తగ్గట్లుగానే దొరికారని అందరూ అనుకునేవారు..*

*"ఎక్కడండీ వాడు ఇంకా రాలేదు" అని ఎవరో అరుస్తూ అడిగేసరికి ఈ లోకంలోకి వచ్చారు ప్రిన్సిపాల్.. "ముందు మీరు ప్రశాంతంగా జరిగింది ఏంటో చెప్పండి" అని ప్రిన్సిపాల్ అడిగేసరికి ఒకావిడ ముందుకొచ్చి నా కూతురిని పట్టుకొని "ముద్దులు ఎన్ని రకాలో నీకు తెలుసా" అని అడిగాడట దరిద్రుడు.. పైగా "క్లాసులో ఉన్న అమ్మాయిలకే వర్తిస్తుంది ఈ మాట" అని కూడా అన్నాడట..*

*గుండె ఆగినంత పనైంది ప్రిన్సిపాల్ కి.. విశ్వనాథం మాస్టారు ఇలా మాట్లాడారా.. ఎక్కడో ఏదో తప్పు జరిగింది.. స్టాఫ్ ని పిలిచి ఆయన గురించి అడిగారు.. ఎవ్వరూ ఆయన చెడ్డవారని చెప్పలేదు.. ఎవరికీ అర్థం కావడం లేదు..*

*ప్రిన్సిపాల్ అందరివంకా చూస్తూ "ఎవరూ ఆవేశపడకుండా నా మాట వినండి.. ఇంతవరకూ విశ్వనాథం మాస్టారి మీద ఒక్క కంప్లైంట్ కూడా లేదు.. ఆయన ఎటువంటివారో ఇక్కడున్నవారందరికీ బాగా తెలుసు.. అందరూ కూడా స్కూల్ మీటింగ్ హాలుకు రండి.. మాస్టార్ని కూడా అక్కడికే పిలిపిస్తాను" అని అనడంతో అందరూ మీటింగ్ హాలులోకి వెళ్లి మాస్టారు కోసం ఎదురుచూడసాగారు..*

*సార్ ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని మీటింగు హాలుకు రమ్మన్నారు.. అటెండర్ చెప్పగా సంతకం పెట్టి హుందాగా మీటింగు హాలులోకి అడుగుపెట్టారు విశ్వనాథం గారు..*

*ఆయనని చూడగానే అంతవరకూ తిట్టిన నోళ్ళు కూడా తమకి తెలియకుండా  మర్యాదగా లేచి నిల్చున్నాయి.. మాస్టారు వెళ్లి ప్రిన్సిపాల్ పక్కన కూర్చున్నారు..*

*ప్రిన్సిపాల్ మాస్టారు వంక చూసి నమస్కరించారు.. ఆయనలో ఏ కోశానా తప్పు చేయలేదన్న భావన స్పష్టంగా అందరికీ కనబడింది..*

 *"ఏంటి సార్ ఆయనని ప్రక్కన కూర్చోబెట్టుకొని ఏమీ అడగకపోతే ఎలా.. సమాధానం చెప్పమనండి" అరిచారు ఎవరో..*

*విశ్వనాథం మాస్టారు ఏం జరిగిందని ప్రిన్సిపాల్ ని అడిగారు.. కానీ ఎలా అడగాలో అని తడబడుతున్నారు ప్రిన్సిపాల్.. విశ్వనాథం మాస్టారికి ఏదో జరిగిందని అనిపించింది "సరే ఏదో జరిగిందని నాకు తెలుస్తోంది.. మీలో ఎవరైనా నాకు చెప్పండి.. మీ సమస్య నేను తీర్చడానికి ప్రయత్నిస్తాను" అని అనగానే సమస్యే మీరు అని అరిచారు అందరూ.. ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు మాస్టారికి.. ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఎంతో గౌరవంగా చూసిన వాళ్ళు ఈ రోజు నన్ను దోషిగా చూస్తున్నారు.. నేనేం తప్పు చెయ్యలేదు.. హాలంతా రెండుక్షణాలు మౌనంగా గడిచాయి.. మాస్టారు గొంతు సవరించుకొని ఏం జరిగిందో చెప్పమని నా తప్పేంటో చెప్పండని అడిగారు..*

*మా ఆమాయిల్ని ముద్దుల గురించి అడిగారట కదా..* 

*"మీకూ అమ్మాయిలు ఉన్నారు వాళ్ళని అడగలేకపోయారా.. పెళ్లైంది కదా చక్కగా వర్ణించి ఉండేవాళ్ళు" కోపంగా అడిగాడు ఒకతను.. "మీరెంతో మంచివాళ్లనుకున్నాం, మీలో ఇన్ని కళలున్నాయని మాకు తెలీకుండాపోయింది" మరొకరు.. "ఇంత వయసొచ్చింది మీ మనవరాళ్ళ వయసున్న వాళ్ళని ఇలా అడగటానికి సిగ్గులేదు నీకు" ఆవేశంతో మరొక గొంతు.. "మర్యాదగా మా అందరికీ క్షమాపణ చెప్పి ఈ వూరు వొదిలి వెళ్లు" మరొక కేక.. ఇలా ఒకొక్కరు అరవడం మొదలుపెట్టారు.. కొంత సేపు అరిచి అరిచి "చూడండి మనం ఇంత అడుగుతున్నా ఒక్కమాట కూడా ఆయన నోటినుంచి పెగలడంలేడు" అరిచాడు ఒకడు..*

*"సమాధానం చెప్పవయ్యా" అడిగేడు ఒకడు..*

*విశ్వనాథం గారు లేచి నిల్చున్నారు.. ఎప్పుడూ ఉన్న చిరునవ్వు ఆ మొహంలో అలాగే కనబడుతోంది.. ఇన్ని రోజులకు నా మీద మీకున్న నమ్మకం గౌరవం భక్తి నిజమే అనుకున్నా.. నేను తప్పు చెయ్యను అని మీరందరూ అనుకునే విధంగా నడుచుకున్నానని గర్వం ఉండేది, మరి కొద్ది రోజులలో నాకు ఈ విద్యాలయానికి ఉన్న సంబంధం తెగిపోతోందే అని బాధపడుతూ  ఉన్నాను.. కానీ ఈ క్షణం నాకు ఇంకా ఈ చోట ఉన్నానే అనే బాధను కలిగించారు.. చాలా సంతోషం.. నిన్న ఆఖరి పీరియడ్ నాది. పిల్లలకి విలువల గురించి క్లాసు తీసుకుందామని అనుకున్నాను. చెప్పడం మొదలు పెట్టారు విశ్వనాథం గారు.. అరిచిన నోళ్లన్నీ స్తబ్దుగా వింటున్నాయి ఆయన మాటలను.. "నిజమే నేను ఆడపిల్లలను మాత్రం అడిగాను ముద్దులు ఎన్ని రకాలో తెలుసా అని.. ఈ లోపల బెల్లు కొడితే అందరం ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకొక పది నిముషాలు బెల్లు కొట్టడం లేట్ అయ్యున్నా ఈరోజు మీరు ఇలా మాట్లాడేవారు కాదు.*

*అందరిలో తప్పుచేసామనే భావన మొదలయ్యింది. తల వంచుకుని కూర్చున్న స్టాఫ్, ప్రిన్సిపాల్ అందరూ హుందాగా నిటారుగా కూర్చున్నారు..* *వాళ్ళ కళ్ళల్లో మునుపటి భయం లేదు. ఏదో శక్తి ఆవహించినట్లు మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.. మాస్టారి మీద తమకున్న నమ్మకం వమ్ముకాలేదన్న భావన కనబడుతోంది.*

*చెప్పడం ప్రారంభించారు మాస్టారు..*

*"ఇక్కడున్న ఆడపిల్లల్ని మాత్రమే ఎందుకు అడిగానంటే అది వారికి ముందు ముందు చాలా ఉపయోగపడే విషయం కాబట్టే..*

*ప్రపంచంలో అతి పవిత్రమైన ముద్దులు మూడే రకాలు..*

అవి:-

1 *తండ్రి ముద్దు* :– 

    *"అమ్మలూ మీ నాన్న పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఉద్యోగరీత్యా ఎందరినో కలుస్తుంటాడు.. వాళ్ళవాళ్ళ అనుభవాలను కుట్రలను కుతంత్రాలను కల్మషాలను అన్నీ కూడా చూస్తూ వాళ్ళ మనస్తత్వాలను బేరీజు వేసుకుంటూ ఎవరినీ నొప్పించకుండా సాయంకాలానికి ఇంటికి క్షేమంగా చేరి మీ అందరితో సుఖంగా ఉండగగుతున్నాను.. నాలాగే నువ్వు కూడా ఉండాలని నీ స్నేహితులతో నీ గురువులతో నీ సహోద్యోగులతో సత్ప్రవర్తనతో మెలిగి జీవితాంతం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకున్న పరిజ్ఞానాన్ని అనుభవాలను నీకు అందిస్తున్నాను" అని తన కూతురుని తండ్రి ఎప్పుడూ నుదుటిపైనే ముద్దు పెడతాడు.*


2 *తల్లి ముద్దు* :– 

*"చిట్టితల్లి నా చిన్నతనంలోనే నాకు పెళ్ళిచేసారు. అప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్నో అనుభవాలు నా జీవితంలో ఎదురయ్యాయి. పొద్దున్న అందరికంటే ముందుగా లేచి అన్నీ పనులూ చేసుకుని మీ నాన్న మీ నానమ్మ మీ తాతయ్యా నా మరిదీ మరియు వాళ్ళ పిల్లలూ ఇలా రోజంతా క్షణం తీరిక లేకుండా అందరికీ అన్ని పనులూ నవ్వుతూనే చేసి తిరిగి సాయంకాలానికి మళ్లీ అందరికీ ఫలహారాలు గట్రా చేసిపెట్టి రాత్రి భోజనాలకి మళ్లీ అన్ని పాత్రలూ కడుక్కొని తిరిగి అందరూ తిన్న తర్వాత వాటిని శుభ్రం చేసి వచ్చి పడుకునేసరికి రాత్రి పదకొండు దాటుతోంది. తిరిగి పొద్దున్న నాలుగు గంటలకే లేచి యథాప్రకారం ప్రతీ రోజూ లాగే అన్నీ పనులూ చేసుకోవాలి.. ఒక్కరోజు నాకు వొంట్లో బాగలేకపోయినా ఇంటిపనులు నిలిచిపోతుంది.. ఎక్కడికి వెళ్ళటానికి ఉండదు.. "ఎందుకు నీకు ధాత్రి అని పేరు పెట్టారో మన పెళ్ళైన తర్వాత కానీ అర్థం కాలేదు. నిజంగా ఆ పేరును సార్ధకం చేశావ్. నువ్వే లేకపోతే ఈ సంసారం ఎలా ఉండేదో వూహించుకొలేకపోతున్నాను.నీకు సహాయపడటానికి కూడా నాకు సమయం దొరకడంలేదు నన్ను క్షమించు ధాత్రీ" అంటూ నా వొళ్ళో తలపెట్టి భోరున ఏడ్చేసేవారు నాన్న.. అంత కష్టంలోను ఆయన నాపై కురిపిస్తున్న ప్రేమకి ముగ్దురాలినైపోయేదాన్ని.. కష్టాలన్నీ మరచిపోయేదాన్ని. ఇలా ఎంత కష్టమొచ్చినా చిరునవ్వుతో అన్నీ భరిస్తున్నాను.. నాలా కష్టపడకుండా నువ్వు హాయిగా ఉండాలి. నాకు దేవుడిచ్చిన వరం నా నవ్వు. ఆ నవ్వుని నీకు కూడా ప్రసాదించాలని ఆ భగవంతుడిని ఎప్పుడూ ప్రార్ధిస్తుంటాను.. నీ నవ్వుకు ఎప్పుడూ దిష్టి తగలకూడదని బుగ్గమీద ముద్దులు పెడుతూ  ఉంటాను" అని తల్లి ముద్దుని తెలియచేశారు మాస్టారు..*


*అందరి కళ్ళల్లో కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి.. నేల కృంగి పాతాళానికి దిగజారిపోయామన్న  బాధ.. విశ్వనాథం గారి ప్రక్కన కూర్చున్న అధ్యాపకులందరూ ప్రిన్సిపాల్ తో సహా ఒక్కొక్కరుగా స్టేజి దిగి ఆయనకు ఎదురుగా క్రింద కూర్చున్నారు.. అంతే మరొక ఐదు నిముషాలలో హాలులో వున్న అన్ని కుర్చీలు మౌనంగా బయటకి వెళ్లిపోయాయి.. అందరూ నేల పైన కూర్చుని శోకతప్త హృదయాలతో మాస్టారి వంక చూడసాగేరు..*

*ఇప్పుడు అందరి కళ్ళకి ఆయన ధర్మోపదేశం చేస్తున్న కృష్ణుడి లాగా కనబడుతున్నారు.*

*"ఇక మిగిలింది మూడవ ముద్దు" ప్రారంభించారు మాస్టారు..*


3 . *భర్త ముద్దు* :– 

*ఇందులో చాలా నిగూఢమైన సందేశం ఉంది.. భర్త ఎప్పుడూ భార్య పెదవులపైనే ముద్దుపెడతాడు. పెళ్ళైన తరువాత పుట్టినింటి నుంచి మెట్టినింటికి వచ్చిన తరువాత ఇది కూడా నీ పుట్టిల్లుతో సమానం.. మా అమ్మా నాన్నలు నీకూ అమ్మానాన్నలు తో సమానం. పొరపాటున వాళ్ళు ఏదైనా అంటే వాటిని పెద్దమనసుతో స్వీకరించు. ఆ విషయాలను ఇంకొకరి దగ్గర కానీ మీ ఇంట్లో కానీ ప్రస్తావించకు. అదే కాకుండా నీకు చుట్టుప్రక్కల వాళ్ళు ఎవరెవరి గురించో ఏదేదో చెబుతూ ఉంటారు. వాటిని అక్కడే విని అక్కడే వొదిలేసెయ్. ఆ మాటలను ఇంకెవరితోనూ అనకు. పదిమందితో మంచిగా మాట్లాడు.. తక్కువగా మాట్లాడటం మరీ మంచిది.. నువ్వు తక్కువగా మాట్లాడతానని నలుగురికీ తెలియడం మంచిదే. ఎందుకంటే నీకు చాడీలు చెప్పిన వాళ్ళు, నువ్వు ఇంకొకరిమీద చాడీలు చెబుతున్నానని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎవరికైనా సహాయం చేసి ఇంకెవరిదగ్గరా అది గొప్పగా చెప్పుకోకు.. మనం ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం అన్న విషయాలు ఎక్కడా ప్రస్తావించకు.. నా సంపాదనతో అందరినీ పోషించాలి. ఒక్కొక్క సారి మనిద్దరికీ తినడానికి తిండి మిగలకపోవచ్చు. ఆ విషయాలను ఎవ్వరితోనూ చెప్పకు. పదిమందికి తెలిస్తే చులకనైపోతాం. ఉన్నంతలో హాయిగా బ్రతుకుదాం. నీ బాధల్ని నాతో పంచుకో. అవి తగ్గించడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడూ కన్నీళ్ళతో ఎదురురాకు.. నీలో నాకు నచ్చేది  ఎప్పుడూ నవ్వుతూ  ఉండే నీ మొహం. ఎన్ని జన్మలైనా మనిద్దరం భార్యాభర్తలుగానే జన్మిద్దాం. నీ కష్టాలలో ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. మన ఇంటిగుట్టును ఈ పెదవులు దాటి బయటికి పొక్కనీయకు.. అని భర్త పెట్టే అతి పవిత్రమైన ముద్దు అది..*


*ఇది నిన్ననే చెప్పేవాడిని. కానీ సమయం లేక చెప్పలేకపోయాను. కానీ ఒక్క పది నిముషాలు నేను సమయాన్ని కేటాయించుకొని ఉండుంటే ఈ రోజు నా మర్యాద ఇలా వీధిపాలు అయ్యేది కాదు..*

*నేను రిటైర్ ఐతే నాకొచ్చే డబ్బులతో ఈ విద్యాలయానికి ఎన్నో చేయాలనుకున్నాను.. ఇప్పుడు కూడా ఆ విషయంలో వెనుకడుగు వేయను.. తప్పకుండా అనుకున్నట్లుగానే చేస్తాను. కానీ మీరు ఇచ్చిన ఈ బహుమతిని మోయడానికి నా శరీరం చాలదేమో.. పర్వాలేదు నా ఆఖరి మజిలీ ఇలా ముగుస్తుందని ఆ విధాత రాసిపెట్టుంటే ఎవరేం చెయ్యగలరు.. ఇప్పటికైనా మీ సందేహాలు తీరిపోయాయా. ఇంకా మిగిలున్నాయా.. సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నాను..*


*నిలబడే ఉన్నారు మాస్టారు. ప్రిన్సిపాల్ వేదిక మీదకొచ్చి ఆయన పక్కనే నిల్చున్నారు. గ్లాసులోని మంచినీరు మాస్టారుకి అందించారు. గుక్కెడు తాగి గ్లాసుని టేబుల్ మీద పెట్టి అలాగే నిల్చున్నారు మాస్టారు. ప్రిన్సిపాల్ మాస్టారు చేయిమీద తన చేయి వేసారు. ఒక కన్నీటి చుక్క ప్రిన్సిపాల్ చేతి మీద పడింది.. మాస్టారి చెయ్యి హిమాలయ పర్వతాలకన్నా చల్లగా ఉంది.. మౌనంగా కుర్చీలో కూర్చుని తల వెనక్కి వాల్చేసారు మాస్టారు.*


*మాస్టారూ !! మాస్టారు !! మాస్టారు !! ఎంత పిలిచినా పలకడం లేదు.. బండి కట్టండి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి ప్రిన్సిపాల్ అరిచారు..*


*"ఆసుపత్రికి అధ్యాపక బృందం తీసుకెళుతుంది. ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చిన వారందరూ నేను చెప్పే మాటల్ని విని వెళ్ళండి" ప్రిన్సిపాల్ మాటలకు అందరూ సిగ్గుతో తలవంచుకొని నిల్చున్నారు.. మాస్టారు అలాగే వాలిపోయి ఉన్నారు..*


*"నాకు మీ అందరితో మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. కానీ ఒక్క విషయం చెప్పాలి.*


*ఈ రోజు ఈ స్కూల్ చరిత్రలో బ్లాక్ డే గా లిఖించబడుతోంది. ఈ రోజు స్కూల్ కి సెలవు ప్రకటిస్తున్నాను. ఈ రోజే కాదు ప్రతీ సంవత్సరం ఈ తారీఖున బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాను. దీనికి సంబంధించి అధికారులకు విజ్ఞాపన పత్రాన్ని కూడా పంపుతున్నాను. అలాగే మాస్టారు లేని ఈ ఆలయంలో ఉండటానికి నా మనసు అంగీకరించడం లేదు. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను.. ఇక వెళ్ళిరండి.. సెలవ్.*


*పక్కన తరగతి గదుల్లో కూర్చున్న పిల్లల గొంతులు వినబడుతున్నాయి.*


 *వినదగు నెవ్వరు చెప్పిన* 

 *వినినంతనె వేగపడక వివరింపదగున్* 

 *గని కల్లనిజము లెరిగిన* 

 *మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ* 


 *అక్షరాలతో  భావి భారత పౌరుల జీవితాలను సుగమ్యంలోనికి తీసుకెళ్లే ప్రతీ గురువునకు ఇది అంకితం*🙏🙏


సెల్ఫ్ డబ్బా ఏమో కానీ సెల్ఫీడబ్బా ప్రమాదమే

 

*సెల్ఫ్ డబ్బా ఏమో కానీ సెల్ఫీడబ్బా ప్రమాదమే*
*〰️〰️〰️〰️NaReN〰️〰️〰️〰️*

సెల్ఫీ ఒక అనివార్యమైన
అంటు వ్యాధి.



ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడం అంటే ప్రాణభీతితో కాదు, ప్రాణ చిలకను మర్రి తొర్రలో కాదు, గుప్పెట్లో పెట్టుకోవడమే!.

ఉన్న చోటు నుంచే ఏడేడు సముద్రాలు తిరిగి రావడం.
కాళ్లే కాదు, కళ్ళు కదపకుండా
దుర్భిణికి కళ్ళప్పగించేయడం!
సమూహంలో ఉన్నా, ఏకాంతంలో ఉన్నా, ఒక సెల్ఫీ తీసుకోవటం అరచేతి దురద తీర్చుకోవడం!
కొన్నిసార్లు సెల్ఫీ ఒక ప్రాణాంతక సాహస కృత్యం! మనిషికి బొటన వేలు ఒకప్పుడు వేటకు
అవసరమైతే నేడు అది
ఒక తీరని తీట.

ఫోను ఒక ఆత్మ,
సెల్ఫీ దాని నీడ.
తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ పద్మవ్యూహం పరిచయం.
అందుకే అభినవ అభిమన్యులకు ఫోను ఒక సహజ కవచకుండలం. కవ్వించే సెల్ఫీ ఊబి.

స్వచ్ఛంద ఆత్మార్పణానికి ప్రేరణ. సెల్ఫీ పిచ్చి ముదిరితే,
వెంటిలేటర్ బెడ్డొకటి రిజర్వుడ్!!

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
పసుపులేటి నరేంద్రస్వామి

Monday, September 26, 2022

నిజం గా అంత అందముందా..ఆడవాళ్ళ పాదాలలో...

 నిజం గా అంత అందముందా..

ఆడవాళ్ళ పాదాలలో...*




ఒక కవి అనేవాడు...ఇలా...

ఎందుకో ఇప్పుడనిపిస్తుంది అంత అందముందా ఆడవాళ్ళ పాదాలల్లో

 అన్వేషిస్తు ఉంటాయి నా కళ్ళు అవకాశం చిక్కినప్పుడల్లా...


పడతి..చింగులు పైకి చెక్కి...పని చేస్తున్నంత సేపు...


పసుపు రాసే కార్యాలలో... పసుపు  రాసుకున్న పాదాలని..


పరిగెత్తే పాదాలని..


పవళించిన పాదాలని..


పట్టీలు వేసుకున్న పాదాలని..


అతని వెనక ఏడడుగులు వేసిన ఆమె పాదాలని


సిగ్గు గా నడక భారమయిన పాదాలని..


కోరిక నేలకి రాసి చూపే పాదాలని..


కోరిక తో వచ్చిన మొగుడు కొసరి కొసరి ముద్దాడే పాదాలని


పసిబిడ్డని కాళ్ళ ఫై వేసుకొని స్నానం పోసే అమ్మ పాదాలని... 


అలిగితే భగవంతుడి శరస్సునే తన్నిన (సత్యభామ) పాదాలని 


కోపమైన పడతిని మన్నించమంటూ మగాడి ఆహాన్నిదాటిన చెయ్యి తాకిన  ఆమె పాదాలని


అవమానాలు ముళ్లయిన నడిచే ఆ పాదాలని


ఉద్యోగ బాధ్యతలు ...కుటుంబ బాధ్యత తీసుకోవడం లో ముందుండే ఆమె పాదాలని


బతుకే సమస్య అయినపుడు..ఎదురీతలు ఎదకోతలు.. దాటిన ఆమె పాదాలు


వంటరి గా సమస్యల ఫై యుద్ధం చేస్తున్న ఆమె పాదాలని


 భారమైన నడక చివరి దశలో ఆమె పాదాలని...


            ఇంత నడక నడిచిన...అంత అందమైన ఆమె పాదాలు   ఎవరో ఒకరి వెనకే నిలబడి ఉండటం... ఇంకా చూస్తూనే ఉన్న...అతనికి సాయం గా...


పసిదానిగా..


పడుచుపిల్ల గా


భార్య గా..


తల్లి గా ఆ పాదం...అడుగు వెనకే. ఉండిపోయింది..


ఇంకా ఎవరి చేతో  నడపబడటం   చూస్తూనే ఉన్న...


ఒక్క మగాడు  అయినా.... 

ఇన్ని దశలలో ప్రతి మగాడి విజయం వెనక ఆడది అనే మాట దాటి...

 

నాతో సమానం గా నో...


నాకు ముందుగానో ..


నడవమనే మాట అంటాడేమో అని. చూస్తూనే ఉన్న.  .ప్చ్...


   నిజం కదా అందమైన పాదాలు...ఎంత బాగుంటాయో

అంత అందమైన పాదాలు..


వాటికీ అందమైన వెండి పట్టాలు...


వాటికీ సవ్వడుల గజ్జెలు...


సవ్వడులు సడి చేయగా...


చిదిమేసే ముళ్ళు దాటి...


చిన్న చిన్న అడుగులు దాటి పరవల్ల నడకలు...నేర్వు అందమా...

నిన్ను నువ్వు గుర్తించు..నిన్ను అంటుకున్న సంకెళ్లు దాటి...

ఆత్మవిశ్వాసం తో అడుగేసే పట్టిల సవ్వడుల అడతనమా...

 *చాలా అందంగా ఉంటాయి నీ పాదాలు*


Saturday, September 24, 2022

బస్సు కండక్టర్ మరియు వృద్దురాలు

 బస్సు కండక్టర్ మరియు వృద్దురాలు

( ఒక వాస్తవ గాథ )




              అది రాత్రి సమయం . 'దేవ్ గడ్' కి వెళ్లే ఆఖరు బస్సు సమయం మించి పోయినా, ఇంకా కదలటం లేదు. బస్సు స్టాండు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ముగ్గురు నలుగురు ప్రయాణికులు మాత్రమే అక్కడక్కడ తిరుగాడుతున్నారు. బస్సులోని పది పన్నెండుగురు ప్రయాణికులు మాత్రమే బస్సు ఇంకా ఎందుకు కదలటం లేదని

తబ్బిబ్బులు పడుతున్నారు.

            ఇంతట్లో ఒకతను బస్సు టైయర్ పంచర్ అయిందని కబురు తెచ్చాడు.

పంచర్ పని కాగానే బస్సు కదులుతుందట. సరిగ్గా పది గంటలకు బస్సు కదిలింది.

ప్రయాణికులందరూ దేవ్ గడ్ కు

వెళ్లేవాళ్ళే. ఒక చేతిన

పెద్ద మూటను పట్టుకొని కూర్చున్న వృద్ధురాలు ను టికెట్టు తీసుకోమని కండక్టర్ అడుగగా ఆమె బస్సు బాటలో ఉన్న 'కాత్వన్ 'ఊరి గేటు వరకు టికెట్టు ఇవ్వమని అడిగింది - ఆ ఊరి గేటు నుండి ఒక కిలో మీటరు దూరాన తన ఊరు ఉందని కూడా అంది.


బస్సు కండక్టర్ ఆలోచనలో పడ్డాడు. ఈ వృద్ధురాలు

వయసు ముదిరింది. ఒక్కతే దిగనుంది . వానకాలపు దట్టమైన మబ్బులో ఆమె తన ఇంటిని ఎలా చేరుకుంటుందో....?


అతడు ఆ వృద్ధురాలిని కొద్దిగా మందలించాడు- "నీవు ఒంటరిగా ఉన్నావు, నీకు కళ్లు కనపడటం లేదు, సరిగా నడవటం కూడా రాదేమో ?, ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? వెలుతురు ఉండగానే ఇంటికి చేరు కోవాలి కదా ? "


ముసలామెకు సరిగా వినపడటం కూడా లేదు. గొణుగుతూ ఏదో జవాబు ఇచ్చింది!

కండక్టర్ ఆమె ఊరికి టికెట్టు ఇచ్చి తన స్థలం వద్దకు వచ్చి కూర్చున్నాడు.


బస్సులోని ఇతర ప్రయాణికులు నిద్ర కూనుకులు తీస్తున్నారు. డ్రైవర్ బస్సు లోని లైట్లు తీశాడు. కండక్టర్ వృద్ధురాలి గూర్చి ఆలోచిస్తున్నాడు. ఆ ముసలవ్వను ఆ ఊరి గేటు దగ్గర దింపుతే ఆమె కిలో మీటరు దూరం లో ఉన్నా తన ఇంటిని ఈ వాన మబ్బులో ఎలా చేరుకుంటుంది ? ఆమె కు నడవటానికే రాదు. కంటి చూపు సరిగా లేదు. ఆమె ఊరి బాటలో వాగులు వంపులు గుంతలు ఉంటే ఎలా దాటి పోగలదు....?

ఒంటరిగా ఉన్నా ఆమె పై ఏదైనా అడవి మృగం దాడి చేస్తే....?


ఇంతలో ముసలామె దిగు ఊరి గేటు వచ్చింది. కండక్టర్ బెల్ కొట్టాడు. డ్రైవర్ బస్సు ఆపాడు .


కండక్టర్ లేచి ముసలవ్వ మూటను ఒక చేత్తో పట్టుకొని రెండవ చేత్తో అవ్వ చేతిని పట్టుకొని ఆమెను బస్సు దింపాడు. కొద్దిగా శ్రమ అని పించింది.


బయట చిట్ట చీకటి. ఏమీ కనపడుట లేదు. కండక్టర్

అవ్వ మూటను తలపైకి ఎత్తుకొని అవ్వ భూజాన్ని చేత్తో పట్టుకొని ఆమె ఊరి బాట పట్టాడు. అవ్వను ఒంటరిగా వదలక ఏదో విధంగా ఆమెను ఇంటికి సురక్షితంగా చేర్చాలని

కండక్టర్ గట్టి  పట్టు పట్టాడు.


అవ్వకు ఆశ్చర్యమేసింది! ఆమె తన శక్తి మేర కండక్టర్ అడుగుల్లో  అడుగులు వేస్తూ బిరబిరా  నడవ సాగింది.


"పది పదిహేను నిమిషాలు గడిచినా కండక్టర్ ఎక్కడి వెళ్ళాడు? " అని ఇటు ప్రయాణికులు అటు డ్రైవర్ల ల కావ్ కావ్ లు మొదలయ్యాయి. డ్రైవర్ బస్సు దిగి బండి చుట్టూ తిరిగాడు. అతడు లఘు శంక లేదా దీర్ఘ శంకకు వెళ్లి ఎక్కడైనా పడిపోయాడేమో నని గాలించాడు. కూతవేశాడు . అయినా, జాడ లేదు. అతడు ముసలవ్వ ను వదలటానికి ఆమె ఇంటికి వెళ్లి ఉంటాడని

అనుకున్నాడు. మనసులో విసుక్కున్నాడు. ఇంత రాత్రిన నిర్జన స్థలంలో బస్సు ను వదిలి వెళ్లిన కండక్టర్ని ప్రయాణికులు కూడా కస్సుబుస్సుమని కరిచారు.. "కండక్టర్ ఎక్కడున్నా ఉండనీయండి ! బస్సును నడపండి! " అని కొందరు ప్రయాణికులు డ్రైవర్ కి

ఆదేశాలు ఇచ్చారు.


"నాయనా! నీ పేరేంటి ?" అని కండక్టర్ని అడిగింది ముసలామె .

"అవ్వా! నా పేరుతో నీకేమి పని?..... నా   పేరు మహాదూ వేంగుర్లే కర్ ."

"ఏ డిపో లో పని చేస్తున్న వయ్యా? "

" మాల్‌ వన్ ." అన్నాడు కండక్టర్ .

" నీకు సంతానం ఎంత మంది ?"

" ఇద్దరు " అన్నాడు కండక్టర్ .


ఇంతట్లో ముసలవ్వ ఇంటిని (పూరి గుడిసె ను ) చేరుకున్నారు.. రెండు మూడు కుక్కలు ఆరుస్తూ అక్కడి నుండి పారిపోయినవి. ముసలవ్వ కండక్టర్ కు తన ఇంటి తాళం చెవి ఇచ్చింది. అతడు ఆమె ఇంటి తాళం తెరిచి ఆమె చేతికిచ్చి పరుగు పరుగున బస్సు దారి పట్టాడు.


ఆ ముసలవ్వ ఆ ఊరి కొన భాగంలో ఒంటరిగా  ఉంటుంది . ఆమెకు దగ్గరి బంధువులు అనువాళ్ళే లేరు! ఆమెను ప్రేమించే వాళ్లు లేదా ఆమె బాగోగులు అడిగే వాళ్లే లేరు!!


ఆమె ఎప్పుడూ ఎవరి వద్దకు వెళ్లేదే కాదు. ఎవరైనా ఆమె దగ్గరకు వస్తే వాళ్ళు స్వార్ధ పరులని సందేహించేది . అలా వచ్చే వాళ్ళు తన సంపద పైన కన్ను వేసే వచ్చారని అనుమానిస్తుంది! ఆ వయసులో అలా అనుమానం  స్వాభావికం మరియు వాస్తవం కూడా ! ఊరు శివార్లో ఆమె పేరట రెండు ఎకరాల  భూమి ఉంది. అట్టి భూమిని ఊరి వారికి కౌలుకు ఇచ్చి  వచ్చిన డబ్బుతో పొట్ట పోషించు కుంటుంది.


ఒక రోజు ముసలవ్వ ఎందుకో చాలా జబ్బు పడింది. అట్టి స్థితిలో ఆమె తన ఊరి సర్పంచ్ మరియు కార్యదర్శిని రమ్మని

పిలుపునిచ్చింది. అది విని వాళ్ళు ముందుగా కొద్దిగా అనుమాన పడ్డారు. అయినా,వాళ్లు ఆమె ఇంటికి వచ్చారు. ముసలవ్వ లేచి కూర్చుంది. వచ్చిన వారితో  "గ్రామ పెద్దళ్లారా! ఇక నా ఆరోగ్యం చాలా క్షీణించింది. నేను ఎక్కువ రోజులు బ్రతకను .

కావున నా దగ్గర ఉన్న ఈ రెండున్నర  తులాల బంగారం, నా భూమి మరియు నా ఇల్లును 'మాల్‌ వన్‌ 'బస్సు డిపో లోని కండక్టర్ మహాదూ వేంగుర్లే కర్ పేరట నా వీలునామా వ్రాయండి. ఇదిగో నా దగ్గర పొదుపు చేసిన ఈ ఇరవై వేల

రూపాయలు తీసుకొండి. ఇందులోంచి నేను గతించిన తరువాత నా క్రియ ఖర్మల

కోసం వాడుకోండి . నేను ఇక ఎక్కువ రోజులు బ్రతకను ." అని

అంది. సర్పంచ్ మరియు కార్యదర్శి ముసలవ్వ మాటలు విని ముందుగా ఆవాకయ్యారు.

ఇదేంటి సమస్య? ఈ మహాదు

వేంగుర్లే కర్ ఎవరు ? ఈ పేరు ముందు ఎప్పుడూ విన లేదే? అతడి పేరట ఈ ముసలామె ఎందుకు తన సంపదను వ్రాస్తుంది? ఏదో సంబంధం ఉండి ఉంటుందనుకొని ముసలవ్వ తో సెలవు తీసుకొని

వెళ్లి పోయారు.                 రెండు మూడు రోజుల తరువాత ముసలవ్వ

కన్నుమూసింది.


ముసలవ్వ కోరిక మేరకు సర్పంచ్ మరియు కార్యదర్శి అన్నీ క్రియ కర్మలు జరిపించారు. అన్నీ పనులు పూర్తి చేసి వాళ్లు 'మాల్‌ వన్ ' బస్సు డిపో కి వెళ్లి మహాదూ వేంగుర్లే కర్,కండక్టర్ ని కలిసి ముసలవ్వ వివరాలు వివరించారు.


ఒక ఏడాది క్రిందటనే జరిగిన సంఘటన కావున కండక్టర్ కి అన్నీ విషయాలు జ్ఞాప్తికి వచ్చాయి. ముసలవ్వ తన 

పేరట వీలునామా వ్రాసిన 

విషయాలు తెలిసిన తరువాత కండక్టర్ కళ్ళు కన్నీళ్ళతో నిండాయి. అతడు ఆ రోజు రాత్రి జరిగిన ఘటన వాళ్ళకు వివరించాడు. అది వినిన సర్పంచ్ మరియు కార్యదర్శి లకు చాలా ఆశ్చర్యమేసింది. వాళ్లు తాము నిర్ధారించిన తారీఖున కండక్టర్ ని తమ ఊరికి రమ్మని పిలుపునిచ్చారు.


మహాదూ వేంగుర్లే కర్ పిలిచిన తారీఖున ఊరును చేరుకున్నాడు. వందలాది గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు. సర్పంచ్ గారు కండక్టర్ మెడలో ఒక పూలమాల వేశాడు. బాజా బజంత్రీలతో అతడిని గ్రామ పంచాయితీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

అందరూ సభగా కూడిన తరువాత సర్పంచ్ గారు ముసలవ్వ తన పొలం మరియు ఇల్లు కండక్టర్ పేరట వ్రాసిన పత్రాలు మరియు రెండున్నర తులాల బంగారు కండక్టర్ చేతుల్లో ఉంచారు. అవి అందుకొని కండక్టర్ తన     దుఃఖాన్ని ఆపుకోలేక పోయాడు.


ముసలవ్వ కు తాను చేసిన చిన్నపాటి సహాయం తో ఆమె ఇంత విలువైన సంపదను తన

పేరట వ్రాయటం అతడికి మతి

పోయినట్లు అయింది.!



అక్కడ సమీపం లో పిల్లల గోల

వినపడింది. "ఇక్కడ ప్రక్కన బడి ఉందా? " అని అడిగాడు

కండక్టర్.


"ఔను, ఈ బడి కోసం స్వంత స్థలం లేదు మరియు భవనం కూడా లేదు. అందుకే మా

 కాత్వాన్ గ్రామ పంచాయితీ అధీనంలో ఉన్న ఈ స్థలం లో సరిపోని ఇరుకు గదుల్లో మా

హైస్కూల్ నడుస్తుంది. " అని

చెప్పాడు సర్పంచ్ . 

" ఏం..? దగ్గర్లో బంజరు భూమి లేదా? ఊర్లో ఎవరో ఒకరు బడి

నిమిత్తం తమ భూమి లోని కొంత భూమి బడి కోసం దానం యిచ్చే వాళ్లు లేరా?" అని మళ్ళీ అడిగాడు కండక్టర్.


" ఊర్లో బంజరు భూమి లేదు. బడి కోసం తమ పొలం ఇవ్వటానికి ఊర్లో ఎవరూ

ముందుకు రావటం లేదు." అని

జవాబిచ్చాడు సర్పంచ్ .


వెంటనే కండక్టర్ తన కుర్చీ లోంచి లేచి నిలబడ్డాడు. టేబల్ పైన ఉంచిన ముసలామె కాగితాలు సర్పంచ్ కు అందిస్తూ -" ఇదిగో సర్పంచ్ గారు పాఠశాల నిర్మాణానికి ముసలవ్వ పొలం మరియు ఇంటి కాగితాలు తీసుకొండి. ఈ పొలం మరియు ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో పాఠశాల నిర్మాణ పనులు మొదలు పెట్టండి. ఇదిగో అవ్వ ఇచ్చిన

బంగారం తీసుకొండి . దీన్ని అమ్మి వచ్చిన డబ్బుతో అవ్వ పేరట బడికి ఒక భవ్యమైన ప్రవేశద్వారం నిర్మించండి మరియు దాని పైన అవ్వగారి పేరు అందమైన అక్షరాలతో లిఖించండి. " గ్రామస్తుల చప్పట్లతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. సర్పంచ్ మరియు ఊరు జనం భావుకులయ్యారు. "పాఠశాల  కు అవ్వ పేరు పెట్టుకుందాం!!" అని అందరూ మురిసి పోయారు.


కండక్టర్ మహాదూ వేంగుర్లేకర్ అందరికి ధన్యవాదాలు చెప్పి వెళ్లటానికి సెలవు పుచ్చుకుని నడవసాగాడు. ఊరి జనం అతడిని కొంత దూరం

వెంబడించింది.


చినిగిన సంచి భుజాన ఉన్నా, కండక్టర్ ఊరి సంపదను అదే

ఊరికి ఇచ్చి వెళ్లి పోయాడు. మరో ప్రక్కన అవ్వ పేరును శాశ్వతంగా నిలబెట్టి పోయాడు.


మనం జీవితం లో ఒకరికి చేసిన

చిన్న పెద్ద సహాయం ఎప్పుడూ వృధా కాదు. ముందటి వ్యక్తి  కృతఘ్నుడైనా, మనం మన పరోపకార బుద్ధిని వదల కూడదు.


మనిషి మనిషి కి మధ్య మన మానవత్వం ఎల్లప్పుడూ బతకాలని ఈ పోస్టు ఒకరికొకరం పంపుకుందాం!!

Thursday, September 22, 2022

ఎక్కిళ్ళకు మందు

 ఎక్కిళ్ళకు మందు


మెడికల్ షాపుకు ఆతృతగా పోయి ఎక్కిళ్ళకు మందు అడిగాడు వైకుంఠం


 "ఎక్కిళ్ళు ఎంత సేపునుండి

 వస్తున్నాయ్?" అడిగాడు షాపువాడు.


"పొద్దున్నుండీ!....త్వరగా మందియ్యవయ్యా సామీ!"


షాపువాడు కౌంటర్ మీదున్న కత్తెర తిరగేసి అకస్మాత్తుగా వైకుంఠం అవాక్కయ్యేలా తలమీద ఒక్కటిచ్చి...


"ఇప్పుడెలా ఉంది!

ఎక్కిళ్ళు తగ్గాయి కదూ!

ఎప్పుడైనా ఇలా నాలా సమయస్ఫూర్తితో ఎక్కిళ్ళు వచ్చేవాడిని ఒక్కటి పీకి, వాడి ఆలోచనని డైవర్ట్ చేస్తే ఎక్కిళ్ళు ఆగిపోతాయి."

గొప్ప రీసెర్చ్ తో చెప్పాడు.


*" ఎహె! ఎక్కిళ్ళు ఇంటి కాడ మా ఆడోళ్ళకయ్యా సామీ!"*


తలమీద బొప్పి తడుముకుంటూ చెప్పాడు వైకుంఠం.



Monday, September 19, 2022

ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా.

 ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా. 



బలవంతం చేస్తే అది అత్యాచారం..,

అది అన్యాయం..

శిక్షలు సెక్షన్లు.  ❤️ లు చాలానే ఉన్నాయి.


అదే అమ్మాయికి ఇష్టం లేకుండా 

 పెళ్లి చేసి శోభనం గదిలోకి పంపితే 

అది సాంప్రదాయం....💔💔💔


ఆడపిల్ల పిల్ల జీవితాన్ని..,

పెళ్లి అనే ముసుగు వేసి..,

మెడలో బంగారు ఊరితాడు కట్టి..,

కన్నీటికి కాటుక అడ్డుగా పెట్టీ..,

గొంతులో మటకి బంగారం అడ్డుగా పెట్టీ..,

కళ్ళకు పట్టిలనే సంకెళ్లు వేసి..,

సంప్రదాయం...అనే నేరం అంట గట్టి..,

పడక గది అనే జైలుకి పంపి..,

పంటిగట్లకి నలిగిన పరువాలని..

మొదటి రాత్రి..అని నచ్చ చెప్పి..,

సుకుమారంగా పెరిగినా  అమ్మాయిని..,

ఒక్క వేశ్య గా మార్చిన వ్యవస్థ..,

ఎక్కడో పుట్టి ఇంకెక్కడో..,. 

పెరిగి చివరికి ముక్కు మొహం తెలియని  ఇంటికి పంపించి..,

ఇదే నీ సంసారం తల్లి అని ఏడుస్తూ చేస్తున్న పెళ్ళిలు చాలానే ఉన్నాయి

తల్లి తండ్రులకి..,

నేను చెప్పాలి అనుకున్నది..,

ఒక్కటే పెళ్లి చేసే ముందు ఇష్టం ఉంది లేదో కనీసం..,

తెలుసుకోండి...ఇష్టం లేదు అంటే ఎవడినో...ప్రేమిస్తుంది అనే..,

ఆలోచన దగ్గర మి పెద్దరికం..ఆగిపోయింది..,

ఇష్టం లేదు అని చెప్పడానికి..,

జీవితంలో చాలా కారణాలు ఉన్నాయి ఉంటాయి..,

వాటిని తెలుసుకునే. ప్రయత్నం చేయండి .

వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?

 వీలుంటే ఈ క్రింది సమాచారాన్ని చదవండి.  తప్పనిసరిగా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నామన్న సంతృప్తి కలుగుతుంది. 🙏😊




*వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?

                🌷🌷🌷


"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః "

- అంటే అర్ధం తెలుసా???

SUN'DAY

MO(O)N'DAY

TUESDAY

WEDNESDAY

THURSDAY

FRIDAY

SATUR(N)DAY

- అంటే ఏమిటో తెలుసా?

అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?


వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?

సూర్యహోర

చంద్రహోర

కుజహోర

బుధహోర

గురుహోర

శుక్రహోర

శనిహోర - అంటే తెలుసా?

ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగమని తెలుసా?

ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టే, బ్రిటిష్ వాళ్లు వీటిని తమ క్యాలెండర్ లో పేర్లు మార్చి, వాటిని వారి విజ్ఞానంగానే ప్రపంచాన్ని నమ్మిస్తున్నారని తెలుసా?

తెలియదా!? 

సరే... ఇప్పుడైనా తెలుసుకుందాం! రండి!

ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి!

వారము - అంటే 'సారి' అని అర్ధము.

1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!

కాస్త విపులంగా....

భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. 

భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే. 

ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.


#మందా_మరేడ్య_భూపుత్ర_సూర్య_శుక్ర_బుధేందవః

అనగా... పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి. 


ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి? 


ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా?

ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.


భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. 

ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.

ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. 

ఆ భాగాలను వారు "హోర" అన్నారు.

"అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది.

దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు. 

ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.

హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.


ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. 

ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది. 

కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.

మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు - మంగళవారం,

ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.

ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.

అయితే... ఈ విధానం వినడం కొత్త అయిన హేతువాద, నాస్తిక, పచ్చ బాబులకు... మొదటి రోజు సూర్యోదయ సమయానికి సూర్యహోర అవుతుందనుకుంటే కదా ఈ లెక్కలన్నీ...ఇలా వచ్చేది! 

అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం. 

వస్తున్నా... అక్కడికే వస్తున్నా...

ఎందుకనుకోవాలంటే - సూర్యుడి(ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. 


దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆగ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు.

అదే మొదటిరోజు. 

అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.

ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే. 

అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది.


అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.

ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది. 


ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా " ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?" అనే విషయం తెలియదు. 


అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం! 


కాబట్టి హేతువాదులని చెప్పుకునే కుహనా మేధావులారా! అన్యమత సంస్కృతులను మూఢాచారాలని నమ్మే కమ్మే వారాల పేర్లు ఇతరమత  గ్రంథాల్లో ఇమడవు కదా! 


మరి ఆ మాక్స్ ముల్లరూ, విలియం జోన్సూ, రిస్లే బాస్టెడూ ఎందుకు వీటిని తీసెయ్యలేకపోయారూ? 

పేర్లు మార్చి, కాపీ కొట్టి ఇవి మావేనని ఎందుకు జబ్బలు చరుచుకుంటున్నారు ఆ?? ఎందుకంటే ఇవి బైబిల్ చట్రంలో ఇమడలేదు, తీసెయ్యడానికి కుదరలేద!


అదీ...భారతీయ ఋషుల గొప్పదనం! 

నేటికైనా తెలుసుకోండి.. తెలియకపోయినా పాటించండి! సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతీదీ మనిషికి పనికొచ్చే సైన్సే తప్ప వేరే కాదు 

🙏🙏🙏🙏🙏

Dignity of Labour

 Dignity of Labour


కొత్త చెప్పులు కొందామని 

ఓ ప్రముఖ చెప్పుల 

దుకాణం కు వెళ్ళాను,

షాపులోని సేల్స్ మేన్ 

నాకు రక, రకాల 

క్రొత్త చెప్పులు చూపిస్తున్నాడు, 


కానీ సైజు కరెక్ట్ ఉంటే 

చెప్పులు నచ్చడం లేదు, 


నచ్చిన చెప్పులు సైజు సరిపోవడం లేదు, 


అయినా పాపం సేల్స్ మేన్ ఓపిగ్గా ఇంకా కొత్తరకాలు తీసుకొచ్చి చూపిస్తున్నాడు,


అంతలో షాపు ముందు 

ఓ పెద్ద కారు వచ్చి ఆగింది, 


అందులోనుండి 

ఓ వ్యక్తి హూందాగా 

షాపులోకి వచ్చాడు, 


ఆయన్ని చూడగానే సేల్స్ మేన్స్ అందరూ మర్యాదగా లేచి నిలబడి 

నమస్కారం చేసారు, 


ఆయన చిరునవ్వుతో యజమాని సీట్లో కూర్చొని దేవునికి నమస్కారం చేసి 

తన పనిలో 

నిమగ్నం అయ్యారు, 


మీ యజమానా? 

అని సేల్స్ మేన్ ను అడిగాను, 


అవును సార్, 

ఆయన మా యజమాని ,


ఇలాంటి షాపులు ఆయనకు 

ఓ పది వరకు ఉంటాయి, 


చాలా 

మంచి మనిషి అండి అని  

ఓ క్రొత్త రకం 

చెప్పుల జత చూయించాడు, 


ఆ చెప్పుల జత చూసే సరికి నాకు తెలియకుండానే నా పెదాల మీద చిరునవ్వు వచ్చేసింది, 


కానీ సైజే కాస్త అటు, 


ఇటు గా ఉన్నట్టుంది, 


చెప్పుల జత నాకు నచ్చిన విషయం సేల్స్ మేన్ కనిపెట్టినట్టున్నాడు ,


ఎలాగైనా నాతో 

ఆ చెప్పులజత కొనిపించేయాలని 

తెగ ఆరాట పడుతున్నాడు, 


కాస్త బిగుతుగా ఉన్నట్టున్నాయి కదా అంటే, 

అబ్బే అదేం లేదు సార్, 


మీకు కరెక్ట్ సైజే అంటూ బలవంతపెట్టడం మొదలుపెట్టసాగాడు, 


ఇదంతా గమనిస్తున్న 

షాపు యజమాని లేచివచ్చి

నాముందు క్రింద కూర్చుని 

సార్ 

ఓసారి మీ పాదం 

ఈ చెప్పులో పెట్టండి 

అని నా పాదం ను తన చేతిలో

తీసుకుని చెప్పును తొడిగాడు,, 


నాకు అంత పెద్ద మనిషి

(వయసు లో పెద్ద, 

హోదాలో కూడా) 

నా పాదం ముట్టుకుని 

చెప్పు తొడుగుతుంటే 

ఇబ్బంది గా అనిపించింది, 


పరవాలేదులెండి సర్ 

నేను  తొడుక్కుంటాను లెండి

అని వారిస్తున్నా 

అతను వినకుండా 

రెండు కాళ్ళకు 

తన చేతులతో 

నాకు చెప్పులు తొడిగి 

లేచి నిలబడి 


ఓసారి నడిచి చూడండి సర్, 

మీకు కంఫర్ట్ గా 

ఉన్నాయో లేదో, 

లేకుంటే 

మరో జత చూద్దాం అన్నారు, 

కానీ 

ఆ జత సరిగ్గా సరిపోయాయి, 


నేను బిల్ పే చేస్తూ షాపు యజమాని తో మనసులో మాట బయటపెట్టాను, 


సర్ మీరు ఈ హోదా లో ఉండికూడా మా పాదాలు పట్టుకుని మరీ చెప్పులు తొడగడం మాకు ఇబ్బంది గా ఉందండీ? అన్నాను,


ఆయన చిల్లర తిరిగి ఇస్తూ చిరునవ్వుతో సర్! 


ఇది నా వృత్తి, 

నాకు దైవం తో సమానం, 


"షాపు బయట 

మీరు కోటి రూపాయలు ఇస్తాను అన్నా 

నేను మీ పాదాలు ముట్టుకోను, 


అదే షాపు లోపల 

మీరు కోటి రూపాయలు ఇచ్చినా 

మీ పాదాలు వదలను "

అన్నారు.. 


నాకు ఆశ్చర్యమేసింది,

ఎంత గొప్ప వ్యక్తిత్వం! 


Dignity of labour 

******************


తను చేసే పని మీద గౌరవం, నిబద్ధత! 


ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పాఠం నేర్పడానికి నాకు దేవుడు పంపిన 

గురువు లా కనిపించారు,


మనం చేసే పని చిన్నదా? పెద్దదా? అన్నది కాదు సమస్య, 


న్యాయబద్ధ మైందా? కాదా అని చూడాలి, న్యాయబద్ధమయినప్పుడు చేసే చిన్న పనికి సిగ్గు పడకూడదు.

 

ఎప్పుడూ 

మనం చేసే పనిని కానీ, 

ఉద్యోగంను కానీ తిట్టరాదు, 


అదికూడ లేక రోడ్ల మీద 

వృధా గా తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారని 

గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను.🙏🙏


సూటు బూటు వేసుకొన్న స్వామి వివేకానంద

సూటు బూటు వేసుకొన్న స్వామి వివేకానంద


 *డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు దిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి.* *ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ వ్యక్తి గుర్తుకొచ్చాడు , అపుడు ఆ ముగ్గురూ ఆయన వంక చూసి ఆశ్ఛర్యపోయారు. ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ పైకి అనుకొని , టై ను భుజం వెనక్కి వేసుకొని , జాకీ , స్పానర్ తీసుకొని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు.*

 *ఈ ముగ్గురూ అవాక్కయ్యారు.  కారణం ఆ నాల్గవ వ్యక్తి #రతన_టాటా.  '' సార్ , మీరు ? '' '' అవును ,  మనం మీటింగ్ కు వెళ్ళాలి , టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 ని. సమయం పడుతుంది , కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లో అతను ఆ పని పూర్తీచేస్తాడు. మనకు 7 ని. కలిసొస్తాయి కదా ? ''  అన్నారు రతన్ టాటా. [ Respect to Time is Respect to Life ]* 


 *TATA Group ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది !* 


 *బాల్యంలో  ఆయన తల్లి తండ్రులు విడిపోయారు , అవ్వ పెంచిపెద్ద చేసింది.* 


 *యవ్వనంలో ఆయన girl friend  మోసం చేసింది.* 


 *ఆ తరువాత కంపెనీకి విపరీతమైన నష్టాలు , సవాళ్ళు ఎదురయ్యాయి.* 


 *కానీ ఆయన తన మంచితనాన్ని , దయను , లక్ష్యాన్ని , నిజాయితీని , సమయపాలనను , క్రమశిక్షణను , కఠోర పరిశ్రమను మరచిపోలేదు. #TATA సంస్థను ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చారో క్రింద వివరాలు చదివితే తెలుస్తుంది :* 


 *టాటా సంస్థ అయిన #TCS  యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం.*  


 *భారతదేశపు GDP కి TATA సంస్థ ఒక్కటే 4 % కాంట్రిబ్యూట్ చేస్తుంది.* 


 *ప్రతి ఏటా  అస్సాం , ఒడిషా , హిమాచల్ ప్రదేశ్ , గోవా లు కలిపి ఎంత tax కడతాయో అంత tax ను ఒక్క TATA సంస్థనే దేశానికి చెల్లిస్తుంది. [ 50000 + కోట్లు ]*  


 *నవంబరు 26 , 2008 లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని TATA సంస్థ యొక్క #TajHotel మీద ఆత్మాహుతి దాడి చేసి వందలమందిని చంపిన సంఘటనలో, చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి  ఒక్కొక్కరికీ 25 నుండీ 50 లక్షల దాకా సహాయం అందించారు రతన్ టాటా ; ఆ సమయంలో తమ హోటల్ లో డ్యూటీలో వుండి మరణించిన  , గాయపడిన ప్రతి పోలీసు , ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబంలో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు , వాళ్ళ పిల్లల చదువు , పెళ్ళిళ్ళ  బాధ్యతను తానే తీసుకొన్నారు;* 


 *అంతకంటే ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్ కు వచ్చివుంటుంది , ఆమెను గది బయటపెట్టి ఆమె తండ్రి , మామయ్య toilet లోకి వెళ్ళివుంటారు , అప్పుడే ఆ దాడి జరిగింది , వాళ్ళిద్దరూ మరణించారు. ఆ చిన్న పాప బ్రతికింది , తరువాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు , స్త్రీలు , వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందలమందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను గుర్తుపట్టింది ఆ చిన్న పాపనే. ఆ చిన్న పాపను ఆసుపత్రిలో చేర్పించి , కోలుకొనేలా చేసి , ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి , ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి , ఆమె పెళ్ళి బాధ్యతను కూడా కూడా రతన్ టాటా నే తీసుకొన్నారు. మరో ఆశ్చర్యమేమంటే  ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళుతున్న , అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు [చేపలు పట్టడం ,  పావ్ బాజీ , పానీపూరి , భేల్ పూరి , పాన్ బీడా , చాయ్ దుకాణాల ]*  *నడుపుకొనేవారికెవ్వరికీ TATA సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా , వారందరికీ నష్టపరిహారం అందించారు రతన్ టాటా. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యమేమంటే ఈ అన్ని పనులనూ రతన్ టాటా దాడి జరిగిన తరువాత కేవలం 20 రోజుల్లో పూర్తీచేసేశారు.* 


 *అందుకే ఆయన గురించి ఒక స్నేహితుడు ఇలా వ్రాశాడు :  Don't mess with him ; if you give him Deep Insults , he will transform them into Deep Results.*  


 *నా దృష్టిలో రతన్ టాటా సూటు బూటు వేసుకొన్న స్వామి వివేకానంద. ఇద్దరూ బ్రహ్మచారులే. మొదటి వ్యక్తి '' ధ్యానంతో '' దేశాన్ని మార్చాడు, రెండవ వ్యక్తి ''ధనంతో "  దేశాన్ని సేవిస్తున్నాడు.* 


ఐశ్వర్యం అంటే

 

🌹🌿 ఐశ్వర్యం అంటే 🌹🌿

*🥀 ఇంటి గడపలలో ఆడపిల్లల గజ్జల చప్పుడు "ఐశ్వర్యం"!*

*🥀 ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య "ఐశ్వర్యం"!*

*🥀 ఎంత ఎదిగినా,నాన్న తిట్టే తిట్లు "ఐశ్వర్యం"!*

*🥀 అమ్మ చేతి ఆవకాయ ఐశ్వర్యం, భార్య చూసే ఓర చూపు "ఐశ్వర్యం"!*

*🥀 పచ్చటి చెట్టు,పంటపొలాలు ఐశ్వర్యం,వెచ్చటి సూర్యుడు "ఐశ్వర్యం"!*

*🥀 పౌర్ణమి నాడు జాబిల్లి "ఐశ్వర్యం"!*

*🥀 మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం"!*

*🥀 పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు "ఐశ్వర్యం"!*

*🥀 ప్రకృతి అందం ఐశ్వర్యం,పెదాలు పండించే నవ్వు "ఐశ్వర్యం"!*

*🥀 అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు  "ఐశ్వర్యం"!*

*🥀 బుద్ధికలిగిన బిడ్డలు  "ఐశ్వర్యం"!*

*🥀 బిడ్డలకొచ్చే చదువు  "ఐశ్వర్యం"!*

*🥀 భగవంతుడిచ్చిన ఆరోగ్యం  "ఐశ్వర్యం"!*

*🥀 చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి  "ఐశ్వర్యం"!*

*🥀 పరులకు సాయంచేసే మనసు మన  "ఐశ్వర్యం"!*

*🥀 కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం*

*🥀మనసు పొందే సంతోషం ఐశ్వర్యం*

*🥀 ఐశ్వర్యం అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు,*

*🥀మీకు ఉన్న ఐశ్వర్యం ఏమిటో గుర్తించండి. దానిలో హాయిగా జీవించండి..*

🍀🪷💧🌻🌹🌿

నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ...

 ‘ నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ... 

ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు . 

*పైనున్న భగవంతుడికి తెలుసు. .......              

                                                     *2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. అందులో ఒక ఆసక్తికరమైన అంశం వెల్లడైంది...*


*🔆--సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట.*

 

*తన కన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట.* 

*భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవడానిక ఇది కూడా ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారు._*

                                                                                                            *--భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు...*

 

*కొందరు ప్రబుద్ధులైతే పురుషాహంకారంతో కొడతారు కూడా !* 


*ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం  తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులక ఉండదు  --*


✳️ _*‘ఆమె’ లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం వా మగానుభావులు..*


 *ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక..అందరితో కలవలేక.. మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు !!_*

                                                                                                                                                                                      ✳️_'‘ *నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు* . 

*పైనున్న భగవంతుడికి తెలుసు.*

 *ఒరే.. పచ్చటి చెట్టుకింద కూర్చుని చెబుతున్నా. ‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు.* 

*ఆ తర్వాత నా సంగతి చూడు’*

*అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని.*

*‘మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా అని అనుకోకు... వుంటారు.* 

*నాకు మీ మావయ్యంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది.* 

*చీకటంటే భయం.* 

*ఉరిమితే భయం.* 

*మెరుపంటే భయం.* 

*నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు ?* 

అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని 

లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు ?’’...  *ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది !_*

                                                _

        ✳️   *నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా ? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన ! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు._*

                                                                                                                                                 ✳️  *_ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం.. భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిపోయిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు._*

                                                                                                                                                                                                                                                                                                                                                       ✳️  *_సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని..*


*తాను తప్ప ఆమెకు దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు.* 


*కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు.*

 

✳️🥎🥎 *భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది.*


 *భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది.* 

*భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు.*


✳️🟡_ *స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది*. 


తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. 

*అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురుచూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది.* 

*ఆ మనోబలమే... భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది._*

                                                                                                                                                                                                                             🌈_*భావోద్వేగ బలం ఆమెదే :-*_


_పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, *స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది*. 

సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. 

ఒక విధంగా చెప్పాలంటే.. 

ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. 

ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. 

ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది..


🌈 -- *అందుకే ఆడదే మగాడికి సర్వస్వం*...యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత.... 


*Save Girl Child and Respect women......*🙏🙏🙏🙏🙏

Sunday, September 18, 2022

ఇంటిపేర్లతో వచ్చిన తంటాలు


ఇంటిపేర్లతో వచ్చిన తంటాలు


అరవై దాటేలోపు ఆరుసార్లు అమెరికాకైతే వెళ్ళగలిగాను కానీ ఫ్లైట్లో ఇచ్చిన చిన్నఫారమే సరిగ్గా నింపలేకపోయాను. ఆ ఫారమ్‌లో నేమ్‌ అన్న దగ్గర ఫ‌స్ట్‌నేమ్‌, మిడిల్‌నేమ్‌, లాస్ట్‌నేమ్‌ అని మూడుగళ్ళున్నాయి. మనకు తెలిసిందల్లా మనపేరు, దాని వెనకాముందు ఓ ఇంటిపేరు. ఆది మధ్యాంతరాలు ఏవో తెలియక ఎలాగోలా ఆ గళ్ళు నింపి బయటపడ్డా. 


ఇంటిపేర్లు తెచ్చిన తంటా ఎలాంటిదంటే ఒకసారి భయస్తుడైన ఉద్యోగి సర్‌ నేమ్‌ అన్నకాలమ్‌ ఎదుట స్వామిభక్తితో వాళ్ళ బాస్‌ పేరు రాస్తే, అతి భయస్తుడైన భర్త ఎందుకొచ్చిన గొడవని సర్‌నేమ్‌ అన్న కాలమే కొట్టేసి మేడమ్‌ నేమ్‌ అని రాసేసుకుని దాని ఎదురుగా వాళ్ళావిడ పేరు రాసేసి గొప్ప రిలీఫ్‌గా ఫీలయ్యాడట.


ఏది ఏమైనా మన వెంటే ఉండే ఇంటిపేర్లు పంచ భూతాలతో మొదలై కనపడిన దేన్నీ వదల్లా. కాదేదీ కవితకనర్హం అన్నట్లుగానే కాదేదీ ఇంటిపేరుకనర్హం. గాలి, ఆకాశం, సముద్రం, మబ్బులతో పాటుగా రోజూవారీ కాలాలైన మధ్యాహ్నం, పట్టపగలు, చీకటి, సంధ్యావందనాలు కూడా ఇంటిపేర్లయినాయి. అడవి జంతువులైన పులి, ఏనుగు, నక్క, జింక, ఎలుగుబంటిలతో పాటు సాధుజంతువులైన ఆవులు, దూడల, మేకల, పిల్లి, గుర్రం, గేదెల, ఉడుత, ఎనుపోతుల, గొఱ్ణెల, పెనుపోతుల, బల్లి, పీతల కూడా మరి కొందరి ఇంటి పేర్లయ్యాయి.


గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ కులపతిగా మేకా రంగయ్య అప్పారావు గారి తరువాత జస్టిస్‌ ఆవుల సాంబశివరావు గార్ని నియమిస్తే పత్రికల వాళ్ళు మేకలు పోయి ఆవులొచ్చాయి అని చమత్కరించారు. ఏనుగు లక్ష్మణకవి, కాశీయాత్ర రాసిన ఏనుగుల వీరాస్వామయ్య మనందరికీ పరిచయమే. గుంటూరు ప్రాంతంలో పూర్వం కొందరు ముర్రాజాతి గేదెపాలు అమ్మేవారట. ఆ గేదెకొమ్ములు జంగిలి (అడవి) దున్నల కొమ్ముల్లా ఉండటంతో వూరి వాళ్ళందరూ జంగిలి వాళ్ళింట్లో పాలు కొంటాం అనడంతో వాళ్ళ ఇంటిపేరు జంగిలి అయిపోయిందట.


మనదేశంలో ఇంటిపేర్లు అమెరికా పోయిన మన వాళ్ళకు పేర్లే కావడంతోనే ప్రమాదం. పోయినసారి అమెరికా వెళ్ళినప్పుడు మా బావ ఆనంద్‌ గారి ఇంట్లో ఫోన్‌ రింగైతే నేను ఎత్తితే అవతలి నుంచి ‘పిల్లి స్పీకింగ్‌’ అనగానే కంగారుపడ్డా. తరువాత మా బావ చెప్తే తెలిసింది వారు పిల్లి సురేష్‌ గారని. అదే ఏ పులి వెంకటరెడ్డిగారో ఎత్తితే పులి గాండ్రింగ్‌ అనో, పాముల నర్సయ్యగారో ఎత్తితే పాములు బుస్సింగో అంటారేమో. మిగిలిన వాళ్ళేం తక్కువ. వాళ్ళు దూడల స్పీకింగనో, ‘కోడి’ కేరింగనో, కాకి ‘కావిం’గనో అనేస్తే, అవి విని మనం కెవ్వుకెవ్వు అనాల్సొచ్చేది. అమెరికాలో సైతం వృత్తులను ఆధారంగా చేసుకుని ఇంటిపేర్లు వస్తాయట. కమ్మరి పనిచేసేవాళ్ళు smith లు అయితే వడ్రంగి పనిచేసే కుటుంబాలు woods అవుతారు.


మనవైపు ఊళ్ళపేర్లు ఇంటిపేర్లు కావడం సర్వసాధారణం. శ్రీరంగం, కాళహస్తి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, వారణాసి, శంకరంబాడి, ద్రాక్షారం, ప్రయాగ, కంచి, మధురాంతకం, తిరువీధుల, రామేశ్వరం, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలతో పాటు గుడివాడ, బెజవాడ, గూడూరు, కడప, కావలి, చల్లపల్లి, కొండపల్లి, గుంటూరు, టంగుటూరు, దర్శి, తెనాలి వూళ్ళు ఇంటిపేర్లయ్యాయి. నీళ్ళకు సంబంధించిన చెఱువు, బురదగుంట, కోనేరు, తూము, నూతి, కడలి, రేవు, కలువ కొలను, కాలువ ఇంటిపేర్లయ్యాయి. పక్షులైన డేగలు, కోడి, పిచ్చుకలు, కాకి, పావురాల, నెమలి, కొంగర, చిలక, పిట్టల, గువ్వల ఇంటిపేర్లే. కోడి రామ్మూర్తి గారు గతంలో గొప్ప మల్లయోధులు. ఇలాంటి ఇంటిపేర్లతో ప్రమాదమేమిటంటే డేగలవారింటి అబ్బాయికి పిచ్చుకల వారింటి అమ్మాయిని ఇవ్వడానికి వెనుకాడతారేమో. అసలే మన జాతకాలు (హర్రర్‌స్కోప్‌) చూసేవాళ్ళు దేవగణం, రాక్షస గణం, మనిషిగణం అని లెక్కలేసి అమ్మాయి పులి అయితే అబ్బాయి పిల్లి అయ్యాడనో భయపడి పులి తినేస్తుందని (కాకపోయినా అదే జరిగేది) పెళ్ళికి వెనకాడతారు. లోహాలైన బంగారు, కంచు, రాగిరెడ్డి, కనకమేడలు, ఆభరణాలైన ఉంగరాలు, వడ్రాణం, సవరం, మెట్ల, కట్టుపోగుల, గాజులు, కడియాలతోపాటు పగడాలు, ముత్యాలు, మాణిక్యాలు, రవ్వలు, వజ్రం కూడా ఇంటిపేర్లయ్యాయి. పనిముట్లైన తాపీ, వడంబం, ఉలి, వానం ఇంటిపేర్లే. తాపీ ధర్మారావు గారు గొప్పరచయిత సినీదర్శకులు.


ఉత్తర భారతదేశంలో ఇంటిపేర్ల కథ వేరే విధంగా ఉంటుంది. అగ్నిహోత్రం చేసే కుటుంబాలు అగ్నిహోత్రులు. వారణాశి ప్రాంతంలో నాలుగు వేదాలు చదివిన పండిత కుటుంబీకులు చతుర్వేదులైతే, మూడువేదాలు చదివినవారు త్రివేదిలు, రెండే చదివితే ద్వివేది. సామవేదం చదివితే సామవేదం వారౌతారు. అదే ఫ్లోలో ఏ వేదమూ చదవని కుటుంబీకుల్ని నిర్వేదులనాలేమో. బెంగాలీలో బంధోపాధ్యాయులు, చటోపాధ్యాయులు, ముకోపాధ్యాయుల్ని ఎక్కువగా చూస్తాం. నా పరిమిత జ్ఞానంతో ముకోపాధ్యాయులు అంటే ముక్కుతో చదివేవారేమో అనుకునేవాడ్ని. వాజపేయుల, సోమయాజుల ఇలాంటివే మరికొన్ని. ఉత్తర భారతదేశంలోని పేర్లమీద మోజుతో ప్రగతిశీలులైన మన తెలుగు సోదరులు కొందరు చాలాకాలం క్రిందటే వాళ్ళ పిల్లలకు టాగూరనో, రాయ్‌ అనో, ఛటర్జీ అనో, బెనర్జీ అనో, గాంధీ అనో, బోస్‌ అనో పేర్లు పెట్టేసారు. ఇలా పేర్లు పెట్టడం బాగానే ఉంది కాని నిజానికి అవి వాళ్ళ పేర్లుకావు. హౌస్‌నేమ్స్‌. ఇది గుర్రాన్ని వదిలి కళ్ళాన్ని పట్టుకున్నట్లే. పేరు ఏదైనేం లెండి అటువంటి పెద్దల పట్ల మనవాళ్ళకు గల భక్తి, గౌరవాలను మనం మెచ్చుకుందాం.


సంగీత ప్రపంచానికి చెందిన సంగీతం, చిడతల, మేళం, అందెల, గజ్జెల, తప్పెట, సన్నాయిలతో పాటు రణరంగానికి చెందిన ఈటెల, బల్లెం, కత్తుల, ఉండేలు, బాణాల, కత్తి, రంపాల కూడా ఇంటిపేర్లయ్యాయి. వృక్ష సంపదనుండి అడవి, తోట, అరణ్య, టేకు, వెదురు, రావి, తుమ్మల, మర్రి, తాడి, మామిడి, నేరెళ్ళ, చింత, జామి, నిమ్మల, నిమ్మకాయల, తోటకూర, వంకాయల, ఉల్లిలతోపాటు వండుకునే పచ్చిపులుసు, తియ్యగూరలు వచ్చి చేరాయి. సువాసనలైన గంథం, జవ్వాజి, కస్తూరిలు (‘ఇంటిపేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు’ అనే నానుడి తెలిసిందే) ఇంటిపేర్లే! మా మేనమామ గారి ఇంటిపేరు కస్తూరేగాని వాళ్ళింట్లో గబ్బిబాలు లేవు. పూలకుటుంబం నుండి పూదోట, పుష్పాల, పువ్వుల సంపంగి, మల్లెల, మొగలి వచ్చి చేరాయి. పువ్వుల సూరిబాబు గొప్ప రంగస్థల నటులు. పాలకు పలురూపాలైన పాలపర్తి, మజ్జిగ, పెరుగు, వెన్న, నేతి, చల్లలు ఇంటిపేర్లే అల్లం, మిరియాలు, శొంఠిలతోపాటు కారం, ఉప్పు, బెల్లపు కూడా ఇంటిపేర్లే. పాయసం, పానకం, గంజి కూడా ఇంటిపేర్లే.


పెద్దరికాల్ని, పెత్తనాల్ని తెలియజేసే కమతం, సుంకం, సేనాని, మంత్రం, పట్వారి, కరణం, రాయల, అధికారి, యాజమాన్యం, పెద్దింటి, దళవాయి, తలారి, టంకశాల, నీరుకట్టి, సంధానపు, మహాపాత్ర, వాడ్రేవు, పుట్రేవు, పెద్దింటి, పెద్దిరెడ్డిలు ఇంటిపేర్లే. కరణం మల్లీశ్వరి గొప్ప క్రీడాకారిణి. తలారి అనంతబాబు గారు ప్రఖ్యాత న్యాయవాది. మనశరీరంలోని గెడ్డపు, మీసాల, గడ్డం, సవరం, కొప్పు, కొప్పుల, శ్రీపాద, బొడ్డు, బుర్రా, బొజ్ఞా, కడుపు, చెవి, మెడబలిమి, ముక్కు, తలతోటి, పచ్చిగోళ్ళు, గుంటకండ్ల, మొండెం కూడా ఇంటిపేర్లే. న్యాయవాదులుగా ఖ్యాతిపొందిన కొందరికి ప్రతివాది, మహావాదిలుగా ఇంటిపేర్లయ్యాయట.


కొంతమంది అదృష్ట దీపక్‌లను చూస్తే ఆవగింజంత విద్వత్తు, ప్రతిభలేకపోయినా (కాకా) పట్టు పరిశ్రమలో శ్రమించడం వలన రాజ్యసభసభ్యులుగా, ఛైర్మెన్‌లుగా ఎదగడం చూసిన తరువాత వారి ఇంటిపేర్లును ‘పట్టు’ గా మార్చేసి పట్టుప్రవీణ్‌, పట్టుప్రసాద్‌ అనాలపిస్తుంది. సాధారణంగా వీరికి ఏ పార్టీ సిద్ధాంతల మీద నమ్మకం ఉండదు. వీరు మేము ఎప్పటికీ రూలింగ్‌ పార్టీనే అని రూలింగ్‌ ఇచ్చుకున్నఘనులు కనుకనే ఎప్పుడూ ఏదో ఒక పదవిలో ఉండగలరు. వీరి చేత Great Art of Staying in Power అన్న పుస్తకం రాయిస్తే The Best Seller అయిపోతుంది. వీరు సిల్క్ బోర్డ్‌ అధ్యక్షులు కాదగినవారు. పట్టు తోబుట్టువు పుట్టు. కేవలం కొంతమందికి పుట్టినందుకు వీరు నటులైతే తెరంగేట్రం చేసేసి, నాయకులైతే యువనాయకులై పోయి మనల్ని వినోదింపజేస్తున్నామని, సేవించేస్తున్నామని భ్రమింపచేస్తారు. వెనకటికి బ్యాట్‌ ఎటువైపు పట్టుకోవాలో కూడా సరిగ్గా తెలియని యువకుడు ముఖ్యమంత్రి కుమారుడైనందున ఏకంగా రంజీట్రోఫీనే ఆడేశాడు. ఇలాంటి వాళ్ళ ఇంటిపేరు ‘పుట్టి’ గా మార్చేస్తే సరిపోతుంది. నాట్యంలో ముద్రలంటే పోస్టాఫీస్‌ ముద్రలనుకునే వాళ్ళకు పద్మశ్రీలు వచ్చాయిగా. వీళ్ళూ పట్టు పారిశ్రామికులే. వీరి పుణ్యాన పట్టు పరిశ్రమకున్న డిమాండ్‌ ఇంక దేనికీ లేదు.


దేవతారాధనకు సంబంధించిన దీపాల, కర్పూరం, పరమాత్ముని, దేవభక్తుని, దర్భశయనం, బృందావనం, అయాచితం, నటేశం, అగ్నిహోత్రం, అగ్రహారం, పూజారి, మహంకాళి, శ్రీరామకవచం, సంకీర్తనం, సుదర్శనం, అర్చకం, పంచాగ్నుల, పండితారాధ్యుల, శ్రీరామ్‌, ద్వాదశి, నమశ్శివాయ, విష్ణుమొలకల, సరస్వతుల, భాగవతుల, రామాయణం, గుడిసేవ, గుడిమెట్ల లు ఇంటిపేర్లు. పెళ్ళికి సంబంధించిన కళ్యాణం, మేళం, అగ్నిహోత్రం ఇంటిపేర్లే. కళ్యాణం రఘరామయ్యగారు మన తొలి సినిమా కృష్ణులు, ఈలపాటకు ప్రసిద్ధులు.


ఇవన్నీపోగా ఏ కోవకు చెందని ప్రత్యేకంగా అనిపించేవి కర్రతలుపులు, కిళ్ళి, అధ్వానం, చప్పిడి, కొండబోయిన, చోద్యం, జగడం, మొండి, శరణు, శకునాల, ఆకలి, తీగెల, కోడెబోయిన, (ఎన్నిసార్లు దూడల్ని పోగొట్టుకుంటే వారికీ ఇంటిపేరు దక్కిందో) దూడబోయిన, కొత్తావకాయ లాంటివి. ఏది ఏమైనా ఇంటిపేర్లు వాటి పుట్టుపూర్వోత్తరాలు మంచి పరిశోధనాయోగ్యమైన విషయమే. అవి తెలుసుకునే కొద్దీ, చరిత్ర, సమాజం పరిణామాలతోపాటు వలసలు, వృత్తులు గురించి మరింత తెలుసుకోవచ్చు.

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE