NaReN

NaReN

Sunday, June 8, 2025

తండ్రి కూతురు

 తండ్రి కూతురు

అన్నీ సర్దుకున్నావా తల్లీ, ఇంకోసారి చూసుకో అక్కడ నువ్వు బయటకు వెళ్లి తెచ్చుకోవడానికి లేదు, నిన్ను బయటకు ఎవరూ తీసుకువెల్లరు మల్లీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, మీ అమ్మమ్మ నిన్ను చూడాలంది కాబట్టి నిన్ను పంపిస్తున్నాం. 


నిజానికి నిన్ను అక్కడికి పంపించడం నాకు అసలు ఇష్టం లేదు, కాని తప్పట్లేదు అని తన నిస్సహాయతకు బాధపడుతూ కూతురు భానుమతితో చెప్తూ ఉన్నాడు భగత్. 


నేను అన్నీ సర్దుకున్నాను నాన్న, నువ్వేం కంగారుపడకు , నాకు తెలీదా అక్కడికి వెలితే మల్లీ బయటకు రాలేనని, నేను ఈజీగా ఇమిడిపోతాను నాన్న అక్కడ, భయపడకు వెలదామా అని అడిగింది భానుమతి. 


మీ అమ్మ ఎక్కడికి వెల్లిందిరా అని అడిగాడు భగత్. 


ఇప్పుడదంతా అవసరం లేదు నాన్న, నేను లేనప్పుడు అయినా అమ్మను తిట్టకుండా ఉండు, చెల్లి జాగ్రత్త అని చెప్పి తన   క్రచ్ ( నడవడానికి సపోర్ట్ గా ఉండే కర్ర) తీసుకుని కుంటుకుంటూ బయటకు నడిచింది భానుమతి. 


లగేజ్ ని పట్టుకుని భగత్ ముందు వెలితే, చేతికర్ర సహాయంతో మెల్లగా నడుచుకుంటూ బయటకు వచ్చింది భానుమతి. 


ఆమె ఎప్పుడెప్పుడు ఇంట్లో నుండి బయటకు కాలు పెడుతుందా అని ఎదురుచూస్తుంది భానుమతి పినతల్లి పార్వతి. 


పేరుకి పార్వతీ అయినా రాక్షస గుణం నుండి వచ్చిందనడానికి ఏమాత్రం తీసిపోదు ఆమె ప్రవర్తన. 


ఊ ఊ అంటూ మూతి తిప్పుతూ, రావే దరిద్రం మన ఇంటిని వదిలి ఇన్ని రోజులకు పోతుంది, ఇల్లు కడిగి శుభ్రం చేసుకుందాం అంటూ తన కూతురు అయిన త్రిశూలని పిలిచి చెప్తుంది పార్వతి. 


నేనెందుకు క్లీన్ చేయాలి అమ్మా, పనివాళ్లు ఉన్నారు వాల్లకు చెప్పు, నాకు డస్ట్ అంటే పడదు అని నీకు తెలుసు కదా అంటూ ముఖం చిట్లిస్తూ మాట్లాడి, వెలుతున్న భానుమతిని చూస్తుంది త్రిశూల. 


అవన్ని మాటలు తనకు వినిపించనట్టుగా గేట్ దాటి వెలిపోతుంది భానుమతి, భగత్ కూతురికి నూటొక్క జాగ్రత్తలు చెప్పి జాగ్రత్త తల్లి వెళ్లగానే ఫోన్ చేయు, నిన్ను ఈ టైమ్ లో పంపిస్తున్నందుకు నన్ను క్షమించరా . 


నీతో పాటు వస్తే మీ అమ్మ అరచి గోల చేస్తుంది, వెళ్లగానే ఫోన్ చేయు తల్లి అంటూ చెప్పి టైమ్ చూస్తాడు. 


అప్పటికి రాత్రి పది గంటలు అవుతుంటే టెన్షన్ గా ఉంటుంది అతనికి ఒంటరిగా ఆడపిల్లని అంత దూరం పంపిస్తున్నాము అందులో కాలు కూడా సరిగ్గా లేదు అని. 


అతని భయాన్ని అర్థం చేసుకున్న భానుమతి తండ్రి చేతిని పట్టుకుని, నేను జాగ్రత్తగానే వెలతాను నాన్న, వెల్లగానే ఫోన్ చేస్తాను అని తండ్రికి ధైర్యం చెబుతుంది. 


ఇంతలో బుక్ చేసుకున్న బస్ రావటంతో, క్లీనర్ ఫోన్ నంబర్ తీసుకుని, దిగేటప్పుడు జాగ్రత్తగా దించండి బాబు అంటూ అతనికి చెప్పి ఆమె సీట్ లో కూర్చునే వరకు చూసి అప్పుడు బస్ దిగుతాడు భగత్. 


తండ్రి కేరింగ్ కు మురిసిపోతూ వెల్లొస్తాను నాన్న అంటూ చెప్పి, బస్ బయలుదేరగానే కల్లు మూసుకుంటుంది సీట్ బెండ్ చేసి. 


భానుమతి చురుకైన పిల్ల, తల్లి చిన్నప్పుడు చనిపోతే అతని ఇంటివారు మల్లీ పెల్లి చేసారు భగత్ కి అతను వద్దని ఎంత చెప్పినా వినకుండా, ఆ ఇంటికి కోడలుగా వచ్చిన పార్వతి అతనికి భార్య అయింది కాని భానుమతికి తల్లి కాలేకపోయింది.


భగత్ ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా చూసుకునేది భానుమతిని. 


భగత్ ఆ విషయం తెలుసుకుని నిలదీస్తే, మీకు మీ కూతురే ఎక్కువా అంటూ ఏడుస్తూ గొడవపడి విషం తాగడానికి ప్రయత్నించింది. 


అప్పటికే రెండు సంవత్సరాల త్రిశూల ఉంది ఆమెకు, ముందున్న భార్యను పోగొట్టుకుని భానుమతి తల్లి లేనిది అయిపోయిందనే ఆమె కోసం మల్లీ పెల్లి చేసుకున్నాడు, ఇప్పుడు పార్వతి కూడా అలా అయితే ఎలా అని భయపడ్డాడు, పార్వతికి ఎదురు చెప్పడం మానేసాడు కాని భానుమతి విషయంలో ఆమెతో గొడవలు పడుతూ ఉంటాడు. 


అప్పటినుండి బానుమతికి దూరంగా ఉన్నా, తండ్రి ప్రేమ పంచుతూనే వచ్చాడు, తరువాత కొన్ని రోజులకు బానుమతికి ఒక యాక్సిడెంట్ లో ఒక కాలు విరిగి, అది అతుకకుండా ఉండిపోయింది. 


ఎవరి మీద ఆధారపడని భానుమతి కాలు విరిగాక కూడా తన పనులు తను చేసుకుంటూ ఉంది, ఆమెకు స్నేహంగా తన దగ్గర ఉన్న చేతికర్రే తోడుగా మారింది. 


ఇప్పుడు భనుమతి వెళుతుంది తన కన్న తల్లి పుట్టిన ఇంటికి, తన అమ్మమ్మ ఇంటికి. 


భానుమతి అమ్మమ్మ పేరు ఇందిరా, తన కూతురు చనిపోయినప్పటినుంచి , ఆ ఇంటికి ఈ ఇంటికి మాటలు తగ్గిపోయాయి, భానుమతిని చూడాలనిపించడంతో భగత్ గారికి ఫోన్ చేసి పిల్లను పంపించు ఇక్కడ కొన్ని రోజులు ఉంచుకుని పంపిస్తాను అని చెప్పింది. 


పెద్దావిడ గారి మాటలు కాదనలేక భానుమతిని హైదరాబాద్ కి పంపిస్తున్నాడు భగత్. 


విజయవాడలో రాత్రి బస్ ఎక్కితే పొద్దున దిగుతారు, సేఫ్టీ చూసి మరీ భానుమతికి బస్ ఎక్కించి ఇంటికి వచ్చాడు భగత్. 


పొద్దున ఎనిమిది గంటలకు హైదరాబాద్ లో బస్ దిగిన భానుమతి ఆటో తీసుకుని ఇందిరా గారి ఇంటిముందు దిగింది. 


ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఇందిరా గారిది. 


ఇందిరా గారికి ఇద్దరు పిల్లలు, ఒకరు భానుమతి వాల్ల అమ్మ అయితే ఇంకొకరు మోహన్ గారు. 


మోహన్ గారు ఒక కంపెనీలో మానేజర్ గా వర్క్ చేస్తూ, పెల్లి చేసుకుని ,రాను రాను తనే ఒక కంపెనీ పెట్టేంతగా ఎదిగిపోయాడు మోహన్, తన చెల్లిని మంచిగా ఉన్నటువంటి ఇంటికే ఇచ్చారు, భానుమతి పుట్టగానే తన చెల్లెలు చనిపోయేసరికి దూరం వచ్చేసి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. 


మోహన్ కి ఒక కొడుకు ఒక కూతురు, కొడుకు భార్గవ్, కూతురు భవిక. 


భార్గవ్ మంచిగా చదువుకుని  ఇప్పుడు ఒక లెక్చరర్ గా స్థిరపడ్డాడు, భవిక ఇప్పుడు ఎం. బి. ఎ ఫస్ట్ ఇయర్ లో ఉంది. 


తండ్రి తెచ్చిన ఆస్తిని లెక్కచేయకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని, తన పాషన్ అయిన లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. 


ఇరవై ఏడేల్ల భార్గవ్ కి పెల్లిచేయాలని ఇంట్లో అనుకున్నారు, కాని భవిక ఉండటంతో ఆమె పెల్లి తరువాత చెయ్యాలి అని ఫిక్స్ అయ్యారు. 


మోహన్ గారి భార్య చందన, చందన తన అన్న కూతురితోనే భార్గవ్ పెల్లి జరిపించాలని అనుకోవటంతో ఒకే చేసారు ఇంట్లో అంతా. 


భార్గవ్ కి కూడా ఆ ప్రపోజల్ నచ్చడంతో ఒకే అన్నాడు, అందులోనూ తన మరదలు అప్సరసలా వంక పెట్టడానికి లేకుండా ఉంటుంది, తన ఇంట్లోనే ఆమె కూడా ఉండటంతో ఒప్పుకున్నాడు పెల్లికి.


పొద్దున్నే లేచిన భార్గవ్ మెడిటేషన్ చేసి,ఫ్రెష్ అప్ అయి డైనింగ్ ఏరియాకు వచ్చాడు. 


ఇందిరా గారితో పాటుగా తల్లి ,తండ్రి ,చెల్లెలు ,మరదలు అక్కడే ఉండటంతో అందరికి ఒకేసారి మార్నింగ్ విష్ చెప్పి కూర్చున్నాడు తినడానికి. 


భవిక పక్కన కూర్చున్న భార్గవ్ ని చూసి లేచి వచ్చి అతన పక్కన సీట్ లో కూర్చుంది మరదలు లావణ్య. 


లవ్ తినే దగ్గర నుండి లేవద్దు అని నీకెన్ని సార్లు చెప్పాను మారవా నువ్ అన్నాడు తింటూనే. 


నువ్ నా పక్కనే ఉండాలి బావా, లేకపోతే నాకు నచ్చదు అంటూ కూర్చుని తను కూడా టిఫిన్ చేయడం మెుదలు పెట్టింది. 


తన అన్న కూతురు తనింటి కోడలు కాబోతుంది అని సంతోషపడుతూ అందరికి టిఫిన్ వడ్డిచటంలో మునిగిపోయింది చందన. 


తిని అందరికి బాయ్ చెబుతూ కాలేజ్ కి వెళ్లడానికి బయటకు వచ్చి కార్ తీస్తున్నాడు భార్గవ్. 


గేట్ ముందు సెక్యూరిటీతో మాట్లాడుతుంది భానుమతి, ప్లీజ్ ఒక్కసారి లోపలికి ఫోన్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. 


సెక్యూరిటీ ఆమెను లోపలకు వెల్లనివ్వకుండా అడ్డుపడుతున్నాడు,చాలా సేపటి నుండి బ్రతిమిలాడి ఓపిక నశించి భగత్ గారికి ఫోన్ చేసింది. 


ఫోన్ మోగడంతో దానివైపు చూసిన పార్వతికి అందులో బంగారం అని పేరు చూసి పెదవి విరుస్తూ సైలెంట్ లో పెట్టేస్తుంది భగత్ గారు వాష్ రూంలో ఉండటంతో. 


నాన్న కూడా ఫోన్ లేపడంలేదు , నాకేమో అమ్మమ్మ ఫోన్ నంబర్ తెలీదు ఏం చేసేది అనుకుంటూ వెనక్కి వెల్లిపోదాం అని వెనుదిరుగేతంలో , ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతాడు సెక్యూరిటిని భార్గవ్. 


అతనిని చూసి, సర్ ఇతను నన్ను లోపలకు వెల్లనివ్వటం లేదు, ఒకసారి ఇందిరమ్మ గారికి ఫోన్ చేయండి, నేను ఆవిడకు తెలుసు,భానుమతి వచ్చింది విజయవాడ నుండి అని చెప్పండి అంటూ భార్గవ్ తో అంది. 


ఎవరు ఈ అమ్మాయి అనుకుంటూ భానుమతిని చూసాడు, నడుము వరకు ఉన్న జడ, చేపలాంటి కల్లు, పొడవాటి ముక్కు,చిట్టి పెదాలు, నున్నటి మెడ,కొంచెం కిందకు చూపు దించాడు వెంటనే జ్ఞానం మేలుకొని చూపు తిప్పి పంపించండి తనను అని సెక్యూరిటికి చెప్పాడు. 


మనసు కుదుటపడి హమ్మయ్య అనుకుంది భానుమతి. 


గేట్ తీయగానే లగేజ్ దగ్గర ఉన్న చేతి కర్రను తీసుకుని గేట్ లోపలకు నడిచింది, అప్పటివరకు మామూలుగా ఉన్న భార్గవ్ మెుహం కోపంతో నిండిపోయింది. 


లోపలికి వెలుతున్న తనతో ఆగు అని అరిచాడు. 


కోపంగా వినిపించిన అతని వాయిస్ కి భయపడి అక్కడే నిలబడిపోయింది.


సెక్యూరిటీ ఆ అమ్మాయిని బయటకు పంపించండి, ఇంట్లోకి రావటానికి వీలులేదు ఈ అవిటివారు మా అమ్మమ్మని ఊరికే అడ్డుపెట్టుకుని డబ్బులు లాగుతూ ఉంటారు అని భానుమతిని చీదరింపుగా చూస్తాడు. 


అవిటివారు అనగానే భానుమతికి ఏడుపు వచ్చింది, కల్లలో తడి చేరింది, కాని వాటిని బయటకు తీసుకురావడానికి మనసు అంగీకరించకపోవటంతో మెుండిగా నిలబడింది అలాగే. 


సెక్యూరిటి ఆమె దగ్గరకు వచ్చి పదమ్మా బయటకు అన్నాడు, ప్లీజ్ అండి ఒక్కసారి ఇందిరమ్మ గారిని చూసి వెల్లిపోతాను అని బ్రతిమిలాడింది. 


చెప్పేది నీకే పంపించండి ఆ అమ్మాయిని అంటూ అరిచి వెల్లి తన కార్ లో కూర్చున్నాడు. 


పదమ్మా మల్లీ సార్ తిడతాడు నిన్ను పంపించలేదు అని భానుమతి లగేజ్ ని తీసుకున్నాడు సెక్యూరిటి, చేసేదేం లేక ఏడుపుని పంటి బిగువున దాచి పెట్టి కర్ర సహాయంతో గేట్ బయటకు నడిచింది. 


కార్ లో కూర్చుని బ్లడీ పీపుల్, ఒకసారి సహాయం చేసిన పాపానికి మల్లీ మల్లీ ఈఇంటికి వస్తూ విసిగిస్తున్నారు, ముందు గ్రానిని తిట్టాలి , దానాలు ధర్మాలు అంటూ ఆస్తిని మెుత్తం ఖర్చుచేస్తుంది , ఆ తరువాత భవికకి ఏం ఇద్దామని అనుకుంటుంది అని ఆలోచిస్తూ కార్ స్టార్ట్ చేసి కాలేజ్ కి పోనిస్తాడు. 


గేట్ బయటకు కార్ రాగానే అక్కడే సెక్యూరిటి పక్కన నిలబడిన భానుమతిని చూస్తూ, తనని ఇంట్లోకి పంపించినట్టు తెలిసిందో మీ పోస్ట్ లు ఊడతాయి అని చెప్పి వెల్లిపోయాడు.


భార్గవ్ ఎవరో తెలియకున్నా అతను అవిటిది అన్న మాట మాత్రం గుండెల్లో దిగిపోయింది భానుమతికి.

లింక్ పై క్లిక్ చేసి పూర్తి కథను చదవండి.

https://pasupuletinarendraswamy.blogspot.com/2025/06/blog-post_98.html

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE