*ఇన్లాండ్ ఉత్తరం*
- ఒక తీపి జ్ఞాపకం
వెనుకటి రోజుల్లో పోస్టు కార్డు కన్నా కాస్త ఎక్కువ రాయాలని అనిపించినప్పుడల్లా అందరూ ఎంచుకునే ఉత్తరం – ఇన్లాండ్ లెటర్. ఆ నీలి రంగు కాగితం మీద చక్కటి దస్తూరితో రాసిన మాటలు – అది కేవలం ఉత్తరం కాదు, మనసులో మాటల్ని భద్రంగా మోసుకొచ్చే ఒక పల్లకి .
ఇన్లాండ్ లెటర్ ఇంటికి వస్తే, అక్షరం చెదరకుండా, ఎంతో శ్రద్ధగా చింపి తెరవడం ఒక కళే! అందులో రాసిన ప్రతి అక్షరం, ప్రతి పదం చదవడం ఒక అనుభూతి. ఎవరి నుండి వచ్చిందో తెలుసుకునే కుతూహలం, రాసినవారి భావోద్వేగాలు చదివే క్షణాలు – ఇవన్నీ ఇప్పుడు స్మృతులే అయ్యాయి.
ఈ “ఇన్లాండ్ లెటర్”లు నశించిన ఈ ఆధునిక కాలంలో, వాటి స్థానం వాట్సాప్ మెసేజులు, ఈమెయిళ్లు, నోటిఫికేషన్లు ఆక్రమించాయి. కానీ వాటిలో ఆ మనసుని తాకే భావం శూన్యం. మనుషుల మధ్య మనసుల మధ్య అనుబంధానికి సాక్ష్యంగా నిలిచిన ఆనాటి ఉత్తరాలు, ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయాయి.
No comments:
Post a Comment