NaReN

NaReN

Monday, June 2, 2025

ఉపాధ్యాయుల పై విద్యార్థుల ప్రభావాలు...

 

ఉపాధ్యాయుల పై విద్యార్థుల ప్రభావాలు...

ఒక ఉపాధ్యాయుడిగా ప్రయాణం మొదలుపెట్టిన సూర్యాపేట జిల్లా, మోతే మండలంలోని  రాయికుంట తండా ప్రాథమిక పాఠశాలలో చదివిన విద్యార్థులు క్రియేట్ చేసిన గ్రూపులో  వారు షేర్ చేసిన అనుభవాలు.....
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
మాకు  విద్యా బుద్దులు నేర్పించి మమ్మల్ని ఈ స్థాయికి చేర్చిన మా గురువులకు పాదాభివందనాలు...
👏👏👏👏👏👏
గుర్తుకొస్తున్నాయి....గుర్తుకొస్తున్నాయి....

అదొక మారుమూల గ్రామం...కాలినడకి కూడా సహకరించని బాటలు....వర్ష కాలానికి జల దిగ్బంధంలో ఆ ఊరు....అలాంటి ఊరికి రోడ్డు మార్గ సదుపాయం కల్పించిన కీ||శే  గౌరవనీయులు శ్రీ కొండా లక్ష్మా రెడ్డి గారు అంతే కాకుండా మాలాంటి మారుమూల తండకి రోడ్డు వేస్తేనే రాక పోకలు ఉంటాయి...తద్వారా అభివృద్ది చెందుతుంది అని గ్రహించిన మహనీయులు....అలాగే మా తండాలో పాఠశాల నిర్మాణానికి సహకరించిన అప్పటి MEO పెద్ద జానయ్య గారు, పాండురంగం గారు మరియు కీ||శే  మిట్టు గారు , ఖండ్యా నాయక్ గారు....వీరి సహకార కృషి ఫలితమే మన ఊరి పాఠశాల....

ఒక్కసారి దీనికి ముందు....సంఘటన
మా ఊరికి దారి  వేసిన పెద్దలు లక్ష్మా రెడ్డి గారు అయితే ....మా జీవితాల్లో అక్షర జ్యోతి నీ వెలిగించిన గురువార్యూలు... ఉపేందర్ సార్
అది నేను  మొదటి రోజు పశువులశాల (పాఠశాల) కీ వెళ్ళిన రోజు...నిజమే నా మొదటి అక్షరం అమర్ సింగ్ వాళ్ళ పశువుల కొట్టం లో నేర్చుకున్న...
పలక మీద నేను రాయించుకున్న అ అక్షరం ఇప్పటికీ గుర్తుకు ఉంది.... లలిత చెల్లి గోల చేసింది అనే ఈ పద్యం మా క్లాస్ లో సొమ్లా చంటి మధు అందరూ లేచి చదివారు కానీ నాకు చదవడం రాలేదు.. ఆ రోజు ఉపేందర్ సార్ చేతిలో తిన్న దెబ్బల గాయం  ఇప్పటికీ నా మదిలో మానలేదు.... మమ్మల్ని ఇంటింటికి తిరిగి పాఠశాలలో చేర్పించి హాజరు తీసుకున్న విధానం...అప్పట్లో మీరూ చదువుకొండి...చదువుకుంటే మీకు రిజర్వేషన్ తోపాటు నౌకరీలు వస్తాయి అని ప్రేరేపించిన మీకు జన్మతః రుణపడి ఉంటాము....సార్

అలాగే మా రెండవ గురువు...గిరిబాబు సార్
మేము చదివే రీతిని మార్చిన గురువు గారు...రోజంతా చదివిన సాయంత్రం అయ్యేసరికి అక్షర దోష (డిక్టేషన్) పరీక్ష పెట్టేవారు...అప్పుడు నేను గెల్చుకున్న చిన్న ప్యాన్ ఇప్పటికీ నా మదిలో తిరుగుతూనే ఉంది....

అలా సాగుతున్న మా చదువులు...అప్పుడే పెను ఉప్పెన లాగ వచ్చిన మా చొక్కా రావు సార్....మాకు వచ్చినా కొద్దీ చదువులకు కొత్త పుంతలు తొక్కి కాంపిటీటివ్  పరీక్షలను పరిచయం చేసిన ఘనుడు....మార్గదర్శకుడు...తన కష్టార్జితమే...నరేందర్ నవోదయ సీటు ... ఆ ప్రభంజనమే నన్ను గురుకుల సీటు సాధించే టట్టు చేసింది అనడంలో అతియోశక్తి లేదు....ఒకరోజు హాజరు తీస్తుంటే నేను yes sir  అనలేదు... నా వక్రబుద్ధి కీ సార్ చేతి దెబ్బలు తినక తప్పలేదు....

నేను ఇప్పుడు చెప్పబోయే గురుద్వయం పేరు.. భరత్ బాబు సార్ & బ్రహ్మయ్య సార్
కేవలం విద్యా ఒక్కటే కాదు...విద్యతోపాటు  క్రీడలు కూడా మానసిక ఆహ్లాదకరానికి అవసరం అని గుర్తించి మనల్ని ఆ దిశగా నడిపించిన ఈ ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పినా తక్కువే....

చివరిగా ఒక గురువు గురించి చెప్పుకోవాలి..వారే రవీందర్ సార్
మన పాఠశాలను అత్యధిక హాజరుతో కూడిన విద్యార్థులను చేర్పించి...వారికి ఏకలవ్య  గురుకులలో సీటు సాధించేటట్టు ప్రణాళికలు చేసి...మన చిన్న నాటి పాఠశాల స్మృతులు చెరిగిపోకుండా చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించి ...మన పాఠశాల సంరక్షకుడిగా ఉండి మన భావితరాలకి ఇచ్చి ఈ మధ్యనే బదిలీ అయిన రవీందర్ సార్ కి మనమందరం రుణపడి ఉండాలి...
మన పాఠశాలలో చదివి వెళ్ళిన స్టూడెంట్స్ తర్వాత ఉర్లుగొండ స్కూల్ లో  టాపర్స్... అది ఇప్పటికీ ఎప్పటికీ ట్రెండ్...అది కదా మన పాఠశాల విద్యా భీజ వంగడం....
ఆచార్య దేవో భవ...
గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై గురవే నమః

ఇట్లు
గురుభక్తితో
మీ శిష్యుడు
భూక్యా నాగరాజు
S/o సూర్య
Branch manager
Canara bank
Hanamkonda
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE