సంసారం ఒక చదరంగం
మీ సంసారాన్ని మరొక సంసారంతో పోల్చుకోకండి
మీరిద్దరు పెళ్ళిచేసుకుని దంపతులయ్యారు మీ జీవితం మీది మీ సంసారం మీది ఇది బాగా అర్ధం చేసుకోవాలి.
మీరిద్దరు ఒకరికోసం ఒకరుగా బ్రతకాలి
మీకు సోదరులు సోదరీలు ఉండవచ్చు. అలాగే స్నేహితులు ఉండవచ్చు వాళ్లకు కూడా పెళ్లిళ్లు అయి మీ కంటే మంచి జీతం సంపాదించుకుంటూవుండవచ్చు వాళ్ళకి సొంతిల్లు ఉండవచ్చు లేదా మీ ఇంటి కంటే పెద్దిల్లు ఉండవచ్చు మరోవిధంగా చెప్పాలంటే మీకంటే మంచి పొజిషన్ లో ఉండవచ్చు. అంత మాత్రాన ప్రతి విషయంలో వాళ్లతో వాళ్ళ కుటుంబంతో పోల్చుకుంటూ కృంగి పోతూ మీలో మీరు గొడవ పడటం సబబు కాదు అంతే కాదు వాళ్ళని చూసి ఈర్ష్య పడటం కూడా తప్పే.
తల్లితండ్రులకు పిల్లలందరూ సమానమే ఒకరు కలెక్టర్ అయినా మరొకరు కండక్టర్ అయినా అందరిని సమానంగానే చూస్తారు. మనం నీకు కుడి చేతికి ఎన్ని వేళ్ళు అంటే ఐదు అని చెపుతాం కానీ ఆ ఐదు వేళ్ళు ఎక్కడైనా సమానంగా ఉంటాయా? ఉండవుకదా
జీవితం కూడా అంతే
పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను కలిపే ఒక బంధం అది మాములు బంధం కాదు పవిత్ర బంధం. మీ కుటుంబం లో మీ మొగుడు పెళ్ళాలు ఇద్దరు సమాన భాగస్థులు. మీ పెళ్లయ్యాక ఏ పని చేసినా కలిసే చెయ్యాలి ఆ ఫలితాన్ని మీరే అనుభవించాలి అది మంచయినా చెడయినా దానికి మీరే భాద్యులు. అంతేకాని మొగుడిని పెళ్ళాం పెళ్ళాన్ని మొగుడు తిట్టుకోవడం కొట్టుకోవడం తగదు. అలాగే మీ పక్క ఇంటి లేదా ఎదురింటి వాళ్ళని లేదా మీరు అపార్ట్మెంట్ లో ఉండే మరొకరిలా ఉండాలని ఎప్పుడు అనుకోకండి.
మీరు మీలా ఉండటం నేర్చుకోండి. మీ వ్యక్తిత్వం మీది. మీ ఇద్దరు ఒకటిగా కలసి ఆలోచిస్తే కష్టపడితే అందరి కంటే మీ కుటుంబమే ఉన్నత స్థితి లో వుండే అవకాశం వందశాతం ఉంటుంది.
ఆవిడ మొగుడు అందంగా వున్నాడు ఈయన పెళ్ళాం చాలా బాగుంది ఇవన్నీ పెళ్లైయ్యే వరకే ఆ తరువాత అందం స్థానంలో ప్రేమ ఆప్యాయత అనురాగం చోటు చేసుకుంటాయి. అందం ఉండి ప్రవర్తన బాగా లేకపోతే ఏ పెళ్ళాం/మొగుడు ఇష్టపడతారు మీరే చెప్పండి?
కాబట్టి మీరు ఒకరికొకరు తోడునీడై మనసావాచా ఒకటై జీవితాన్ని ఆనందమయం చేసుకోండి
సదా మీ సేవలో
పనస
No comments:
Post a Comment