పూలు పండ్లు-3
శిల్ప, విక్రమ్ ఇచ్చిన గిఫ్ట్ ను చూస్తూ టెన్షన్తో చేతులు రెండు లాక్ చేస్తుంది.. శిల్ప టెన్షన్ చూసి విక్రమ్ హే జస్ట్ రిలాక్స్, ఇక్కడ ఉన్నది మనిద్దరమే.
భార్యాభర్తలు అంటే వేరు, వేరు కాదు ఒకటే అని మా గ్రానీ ఎప్పుడూ చెబుతూ ఉండేది.
మా ఇంటి ఆచార ప్రకారం ఈరోజు జరిగే కార్యం వరకు మనం ఒకరినొకరు చూసుకోకూడదు.
ప్రజెంట్ జనరేషన్ లో ఫోటో కూడా చూడకుండానే పెళ్లి చేసుకుంది మనమే అయి ఉంటాం. మన ఆచారాలు మనం పాటించాలి కదా! అని చెబుతూ ఉంటే ముసుగులో నుంచే శిల్ప విక్రమ్ చూస్తూ ఉంటుంది.
విక్రమ్, శిల్పతో బాక్స్ ఓపెన్ చేసి చూడవా నేను ఇచ్చినవి అంటే... శిల్ప కంగారుగా బాక్స్ ఓపెన్ చేస్తుంది.
ఆ గిఫ్ట్ ని పట్టుకుని చూస్తూ ఉంటుంది. ముసుగులో ఉన్న శిల్ప భావాలు అర్థం కాక... నచ్చిందా అని అడుగుతాడు.
శిల్ప నచ్చింది అని తల ఊపుతుంది. విక్రమ్ హ్యాపీగా ఫీల్ అయ్యి నేను పెట్టనా అని అడుగుతాడు.
ఆ బాక్స్ విక్రమ్ చేతికి ఇస్తుంది. బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న నల్లపూసలు, గ్రీన్ స్టోన్ రింగ్ ఆమెకు పెట్టి రింగ్ పెట్టిన చేతిని కిస్ చేస్తాడు.
శిల్ప చిన్నగా వణుకుతుంది. దానికి విక్రమ్ జస్ట్ రిలాక్స్ అని చెబుతూ ఉంటే... శిల్ప విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది.
శిల్ప ఎందుకో కంగారు పడుతుంది అని అర్థమయ్యి... నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంటే, డోర్ నాక్ చేసిన సౌండ్ వస్తుంది.
విక్రమ్ వెళ్లి డోర్ తీస్తాడు. అక్కడ నివి, భార్గవి ఉంటారు.
భార్గవి విక్రమ్ చూస్తూ.... అది అల్లుడుగారు కార్యం అయ్యేవరకు ఇద్దరు ఒకచోట ఉండకూడదని చెప్పి, శిల్ప ని తీసుకు వెళుతుంది. శిల్ప తన చీర కొంగుతో విక్రమ్ తొడిగిన రింగ్ చేతుని కవర్ చేస్తుంది.
అది చూసి విక్రమ్ నవ్వుకుంటాడు. పరవాలేదు.. తెలివైంది. ఎవరైనా చూస్తే టీస్ చేస్తారని బాగానే కవర్ చేసింది అనుకుంటాడు.
సాయంత్రం శిల్పా, విక్రమ్ ను తీసుకుని ధనుంజయ్ వాళ్ళ ఇంటికి వెళతారు.
విక్రమ్, శిల్ప ఒక కారులో వెళ్తారు. విక్రమ్ శిల్పతో నువ్వు నన్ను చూస్తున్నావు ముసుగులోనుంచి. కానీ..నిన్ను చూడడానికి మాత్రం నేను రాత్రి వరకు వెయిట్ చేయాలి అని చెబుతాడు.
దానికి శిల్ప తలవంచుకుంటుంది. శిల్ప సిగ్గు చూసి విక్రm❤️ చిన్నగా నవ్వుకుంటాడు.
పెళ్లి ఒక మ్యాజిక్ కదా! తెలియని ఇద్దరు మనుషుల్ని ఒకటి చేస్తుంది.
శిల్ప నువ్వు అస్సులు టెన్షన్ పడకు. మన ఇంట్లో అందరూ బాగా కలిసి పోతారు.
బిజినెస్ ఫీల్డ్ లోనే మేము సీరియస్ గా ఉంటాము. అది తప్పదు. బట్ ఇంట్లో అలా ఉండము.
అమ్మ, అత్తయ్య,, నివి నీతో బాగా కలిసి పోతారని చెబుతూ ఉంటే శిల్ప విక్రమ్ చేయి పట్టుకుంటుంది.
ఎందుకు కంగారుపడుతున్నావ్?? నేను ఎక్కడికి వెళ్ళను. నీతోనే ఉంటాను అని చెప్పి చేయి ప్రెస్ చేస్తాడు.
ఇంటి ముందు కారు ఆగుతుంది. విక్రమ్, శిల్ప కారు దిగి లోపలికి వెళతారు.
లోపల కు వెళ్లగానే ఇద్దరినీ సోఫాలో కూర్చోబెట్టి మర్యాదలు చేస్తారు. విక్రమ్ ను రెస్ట్ తీసుకోమని ఒక రూమ్ లోకి తీసుకువచ్చి వదులుతారు.
విక్రమ్ వెళ్లి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంటాడు. కళ్ళ ముందు మేలు ముసుగులో ఉన్న శిల్ప రూపం కనిపిస్తుంది.
శిల్ప రూమ్ లోనికి వెళ్లే ముందు వెనక్కి తిరిగి నన్ను ఎందుకు చూసింది. తన స్పర్శ నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు ఉంది అనుకుంటాడు .
రాత్రి గర్భధారణ పూజ సమయానికి విక్రమ్ ఫ్యామిలీ అందరూ వస్తారు. ఒక ఇందిర గారు తప్ప.
పూజారి ఇద్దరి చేత గర్భాదాన పూజ చేయించి, పెద్దలు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెబుతారు.
జంటగా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత శిల్ప ను విక్రమ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెబుతారు. శిల్ప విక్రమ్ పాదాలు తాకి గట్టిగా పట్టుకుంటుంది. శిల్ప కన్నీటి చుక్క విక్రమ్ పాదాలపై పడుతుంది.
శిల్ప ప్రవర్తన అర్థం కాక విక్రమ్ చాలా డిస్టర్బ్ అవుతాడు. భార్గవి వచ్చి శిల్పను రెడీ చేసి తీసుకు వస్తానని రూములోకి తీసుకు వెళుతుంది.
లలిత గారు కూడా వస్తాను అంటే వద్దు వదినగారు, అమ్మాయి సిగ్గుపడుతుంది.
నేను రెడీ చేసి తల్లిగా నేను చెప్పవలసిన చెప్పి తీసుకో వస్తానని చెప్పి లోపలికి తీసుకు వెళుతుంది.
విక్రమ్ ని గదిలోకి పంపిస్తారు. శిల్ప ను అందంగా రెడీ చేసి ముసుగు వేసి తీసుకు వస్తుంది
సత్యవతి గారి పాల గ్లాసు ఇచ్చే జాగ్రత్తలు చెప్పి విక్రమ్ ఉన్న గదిలోకి పంపిస్తారు.
శిల్ప విక్రమ్ గదిలోకి వెళ్లిన తరువాత, విక్రమ్ ఫ్యామిలీ అంతా మాన్షన్ కి వెళ్ళిపోతారు.
ఆ గది మొత్తం సువాసన వెదజల్లే పూలతో అలంకరిస్తారు. ఫ్లోర్ మొత్తం గులాబీ రేకులతో నిండిపోతుంది. అరోమా క్యాండిల్స్ తో విక్రమ్ కి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి.
విక్రమ్ శిల్పని చూసి ఎందుకు తలుపు దగ్గర నిలబడిపోయావు...ఎవరైనా పనిష్మెంట్ ఇచ్చారా అని అంటే... లేదు అని కంగారుగా తల ఊపుతుంది.
విక్రమ్ నవ్వుతూ ముందుకు వచ్చే శిల్ప చేయి పట్టుకుంటాడు.
ఆ టచ్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. నిన్నటి నుంచి టచ్ చేసినప్పుడు వచ్చిన ఫీల్ రావడం లేదు ఏంటిది అని ఆలోచిస్తూ... శిల్ప ను తీసుకోవచ్చి మంచం మీద కూర్చోబెడతాడు.
ముసుగు తియ్యనా అని శిల్ప ని అడుగుతాడు. దానికి సరే అని తల ఊపుతుంది.
మెల్లిగా శిల్ప మొఖంపై ఉన్న ముసుగు తీసి తన ముఖం చూస్తాడు. శిల్ప చాలా అందంగా ఉంటుంది. ఆ అందంతో ఎవరినైనా కట్టే పడేయచ్చు అన్నట్టుగా ఉంది.
బ్యూటిఫుల్ అంటాడు. దానికి శిల్ప నవ్వుతుంది. కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది విక్రమ్ కి.
శిల్ప చేయి పట్టుకోగానే నెగటివ్ వైప్స్ వచ్చినట్టు అనిపిస్తుంది.
శిల్ప మెడ వంక చూస్తాడు. తను ఇచ్చిన నల్లపూసలు ఉండవు.
డౌటుగా మాట్లాడుతూ, చేతులు పట్టుకొని తను పెట్టిన ఉంగరాన్ని చూస్తాడు. ఆ ఉంగరం ఉండదు. వేరే మోడల్ ఉంగరం ఉంటుంది.
శిల్ప చేతులను చూస్తాడు. సాయంత్రం వరకు అరచేతుల వరకు ఉన్న గోరింటాకు ఇప్పుడు మోచేతులు దాకా కనిపిస్తుంది.
కుడి చేతి మణికట్టుపై తన చూసిన పుట్టుమచ్చ కూడా లేదు. ఏదో తప్పు జరుగుతుంది అని విక్రమ్ కి అర్థమయ్యి శిల్ప వంక కోపంగా చూస్తూ.... రూమ్ లో నుంచి బయటికి వెళ్లిపోతాడు.
కోపంగా విక్రమ్ ఎక్కడికి వెళుతున్నాడు??
ఇప్పుడు శిల్ప పరిస్థితి ఏమిటి??
కథ కొనసాగుతుంది....
ఇంకా చదవాలని ఉంటే కింద క్లిక్ చేయండి.
No comments:
Post a Comment