అసలేం జరుగుతుంది
ఏంటి మన దారి !
ప్రతిరోజూ వార్తలు చూస్తుంటే హత్యలు ఆత్మహత్యలు లేని రోజు లేదు.
అమ్మాయిలు పెళ్లి అయ్యాక భర్తలను చంపించడం. కొందరు తల్లులు తమ పిల్లలనే చంపడం అంటే అంతకు మించిన పాపం లేదు. ఎంతటి దౌర్భాగ్యం. కారణాలు ఏమిటి?
కొందరు భార్యా పిల్లలను చంపడం.
విద్యావంతుల విద్యార్థుల ఆత్మ హత్యలు.(పరీక్షల్లో తప్పడం తో చదువుల ఒత్తిడి తట్టుకోలేక)
ఇష్టం లేని పెళ్లి చేసుకుని సర్దుకులేక పోవడం.(అంతకుముందే ఎవరినో ప్రేమించడం)
పెళ్లయిన తర్వాత తీరని కోరికలతో సతమతం. (ఇతరులతో పోల్చుకుని అసంతృప్తికి లోనవ్వడం)
ఒంటరితనంతో లేదా ఇతర కారణాలతో ఇతరుల పట్ల ఆకార్షితులవడం.( పరాయి వారి ఆదరణ కోసం తహతహ దీనికి కారణం కావచ్చు)
బెట్టింగ్ లలో డబ్బులు పోగొట్టుకుని కొందరు (అతితక్కువ సమయంలో శ్రీమంతుడు కావాలనే దురాశ)
*కారణాలు*
తల్లి దండ్రులు పిల్లలతో గడపక పోవడం లేదా వారి వారి గొడవలలోనే వారు మునిగిపోవడంతో పిల్లలు దూరం అవుతారు. ( ఇలాంటి వారికి బయట సానుభూతి ఆదరణ లభిస్తే తొందరగా వారికి దగ్గరవుతారు.)
పిల్లలకు తల్లిదండ్రులతో, పెద్దలతో సాన్నిహిత్యం లేక పోవడం. ( ముఖ్యకారణం కొంతవరకు తల్లిదండ్రులే! పిల్లలను వారికి దూరంగా ఉంచడంతో వారిప్రేమను పొందలేరు.కొన్ని కుటుంబవిలువలు వారికి తెలియవు.)
*సామాజిక మాధ్యమాలు*
నేడు బయటకు వెళ్లిన పిల్లల ఆచూకీ తెలుసుకోవడం వారిక్షేమ సమాచారం తెలియటం కోసం సెల్ ఫోన్ అవసరం.
మొదట అవసరం.
తర్వాత వినోదం.
ఆ తర్వాత మాటలు చాటింగ్ లు. వీడియోలో కబుర్లు.
చివరికి దానికి బానిసగా మారడం.
కలల ప్రపంచంలో తేలిపోవడం.
వ్యసనంగా మారడం.
*తప్పేదెలా?*
అమ్మాయి అబ్బా యిల సెల్ ఫోన్ లాక్ కుటుంబ సభ్యులకు అందరకు తెలిసి ఉండాలి. అసలు పిల్లలకు రహస్యాలు ఎందుకు?
*మరికొన్ని కారణాలు:* తెలుగు సీరియల్ లు
"ఈ పెళ్లి ఎలా జగురుగుతుందో చూస్తా"
"ఎలాగైనా అడ్డుతొలగించాలి"
"కారుతో ఢీకోట్టించాలి"
లాంటివి కొన్ని.
OTT లో హింస అసభ్యకరమైన సన్నివేశాలు వేషధారణ.
ఏదీ తప్పుకాదు.
అన్నీ సహజమనే అసంబంధ్ధమైన భావనలు కలగడం. వీటిలో సెన్సార్ లేని క్రైం నేరాలు.
విపరీత పోకడలతో దారుణ హత్యా దృశ్యాలు.
*పెద్దల బాధ్యత*
ఇది కొంతవరకు పిల్లలు నేరప్రవృత్తి వైపు మరలకుండా అవసరం.
పిల్లలకు సమయం ఇవ్వాలి. వారితో ఎక్కువగా కబుర్లాడుతూ వారి స్థితిగతులు తెలుసుకోవాలి.
వారి ప్రవర్తన ఏమాత్రం వారికి నచ్చక పోయినా గమనించాలి. అడగాలి.
సర్దిచెప్పాలి.
నీలదీయాలి.
పెద్దలు సెల్ ఫోన్ కు దూరంగా ఉంటూ పిల్లలను వాటికి దూరంగా ఉండేట్టు చేయాలి.
కథలు
కబుర్లు
వార్తలు
పుస్తక పఠనం
అలవాటు చేయాలి.
దారితప్పిన వారి జీవితాలు ఎలా నాశనం అయ్యాయో తెలిసేట్టు చేయాలి.
తమ ఇల్లు తమ తల్లి దండ్రులు తమ కుటుంబమే సర్వస్వం అనే భావన పిల్లలలో కలిగేట్టు అన్ని అవకాశాలను వినియోగించు కోవాలి.
హాయిగా బ్రతకడానికి డబ్బులు మాత్రమే అవసరం కాదు అనేది తెలియాలి.
*ప్రభుత్వ బాధ్యత*
విద్యా వ్యవస్థలో చిన్నప్పటినుండే విలువలతో కూడిన విద్య అందించాలి.
OTT లు సినిమాలు సీరియల్ లు సెన్సార్ చేయాలి.
చివరికి ఏం చేయాలో ఎవరికీ అర్థం కావడం లేదు.
తల్లిదండ్రులు పిల్లలకు భయపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
🙏
No comments:
Post a Comment