పూలు పండ్లు -2
గుమ్మం దగ్గర నిలబడిన నూతన దంపతులను ఆపి పేర్లు చెప్పి రమ్మంటారు.
దానికి వరుడు చిన్నగా నవ్వి, విక్రమ్ జై సింహ అనే నేను నా భార్య అయిన శిల్పతో వచ్చాను అని చెబుతాడు.
వధువు వంక చూసి ఇప్పుడు నువ్వు చెప్పు వదిన అనగానే, వధువు కంగారుగా విక్రమ్ చేయి పట్టుకుంటుంది.
దానికి విక్రమ్ చిన్నగా చేతిని ప్రెస్ చేసి రిలాక్స్ అని చెప్పి, విక్రమ్ వాళ్ళ అమ్మగారి వంక చూస్తాడు. లలితగారు నవ్వుకుంటు వచ్చి శిల్పా మౌనవ్రతంలో ఉంది లోపలికి రానివ్వండి అని చెబుతారు.
ఇందిరా దేవి గారు అక్కడికి వచ్చి అప్పుడే కోడల్ని వెనకేసుకొస్తున్నావా అని అడుగుతారు.
దానికి లలితగారు మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టు శిల్ప కు నేను ఇస్తున్నాను అత్తయ్య గారు అని చెబుతుంది.
దానికి ఇందిరాగారి ముఖంలో గర్వంతో కూడిన చిరునవ్వు వస్తుంది. భార్య లౌక్యం చూసిన లలిత భర్త గారైన కళ్యాణ గారు ముసిముసగా నవ్వుకుంటారు.
విక్రమ్ శిల్ప కుడి కాలు లోపలికి పెట్టి వస్తారు. విక్రమ్ చెల్లి అయిన నివేదిత వాళ్ళ అమ్మ గారిని అడుగుతుంది. వదిన ఎప్పుడు ముసుగు తీయాలి అని...
దానికి శిల్ప టెన్షన్ తో ముసుగుని గట్టిగా పట్టుకుంటుంది. నీకెందుకే అంత తొందర అంటూ వినయ్ అక్కడికి వస్తాడు. చిన్నన్నయ్య అని గారంగా పిలుస్తుంది.
దానికి ఉన్నదే ఆ కంగారు కదా అని అంటూ భరత్ అక్కడికి వస్తాడు. బావా అంటూ గుర్రుగా చూస్తుంది.
శిల్పతో భరత్ హాయ్ చెల్లమ్మ నేను నీకు అన్నయ్యని అవుతాను. అలాగే నీ భర్తకి బావ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ని అని పరిచయం చేసుకుంటాడు.
వినయ్ కూడా హాయ్ వదిన నేను నీకు బుల్లి గారాల మరిదిని అని పరిచయం చేసుకుంటాడు.
నివేదిత మళ్ళీ అడుగుతుంది మూసుకు ఎప్పుడు తీస్తారు అని...
రేపు ఉదయమే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది. రేపు రాత్రికి కార్యం జరుగుతుంది.
ఎల్లుండి శిల్ప పూజ చేసిన తర్వాత ముసుకు తీస్తామని ఇందిరా గారు చెబుతారు.
అన్నయ్య ఎప్పుడు చూస్తాడు అంటే... నువ్వు చిన్నపిల్లవు ఇంకా ఎక్కువగా అడగకు అని చిరు కోపంగా చెప్పి, వదినని రూమ్ కి తీసుకెళ్లని ఇందిరా గారు చెబుతారు.
శిల్పా రూమ్ లోకి వెళ్ళగానే శిల్ప మేనమామ అయిన సునీల్, మేనత్త అయిన బిందు లోపలికి వస్తారు.
సునీల్ లోపలికి వస్తూనే క్షమించండి. కొంచెం ట్రాఫిక్ జామ్ అయి లేట్ అయ్యాము అని చెబుతారు.
ఎందుకు అంత కంగారు పడుతున్నారు? శిల్పా మా అమ్మాయి రూములో ఉంది అని చెప్పి...
సర్వెంట్ ని పిలిచి గెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్లమంటారు బిందూకి వ్రతం వరకు శిల్పని కలవడం కుదరదు.
వ్రతానికి విక్రమ్, శిల్ప కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. శిల్ప తల్లిదండ్రులైన ధనుంజయ్, భార్గవి, నానమ్మ, తాతయ్యలైన సత్యవతి, శేషగిరి గారు వస్తారు.
వ్రతం అంత ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. వ్రతం పూర్తయిన తర్వాత లలితగారు వంశపారపర్యంగా వస్తున్న నగలను శిల్పకు అందిస్తారు.
శిల్ప మొహమాటం పడుతుంటే, తీసుకో శిల్పా అవి ఇంటి కోడళ్ళకి చెందవలసినవి. నీకు ఇంకా వినయ్ కి వచ్చే భార్యకు మాత్రమే చెందుతాయి. అని చెప్పి శిల్పకు అందిస్తారు.
శిల్పా అవి తీసుకోగానే భార్గవి వచ్చి అవి శిల్ప చేతిలో నుంచి తీసుకుంటుంది. విక్రమ్ మేనత్త అయిన మాధవి గారు డైమండ్ సెట్ ప్రెసెంట్ చేస్తారు..
లలిత గారు అది చూసి ఇప్పుడు ఎందుకు వదిన అంటే,, నా కూతురికి మేము పెట్టుకుంటున్నాం అని మాధవి భర్త అయినా రమేష్ గారు చెబుతారు.
వ్రతం పూర్తిచేసి విక్రం కి శిల్ప కి రూమ్లో భోజనం ఏర్పాటు చేస్తారు. నివేదిత ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది. శిల్ప ముసుగు లోపలికి చేతిని తీసుకువెళ్లి భోజనం చేస్తూ ఉంటుంది.
భోజనం అయిన తర్వాత విక్రమ్ నివేదితను పిలిచి, నివి బయట 5 మినిట్స్ మేనేజ్ చెయ్ అని చెబుతాడు.
దానికి నివి ఓహో..... లెజెండ్ విక్రమ్ గారు రొమాంటిక్ పర్సన్ అయ్యారా..అని టీస్ చేస్తుంది.
ఒక నవ్వి నవ్వి విక్రమ్ చెల్లిని పంపిస్తాడు. విక్రమ్ శిల్ప దగ్గరికి వచ్చి నీకు ఒక స్మాల్ గిఫ్ట్ అని ఒక బాక్స్ ఇస్తాడు.
ఆ గిఫ్ట్ చూసిన శిల్ప రియాక్షన్ ఏమిటి??
కథ కొనసాగుతుంది....
ఇంకా చదవాలని ఉంటే కింద క్లిక్ చేయండి.
No comments:
Post a Comment