పర్యావరణ జాజి
దూరవిద్య ద్వారా రెండు పీజీలు చేసిన "జాజి "అనే వ్యక్తి వారానికి ఐదు రోజు పొద్దున్నే తన బండి తీసుకుని, నల్లమల అడవిలోకి వెళ్ళి ,అక్కడ కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలు లాంటివి తను తెచ్చుకున్న సంచీ లో వేసి తెచ్చి చెత్త ఇరుకునేవాళ్లకి ఇస్తాడు.ఇలా పాతికేళ్ల నుండి చేస్తున్నాడు..అలాగే వర్షాకాలం మొదలవగానే విత్తనాలను తీసుకెళ్లి రోడ్డుకి పక్కన ఖాళీ ప్రదేశాల్లో చల్లేసి వస్తాడు.. కొన్నాళ్ళకి అవి మొలకెత్తాయో లేదో చూసుకుని వస్తాడు.
పల్నాడు కి చెందిన "జాజి" దినచర్య ఇది.జాజి అసలు పేరు komera Ankarao .
అంతేకాదు ప్రకృతి పాఠశాల పేరు తో పుస్తకం రాశాడు.తన ప్రాంతం కి చుట్టూ ఉండే ఐదువేల పైన పాఠశాలకు వెళ్ళి పిల్లలకి ప్రకృతి పరిరక్షణ పై అవగాహన కార్యక్రమాలు చేశాడు.
ఎన్నో పురస్కారాలు వచ్చాయి.
The week మ్యాగజైన్ ఈతని మీద ఒక కథనం రాసింది.
అడవులు పర్యావరణ పరిరక్షణ అంటూ తనపని తను చేసుకుంటూ, ప్లాస్టిక్ వ్యర్థాలను పక్షులు, జంతువులు తినకుండా ఏరిపారేస్తూ ,భూమ్మీద మనిషిగా పుట్టినందుకు ఎంతో కొంత కాకుండా తలకుమించిన భారాన్ని ఇష్టం గా మోస్తూ ప్రకృతి కోసం కష్టపడుతున్న ఫారెస్ట్ మ్యాన్ ( జాజి) అంకారావ్ కొమెర ను అటవీ పరిరక్షణ సలహాదారు గా ఏపీ ప్రభుత్వం నియమించింది..
అతనో సంచీ భుజానికి తగిలించుకుని అడవుల్లో కనిపించే వ్యర్థాలను ఒక్కడే సంచీలో వేసుకుని తిరగడం చూసి అతని కి పర్యావరణం పట్ల ఉన్న బాధ్యత చూసి,ఈరోజు అతన్ని వెతుక్కుంటూ వచ్చిన అధికారం చూసి నల్లమల నుండి చిన్న చిన్న అడవుల్లో ఉండే చాలామంది సంతోషపడతారు.
No comments:
Post a Comment