NaReN

NaReN

Tuesday, June 10, 2025

వారంలో ఇది 3 సార్లు తింటే ముసలోళ్లు అయ్యే ఛాన్సే లేదంట..!

 

వారంలో ఇది 3 సార్లు తింటే ముసలోళ్లు అయ్యే ఛాన్సే లేదంట..!



మీల్‌ మేకర్‌.. వెజీటెరియన్‌ వాళ్లకు మాంసానికి ప్రత్యామ్నాయంగా దీనిని పిలుస్తారు. మీల్‌ మేకర్‌ను సోయా చంక్స్‌ అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆరోగ్యకరమైన మీల్‌ మేకర్‌ను సోయాతో తయారు చేస్తారు. మీల్‌ మేకర్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొవ్వు ఉండదు. ప్రొటీన్‌, ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం, జింక్‌, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీల్‌ మేకర్‌ను తరచుగా మన డైట్‌లో చేర్చుకుంటే.. లెక్కలేనన్నీ ఆరోగ్య లాభాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.


ప్రోటీన్ .. అత్యధికంగా ఇచ్చే ఆహారాల్లో సోయా చంక్స్ ఒకటి. వెజిటేరియన్ మటన్ గా పిలిచే దీని వల్ల మసిల్స్ పెరిగేందుకు సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్ అందిస్తుంది. కాల్షియం, ఐరన్ అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది..డైబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్‌ అంటున్నారు నిపుణులు. మీర ముఖ్యంగా సోయా ఫుడ్స్‌తో అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను నిర్వహించడంతో పాటు వివిధ సీజనల్ సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.


మీల్ మేకర్ తినటం వల్ల మహిళల్లో ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. ఈ పోషకమైన మీల్ మేకర్ అన్ని వయసుల వారికి సమానంగా ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో చికెన్‌, మటన్‌, గుడ్లు కంటే ఎక్కువ ప్రొటీన్‌ ఉంటుంది. వెజిటేరియన్స్‌ వీటిని మాంసానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ప్రొటీన్‌ లోపంతో బాధపడేవారు.. మీల్‌ మేకర్‌ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. రోజుకి ఒక కప్పు సోయా చంక్స్ ని ఉడికించి కూర లేదా సలాడ్ రూపంలో తినాలి. ఎక్కువగా తినకుండా పరిమితంగా తీసుకోవాలి.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE