NaReN

NaReN

Monday, June 30, 2025

LIP Test

LIP Maths -9th class


Name: 

Class: IX
Section: 
Roll No: 


I. Solve the following problems.

  1. Solve the following additions:

    • i) 735 + 263
    • ii) 5084 + 479
    • iii) 9386 + 5974
  2. Solve the following subtractions:

    • i) 897 - 376
    • ii) 9703 - 476
    • iii) 60040 - 3047
  3. Solve the following multiplications:

    • i) 203 × 8
    • ii) 649 × 24
    • iii) 9005 × 48
  4. Solve the following divisions:

    • i) 864 ÷ 4
    • ii) 607 ÷ 15
    • iii) 5151 ÷ 17

Prerequisites

II. Solve the following problems:

  1. The length and breadth of a rectangular park are 45 meters and 24 meters respectively. Find the area of the park.

  2. Latha has of a chocolate bar. She wants to give half of it to her friend. How much of the whole chocolate bar will her friend receive?


Learning Outcomes

III. Solve the following problems:

  1. If and , then find the value of:

  2. Find the square root of 7056.

  3. Factorize:

  4. The parallel sides of a trapezium are 9 cm and 7 cm long and the distance between them is 6 cm. Find the area of the trapezium.


Let me know if you'd like this styled into a printable worksheet, formatted as a PDF, or designed as digital flashcards.





NQT

 TCA NQT JULY

HI!!! THANKYOU FOR REACHING TILL HERE. PLEASE READ THE FOLLOWING DOCUMENT THOROUGHLY!

 

National Qualifier Test

TCS NQT (National Qualifier Test) is an assessment conducted by Tata Consultancy Services (TCS) to evaluate fresh graduates for recruitment. It measures candidates on various skills, including cognitive ability, subject knowledge, and domain-specific skills.

 

The test consists of two parts: a foundational section covering numerical, verbal, and reasoning abilities, and an advanced section focusing on advanced quantitative reasoning and coding skills.

To Apply Click Below:

https://www.tcsion.com/hub/national-qualifier-test/

!!!Last Date to Apply is 24th June!!!

 

Here are some free resources to help you prepare for TCS NQT (National Qualifier Test) effectively, covering all sections (cognitive, programming, and domain-specific):

 

🔹 1. TCS NQT Official Resources

• TCS NQT Website Practice Test

➤ Official mock tests and sample papers.

➤ Covers verbal, reasoning, numerical, and programming logic.

 

🔹 2. YouTube Channels (Free Video Tutorials)

• Apna College

➤ Aptitude + Programming preparation playlists.

➤ Apna College YouTube

• Gate Smashers

➤ Data Structures, OS, DBMS — useful for subject-specific tests.

➤ Gate Smashers

• Jenny’s Lectures CS/IT

➤ Clear and easy explanations for technical subjects.

➤ Jenny’s Lectures

• Quantifiers Aptitude

➤ Specializes in Quantitative Aptitude + Logical Reasoning

➤ Quantifiers YouTube

 

🔹 3. Free Practice Websites

Platform

Features

PrepInsta

TCS NQT-specific syllabus, practice questions, previous papers

IndiaBix

Aptitude, reasoning, verbal, and puzzles practice

GeeksforGeeks TCS Section

Programming, coding questions from past years

InterviewBit

DSA and coding practice (ideal for programming logic)

CodeStudio by Coding Ninjas

TCS NQT-focused mock tests and company-specific contests

 

🔹 4. Free PDFs / Notes

• PrepInsta Free TCS NQT Preparation PDF

➤ Downloadable materials for each topic

➤ Practice questions with solutions

• IndiaBix Verbal and Quant Formulas PDF

➤ Handy formulas and concept summaries

 

 

🔹 5. Coding Platforms (for Programming Logic Section)

Platform

Focus

LeetCode (Easy + Arrays, Strings)

Practice TCS-level coding questions

HackerRank (30 Days of Code)

Great for beginners to intermediate

CodeChef Beginner Track

Programming Logic + DSA (basic)

 

🔹 Bonus Tip: LinkedIn Community

• Search for #TCSNQT and follow people sharing real experiences, questions, and solutions.

• Join TCS NQT prep groups for free discussions and materials.

Friday, June 27, 2025

అసలేం జరుగుతుంది

  అసలేం జరుగుతుంది 

 ఏంటి మన దారి  !


ప్రతిరోజూ వార్తలు చూస్తుంటే హత్యలు ఆత్మహత్యలు లేని రోజు లేదు.  


అమ్మాయిలు పెళ్లి అయ్యాక భర్తలను చంపించడం. కొందరు తల్లులు తమ పిల్లలనే చంపడం అంటే అంతకు మించిన పాపం లేదు. ఎంతటి  దౌర్భాగ్యం. కారణాలు ఏమిటి?


కొందరు భార్యా పిల్లలను చంపడం. 


విద్యావంతుల విద్యార్థుల ఆత్మ హత్యలు.(పరీక్షల్లో తప్పడం తో చదువుల ఒత్తిడి తట్టుకోలేక)         


ఇష్టం లేని పెళ్లి చేసుకుని సర్దుకులేక పోవడం.(అంతకుముందే ఎవరినో ప్రేమించడం) 


పెళ్లయిన తర్వాత తీరని కోరికలతో సతమతం. (ఇతరులతో పోల్చుకుని అసంతృప్తికి లోనవ్వడం)


 ఒంటరితనంతో లేదా ఇతర కారణాలతో ఇతరుల పట్ల ఆకార్షితులవడం.( పరాయి వారి ఆదరణ కోసం తహతహ దీనికి కారణం కావచ్చు) 



బెట్టింగ్ లలో డబ్బులు పోగొట్టుకుని కొందరు (అతితక్కువ సమయంలో శ్రీమంతుడు కావాలనే దురాశ)


 *కారణాలు* 

తల్లి దండ్రులు పిల్లలతో గడపక పోవడం లేదా వారి  వారి గొడవలలోనే వారు మునిగిపోవడంతో పిల్లలు దూరం అవుతారు. ( ఇలాంటి వారికి బయట సానుభూతి ఆదరణ లభిస్తే తొందరగా వారికి దగ్గరవుతారు.)


 పిల్లలకు తల్లిదండ్రులతో, పెద్దలతో సాన్నిహిత్యం లేక పోవడం. ( ముఖ్యకారణం కొంతవరకు తల్లిదండ్రులే! పిల్లలను వారికి దూరంగా ఉంచడంతో వారిప్రేమను పొందలేరు.కొన్ని కుటుంబవిలువలు వారికి తెలియవు.) 


*సామాజిక మాధ్యమాలు* 


నేడు బయటకు వెళ్లిన పిల్లల ఆచూకీ తెలుసుకోవడం వారిక్షేమ సమాచారం తెలియటం కోసం సెల్ ఫోన్ అవసరం. 

మొదట అవసరం. 

తర్వాత వినోదం. 

ఆ తర్వాత మాటలు చాటింగ్ లు. వీడియోలో కబుర్లు. 

చివరికి దానికి బానిసగా మారడం.

 కలల ప్రపంచంలో తేలిపోవడం.

 వ్యసనంగా మారడం. 

*తప్పేదెలా?* 

అమ్మాయి అబ్బా యిల సెల్ ఫోన్ లాక్ కుటుంబ సభ్యులకు అందరకు తెలిసి ఉండాలి. అసలు పిల్లలకు రహస్యాలు ఎందుకు?  


*మరికొన్ని కారణాలు:* తెలుగు సీరియల్ లు  

"ఈ పెళ్లి ఎలా జగురుగుతుందో చూస్తా" 

 "ఎలాగైనా అడ్డుతొలగించాలి"

 "కారుతో ఢీకోట్టించాలి" 

లాంటివి కొన్ని. 

OTT లో హింస అసభ్యకరమైన సన్నివేశాలు వేషధారణ. 

ఏదీ తప్పుకాదు. 

అన్నీ సహజమనే అసంబంధ్ధమైన భావనలు కలగడం. వీటిలో సెన్సార్ లేని క్రైం నేరాలు. 

విపరీత పోకడలతో  దారుణ హత్యా దృశ్యాలు. 

*పెద్దల బాధ్యత*

 ఇది కొంతవరకు పిల్లలు నేరప్రవృత్తి వైపు మరలకుండా అవసరం.

 పిల్లలకు సమయం ఇవ్వాలి. వారితో ఎక్కువగా కబుర్లాడుతూ వారి స్థితిగతులు తెలుసుకోవాలి.

 వారి ప్రవర్తన ఏమాత్రం వారికి నచ్చక పోయినా గమనించాలి. అడగాలి. 

సర్దిచెప్పాలి. 

నీలదీయాలి. 

పెద్దలు సెల్ ఫోన్ కు దూరంగా ఉంటూ పిల్లలను వాటికి దూరంగా ఉండేట్టు చేయాలి. 

కథలు 

కబుర్లు 

వార్తలు 

పుస్తక పఠనం

 అలవాటు చేయాలి.

 దారితప్పిన వారి జీవితాలు ఎలా నాశనం అయ్యాయో తెలిసేట్టు చేయాలి. 

తమ ఇల్లు తమ తల్లి దండ్రులు తమ కుటుంబమే సర్వస్వం అనే భావన పిల్లలలో కలిగేట్టు అన్ని అవకాశాలను వినియోగించు కోవాలి.

హాయిగా బ్రతకడానికి డబ్బులు మాత్రమే అవసరం కాదు అనేది తెలియాలి. 

*ప్రభుత్వ బాధ్యత* 

విద్యా వ్యవస్థలో చిన్నప్పటినుండే విలువలతో కూడిన విద్య అందించాలి. 

OTT లు సినిమాలు  సీరియల్  లు సెన్సార్ చేయాలి.  


   చివరికి ఏం చేయాలో ఎవరికీ అర్థం కావడం లేదు.


తల్లిదండ్రులు పిల్లలకు భయపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.         


🙏

పదవ తరగతి దోస్తులు

 పదవ తరగతి దోస్తులు 


 *‘‘ఓ పనిచేయండి, మీ పాత బడికి వెళ్లి మీ టెన్త్ క్లాస్ రిజిష్టర్ అడిగి తీసుకొండి…’’* 



ఆయన వయస్సు 50 ఏళ్లు… నీరసంగా ఉంటున్నాడు… ఏదో డిప్రెషన్ కుంగదీస్తోంది… జీవితం పట్ల నిరాశ, ఏదో అసంతృప్తి, దిగాలుగా కనిపిస్తున్నాడు… నిజానికి ఈ వయస్సులోనే ఎవరైనా సరే, బాధ్యతలన్నీ ఒక్కొక్కటే వదిలించుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి…



తనకు ఇష్టమైన వ్యాపకాల్లోకి మళ్లిపోవాలి… ఆఫ్టరాల్ ఆస్తులు, పోస్టులు, డబ్బు వస్తయ్, పోతయ్,… మంచి జ్ఞాపకాలే జీవితాంతం వెన్నంటి ఉంటయ్… 



ఆయన భార్య ఓ క్లినికల్ సైకాలజిస్ట్ అపాయింట్‌మెంట్ తీసుకుంది… ఆయన కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాడు… ముందుగా కొన్ని వ్యక్తిగత వివరాలు అడిగాడు… నువ్వు బయటికి వెళ్లి కూర్చోమ్మా అని ఆమెను బయటికి పంపించేశాడు… 


‘‘ఇప్పుడు చెప్పండి, మీ ప్రాబ్లం ఏమిటి..? ఎందుకు ఈ దిగాలు, డిప్రెషన్… ఏమైంది మీకు, శారీరకంగా కూడా ఏ వ్యాధులూ లేవు… మరిక ఏం బాధ..?’’



‘‘నిజం డాక్టర్, చాలా ఆందోళనగా ఉంటోంది… చాలా చిక్కులు… ఉద్యోగంలో ఒత్తిడి పెరిగింది, పిల్లల చదువులు ఓ కొలిక్కి రావాలి, వాళ్లు స్థిరపడాలి, పెళ్లిళ్లు కావాలి, ఇంటి లోన్ తీర్చాలి, కార్ లోన్ అలాగే ఉండిపోయింది… అన్నీ ప్రెజర్ పెంచుతున్నయ్…’’


ఆయన ఓ డిఫరెంట్ సైకాలజిస్టు… పదే పదే కౌన్సిలింగు సెషన్స్ తీసుకుంటూ డబ్బులు పీక్కునే రకం కాదు… 


‘‘నువ్వు పదో తరగతి ఏ స్కూల్‌లో చదివావ్..?’’


ఆయన ఏదో చెప్పాడు… తరువాత డాక్టర్ ఆయనకు ఓ సలహా ఇచ్చాడు, తరువాత తన దగ్గరికి రమ్మన్నాడు… మందులు కాదు, యోగ కాదు, మెడిటేషన్ కాదు, ఎక్కడికైనా గాలిమార్పిడి, స్థలమార్పిడికి వెళ్లమనే సూచన కూడా కాదు… నిజానికి అది విని ఆశ్చర్యపోవడం రోగి వంతైంది…


‘‘మీరు మీ బడికి వెళ్లండి, మీరు టెన్త్ క్లాసులో ఉన్నప్పటి రిజిష్టర్ అడిగి తీసుకొండి, మీ క్లాస్‌మేట్ల పేర్లన్నీ రాసుకొండి, అడ్రెస్సులు సేకరించండి, వారు ఇప్పుడు ఎలా ఉన్నారో వివరాలు సేకరించండి… మీ మైండ్ డైవర్ట్ కావడమే కాదు, మిమ్మల్ని యథాస్థితికి తీసుకొస్తుంది… బహుశా మీరు మళ్లీ నా దగ్గరకు రాకపోవచ్చు…’’



ఆ పెద్దమనిషి డాక్టర్ చెప్పినట్టుగానే బడికి వెళ్లాడు… ఎక్కడో పాత బీరువాలో ఉన్న ఆ పాత రిజిష్టర్ తీసుకుని, దుమ్మదులిపాడు… ‘‘ఏం సార్, స్టడీ సర్టిఫికెట్ కావాలంటే నేనిస్తాను కదా, మీకెందుకు ఈ పేర్ల తనిఖీలు..?’’ అన్నాడు ఓ క్లర్కు నవ్వుతూ…


‘‘కాదు సార్, అల్యూమినీ (పూర్వ విద్యార్థుల) భేటీ ప్లాన్ చేస్తున్నాను’’ అన్నాడు… ఈమధ్య ఆ ట్రెండ్ కనిపిస్తోంది కదా, క్లర్క్ అభినందనగా చూసి తలపంకించాడు…


మొత్తం 120 పేర్లున్నయ్, తన సెక్షన్, మరో సెక్షన్ కలిపి… ఇక ఇంటికెళ్లి, ఒక నెల మొత్తం ఇదే పనిలో పడ్డాడు… రేయింబవళ్లూ ఫోన్లు, వివరాల సేకరణ… అంతా రాసిపెడుతున్నాడు… కేవలం 80 మంది వివరాలు మాత్రమే దొరికాయి… 


ఆశ్చర్యం… వారిలో 20 మంది ఆల్‌రెడీ చనిపోయారు… ఏడుగురు తమ జీవిత భాగస్వాములను కోల్పోయారు… 13 మంది విడాకులు తీసుకున్నారు… 10 మంది వ్యసనాలకు బానిసలయ్యారు… ఎలా బతుకుతున్నారనేది విలువ లేని విషయం…


అయిదుగురు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు… ఆరుగురు మాత్రం బాగా ధనికులయ్యారు… ఇద్దరికి పక్షవాతం, సగం మందికి సుగర్ లేదా ఆస్తమా ఉంది… ఇద్దరు కేన్సర్ రోగులు… ఒక జంట ప్రమాదంలో గాయపడి, వెన్నెముక దెబ్బతిని మంచం మీదే బతుకుతోంది…


ఒకడు జైలులో ఉన్నాడు… మరొకాయన రెండు విడాకుల అనుభవాల తరువాత మూడో పెళ్లి కోసం వెతుకుతున్నాడు… ఇద్దరి పిల్లలు మానసిక వికలాంగులు, ముగ్గురో నలుగురి పిల్లలో బేవార్స్‌గా తిరుగుతూ అన్‌వాంటెడ్ ఎలిమెంట్స్‌గా మారిపోయారు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతి పేరు వెనుక ఓ విషాదపర్వం… దాదాపుగా… 


తాను రాసుకున్న సమాచారాన్ని ఓ క్రమపద్ధతిలో పాయింట్ల వారీగా క్రోడీకరించాడు, ఆ డాక్టర్‌ వద్దకు వెళ్లాడు, వినిపించాడు… ఇప్పుడు చెప్పు నీకు ఏమనిపిస్తోంది అనడిగాడు డాక్టర్ చిరునవ్వుతో… 


‘‘నీకు రోగాల్లేవు, ఆకలి బాధల్లేవు, కోర్టు కేసుల్లేవు, నీ కుటుంబసభ్యులు కూడా ఆరోగ్యంగా ఉన్నారు, తెలివైనవాళ్లు… పైగా జరగబోయేది ఏదైనా సరే, నువ్వు ఆపలేవు, ఆహ్వానించాల్సిందే…


ఏం జరుగుతుందో కూడా ఎవడూ చెప్పలేడు… మరి రేపటి మీద చింతతో ఈరోజును ఎందుకు నాశనం చేసుకోవడం..? మీరిక వెళ్లిరండి’’ అన్నాడాయన… తను డోర్ తీస్తుండగా మళ్లీ తనే ఓ మాటన్నాడు… 


‘‘ఇతరుల పళ్లేలలో ఏముందో చూడటం మానేయండి, మీ పళ్లెంతో ఆహారాన్ని ఆస్వాదించండి… ఇతరులతో పోలిక వద్దు, ఎవరి జీవితం వాళ్లదే…’’ ఏమిటి… మీకు కూడా బడికి వెళ్లి, పదో తరగతి రిజిష్టర్ తిరగేయాలని అనిపిస్తోందా… 

నా జీవన ప్రయాణం

 నా జీవన ప్రయాణం


అయిదవుతోంది. గదిలో లైటుండడంవల్ల బయటి వాతావరణం ఎలావున్నదీ తెలియట్లేదు. ఎక్కడా అలికిడిలేదసలు. ఫోన్ చార్జింగ్ తీసి, కేబుల్ని చక్కగా చుట్టి, చక్కిలంలా తయారుచేశాను. ఆనక వెల్క్రో స్ట్రాప్‌తో బంధించి, దాన్నీ అడాప్టర్నీ సూట్‌కేసులో పడేశాను. 

 


‘నీకేం, మగమహారాజులా బుడుంగుమని పెట్లోంచి బయటికీ, బయట్నించి పెట్లోకి దూకేస్తావు. నేనైతే చీరకొంగులా ఎన్ని చుట్టలు చుట్టుకోవాలో తెలుసా?’ అంటూ మూతి ముప్ఫై వంకర్లు తిప్పింది కేబుల్. 


‘నిజానికి కష్టమంతా నాదేనే కేబుల్‌బుల్! ఎంత వేడెక్కిపోతానో తెలుసా? వీడొక్కోసారి రాత్రంతా అలా చార్జింగ్ పెట్టి వదిలేస్తుంటాడు. అప్పుడు చూడు, తెలుస్తుంది!’ అంది చెమటలు తుడుచుకుంటూ అడాప్టర్.


ఈ గోలేదీ పట్టని నేను పెట్టేబేడా సర్దుకుని బయటికొచ్చాను. వార్నీ, చిమ్మచీకటైపోయిందే?


పొద్దున్న నేనొచ్చేటప్పుడు ప్రశాంతంగా, నీలంగా ఉన్న ఆకాశమంతా ఇప్పుడు ప్రశాంత్‌నీల్ సినిమాలా నల్లగా మసిపూసుకుని తయారైంది. 


గట్టిగా బాదేలా ఉంది వర్షం. రిసెప్షన్ దగ్గరకి రాగానే కాస్త అలికిడి వినబడింది. డేటా ఎంట్రీ ఆపరేటర్లు కంప్యూటర్ల ముందు కూర్చుని శ్రద్ధగా పనిచేసుకుంటున్నారు. ఓపీలోకి మాంచి దూకుడుమీద వచ్చేసిన కుక్కనొకదాన్ని తరుముతున్నాడు సెక్యూరిటీ గార్డు.


‘దీనికి అన్నవెఁయ్యొద్దని ఎన్నిసుట్లు సెప్పినా ఆలకించదండీ ఆ సావిత్రమ్మ! ఈమజ్జిన చికినుముక్కలు కూడా ఏస్తంది. ఇంకేటొదుల్తాది మనాస్పత్రిని? రోజుకీ లోనకొచ్చేస్తంది!’ అంటూ స్వగతం చెప్పుకున్నాడు.


ఎవరూ స్పందించలేదు. ఎంచేతంటే ఇద్దరు డిఇఓల చెవుల్లోనూ ఇయర్‌బడ్స్ ఏవో పాటల్ని వినిపిస్తున్నాయి.


‘ఏటి భాస్కర్రావుగారూ, కుక్క మళ్ళీ లోనకొచ్చీసిందా?' అంటూ పలకరించాను.


‘సార్, సారీ సార్! సూళ్లేదు. ఇటియ్యండ్సార్!' అంటూ నా చేతిలోంచి సామాను లాక్కోబోయాడు. పెట్టె అతన్ని పట్టకొమ్మని, బేడ నేను మోసుకుంటూ పోర్టికోలొకొచ్చాను.


అప్పుడే వర్షం మొదలైపోయింది. మరీ ఉధృతంగా లేదుగానీ, ‘అబ్బా... ఇది ఏమివానా!’ అంటూ పాడుకోడానికి సరిపడేంత రొమాంటిక్‌గా ఉంది.


పొద్దుట్నించీ ఎండకి వేడెక్కిపోయిన కారు ఆ వానకి తెల్లచీరలో తన్మయత్వంతో తడుస్తోంది. హెడ్‌లైట్లమీంచి కారుతున్న వాననీళ్ళు ఆనందబాష్పాల్లా కనబడ్డాయి నాకు. 


‘గొడుగు తెమ్మంటరేట్సార్?’ అన్నాడు భాస్కర్రావు లగేజిని ఒకచేత్తో పట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ. మరి దాన్నిండా ఈ-వేస్ట్ ఉంటుంది. అంటే తెలుసుగా? అన్నీ ఫోన్లు, బ్లూటూతులు, పెన్‌డ్రైవులూనూ! ఒక్క ఇంజెక్షనుగాని, మాత్రగానీ ఉండవు.


‘ఈమాత్రం వర్షానికేమీ మొక్కమొలవనుగానీ, ఇటిచ్చెయ్ ఆ సూట్‌కేసు!' అంటూ ఒక్కడుగులో కారుదగ్గరకి చేరాను.


రోడ్డంతా ఖాళీ అయిపోయింది. హార్న్ కొట్టాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా అయితే చెయ్యినొప్పెట్టేలా బాదినా ఎవడూ తప్పుకోడు. 


షాపుల ముందున్న రేకులకింద ఏవో టూవీలర్ల జనం నిలబడున్నారు. వర్షానికి అడ్డంగా దొరికిపోయిన బాపతనుకుంటా. పొగలుకక్కే టీని గాజుగ్లాసుల్లో పోస్తోంది రవణ. తాటాకు గొడుగుని రోడ్డుమీద అడ్డంగా పడేసి టీ అందుకున్నాడు తాత.


పెదాలమీద చిరునవ్వు మెరిసింది నాకు. రోజూ పొద్దున్న రౌండ్స్ వేస్తున్నప్పుడు కూడా ఇంతే! ఆ అమాయక గిరిజనుల్ని చూస్తే మాటిమాటికీ నా పెదాలమీద చిరునవ్వు మెరుస్తూ ఉంటుంది. నాతో రౌండ్స్‌కొచ్చే సిస్టర్లకి ఈపాటికి అర్ధమైపోయే ఉంటుంది, పెదాలమీద చిరునవ్వు మెరవడమంటే ఏమిటో!


ఎండకి మాడిపోయిన తారురోడ్డు వర్షపుజల్లుకి పులకించి మెత్తగా, నల్లగా నిగనిగలాడుతోంది. నిదానంగా పోదాం, తొందరేం? 


ఉదయం చూశాను. మూడేళ్లపిల్ల అది. మూడురోజుల క్రితం నూటమూడు జ్వరంతో వచ్చింది. మంచానికి అతుక్కుపోయి, ఒళ్ళు కాలిపోతోంది. వాళ్లమ్మని చూస్తే పట్టుమని ఇరవయ్యేళ్లు దానికి. ఏదో శౌచాలయం గోడమీద ‘స్త్రీలు’ అని రాసి, పక్కనవేసే బొమ్మలా ఉందే తప్ప ఏ ఆకారమూ లేదు. సరైన తిండీ, పోషణా లేని కొండపిల్ల. ఇక పిల్లల్నేం పెంచుతుంది?


దేవుడిదయవల్ల, మావాళ్ల దాక్షిణ్యంవల్లా చంటిదానికి ఈరోజుకి తగ్గింది జ్వరం. ఇవాళ డిశ్చార్జ్‌ట!


పొద్దున్న చూద్దునుకదా, పిల్లకి జుత్తంతా నూనెరాసి రెండు కొత్తిమీర కట్టల్లా తయారుచేసి రబ్బరుబాండ్లు పెట్టేసింది వాళ్లమ్మ. ఇంటికెళిపోవడంకంటే ఆనందమేముంటుంది? బుద్ధిగా మంచంమీద కూర్చుని బ్రెడ్ తింటోంది. 


అస్సలు అందంగా లేదు. కానీ చాలా ముద్దుగా ఉంది. 


‘ఏరా తల్లీ, ఆయి తగ్గిందా?’ అంటూ పలకరించే ప్రయత్నం చేశానోలేదో బ్రెడ్ పక్కనబడేసి ఏడుపు మొదలెట్టింది. మళ్లీ వీడేదో ఇంజెక్షన్ చెయ్యబోతున్నాడని అనుకునుంటుంది. 


ఆలోచనల్లో ఉండగానే చెరువుదాకా వచ్చేశాను. కారునలా పక్కకాపి కిటికీ అద్దం దించాను. తురాయిపూల సీజనిది. తలనిండా మందారాలు తురుముకున్న మా అమ్మమ్మలా ఉంది చెరువు ఒడ్డునున్న చెట్టు. నుదుటన రూపాయిబిళ్ళంత బొట్టుపెట్టుకుని, పెసరపప్పు ఛాయలో ఉండేది అమ్మమ్మ. అప్పుడే ఏదో గుర్తొచ్చి, నవ్వు ఆపుకున్నట్టుండే మొహం. మనవల్ని చూడగానే ఇలాగే ఆనందంతో తడిసిముద్దైపోయేది.


గుంపులుగుంపులుగా నల్లటి మబ్బులు కౌరవసైన్యంలా మీదకొచ్చేస్తోంటే లేతాకుపచ్చ రంగులో తమలపాకుల్లా ఉండే కొండలుకాస్తా ముదురు బాదం ఆకుల్లా కనబడుతున్నాయి.


నా సరదా గమనించిందనుకుంటా, వానజల్లు హుషారుగా లోపలికొస్తోంది. పెళ్ళివారింట్లో గుమ్మందగ్గర ఆడపిల్లలు పన్నీరు చిలకరించినట్టనిపించింది.


‘ఇళమై ఎనుమ్ పొంగాట్రూ...’ రేడియోలో బాలు గొంతు పిండేస్తోంది ఓపక్క. ‘ఒరే వీణై... ఒరే రాగం..’ ఈ లైను విన్న ప్రతిసారీ ఝల్లుమంటుంది నాకు.


కాసేపలా వర్షాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను. పట్టుమని పదినిముషాలైనా కురవకుండానే ఆగిపోయింది. ఆమాత్రందానికే ఆకాశం ఇలా నల్లకంబళ్లవీ కప్పుకుని కాటిసీన్లో హరిశ్చంద్రుడిలా తయారవడమెందుకో?


కానీ చూడ్డానికి భలే బావుంది బయటంతా! 


అచ్చం ఆ జ్వరం తగ్గిన పిల్లకిమల్లే తాజాగా కనబడుతోంది. నా జీవితంలో ఇలా బయటంతా ప్రకృతీ, హాస్పిటల్లో వికృతీ రాసిపెట్టాడు ఆ దేవుడు.


నేనక్కడ ఆగినట్టు ఎలా తెలిసిందో, దూరంగా కనబడుతున్న కొండలవారగా గూడ్స్ రైలొకటి వయ్యారంగా వచ్చింది. పాపం, ఖాళీలేకుండా కుక్కేసినట్టున్నారు పెట్టెలన్నీ, భారంగా కదులుతోంది నిండుచూలాలిలా!


నాకు కుంచెలతో రంగులద్దడాలవీ రావుగానీ లేకపోతే ఈ దారమ్మట కనబడే సౌందర్యానికి ప్రతిరోజూ ఓ చిత్రపటం గీసేసి ఎగ్జిబిషన్ పెట్టేసి, ఒక్క బొమ్మా అమ్ముడవ్వక ఆనక ఏడుస్తూ కూచుందును 😝😎 


ఆఖర్న గార్డు కూడా ఎవడో నాలాంటివాడే అనుకుంటా ఎంచక్కా బయట నిలబడి తనివితీరా ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. 


‘విసుగురాదు ఖుషీ పోదు వేసట లేనేలేదు...అసలు నా మరోపేరు ఆనందవిహారి..’ బాలు అలా పాడుతూనే ఉండాలి నా సమక్షంలో, నా జీవితమంతా!


Sunday, June 22, 2025

శేఖర్ కమ్ముల @23.06.2025

 శేఖర్ కమ్ముల@23.06.2025

|| ఎవరోగానీ 100% నిజం చెప్పారు 

|| కుబేర సినిమా ప్రమోషన్ వాక్యం కాదు 

|| సినిమా పిచ్చితో చెప్తుంది అంతకంటే కాదు..కానీ ఇతను చాలా మందికి నచ్చుతాడు చాలా వాటికి మెచ్చుతాడు..




తొలి సినిమా

ఈ దేశపు రాజకీయాల మీద.

చూశాక,

ఇతను కచ్చితంగా త్వరలో 

ఫేడ్ అవుట్ అవుతాడని అనుకున్నాను.


కొనడం,అమ్మడం మాత్రమే తెలిసిన 

భారత రాజకీయాల మీద తీసిన ఆ సినిమా 

ఏ మాత్రం మారడానికి వీలు కానీ, లేని ఇండియన్ రాజకీయాల గురించి కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.


అయితే

అంత సీరియస్ ట్రాక్ లో కూడా 

దర్శకుడు లవ్ ట్రాక్ దగ్గర దొరికిపోతాడు.


అతని సినిమాల్లో మ్యూజిక్

సినిమాలోని క్యారెక్టర్ ఆత్మను పట్టుకుంటుంది. 

ఎక్కడ వెలగాలో అక్కడ ఖచ్చితంగా అది వెలుగుతుంది.


అక్కడ మొదలైంది 

అతని సినిమాని పరిశీలనగా చూస్తూ ప్రేమించడం.


ఇక

బ్యానర్ మీద

డైరెక్టర్ శేఖర్ కమ్ముల పేరు చూసి 

సినిమా చూడడం కొంచెం అలవాటు.


' ఆనంద్' చాలాసార్లు చూసినప్పుడల్లా 

ఎందుకు ఇష్టం ఉంటుందో కానీ, 

చిరాకుగా ఉన్నప్పుడు ' సింక్ దగ్గర మాటిమాటికి నీళ్ల పంపు కు అడ్డం పడుతున్న జుట్టును  

అదాటును కత్తిరించే హీరోయిన్ని చూడగలిగిన వాడు 

ఎందుకు నచ్చడు.?


అయితే,

పేద పిల్లల కోసం దిగివచ్చే' కుబేరులు' అనే 

ఇతని ఆదర్శం మీద 

నాకు కొంచెం కినుక ఉండేది, ఉంటుంది కూడా.


ఇక 'లవ్ స్టోరీ' దగ్గర

ఎంత నచ్చేసాడో చెప్పలేను.

' ఎక్కడపడితే అక్కడ, గుండెల్లోకి కలుక్కుమని గుచ్చుకునే కులం పీడన' అందరికీ అర్థం కాదు.

ముఖ్యంగా

ఫ్యూడల్ కులం నుండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం ద్వారా అమెరికాలో తిరిగి, ఇండియాకి వచ్చే వాళ్లకు.

కానీ

ఇతను దానిని దాటేశాడు. 

అర్ధం ఐనోళ్ళకి 

దాటడం ఎంత అవసరమో తెలుస్తుంది కూడా.


గీతలు చెరిపివేయగలగటం ఒక పెద్ద సాహసమే. 

ఆ సాహసాన్ని చాలా చోట్ల చేశాడు ఇతను.


' లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అని చెప్పే ఇతను, 

మిడిల్ క్లాస్ కి అప్పర్ క్లాస్ కి మధ్య గీతలు చెరిపేయాలని, 

ఆడే క్రికెట్ ద్వారా చెప్పడమే కాదు' 

ఎగురుతున్న విమానంలో, 

ప్రమాదాలను చెరిపేసే ప్రేమను కూడా చెప్పినప్పుడు' 

ఇతను

ఈ నేల కోల్పోయిన అమ్మ ప్రేమ ఏదో 

మళ్లీ మళ్లీ చెప్పాలనుకుంటున్నాడని భలే ఇష్టం వేసింది.

అంతే.

గోదావరి నుంచి లవ్ స్టోరీ దాకా ఫిదా.


అతని సినిమాలు,

ఫ్రెష్ గా ఉంటాయి. 

మనకు బాగా తెలిసిన క్యారెక్టర్స్ లోని 

కొత్తగా తెలిసే అద్భుతమైన మనస్తత్వం లాగా.


ప్రేమ తెలియడం గొప్ప కాదు.

ప్రేమించడం ఎలాగో తెలియజేయడం గొప్ప.


సమాజంని అస్తవ్యస్తం చేస్తున్న

' గీతలు' ఏవో తెలియడం గొప్పకాదు.

ఆ గీతల్ని చెరిపి వేయడం ఎట్లాగో తెలియడం గొప్ప.


మన జీవిస్తున్న సమాజంలో

' తప్పులు' ఏవో తెలియడం గొప్పకాదు.

ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడం ఎలాగో తెలియజేయడం గొప్ప.


వంశాలు,డిఎన్ఏలు జబ్బ చరుచుకునే చోటే

దొంగలు, మాఫియాలు 

అడ్డగోలుగా బాక్స్ ఆఫీస్ లో డబ్బును దోచుకునే చోటే

వికసితభారతం, 

75 ఏళ్ల తర్వాత కూడా ప్రజాస్వామ్యం అంచులు కూడా తాకడానికి సాహసించనప్పుడు, 

సిగ్గులేకుండా రాజరికాన్ని బాహాటంగా 'రాజ'సాన్ని

ప్రచారం చేస్తున్నప్పుడు

ఇతను ఒకడు

మనిషిలోని సున్నితమైన స్పందన కోసం

అతనిలో రావాల్సిన మార్పు కోసం

అతనిని వెలిగించే ప్రేమ కోసం

మానవ సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్న 

సంపదదాహం నిర్మూలన కోసం

మన ఎదురుగా ఒక పసి పిల్లవాడు 

పొద్దుపొద్దున్నే మంచులో తడిసిన 

ఒక పువ్వు ఇచ్చినట్టుగా 

మనతో మాట్లాడుతాడు చూడూ' ఇది నచ్చుతుంది.


పల్లెటూర్లు

ఊరి చివరి చెరువు

ఏమాత్రం భేషజాలు పోకుండా అందర్నీ కలిపే నది.

పువ్వులకు నీళ్లు పోసే అమ్మాయి

అంతఃపురాలు దాటి

అటువంటి అమ్మాయి కోసం కఠినమైన ఎండలో నిలబడే అబ్బాయి

అనేకరకాల అహంకారాలను కడిగేసే వాన

రకరకాల గీతలు చెరిపే మనుషులు

అందరినీ బతికించే ప్రేమ

మనుషుల మధ్య ప్రేమలు పంచే దేవుడు

జీవితాన్ని పరిపుష్టం చేసే 

స్వేచ్ఛ కోసం తపించే అమ్మాయిలు

ఇట్లా ఒక్కరేమిటి, 

అతను ' సినిమా ద్వారా ఈ ప్రపంచానికి 

ఏదైనా ఒక మంచి చెప్పాలనుకుంటున్న రుషిలాగా అనిపిస్తాడు.


నిజం చెబుతున్నాను

ఇదంతా శేఖర్ కమ్ముల గురించే.

కుబేర సినిమా గురించి అసలు కాదు.


కానీ

రోడ్డుమీద బండిని డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు 

ఎందుకు' కుబేర' సినిమా పోస్టర్ నా చూపుని లాక్కెడుతుందో తెలియదు.

ముఖ్యంగా

దుమ్ము కొట్టుకున్న, మురికి చొక్కాతో 

మంచి క్లాసికల్ పోస్టర్స్ మీద దిగాలుగా నించున్న' ధనుష్' బొమ్మ.


ఎందుకురా

ఇప్పటికే పేరుకుపోయిన అబద్దాలతో

మరింత నాశనం చేస్తారు మనసుల్ని.


కాస్త

అతనిని చూసి కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నించండి.

ఇది కేవల నా అభిప్రాయం మాత్రమే..ఈ డబ్బు ,కులం, ఆదిపత్యం ఇవేవీ నీకు మేలు చేయవు సరికదా..నీతో ఏదీ ఊరికి ఉత్తరాన బూడిదయ్యేటప్పుడు తోడు రాదు.



పుణ్యఫలం

 పుణ్యఫలం

ఈ కథను ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చదవండి.

 

చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి, రద్దీగా ఉన్న ఒక బస్సు 🚌తన గమ్యస్థానానికి బయలుదేరింది.


👉ఆ బస్సు 🚌ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన  కుండపోత వర్షం ⛅ప్రారంభమైంది.


👪ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక 🌋పిడుగుపాటు వల్ల బస్సుకు🚌 50 అడుగుల దూరంలో ఒక చెట్టు🌴 పడిపోయింది. 👴👨డ్రైవర్ చాకచక్యంతో బస్సును🚌 ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ🎫 వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.





🏃కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు🚌 బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.😞


👉ఆ బస్సు🚌రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు 🌋బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు🌴 కొట్టింది. డ్రైవర్ 👨చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.


👉ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 🌋30అడుగుల దగ్గరలో కొట్టింది.ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు 😤ప్రారంభమయ్యాయి.


👉అందులోంచి ఒక పెద్ద మనిషి 👴 ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావ వలసి వస్తుంది.


👉నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!

ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి,

అదిగో!ఎదురుగా ఉన్న ఆ 🌴చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో 🚌వచ్చి కూర్చోండి.

మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు.

మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!🏃

ఒక్కరి కోసం అందరూ చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.😞


👉చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.

మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.

అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో 🚌కూర్చున్నాడు….


👉ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును 🌴ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.

చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.💜


👉చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతోచూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును🌴 ముట్టుకోవడానికి నిరాకరించాడు.


కాని, బస్సులోని ప్రయాణికులందరు”నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు. బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.


👉చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును🌴 ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు🌋 వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు!


👉బస్సుపై…అవును.. 🚌బస్సుపై పిడుగు🌋 పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.😞


👉నిజానికి ఈ చివరి వ్యక్తి 👨ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది.👏


👉ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదేననుకుంటాము.👈


👉కాని, ఆ పుణ్యఫలం

మన తల్లిదండ్రులది కావచ్చు!

👸జీవిత భాగస్వామిది కావచ్చు!

👷పిల్లలది కావచ్చు!

👧తోబుట్టువులది కావచ్చు!

👦మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా

👨మన శ్రేయస్సును కోరే స్నేహితులది – బంధువులది కావచ్చు!

మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు.

ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.💜

👉ఒక సినిమాలో చెప్పినట్లు…”బాగుండడం” అంటే బాగా ఉండడం కాదు. 

👪అందరితో కలిసి ఆనందంగా ఉండడం👧👸🏃

కృష్ణం వందే జగద్గురుం


              

సేకరణ

ఆశించడం ఆపేస్తే

 ఆశించడం ఆపేస్తే... 

నాకూ నచ్చి చదువుతూ వుండే ఇన్స్పిరేషన్  సంఘటనా... .... 

ఓసారి బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్ కు వెళ్ళారు, షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు...

అక్కడున్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు, బ్రహ్మానందం తనికెళ్ళ భరణి ఇద్దరినీ చూడగానే ఆ పూజారి వీళ్ళని గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తాడని అనుకున్నారిద్దరూ కానీ ఆయన వీళ్ళని చూసి తన పూజలో తాను నిమగ్నమయ్యాడు



పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అదీలేదు, వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది గానీ ఆయన మాత్రం వీళ్ళ దగ్గరికి రాలేదు, ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకొని పూజారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయమని అడిగారు, 

ఇప్పుడు సమయం అయిపోయింది రేపు ఉదయం ఏడు గంటలకు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు...

మర్నాడు ఉదయం ఏడు గంటలకల్లా గుడి దగ్గర నిలబడి ఉన్నారు, పూజారి రావడం, అభిషేకం చేయడం, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అన్నీ అయిపోయాయి...

స్వామి దక్షిణ తీసుకోండి అని తలా వేయిరూపాయలు బయటకు తీశారు, ఆయన హుండీలో వేయమని సైగ చేశాడు.

యూనిట్ వాళ్లు టిఫిన్ తెచ్చి ఇచ్చారు ఇద్దరూ ఆ గుడి ఆవరణలోనే కూర్చుని తినడానికి వెళ్తూ పూజారిని ఆహ్వానించారు, నేను తినేశాను మీరు తినండి అని సున్నితంగా తిరస్కరించాడు, కాఫీ అయినా తాగండి అన్నారు, ఆ పూజారి మంచినీళ్ళు కూడా తాగను అనేశాడు, 

మీరు మమ్మల్ని గుర్తించారా అని అడిగారు భరణి గారు కాస్త అహంతో...

ఆ పూజారి పేర్లతో సహా చెప్పాడు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఆశ్చర్యంతో "స్వామి దక్షిణ ఇస్తే తీసుకోలేదు హుండీలో వేయమన్నారు, టిఫిన్ ఇస్తే తీసుకోలేదు, కనీసం కాఫీ కూడా తాగలేదు, ఎందుకు, కారణం తెలుసుకోవచ్చా" అని అడిగారు 

అప్పుడాయన "సార్ నాకోక ఎకరం పొలం ఉంది, ఒక ఆవు ఉంది, ఒక శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి ఈ జీవితానికి" అని వెళ్ళిపోయాడు... 

ఆ సందర్భాన్ని అప్పుడే భరణి గారు 

"మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది" అని వర్ణించారు...

ఎవరి దగ్గరా ఏదీ ఆశించకపోతే జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించింది ఇద్దరికీ, ఆక్షణం ఆయన్ని మించిన శ్రీమంతుడు ప్రపంచంలో ఇంకెవరూ లేరు అన్నంత గొప్పగా కనిపించాడు ఆ పూజారి వాళ్ళిద్దరి కళ్ళకి, సంతృప్తిగా బ్రతికే ప్రతి మనిషీ మహారాజే గురూజీ...

ఆశించడం ఆపేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది

ఎవరి నుంచీ ఏదీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అప్పుడే లైఫ్ లో తృప్తి దొరుకుతుంది, ప్రశాంతత నీలో కొలువుంటుంది...

ఈ సంఘటనను వెంటనే భరణి గారు

ఓ పాటలా ఇలా రాశాడు... 

"మాసెడ్డ మంచోడు దేవుడు 

మాసెడ్డ మంచోడు దేవుడు...

నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు

మాసెడ్డ మంచోడు దేవుడు...

అస్సలడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు

మాసెడ్డ మంచోడు దేవుడు..."

Saturday, June 21, 2025

సమయం లేదు మిత్రమా

 సమయం లేదు మిత్రమా



పన్నెండు గంటల ప్రయాణం నాలుగు గంటల్లో పూర్తవుతోంది,

అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు.


పన్నెండు మందితో ఉండే కుటుంబం ఇద్దరికి చేరిపోయింది,

అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు.


నాలుగు వారాలు పట్టే సందేశం ఇప్పుడు నాలుగు సెకన్లలో వస్తోంది,

అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు.


"30 నిమిషాల్లో కాకపోతే ఉచితం" అనే ఆఫర్లు ఉన్నాయి,

అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు.


ఒకప్పుడు దూరంలోని మనిషి ముఖం చూడటానికి సంవత్సరాలు పట్టేది,

ఇప్పుడది కేవలం ఒక సెకన్లో కనిపిస్తోంది –

అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు.


ఇల్లు పైకి కిందకి వెళ్ళడానికి పట్టే శ్రమ

ఇప్పుడు ఎలివేటర్ వల్ల క్షణాల్లో ముగుస్తోంది,

అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు.


బ్యాంక్ లో గంటల తరబడి క్యూలో కూర్చున్న మనిషి,

ఇప్పుడు మొబైల్ లో కొన్ని సెకన్లలో లావాదేవీలు చేస్తున్నాడు,

అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు.


వారాలు పట్టే ఆరోగ్య పరీక్షలు

ఇప్పుడు కొన్ని గంటల్లో పూర్తవుతున్నాయి,

అయినా మనిషి అంటున్నాడు – సమయం లేదు.


ఒక చేతిలో స్కూటీ హ్యాండిల్, ఇంకో చేతిలో ఫోన్ –

ఎందుకంటే ఆగి మాట్లాడేందుకు సమయం లేదు.


కారు నడుపుతూనే ఒక చేతిలో స్టీరింగ్, ఇంకో చేతిలో వాట్సాప్ –

ఎందుకంటే సమయం లేదు.


ట్రాఫిక్ జామ్ అయితే రెండు లైన్లు దాటుతూ మూడో లైన్ తయారు చేస్తాడు –

ఎందుకంటే సమయం లేదు.


నాలుగుమందితో కూర్చున్నా అసహనంగా ఫోన్‌లో వేలు వేశాడు –

ఎందుకంటే ఎక్కడికో వెళ్ళాలి – సమయం లేదు.


ఒక్కడిగా ఉన్నప్పుడు శాంతిగా ఉంటాడు,

కానీ ఎవరైనా ఎదురుగా ఉంటే అసౌకర్యంగా ఫోన్ చూస్తాడు –

ఎందుకంటే సమయం లేదు.


పుస్తకం చదవడానికి సమయం లేదు,

తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం లేదు,

మిత్రుడిని కలవడానికి సమయం లేదు,

ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు…


కానీ – ఐపీఎల్ కోసం సమయం ఉంది,

నెట్‌ఫ్లిక్స్ కోసం సమయం ఉంది,

రీల్స్ కోసం సమయం ఉంది,

రాజకీయాలపై చర్చల కోసం సమయం ఉంది,

కానీ తనకోసం సమయం లేదు…


ప్రపంచం సులభమైంది, వేగం పెరిగింది,

సాంకేతికత దగ్గరైంది, దూరాలు తగ్గాయి,

ఆధునికత పెరిగింది, అవకాశాలు వచ్చాయి –

కానీ మనిషి "సమయం లేదు" అంటూ తనను తానే మర్చిపోయాడు.


నిశ్శబ్దంగా కూర్చుని తనతో మాట్లాడుకోవడానికి,

తనను అర్థం చేసుకోవడానికి,

లేదా కేవలం ఒక్క నిమిషం హాయిగా నవ్వడానికి –

సమయం లేదు అంటున్నాడు.


మరొక్క రోజు సమయమే వెళ్లిపోతుంది.

ఆఖరి క్షణంలో అర్థమవుతుంది –

సమయం ఉండింది…

కానీ మనమే “సమయం లేదు” అంటూ జీవించడాన్ని మరిచిపోయాము.


కాబట్టి, ఈరోజే నిర్ణయం తీసుకోండి –

తనకోసం కొద్దిగా సమయం కేటాయించండి,

బంధాల కోసం కొంత సమయం పెట్టండి,

మనసు కోసం, ప్రశాంతత కోసం, జీవితపు గర్భం కోసం –

కొంత సమయం వెచ్చించండి.


ఎందుకంటే "సమయం లేదు" అనేది నిజం కాదు,

అది కేవలం అలవాటు మాత్రమే…

దానిని మార్చాలి.

సమయం లేదు మిత్రమా సమయం లేదు అనే పదం మార్చడానికి....

అందరు బాగుండాలి అందులో మనముండాలి.


              కృష్ణం వందే జగద్గురుమ్.

Thursday, June 19, 2025

సంసారం ఒక చదరంగం

 సంసారం ఒక చదరంగం

మీ సంసారాన్ని మరొక సంసారంతో పోల్చుకోకండి

మీరిద్దరు పెళ్ళిచేసుకుని దంపతులయ్యారు మీ జీవితం మీది మీ సంసారం మీది ఇది బాగా అర్ధం చేసుకోవాలి. 



మీరిద్దరు ఒకరికోసం ఒకరుగా బ్రతకాలి

మీకు సోదరులు సోదరీలు ఉండవచ్చు. అలాగే స్నేహితులు ఉండవచ్చు వాళ్లకు కూడా పెళ్లిళ్లు అయి మీ కంటే మంచి జీతం సంపాదించుకుంటూవుండవచ్చు వాళ్ళకి సొంతిల్లు ఉండవచ్చు లేదా మీ ఇంటి కంటే పెద్దిల్లు ఉండవచ్చు మరోవిధంగా చెప్పాలంటే మీకంటే మంచి పొజిషన్ లో ఉండవచ్చు. అంత మాత్రాన ప్రతి విషయంలో వాళ్లతో వాళ్ళ కుటుంబంతో పోల్చుకుంటూ కృంగి పోతూ మీలో మీరు గొడవ పడటం సబబు కాదు అంతే కాదు వాళ్ళని చూసి ఈర్ష్య పడటం కూడా తప్పే. 

తల్లితండ్రులకు పిల్లలందరూ సమానమే ఒకరు కలెక్టర్ అయినా మరొకరు కండక్టర్ అయినా అందరిని సమానంగానే చూస్తారు. మనం నీకు కుడి చేతికి ఎన్ని వేళ్ళు అంటే ఐదు అని చెపుతాం కానీ ఆ ఐదు వేళ్ళు ఎక్కడైనా సమానంగా ఉంటాయా? ఉండవుకదా

జీవితం కూడా అంతే

పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను కలిపే ఒక బంధం అది మాములు బంధం కాదు పవిత్ర బంధం. మీ కుటుంబం లో మీ మొగుడు పెళ్ళాలు ఇద్దరు సమాన భాగస్థులు. మీ పెళ్లయ్యాక ఏ పని చేసినా కలిసే చెయ్యాలి ఆ ఫలితాన్ని మీరే అనుభవించాలి అది మంచయినా చెడయినా దానికి మీరే భాద్యులు. అంతేకాని మొగుడిని పెళ్ళాం పెళ్ళాన్ని మొగుడు తిట్టుకోవడం కొట్టుకోవడం తగదు. అలాగే మీ పక్క ఇంటి లేదా ఎదురింటి వాళ్ళని లేదా మీరు అపార్ట్మెంట్ లో ఉండే మరొకరిలా ఉండాలని ఎప్పుడు అనుకోకండి.

మీరు మీలా ఉండటం నేర్చుకోండి. మీ వ్యక్తిత్వం మీది. మీ ఇద్దరు ఒకటిగా కలసి ఆలోచిస్తే కష్టపడితే అందరి కంటే మీ కుటుంబమే ఉన్నత స్థితి లో వుండే అవకాశం వందశాతం ఉంటుంది. 

ఆవిడ మొగుడు అందంగా వున్నాడు ఈయన పెళ్ళాం చాలా బాగుంది ఇవన్నీ పెళ్లైయ్యే వరకే ఆ తరువాత అందం స్థానంలో ప్రేమ ఆప్యాయత అనురాగం చోటు చేసుకుంటాయి. అందం ఉండి ప్రవర్తన బాగా లేకపోతే ఏ పెళ్ళాం/మొగుడు ఇష్టపడతారు మీరే చెప్పండి?

 కాబట్టి మీరు ఒకరికొకరు తోడునీడై మనసావాచా ఒకటై జీవితాన్ని ఆనందమయం చేసుకోండి

సదా మీ సేవలో

పనస 

Sunday, June 15, 2025

Meet Neena Gupta

 🇮🇳✨ Meet Neena Gupta 

The Modern Queen of Algebra! 👩‍🏫🔬


An Indian mathematician solving problems the world couldn’t solve for decades!

When people say “math is hard,” remind them of Neena Gupta—a fearless female genius from Kolkata, India, who faced one of the world’s toughest math problems… and solved it!



📚 Who is Neena Gupta?

She’s a young professor at the Indian Statistical Institute (ISI), Kolkata.

 In 2021, she received the Ramanujan Prize—one of the most prestigious international awards in mathematics!


🧩 Her Breakthrough:

She cracked the famous Zariski Cancellation Problem in algebraic geometry—a puzzle that had confused mathematicians for over 70 years!


This problem is like asking:

“If two shapes look the same when you add a cube to both… were they originally the same shape?”

Sounds simple? It’s one of the deepest problems in algebra.

 And Neena Gupta solved it—alone. 💪


👩‍🎓 From Passion to Prestige

Born in 1984, Neena was passionate about mathematics from a young age.

 She studied at ISI and stayed on to become a professor—dedicating her life to deep, pure math.


Her work has earned her:

 ✅ Ramanujan Prize (2021)

 ✅ Shanti Swarup Bhatnagar Award

 ✅ Recognition from the world’s top math institutes


🌟 Why She’s an Inspiration

She’s a young Indian woman in a male-dominated field


She proved that deep thinking and consistency matter more than noise


She’s a role model for girls who love numbers, puzzles, and thinking differently


💬 What We Learn from Neena Gupta:

“Math is not just for the brilliant few. It’s for the curious, the patient, the bold.”

Let’s celebrate her genius and show our students that they can be next.

 Your background doesn’t limit your brilliance.


#NeenaGupta #IndianMathematician #WomenInSTEM #ModernMathLegends #SHITTUAcademy #RamanujanPrize #MathInspiration #ZariskiSolved #GirlPowerInSTEM

Saturday, June 14, 2025

అర ఎక‌రం పొలంలో 3223 KG ల దిగుబ‌డి సాధించి చూపించిన ఉపాధ్యాయురాలు !!

 అర ఎక‌రం పొలంలో 3223 KG ల దిగుబ‌డి సాధించి చూపించిన ఉపాధ్యాయురాలు !!

==================================

త‌మిళ‌నాడుకు చెందిన ఆ మ‌హిళా రైతు ఏకంగా అర ఎక‌రానికే 43 బ‌స్తాల వ‌రి పండించి రికార్డు సృష్టించింది. ఓ మ‌హిళే ఈ ఘ‌న‌త‌ను సాధించింది.


 అది కూడా ఆమె ఓ ఉపాధ్యాయురాలు కావ‌డం విశేషం. ఆమె పేరు ప్ర‌స‌న్న‌. త‌మిళ‌నాడులో నివాసం. ఓ ప్రైవేటు పాఠ‌శాల‌లో సైన్స్ అధ్యాప‌కురాలిగా ప‌నిచేస్తోంది.


అయితే చిన్న‌ప్ప‌టి నుంచి ప్ర‌స‌న్న‌కు వ్య‌వ‌సాయం అంటే ఎంత‌గానో ఇష్టం. ఆమె తండ్రి కూడా ఆమె ఇష్టాన్ని గ‌మ‌నించి నిత్యం పొలానికి తీసుకెళ్లేవాడు.



 అంతేకాదు ఆమె క‌ళాశాల‌లో చేరినా రోజూ పొలానికి వెళ్లి వ‌చ్చాకే కాలేజీకి వెళ్లేది. ఈ క్ర‌మంలో ఆమె ఎమ్మెస్సీ బీఈడీ కూడా పూర్తి చేసి టీచ‌ర్‌గా ఉద్యోగం చేయ‌డం ప్రారంభించింది.


అయితే వ్య‌వ‌సాయం మీద మ‌క్కువ ఉండ‌డంతో ఓ రైతునే పెళ్లి కూడా చేసుకుంది. కాగా త‌మిళ‌నాడుకు చెందిన వ్య‌వ‌సాయ శాస్త్రవేత్త‌లు కొత్త‌గా శ్రీ‌వ‌రి అనే వంగడాన్ని క‌నిపెట్ట‌డంతో స‌ద‌రు విత్త‌నం గురించి తెలుసుకుని దాన్ని పండించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.


అలా ప్ర‌స‌న్న అనుకున్న‌దే త‌డవుగా సంబంధిత అధికారుల‌ను క‌లిసి విత్త‌నాల‌ను తీసుకుని పంట‌లు వేసింది. కానీ మొద‌టి రెండు సార్లు విఫ‌ల‌మైంది.


 అయితే ఈ సారి ఎలాగైనా స‌ద‌రు విత్త‌నంతో మంచి దిగుబ‌డి రాబ‌ట్టాల‌నుకుంది. ఈ క్ర‌మంలో కృత్రిమ ఎరువుల జోలికి పోకుండా పూర్తి స్థాయిలో సేంద్రీయ ప‌ద్ధ‌తిలో త‌యారు చేసిన ఎరువుల‌ను వాడింది.


 అయితే ఈ సారి ఆమె అనుకున్న‌ట్టుగానే అత్యంత ఎక్కువ‌గా దిగుబ‌డి సాధించింది. సాధార‌ణంగా ఒక ఎకరా వ‌రి పొలానికి దాదాపుగా 40 బ‌స్తాలు పండుతాయి, కానీ ప్ర‌స‌న్న చేసిన సాగుతో, శ్రీ‌వ‌రి విత్త‌నం కార‌ణంగా ఆమె అర ఎక‌రం పొలంలోనే ఏకంగా 43 బ‌స్తాలు (3223 కిలోలు) వ‌రి పండింది.


 ఈ క్ర‌మంలో మొద‌ట్నుంచీ ప్ర‌స‌న్న చేస్తున్న సాగును, ఆమె వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌ను అధికారులు రిజిస్ట‌ర్‌ల‌లో న‌మోదు కూడా చేశారు.


దీంతో చివ‌రికి ఆమె సాధించిన దిగుబ‌డి రికార్డు స్థాయిలో ఉండ‌డంతో ఆమెకు రూ.5 ల‌క్ష‌ల న‌గదు కూడా అందించారు.


కాగా ఇప్పుడు ప్ర‌స‌న్న దృష్టి బిందు సేద్యంపై ప‌డింది. ఈ విధానంలో పంట‌ల‌ను పండిస్తూ పేరు తెచ్చుకోవాల‌న్న‌ది ఆమె కోరిక‌. ఆమె ఆశ నెర‌వేరాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం.

Tuesday, June 10, 2025

ఈ మెసేజ్ మళ్లీ దొరకదు

 


ఈ మెసేజ్ మళ్లీ దొరకదు.. అరుదైన సమాచారం.
దీనిని   తయారు  చేయడానికి  చాలా  రోజులు  పట్టాయి.

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.

దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం

మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం

వేదాలు :(1) ఋగ్వే దం,
(2) యజుర్వేదం,(3) సామవేదం,
(4) అదర్వణ వేదం

పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,
(3) కామ,(4) మోక్షా

పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,
(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.

  పంచేంద్రియాలు : (1) కన్ను,
(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,
(5) చర్మం.

లలిత కళలు : (1) కవిత్వం,
(2) చిత్రలేఖనం, (3) నాట్యం,
(4) సంగీతం, (5) శిల్పం.

పంచగంగలు : (1) గంగ, (2)  కృష్ణ,
(3) గోదావరి, (4) కావేరి,
(5) తుంగభద్ర.

దేవతావృక్షాలు : (1) మందారం,
(2) పారిజాతం, (3) కల్పవృక్షం,
(4) సంతానం, (5) హరిచందనం.

పంచోపచారాలు : (1) స్నానం,
(2) పూజ,  (3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.

 
పంచామృతాలు : (1) ఆవుపాలు,
(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర,
(5) తేనె.

పంచలోహాలు : (1) బంగారం,
(2) వెండి,  (3) రాగి,
(4) సీసం, (5) తగరం.

పంచారామాలు : )1) అమరావతి,
(2) భీమవరం, (3) పాలకొల్లు,
(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం

షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు,
(3) చేదు, (4) వగరు,
(5) కారం, (6) ఉప్పు.

అరిషడ్వర్గాలు  షడ్గుణాలు:(1) కామం,
(2) క్రోధం, (3) లోభం, (4) మోహం,
(5) మదం, (6) మత్సరం.

ఋతువులు : (1) వసంత,(2) గ్రీష్మ,
(3) వర్ష, (4) శరద్ఋతువు,
(5) హేమంత, (6) శిశిర

సప్త ఋషులు : (1) కాశ్యపుడు,
(2) గౌతముడు,  (3) అత్రి,
(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,
(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.

తిరుపతి సప్తగిరులు : (1) శేషాద్రి,
(2) నీలాద్రి, (3) గరుడాద్రి,
(4) అంజనాద్రి, (5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.

సప్త వ్యసనాలు : (1) జూదం,
(2) మద్యం, (3) దొంగతనం,
(4) వేట, (5) వ్యభిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

సప్త నదులు : (1) గంగ,
(2) యమునా,  (3) సరస్వతి,
(4) గోదావరి,  (5) సింధు,
(6) నర్మద,  (7) కావేరి.
           
నవధాన్యాలు : (1) గోధుమ,
(2) వడ్లు,  (3) పెసలు,
(4) శనగలు, (5) కందులు,
(6) నువ్వులు, (7) మినుములు,
(8) ఉలవలు, (9) అలసందలు.

నవరత్నాలు : (1) ముత్యం,
(2) పగడం, (3) గోమేధికం,
(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).

నవధాతువులు : (1) బంగారం,
(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి,
(5) ఇనుము, (6) కంచు,
(7) సీసం, (8) తగరం,
(9) కాంతలోహం.

నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార,
(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర,
(6) భయానక, (7) బీభత్స,
(8) అద్భుత, (9) వీర

నవదుర్గలు : (1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,
(4) కూష్మాండ, (5) స్కందమాత,
(6) కాత్యాయని, (7) కాళరాత్రి,
(8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.

దశ సంస్కారాలు : (1 ) వివాహం,
( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం ,
(4 ) సీమంతం, (5) జాతకకర్మ,
(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం,
(8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం,
(10) సమవర్తనం

దశావతారాలు : (1) మత్స్య,
(2) కూర్మ, (3 ) వరాహ,
(4) నరసింహ, (5) వామన,
(6) పరశురామ, (7) శ్రీరామ,
(8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.

జ్యోతిర్లింగాలు :

హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

తమిళనాడు ~ రామలింగేశ్వరం

తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ,
(3) మంగళ, (4) బుధ, (5) గురు,
(6) శుక్ర, (7) శని.

తెలుగు నెలలు : (1) చైత్రం,
(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం,
(5) శ్రావణం, (6) భాద్రపదం,
(7) ఆశ్వీయుజం, (8) కార్తీకం,
(9) మార్గశిరం, (10) పుష్యం,
(11) మాఘం, (12) ఫాల్గుణం.

రాశులు : (1) మేషం,(2) వృషభం,
(3) మిథునం, (4) కర్కాటకం,
(5) సింహం, (6) కన్య, (7) తుల,
(8) వృశ్చికం, (9) ధనస్సు,
(10) మకరం, (11) కుంభం,
(12) మీనం.

తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ,
(3) తదియ, (4) చవితి,(5) పంచమి,
(6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి,
(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి,
(12) ద్వాదశి, (13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.

నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి,
(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర,
(6) ఆరుద్ర, (7) పునర్వసు,
(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ,
(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త,
(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ,
(17) అనురాధ, (18) జ్యేష్ఠ,
(19) మూల, (20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం,
(23) ధనిష్ఠ, (24) శతభిషం,
(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.

తెలుగు సంవత్సరాల పేర్లు :
(1) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

(2) విభవ :-
1928, 1988, 2048, 2108

(3) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. -
1934, 1994, 2054, 2114

9యువ.  -
1935, 1995, 2055, 2115

10.ధాత.  -
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. -
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. -
1939, 1999, 2059, 2119

14.విక్రమ. -
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. -
1942, 2002, 2062, 2122

17.స్వభాను. -
1943, 2003, 2063, 2123

18.తారణ. -
1944, 2004, 2064, 2124

19.పార్థివ. -
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. -
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. -
1948, 2008, 2068, 2128

23.విరోధి. -
1949, 2009, 2069, 2129

24.వికృతి. -
1950, 2010, 2070, 2130

25.ఖర.
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ.
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136

31.హేవళంబి.
1957, 2017, 2077, 2137

32.విళంబి.
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి.
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్.
1962, 2022, 2082, 2142

37.శోభకృత్.
1963, 2023, 2083, 2143

38. క్రోది.


1964, 2024, 2084, 2144,

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147

42.కీలక.
1968, 2028, 2088, 2148

43.సౌమ్య.
1969, 2029, 2089, 2149

44.సాధారణ .
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151

46.పరీదావి.
1972, 2032, 2092, 2152

47.ప్రమాది.
1973, 2033, 2093, 2153

48.ఆనంద.
1974, 2034, 2094, 2154

49.రాక్షస.
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156,

51.పింగళ                
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి        
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి             
1979, 2039, 2099, 2159

54.రౌద్రి                
1980, 2040, 2100, 2160

55.దుర్మతి             
1981, 2041, 2101, 2161

56.దుందుభి            
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి        
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి                
1984, 2044, 2104, 2164

59.క్రోదన                 
1985, 2045, 2105, 216

60.అక్షయ             
1986, 2046, 2106, 2166.

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం....
నమస్కారం

సదా మీ సేవలో
పసుపులేటి నరేంద్రస్వామి

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE