NaReN

NaReN

Wednesday, April 19, 2023

విలువ తెలుసుకోవాలంటే

 మీరు ఒక సంవత్సరం విలువ తెలుసుకోవాలంటే, విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో విఫలమైన వ్యక్తిని అడగండి.


నెల విలువ తెలుసుకోవాలంటే అప్పుడే నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని అడగండి. 


మీరు ఒక వారం విలువ తెలుసుకోవాలంటే, క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తిని అడగండి.


మీరు ఒక రోజు విలువ తెలుసుకోవాలంటే, దినపత్రిక ఎడిటర్‌ని అడగండి.


మీరు గంట విలువ తెలుసుకోవాలంటే, ఇప్పుడే లిఫ్ట్‌లో చిక్కుకున్న వ్యక్తిని అడగండి.


మీరు ఒక నిమిషం విలువ తెలుసుకోవాలంటే, ఇప్పుడే బస్సు మిస్ అయిన వ్యక్తిని అడగండి.


మీరు సెకను విలువను తెలుసుకోవాలనుకుంటే, ట్రాఫిక్ ప్రమాదంలో మరణించిన బంధువు ఉన్న వ్యక్తిని అడగండి.


సెకనులో పదవ వంతు విలువ తెలుసుకోవాలంటే, ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన వ్యక్తిని అడగండి.


సమయం అమూల్యమైనది. అది గడిచినప్పుడు, అది ఎప్పటికీ తిరిగి రాదు.


కాబట్టి, "బతకడానికి చాలా రోజులు ఉన్నట్టు జీవించవద్దు, రేపు ప్రపంచం అంతమయ్యే రోజు అనుకొని జీవించండి".


శుభోదయం


ఎవరినైనా ఒదార్చ వలసి వచ్చినపుడు....

ఎపుడైనా మనకు ఆత్మీయులైన వారు కష్టాల పాలైతే ఎలా ఓదార్చాలో తెలియక ఇబ్బంది పడతాం. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే confusion లో ఉంటాము. ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకుంటే, ఓదార్చడం కొంత సులువు అవుతుంది.


1. బాధలో ఉన్న వ్యక్తులను ఒక్కసారిగా ఆనందపరచాలి అని ప్రయత్నించకండి.

2. జరిగిన నష్టం చిన్నది అని, మర్చిపోండి అని తేలికగా మాట్లాడకూడదు.

3. బాధలో ఉన్న వారిని అకస్మాత్తుగా వేరే విషయాల మీదకు మళ్ళించాలి అని ప్రయత్నించకండి.

4. మనసు మార్చుకోవడం అంత సులువు కాదు. దానికి కొంత సమయం పడుతుంది.

5. బాధలో ఉన్న వారి మనసు మళ్ళించడానికి వ్యర్ధ ప్రసంగం, అసందర్భంగా మాట్లాడడం చేయకూడదు.

6. ఎవరైనా ఆత్మీయులు మరణించినపుడు ఒదార్చవలసి వస్తే, మరణించిన వ్యక్తీ గురించి మంచి విషయాలు మాట్లాడాలి. కోలోపోయిన వ్యక్తీ గురించిన మంచి విషయాలు వినడం వారి సంబంధీకులకు ఆనందంగా ఉంటుంది.

7. మీరు వోదార్చేటప్పుడు వారు కన్నీళ్లు పెట్టుకుంటే, వారిని స్వేచ్చగా ఏడవనివ్వండి. వేదన కన్నీళ్ళ రూపం లో బయటికి వస్తే, మనసు తేలికపడుతుంది.

8. పలకరించడానికి వెళ్ళినపుడు మీకు కూడా కన్నీళ్లు వస్తే రానివ్వండి. దానివల్ల అవతలి వారు మరింత దుఃఖ పడతారు అని సంశయించ వద్దు. వారి బాధలకు మీరు తోడూ ఉన్నారు అన్న ఫీలింగ్ వారిని తేలిక పడేలా చేస్తుంది.

8. బాధకు లోనైన వ్యక్తిని కూడా మాట్లాడనివ్వాలి. వారు ఏమి చెప్పినా ఓపికగా వినాలి. వారు ఒకటే మాట పది సార్లు చెప్పినా వినాలి.

9. ఓదార్చే సమయం లో వారితో కానీ, ఇతరులతో కానీ, అనవసర చర్చలు, అనవసర సంభాషణలు చేయకూడదు.

10. బాధ పడుతున్న వ్యక్తీ ఏమి చెప్పినా, అది మీకు అబద్ధం అనిపించినా, ఆ సమయం లో ఖండించకూడదు.

11. కష్టం వచ్చినపుడు అందరూ ఒక్కసారి కలుస్తారు. తరువాత ఎవరికీ వారె అన్నట్టు ఉంటారు. అలా కాకుండా, తరచూ కలుసుకో గలిగినంత దగ్గరలో ఉన్నట్టయితే, అవకాశం ఉన్నట్టయితే, తరువాత కొంత కాలం వరకూ తరచూ కలుస్తూ ఉండాలి.

12. బాధలో ఉన్న వ్యక్తీ భోజనం మానేయడం, బయటికి రావడం మానేయడం వంటివి చేస్తున్నపుడు వారిని ఒప్పించి నలుగురిలో తిరిగేల చేయాలి.

13. ఆత్మీయులను పోగొట్టుకున్నపుడు, అత్యంత వేదన అనుభవిస్తున్నపుడు, వారు ఆ బాధ నుంచి బయటకు రావడం ఒక్కోసారి చాల కష్టం అవుతుంది. అటువంటప్పుడు వారికీ ఉన్న హాబీలు ఇతరత్రా వాటి ద్వారా ఆ వేదన మర్చిపోయేట్లు చేయాలి.

14. ఇదేమంత పెద్ద విషయం? అందరికి ఉండేదే కదా! లోక సహజం కదా! అన్నట్లు మాట్లాడకూడదు. ఎవరి కష్టం వారికీ పెద్దగానే ఉంటుంది.

15. వారి బాధను పోగొట్టడానికి అన్నట్టు, వారికీ ఇష్టమైన విషయం మాట్లాడాలి. అలా అని, క్రికెట్ గురించో, సినిమాల గురించో మాట్లాడడం చాలా అసందర్భంగా ఉంటుంది.

16. వారి దారిలోనే వెళ్లి వారి మనసు మళ్ళించాలి తప్ప, మన దారిలోకి తెచ్చుకోవాలి అనుకోవడం హాస్యాస్పదం.

17. వారు పోగొట్టుకున్న వ్యక్తీ గురించి వివరాలు తెలుసుకోవాలని వినాలని అనుకుంటారు. అలా అని కోలోపోయిన వ్యక్తీ గురించి నెగటివ్ గా అసలు మాట్లాడకూడదు.

18. మౌనప్రేక్షకుల లాగా ఉండటం కంటే, ఏదో ఒకటి సవ్యంగా మాట్లాడడం మేలు.

19. చివరిగా, మన ఓదార్పు వారికీ శక్తి నిచ్చేదిగా ఉండాలి. వారిలో స్థైర్యం పెంచాలి. ఇలా చేస్తే, వారు జీవితాంతం మనతో బంధం కోరుకుంటారు.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE