NaReN

NaReN

Sunday, April 16, 2023

ఒక స్త్రీ

 ఒక స్త్రీ  కుటుంబానికి  అంకితం అయ్యి తన గురించి ఆలోచించలేక పోయినది.


భర్త ఉద్యోగం ఉద్యోగం అంటూ ఊర్లు తిరిగి సంపాదించడానికి వెళ్ళేవారు.

కుటుంభంలోని ప్రతి ఒక్కరి బాధ్యత ఆమెదె అయ్యింది


వయసు మీదపడ్డ అత్తమామలు

బడికి వెళుతున్న చిన్న పిల్లలు

ఇక ఇంట్లో అన్ని అవసరాలు.


ఒక్కరోజు రమ్మని మిత్రులంతా కలుసుకోవాలని అడిగితే నేను లేకపోతే ఆ ఇంట్లో కష్టం అని రాలేదు.


తన అన్న కూతురి పెళ్ళికి రెండ్రోజులు ముందు వెళ్ళలేదు కారణం అత్త మామకు అనారోగ్యం దగ్గరుండి చూసుకోవాలి.


స్నేహితురాలి గృహప్రవేశానికి రాలేకపోయింది

కారణం పిల్లలకు పరీక్షలు.


ఎప్పుడైనా పలకరిస్తే మాతో ఒక్క మాట మాట్లాడితే ఇంట్లో వారి అవసరాలకు బదులు చెప్పిందే ఎక్కువ.

మా వారికి కనీసం ఒక్క టీ పెట్టడం రాదూ 


నేనంటూ లేకపోతే ఇంట్లో వారికి కష్టం అని పదే పదే చెపుతుండేది.


ఒక రోజు ఆమె ఇక లేదు అన్న వార్త అందింది.

మనసు చెప్పలేనంత బాధ నన్ను చుట్టుకుంది.

ఆమె లేదు అన్న చేదు వార్త ఒక పక్క అయితే ఆమె పైన ఆధారపడిన కుటుంభం అని ఆలోచన వచ్చింది.


పదిరోజుల తరువాత ఆమె భర్తకు ఫోన్ చేసాను.

ఎలా ఉన్నారు అని .


ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ ఒక కొలిక్కి వచ్చాయి అని చెప్పారు.

తల్లితండ్రిని చూడడానికి ఒక మనిషిని పెట్టాను.

వంటకు ఒక మనిషిని మాట్లాడుకున్నాను మొత్తం వాళ్ళే చూసుకుంటారు.


నేను ఊర్లోనే ఉద్యోగం చూసుకుని ఇక్కడే ఉండిపోయాను.

పిల్లలు నాతోనే ఉన్నారు వాళ్లు కూడా మెల్లగా వారి పనులు చేసుకుంటున్నారు 


నేను ఇప్పుడే బయట స్నేహితులతో గడిపి వస్తున్నాను అని అన్నారు.


వారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాక నా మనసు నిజంగా ఇప్పుడు ఏడవడం మొదలుపెట్టింది.


మనవాళ్లు అనుకుని మన సంతోషాలను దూరం చేసుకోకూడదు.

బాధ్యతలను వదిలేయమని చెప్పడం లేదు

మీ ఆనందాలను అనుభవించమని చెబుతున్నాను.


మీ సంతోషాలను త్యాగం చేసి మరి బరువులను మోయమనడం లేదు.

మీకోసం సమయాన్ని వెచ్చించమని చెబుతున్నాను.


ఇవన్నీ ఆమెకు చెప్పాలని ఉంది కాని వినిపించుకోలేనంత దూరం ఆమె వెళ్లిపోయింది అని రెండు కన్నీటి చుక్కలు కార్చేసి నేను మర్చి పోతాను


మనుషులు మారిపోయారు

ఎవరికోసం నువ్వు నిన్ను పోగొట్టుకుంటున్నావు

నువ్వు చనిపోతే ఒక రెండ్రోజులు ఆ తరువాత ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు

గుర్తింపు లేని సేవ ఎక్కడ ఉంటుంది అంటే అది ఇంట్లో బాధ్యతలు మోస్తున్న ప్రతి స్త్రీ జీవితం అని చెప్పాలని ఉంది.

************************************

గృహిణి జీవితాన్ని వాస్తవం గా వివరించారు ...

తను ఉన్నప్పుడు చేయలేని పనులన్నీ  తను వెళ్ళిపోయాక చేసుకుంటున్నారు.. తను  పోయిన బాధ  ఎవరిలో లేదు.. కాని తను మాత్రం జీవితం మొత్తం వాళ్ళకి బానిసల చేసి చేసి ఇప్పుడు శాశ్వత విశ్రాంతి తీసుకుంటుంది..

2 comments:

  1. It's true in some of the families.

    ReplyDelete
  2. కొంత మంది జీవితాలు అంతే

    ReplyDelete

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE