NaReN

NaReN

Friday, April 28, 2023

శరీరం

 💖 🌻*ప్రతీనిత్యం మనము చూసుకొని మురిసిపోతున్న ఈ శరీరం గూర్చి పరికిద్దాం ఒకమారు.*🌼


🫀❄️🔥🔥🔥🔥🔥🔥


💕 *ఈ శరీరం ఎప్పుడూ ఇలాగే ఉండేది కాదు, ఇప్పుడు అందంగా, బిగువుగా, ఆకర్షణీయంగా ఉన్న శరీరం కొంతకాలం గడిచేసరికి సడలిపోతుంది, కృశించిపోతుంది, అందవిహీనమౌతుంది, చివరకి రాలిపోతుంది.*

💕 *ఈ విషయాన్ని మనం మరువరాదు, ఈ శరీరం నేను కాదు, ఇది కేవలం నేను వాడుకొనే పరికరం మాత్రమే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.*

💓 *నా వాచీని నేను ఎలా జాగ్రత్తగా వాడుకుంటున్నానో, దానిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నానో, అది చెడిపోతే ఎలా రిపేరు చేయించుకుంటున్నానో, కొత్త పార్టులు అమర్చుకుంటున్నానో, అలాగే ఈ శరీరాన్ని కూడా అలానే వాడుకోవాలని భావించాలి.*

💞 *దుస్తులు వేయాలి, పోషించాలి, అందంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి.*

💕 *ఐతే ఒక ముఖ్య విషయాన్ని మాత్రం మరచిపోకూడదు. ఇది మన కోసం వాడుకోవాల్సిన పరికరమని, ఇది శాశ్వతంగా ఉండేది కాదని, కనుక తెలివిగా, జాగ్రత్తగా వినియోగించు కోవాల్సినదని జ్ఞాపకం ఉంచుకోవాలి.*

💖 *సత్యశోధనకై పరమాత్మ ప్రాప్తికై దీనిని వినియోగించాలి.*

💕 *అంతే గాని శరీరాన్ని పోషించటమే మానవ జీవితం యొక్క పవిత్ర కర్తవ్యం కాదు*

❤️ *ఏదైనా ఒక వస్తువును పనికివచ్చినంత కాలం వాడుకుంటాం, పనికి రాకపోతే పారవేస్తాం. అలా పనికిరాక పారవేసే చిత్తు కాగితాలను గాని, ప్లాస్టిక్ వస్తువులను గాని, ఇనుప ముక్కలను గాని, బల్బులను గాని ఎవరో ఒకరు కొంటారు.*

💕 *అలాగే ఏ జంతువన్నా చనిపోతే వాటి మాంసాన్నో, వాటి చర్మాన్నో, దంతాలనో ఉపయోగించుకుంటాం*

💓 *~కాని మనిషి శరీరాన్ని మాత్రం ఎవరూ కొనరు. ఎదురు డబ్బు ఇచ్చినా తీసుకోరు. ఇలాంటి పనికిరాని మురికి మూట అయిన ఈ శరీరం కోసం బ్రతికినన్నాళ్ళు తపించి పోవటం, ఇతరుల నెత్తిన చెయ్యి పెట్టటం, గొంతులు కొయ్యటం, యుద్ధాలు చెయ్యటం, దారుణంగా హత్యలు చెయ్యటం జరుగుతుంటాయి.*

💕 *ప్రాణం పోయిన తర్వాత దీనికి పైసా విలువలేదు, ఇంటిలో ఎవరూ దీని క్షేమాన్ని గురించి పట్టించుకోరు, తుదకు భార్య కూడా భయపడుతుంది, ఈ కట్టెను మండే కట్టెల మీదకు చేర్చి అడ్డం వదలించుకుంటారు*

❤️ *మరి ఇట్టి శరీరాన్ని చూసుకొని, దీని కోసం విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం, మానవ జీవిత పరమార్థాన్ని సాధించటానికి వినియోగించక పోవడం తెలివైనపనేనా..?*

💕 *ప్రాణం పోతే ఎందుకూ పనికిరాని ఈ శరీరాన్ని ప్రాణం ఉన్నంత కాలం ఎలా ఉపయోగించుకోవాలో, ఏమి సాధించుకోవాలో అనే విషయాన్ని నిరంతరం విచారణ చేసుకోవాలి, శరీరాభిమానం తగ్గించుకోవాలి.*



Wednesday, April 26, 2023

ఇంట్లో వైఫైని వాడుతున్నారా..

 *📡ఇంట్లో వైఫైని రాత్రి పూట కూడా ఆన్‌లో ఉంచుతున్నారా?..✍️*


 *💥అది ఎంత అనర్థమో తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది! ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నెట్(Internet) లేని ప్రపంచాన్ని మనం ఊహించలేం. అన్ని పనులు ఇంటర్నెట్ సహాయంతోనే జరుగుతున్నాయి. ప్రతీ ఇంటిలోనూ ఇంటర్నెట్ ఒక అవసరంగా మారిపోయింది*ఈ నేపధ్యంలో మెరుగైన కనెక్టివిటీ(Connectivity), వేగవంతమైన ఇంటర్నెట్ కోసం మనం ఇంట్లో WiFiని ఇన్‌స్టాల్ చేసుకుంటాం.*


*💥అయితే దానివలన మనల్ని చుట్టుముట్టే అనారోగ్య సమస్యలను(Health problems) గ్రహించలేకపోతున్నాం. వైఫై నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. వాస్తవానికి వైఫై రూటర్ నుండి అనేక రకాల రేడియేషన్ తరంగాలు(Radiation waves) వెలువడుతాయి. ఇది డిప్రెషన్, నిద్రలేమి అధిక రక్తపోటు మొదలైన వ్యాధులకు కారణంగా నిలుస్తుంది. Wi-Fi కి సంబంధించిన విద్యుదయస్కాంత తరంగాలు, ఇంటర్నెట్ అధిక వినియోగం మన నిద్రను అధికంగా ప్రభావితం చేస్తాయి*


*⛺దీని వల్ల నిద్రలేమి(Insomnia) సమస్య తలెత్తుతుంది. Wi-Fi నుంచి వెలువడే రేడియేషన్ తరంగాలు మనల్ని మానసికంగా ప్రభావితం చేస్తాయి. ఇంటర్నెట్‌ను ఎక్కువగా వినియోగించడం వల్ల జ్ఞాపకశక్తిపై(memory) ప్రభావం పడుతుంది. దీనివల్ల అల్జీమర్స్ సమస్య వస్తుంది*


*♦️ఇటువంటి చెడు ప్రభావాలను నివారించడానికి మనం ఇంటర్నెట్ వినియోగాన్ని పరిమితం చేయాలి. అవసరమైనప్పుడు మాత్రమే ఇంటర్నెట్(Internet) వినియోగించాలి. రాత్రి నిద్రపోయేటప్పుడు వైఫైని ఆఫ్ చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల రేడియేషన్ తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాల నుండి మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా, విద్యుత్తును(Electricity) కూడా ఆదా చేయవచ్చు*

Saturday, April 22, 2023

నారింజ పండు లో ఏముంది

 నారింజ పండు లో ఏముంది

అద్భుతమైన పోషకాల గని ఈ నారింజ పండు🍊*



👉చక్కగా తినేసి జీర్ణం చేసుకోగల ఫలం కమలాఫలం.  చూడగానే తినేయాలని... జ్యూస్ తాగేయాలని అనిపించే పండు కమలాపండు.


👉నారింజలో విటమిన్ సి, ఏ, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి.


👉 నారింజ పండు కఫం, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. 


👉మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది. 


👉ముదిరిన నారింజ కాయలను కోసి, ఉప్పులో ఊరబెట్టి, ఎండబెట్టి, కారం, మెంతిపొడి కలుపుకున్నట్లయితే… ఊరగాయలా నిల్వ ఉంటుంది. రుచిగా ఉండటమే కాక, ఆరోగ్యాన్ని కూడా వృద్ది పరుస్తుంది. 


👉జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు… నారింజను వాడితే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. 


👉అలాగే, ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు ఉంది. 


👉నారింజలో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 


👉ఇందులో ఉండే కాల్షియం.. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. 


👉రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. 


👉విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది.


👉 జలుబు, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరి చేరవు. 


👉రోజూ పరగడుపున ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగితే, మార్నింగ్ సిక్‌నెస్‌నుండి సులభంగా బయటపడవచ్చు. 


👉గర్భవతులు రోజూ ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగినట్లయితే.. ఫోలిక్‌యాసిడ్ సంప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.


👉నారింజ తొక్కను పడేయకుండా… ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది.


👉ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే… చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది. 


👉 వ్యాధి నిరోధక శక్తిని పెంచగలిగే ఫలాలలో కమలాఫలం కూడా ఒకటి. 


👉ఆస్తమా, శ్వాశ నాల ఇబ్బందులు,  ట్యూబర్‌క్యూలోసిస్‌తో ఇబ్బంది పడేవారికి కమలాపండు అతిముఖ్యమైన ఆహారం. 


👉ఈ పండు రసం ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించవచ్చు. 


👉కమలాపండులో అధికంగా ఉండే పోలిక్ యాసిడ్ మెదడును బ్యాలెన్స్‌గా ఉంచగలగడమే కాకుండా ఉత్సాహంగా.. ఉల్లాసంగానూ ఉంచగలుగుతుంది. 


👉యుక్తవయస్సులో ఆడపిల్లల ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలో కమలా రసం బాగా ఉపయోగకారి. 


👉తరచూ జలుబు చేసేవారిలో రోగనిరోధక శక్తి పెంచగలదు.


👉గుండెపోటు ముప్పును తప్పించుకోవాలంటే? రోజుకు రెండుగ్లాసుల కమలా రసం తీసుకుంటే సరిపోతుంది. 


👉కమలాల్లో ఉండే హెస్పెరిడిన్‌ అనే మిశ్రమం రక్తపోటును క్రమంగా తగ్గిస్తుంది.


👉 నారింజ రసం క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే మూత్రపిండాల వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా సహాయపడుతుంది.


👉ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు నారింజ పండ్లను, ఉదయం స్నానానంతరం రెండు పండ్లను తింటే మలవిసర్జన సులభంగా జరిగిపోతుంది.


👉  తేలికగా జీర్ణమయ్యే రోగ నిరోధక శక్తిగల నారింజ పండ్లను ఇస్తే జీర్ణ సమస్యలు పోతాయి.


👉శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్రాన్ని సరళంగా జారీ చేస్తుంది. 


👉 నారింజ పళ్ల తొక్కలను నీడలో ఎండ బెట్టి మెత్తగా పొడి చేసి దానిని పెరుగులో కలిపి ముఖానికి లేపనంగా రాసుకొ పది నిముషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే ముఖం మీద ఏర్పడిన మృత ఖణాలు పోయి ముఖం కాంతి వంతంగా వుంటుంది.


🍊🍊

Friday, April 21, 2023

Two Wives chatting in office

 *Two Wives chatting in office*


*Wife 1*

*I had a fine evening, how was yours ?*


*Wife 2* : 

*It was a disaster. My husband came home, ate his dinner in 3 mins & fell asleep in 2 mins. How was yours?*


*Wife 1* : 

*Oh mine was amazing ! My husband came home and took me out for a romantic dinner. After dinner we walked for an hour. When we came home he lit the candles around the house. It was like a fairy tale !*


*At the same time, their husbands are talking at work.*


*Husband 1*: 

*How was your evening?*


*Husband 2*:

*Great. I came home, dinner was on the table, I ate & fell asleep. What about you ?*


*Husband 1*: 

*It was horrible. I came home, there's no dinner, they cut the electricity because I forgot to pay the bill; so I took her out for dinner which was so expensive that didn't have money left for a cab or auto.We walked home which took an hour & when we got home I remembered there was no electricity so I had to light candles all over the house.*


*MORAL*: *PRESENTATION DOES MATTER. NO MATTER WHAT THE REALITY IS !*


*"If you want to be Happy with your husband, Love him Less & Understand him more !*


*If you want to be Happy with your wife, Love her More & NEVER try to Understand her !"*


*Dedicated to All married couple.😎*

Wednesday, April 19, 2023

సులభం గా మామిడికాయ ఊరగాయ పెట్టె విధానం...!

 సులభం గా మామిడికాయ ఊరగాయ పెట్టె విధానం...! 😂😂😂



కావాల్సిన వస్తువులు...!


1) భర్త

2) మామిడికాయలు

3) ఆవపిండి

4) ఉప్పు

5) పల్లిల నూనె (లేక) నువ్వుల నూనె

6) రెడ్ చిల్లీ పౌడర్

7) కత్తిపీట


ముందుగా మీ భర్తను ప్రిపేర్ చేసుకోవాలి...!

నాణ్యమైన పచ్చి మామిడికాయలు పెద్దవి మచ్చలు పుచ్చులు లేకుండా తీసుకురమ్మని ఒక బ్యాగు ఇచ్చి మార్కెట్ పంపించాలి...!

మార్కెట్ వెళ్లి వచ్చిన మీ వారికి ప్రేమగా ఒక లుంగీ ఇచ్చి కట్టుకోమని చెప్పి...!

తీసుకు వచ్చిన మామిడికాయలను కట్ చెయ్యమని కత్తిపీఠను ఇవ్వాలి...!

మీరు అప్పటికే ఓలకబోసిన ప్రేమ కారణంగా మీ మాట కాదనలేక ఎదురు చెప్పలేక చెమటలు కక్కుతూ ఆ పనిని పూర్తి చేసిన వెంటనే ఆ ముక్కలలో, ఆవపిండి,నువ్వుల నూనె, ఉప్పు, మిర్చిపౌడర్, తగిన పాళ్లలో బాగా కలిపించి...!

ఒక శుభ్రమైన జాడీ తీసుకుని కలిపిన ఆ మిశ్రమాన్ని జాడీలో పెట్టించాలి...!

సులభంగా మీరు కష్టపడకుండా మామిడికాయ ఊరగాయ తయారైపోయింది.😍😍😍😍😍.


Just for fun 😂😂😂

ANTOMOLOGY

 🌱🐜 ANTOMOLOGY"👇😊

✍️*Let's laugh away our stress with ants*🐜


1.  5 ants + 5 ants = Tenants.

2.  To bring ant from another country into your country = Important.

3.  Ant that's looking for a job = Applicant.

4.  A spy ant = Informant.

5.  A big ant = Elephant

6.  A very little ant = Infant.

7.  Ant that has a gun = Militant                                              8.  Ant that is a specialist  = Consultant 😂

9.  A proud ant = Arrogant

10.  Ant that is cruel and oppressive = Tyrant

11.  Ant that is friendly and lovely = Coolant

12.  Ant that changed from evil to good deeds = Repentant

13. Ant that accumulated so much food in winter and summer = Abundant

14.  Ant that opposes change: Reluctant

15.  Perfumes on body to prevent bad odour= deodorant.   

16.  Ant that occupies a place = Occupant.

17.  A dirty ant = Pollutant. 

18.  An unlikeable ant = Irritant. 

19.  A green ant = Verdant

20.  Ant that is important = Significant

21.  A sarcastic Ant = Mordant

22. An extremely fast ant = Instant

23.  Shouting Ant = Rant

24. An ant that doesn't keep moving = Constant.

25.  An enthusiastic ant = Exuberant.


26. An ant that has changed in to a different form = Mutant

27. An ant that keeps accounts = Accountant

😅😅🍊🍎🌱

పది పక్షులు…

*పది పక్షులు…* 🐦

ఒకటే చెట్టు…మీద పది పక్షులు… 
ఒకటే తుపాకీ గుండు…

 తర్వాత మీరే చదవండి…

ఒక ప్రొఫెసర్‌కు తన పిల్లల ఐక్యూ పరీక్షించాలని అనిపించింది.

 క్లాసులో ఓ పిల్లవాడిని లేపాడు… 
అడిగాడు… 

‘‘ఒక చెట్టు మీద 10 పక్షులున్నాయ్… 
నువ్వు ఒకదాన్ని తుపాకీతో కాల్చావు, ఇంకా ఎన్ని మిగిలి ఉంటాయి..?’’ 
మిగతావన్నీ ఎగిరిపోతాయి అని జవాబు చెబుతాడని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈ పక్షులు, చెట్లు, కాల్పుల పజిల్స్ ఎప్పుడూ వినేవే కదా… కానీ ఆ పిల్లాడు *ఇండియన్ పొలిటికల్ లీడర్ టైపు*

… ఈడీ ప్రశ్నలకు బదులు చెప్పే తరహాలో సంభాషణ ఇలా సాగింది…

‘‘అది సైలెన్సర్ బిగించిన తుపాకీయా..? లేక నిశ్శబ్దంగా పేలే ఇతరత్రా తుపాకీయా..?’’

‘‘నో, అది శబ్దంతో పేలే తుపాకీయే…’’

‘‘అది ఎంత శబ్దం చేస్తుంది..?’’

‘‘80 నుంచి 100 డెసిబిల్స్’’

‘‘అంటే చెవులు నొప్పి పెట్టేంత రేంజా..?’’

‘‘అవును..’’

‘‘సిటీలో పక్షలపైకి కాల్పులు చట్టవిరుద్ధమా..?’’

‘‘నో, చట్టాన్ని ఉల్లంఘించడం ఏమీ కాదు…’’

‘‘నిజం చెప్పండి, ఆ పక్షి నిజంగా మరణించిందా..? మీరు వెరిఫై చేసుకున్నారా..?’’

‘‘అవును’’ ప్రొఫెసర్ లో అసహనం పెరిగిపోతోంది… ‘‘అక్కడ ఎన్ని మిగిలి ఉంటాయో చెప్పు…’’

‘‘సరే, సరే, ఆ పక్షుల్లో చెవిటి పక్షులు ఏమైనా ఉన్నాయా..?’’

‘‘లేవు…’’

‘‘మెంటల్ పక్షులేమైనా ఉన్నాయా..? తుపాకీ చప్పుడు కాగానే ఎగరకుండా అలాగే ఉండిపోయేవి ఉన్నాయా..?’’

‘‘నో, నో, ప్రతి పక్షీ కనీసం 200 ఐక్యూ దాటి ఉంటుంది… తుపాకీ పేలగానే ఎగిరిపోతాయి…’’

‘‘ఆ పక్షుల్లో ఏమైనా పంజరాల్లో బంధించినవి ఉన్నాయా..?’’

‘‘లేవు… నీకు దండం పెడతానురా… నన్ను ఇంటరాగేట్ చేయకురా…’’

‘‘పక్కన ఇంకేమైనా చెట్లున్నాయా..? వాటిపై ఏమైనా పక్షులున్నాయా..?’’

‘‘ఏమీ లేవు…’’

‘‘చుట్టుపక్కల పది మైళ్లు ఎలా ఉంటుంది..?’’

‘‘అలాంటి చెట్లే తప్ప ఇంకేమీ లేవు…’’

‘‘ఈ చెట్టు మీద ఉన్న పక్షుల్లో ఆకలితో ఉండి ఎగరలేనివి, రెక్కలు సరిగ్గా లేనివి ఉన్నాయా..?’’

‘‘నో, అన్నీ బాగానే ఉన్నాయి…’’

‘‘పక్షుల కడుపుల్లో ఉన్న పిల్లల్ని కూడా కౌంట్ చేయాలా..?’’

‘‘అవన్నీ మగ పక్షులు… కడుపుల్లేవు, కాకారకాయల్లేవు…’’

‘‘కడుపయ్యే అవకాశాలే లేవంటారా..?’’

‘‘సవాలే లేదు… నో చాన్స్…’’

‘‘ఇంతకీ షూటర్ కంటిచూపు బాగానే ఉందా..? ఆ పది పక్షలనూ ఎలా పోల్చుకున్నాడు..?’’

‘‘ఒరేయ్, ఒరేయ్, నిన్ను షూట్ చేసినా బాగుండు… వాడి కంటిచూపు బాగానే ఉంది… అక్కడున్నవి కేవలం పది పక్షులు…’’ ప్రొఫెసర్ నుదుటి మీద చెమట కనిపిస్తోంది ఇప్పుడు…

‘‘క్లాస్ బెల్ మోగింది, ఆ విద్యార్థి అడుగుతూనే ఉన్నాడు… ‘‘వాటిల్లో చావంటే భయం లేనివి ఏమైనా ఉన్నాయా..?’’

‘‘నో, అన్నింటికీ చావంటే భయమే…’’

‘‘సపోజ్ తమ లవర్‌ను కాల్చడాన్ని చూసి, మరో పక్షి తనూ చావడానికి సిద్ధపడి అక్కడే ఉండిపోయిందా..?’’

‘‘ఒరేయ్, నువ్వు ఎక్కడికో వెళ్లిపోతున్నావ్… అవన్నీ మగ పక్షులని చెప్పాను కదరా..?’’

‘‘అలా కాదు మాస్టారూ… స్వలింగ సంపర్కులు ఉండొచ్చు కదా… వాటి లైంగిక స్వభావాన్ని మీరెలా నిర్ధారిస్తారు..?’’

‘‘అవన్నీ వదిలేసి, కాస్త నేనడిగిన ప్రశ్నకు సూటిగా జవాబు ఇవ్వరా బాబూ…’’

‘‘ఒక షాట్‌కు రెండు పక్షులు మరణించే చాన్స్ ఉందా..? అలా కాల్చగలడా..?’’

‘‘లేదు..’’

‘‘పోనీ, మూడు పక్షులు..?’’

‘‘లేదే…’’

‘‘పోనీ, నాలుగు పక్షులను ఒకే దెబ్బకు కొట్టేయగలడా..?’’

‘‘లేదు, లేదు… లేదు…’’

‘‘ఓహో, అయిదు కొట్టగలడా..?’’

‘‘లేదురా, నీ దుంపతెగ, నన్ను కాల్చుకు తింటున్నావు కదరా…’’

‘‘ఆ షాట్ ఏకంగా చెట్టునే కూలదోసేంత బలమైందా..? అప్పుడిక పక్షులే ఉండవు కదా…’’

‘‘అదొక ఆర్డినరీ పిస్టల్, చెట్టును కూలదోసేంత సీన్ లేదు…’’

‘‘…. అంటే పక్షులన్నీ ఎగరిపోయే స్థితిలోనే ఉన్నాయంటారా..?’’

‘‘అవును బాబూ, అవును, అవును, అవును…’’

‘‘ఎగిరిపోయేటప్పుడు ఒకదాన్నొకటి పొడుచుకునే అవకాశం ఏమైనా ఉందా..?’’

‘‘లేదు, ప్రతీ పక్షికీ శాటిలైట్ నేవిగేషన్ సిస్టమ్ ఫిట్ చేసి ఉంది… సాఫీగా ఎగిరిపోతాయి…’’

‘‘వోకే, మీ జవాబులు నన్ను మోసం చేసేవిలా ఏమీ లేవు… మరణించిన పక్షి అలాగే చెట్టుకు వేలాడుతూ ఉంటే, చెట్టుపై మిగిలి ఉండేది అదొక్కటే… 

*మీ ప్రశ్నకు జవాబు ఒకటి…* ఒకవేళ అదీ కిందపడిపోతే, చెట్టుపై ఏమీ మిగలవు.

 జవాబు మీరే వర్తింపజేసుకొండి…’’

*ఒరేయ్, నువ్వు భవిష్యత్తులో గొప్ప లాయర్ లేదా గొప్ప సివిల్ సర్వెంట్ లేదా కరప్ట్ లీడర్ అవుతావురా… గ్యారంటీ…*
అంటూ కిందపడిపోయాడు… కథ అయిపోలేదు…
 మిగతాది మీరు రాసుకోవచ్చు…
 మీ ఐక్యూ ఆ పిల్లాడికన్నా ఎక్కువగా ఉండి ఉంటే…!! 😝

పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు

 పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?

-

ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే 

వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదాని శాస్త్రం చెప్తుంది.

♦️కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు 

మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు?

 ఇలాంటి నిస్సహాయ స్థితి లో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత ఔదార్యానికి తలవంచాలిగా?

♦️కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి, కన్యాదాత మీద పడి అరవాడనికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది?దానం ఇస్తున్నవాడిని ఇంకా ఇంకా కట్నాలు, కానుకలు, లాంచనాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెఫ్ఫారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి?

♦️"సీతారాములలా ఉండండి!" అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామకళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. 

♦️జనక మహారాజు, దశరథ మహారాజుని అడుగుతారు

"మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా?" అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా? 

"అయ్యా! ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది" అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్ర ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు.

♦️అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు!

♦️అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది.

♦️తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? "పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!" అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు.

♦️కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్ళి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు - 

ఇలాంటివి సనాతన ధర్మం లో లేవు

ఐదు వస్తువులు

 దరిద్రాన్ని తెచ్చే ఈ ఐదు వస్తువులు మీ ఇంట్లో ఉంటే అంతే సంగతులు..!


హిందూ సంప్రదాయం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల, లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుందని గట్టిగ నమ్ముతాము కదా..అలాగే అపవిత్రమైన కొన్ని వస్తువులు ఇంట్లో వాడటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి, దరిద్రం ఆవహిస్తుందని వేద పండితులు హెచ్చరిస్తూ ఉన్నారు.అవేంటో ఇప్పుడు చూద్దాం..

విరిగిపోయిన చీపురు :

సాధారణంగా చీపురును కూడా లక్ష్మిదేవిగా భావిస్తుంటారు.కానీ కొంతమంది స్త్రీలు ఇంట్లో విరిగిపోయిన చీపురు ఉన్నా సరే,దానితోనే పని జరుగుతుంది కదా అని,వాడేస్తూ ఉంటారు.కానీ దానివల్ల లక్ష్మి దేవికి ఆగ్రహం వచ్చి, ఇంటి నుంచి వెళ్ళిపోతుందని, మరియు కటిక దరిద్రం ఆవహిస్తుందని వేదపండితులు హెచ్చరిస్తున్నారు.కావున విరిగిపోయిన చీపురున  ఎవరూ కూడా ఇంట్లో వాడ కూడదు.

పాదరక్షలు :

పాడైపోయిన చెప్పులు ఇంట్లోనే ఉంచుకోవడం వల్ల,  పేదరికాన్ని తెస్తుంది.పెద్దలు కూడా ఎవరైనా చెప్పులు పోగొట్టుకుంటే దరిద్రం పోయిందని అంటుంటారు. అలాంటి చెప్పులు లేదా షూస్ ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగు తుందని అని పురాణాలు చెబుతున్నాయి. కావున అటువంటి పాదరక్షలు మీ ఇంట్లో ఉంటే విసిరి పారేయండి.

 విరిగిపోయిన పాత్రలు..

 కొంతమంది కొత్త పాత్రలు ఉన్నా కానీ,విరిగి పోయిన పాతర్లనే వాడుతూ ఉంటారు.దానివల్ల ఇంటి నిండా నెగటివ్ ఎనర్జీ నిండిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదని,దరిద్రం ఆవహిస్తుందని చెబుతూ ఉంటారు. కావున ఇంటి యజమానికి ధన సంపద పెరగాలి అంటే,ఇలాంటి పాత్రలు ఉంటే పడేయండి.

చిరిగిన బట్టలు..

ఇంట్లో గృహిణి చిరిగిన బట్టలు మాత్రం అస్సలు వాడకూడదు.అలా వాడటం  వల్ల దరిద్ర దేవత ఆవహిస్తుంది.కావున ఇల్లాలు ఎంత శుభ్రంగా ఉంటే ఇంట్లో,అంతా పాజిటివ్గా ఉండి వారి ఇంట్లోకి ధన ప్రవాహం కలుగుతుంది.

వాడిపోయిన మొక్కలు..

కొంతమంది పని హడావిడిలో పడి,వాడిపోయిన మొక్కలు ఉన్నా సరె, వాటిని తీసేయకుండా అలాగే పెట్టి ఉంటారు. దానివల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించడానికి అంతగా ఇష్టపడదని చెబుతుంటారు. ముఖ్యంగా తులసి మొక్క,మనీ ప్లాంట్ వంటివి పాడైపోతే,వెంటనే తీసేయడం చాలా ఉత్తమం.

హీట్ వేవ్

 *ప్రస్తుతం, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ మరియు ఇతర దేశాలు "హీట్* వేవ్" ను ఎదుర్కొంటున్నాయి.


 40 నుండి 50 °C మధ్య  వేడి తరంగాలను ఎదురుకానుంది. అందుకు మనం సిద్ధంగా ఉండాలి . 

 

_ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత నీటిని నెమ్మదిగా త్రాగాలి_ .

 

 *చల్లని లేదా ఐస్ వాటర్ తాగడం మానుకోండి!* 


 

 ఇవి చేయవలసినవి మరియు చేయకూడనివి:


   1.  *మన చిన్న రక్తనాళాలు పగిలిపోయే అవకాశం ఉన్నందున* , ఉష్ణోగ్రత 40 ° Cకి చేరుకున్నప్పుడు చాలా *చల్లటి నీరు త్రాగకూడదని* వైద్యులు సలహా....  *


 ఒక వైద్యుని స్నేహితుడు చాలా వేడిగా ఉన్న రోజు  ఇంటికి వచ్చాడు...  


అతను విపరీతంగా చెమటలు పట్టాడు మరియు అతను త్వరగా చల్లబడాలని  తన పాదాలను చల్లటి నీటితో కడుక్కొన్నాడు... 


 *అకస్మాత్తుగా, అతను కుప్పకూలిపోయి ఆసుపత్రికి తీసుకెళ్లబడ్డాడు.* 


   2. ఆరుబయట వేడి 38 ° Cకి చేరుకున్నప్పుడు మరియు మీరు ఇంటికి వచ్చినప్పుడు, *చల్లని నీరు త్రాగవద్దు -* నెమ్మదిగా వెచ్చని నీటిని మాత్రమే త్రాగండి.


 మీ చేతులు లేదా కాళ్ళు వేడి ఎండకు గురైనట్లయితే వెంటనే కడుక్కోవద్దు.  


కడగడానికి లేదా స్నానం చేయడానికి ముందు కనీసం *అరగంట వేచి ఉండండి.* 


   3. ఎవరైనా వేడి నుండి చల్లబడాలని  వెంటనే స్నానం చేసారు.  


స్నానం చేసిన తర్వాత, 

దవడ గట్టిపడి & స్ట్రోక్‌ వస్తుంది, ఆసుపత్రికి తీసుకెళ్లాలి...



 *దయచేసి గమనించండి:*

 వేడి వలన మీరు బాగా అలసిపోయినట్లయితే, 


 *వెంటనే చాలా చల్లటి నీటిని తాగడం మానుకోండి,* ఇది ఇరుకైన సిరలు లేదా రక్త నాళాలను సంకోచం చెందడం, అది *స్ట్రోక్‌కు* దారితీయవచ్చు.


 *దయచేసి ఈ హెచ్చరికను ఇతరులకు  చేరవేయండి!*  *

నాన్న

 అమ్మ తొమ్మిది నెలలు మోస్తే!

నాన్న పాతికేళ్ళు !!

రెండు సమానమే అయిన నాన్న ఎందుకో వెనుకబడ్డాడు!!!


ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ !

తన జీతమంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న !!

ఇద్దరి శ్రమ సమానమే అయినా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు !!!


ఏది కావాలంటే అది వండిపెడుతూ అమ్మ !

ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న !!

ఇద్దరి ప్రేమ సమానమే అయిన అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనుకబడ్డాడు !!!


ఫోన్లోను అమ్మ పేరే !

దెబ్బతగిలినపుడు అమ్మా అని పిలవడమే !

అవసరం వచ్చినపుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్నేమైనా భాదపడ్డాడా…ఏమో !!!


ఇద్దరు సమానమే అయిన పిల్లల ప్రేమని పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో బాగా వెనుకబడ్డాడు !!!


అమ్మకి, మాకు బీరువానిండా రంగురంగుల చీరలు, బట్టలు !

నాన్న బట్టలకు దండెం కూడా నిండదు !!

తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనుకబడ్డాడు !!!


అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు !

నాన్నకి బంగారు అంచు ఉన్న పట్టు పంచె ఒకటి !!

కుటుంబం కోసం ఎంత చేసినా తగినంత గుర్తింపు తెచ్చుకోవడంలొ నాన్నెందుకో వెనుకబడ్డాడు !!!


పిల్లల ఫీజులు, ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు ఈ పండుగకు చీర కొనొద్దు అంది అమ్మ !

ఇష్టమైన కూరని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న !!

ఇద్దరి ప్రేమ ఒకటే అయినా అమ్మ కంటే నాన్న చాలా వెనుకబడ్డాడు !!!


వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికి వస్తుంది నాన్న అయితే ఎందుకు పనికి రాడు అని మేం తీర్మానం చేసుకున్నపుడు కూడా వెనుకబడిందీ నాన్నే…!!!


నాన్న ఇలా వెనుకబడి పోవడానికి కారణం…..!!!


ఆయన ఇలా అందరికి వెన్నెముక కావడమే….!!!


వెన్నెముక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం…!!!


ఇదేనేమో బహుశా నాన్న వెనుకబడి పోవడానికి గల కారణం……!!!!!!మిస్ యు అమ్మ!!!! లవ్ యు నాన్న!"!"

విలువ తెలుసుకోవాలంటే

 మీరు ఒక సంవత్సరం విలువ తెలుసుకోవాలంటే, విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో విఫలమైన వ్యక్తిని అడగండి.


నెల విలువ తెలుసుకోవాలంటే అప్పుడే నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని అడగండి. 


మీరు ఒక వారం విలువ తెలుసుకోవాలంటే, క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తిని అడగండి.


మీరు ఒక రోజు విలువ తెలుసుకోవాలంటే, దినపత్రిక ఎడిటర్‌ని అడగండి.


మీరు గంట విలువ తెలుసుకోవాలంటే, ఇప్పుడే లిఫ్ట్‌లో చిక్కుకున్న వ్యక్తిని అడగండి.


మీరు ఒక నిమిషం విలువ తెలుసుకోవాలంటే, ఇప్పుడే బస్సు మిస్ అయిన వ్యక్తిని అడగండి.


మీరు సెకను విలువను తెలుసుకోవాలనుకుంటే, ట్రాఫిక్ ప్రమాదంలో మరణించిన బంధువు ఉన్న వ్యక్తిని అడగండి.


సెకనులో పదవ వంతు విలువ తెలుసుకోవాలంటే, ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన వ్యక్తిని అడగండి.


సమయం అమూల్యమైనది. అది గడిచినప్పుడు, అది ఎప్పటికీ తిరిగి రాదు.


కాబట్టి, "బతకడానికి చాలా రోజులు ఉన్నట్టు జీవించవద్దు, రేపు ప్రపంచం అంతమయ్యే రోజు అనుకొని జీవించండి".


శుభోదయం


ఎవరినైనా ఒదార్చ వలసి వచ్చినపుడు....

ఎపుడైనా మనకు ఆత్మీయులైన వారు కష్టాల పాలైతే ఎలా ఓదార్చాలో తెలియక ఇబ్బంది పడతాం. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే confusion లో ఉంటాము. ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకుంటే, ఓదార్చడం కొంత సులువు అవుతుంది.


1. బాధలో ఉన్న వ్యక్తులను ఒక్కసారిగా ఆనందపరచాలి అని ప్రయత్నించకండి.

2. జరిగిన నష్టం చిన్నది అని, మర్చిపోండి అని తేలికగా మాట్లాడకూడదు.

3. బాధలో ఉన్న వారిని అకస్మాత్తుగా వేరే విషయాల మీదకు మళ్ళించాలి అని ప్రయత్నించకండి.

4. మనసు మార్చుకోవడం అంత సులువు కాదు. దానికి కొంత సమయం పడుతుంది.

5. బాధలో ఉన్న వారి మనసు మళ్ళించడానికి వ్యర్ధ ప్రసంగం, అసందర్భంగా మాట్లాడడం చేయకూడదు.

6. ఎవరైనా ఆత్మీయులు మరణించినపుడు ఒదార్చవలసి వస్తే, మరణించిన వ్యక్తీ గురించి మంచి విషయాలు మాట్లాడాలి. కోలోపోయిన వ్యక్తీ గురించిన మంచి విషయాలు వినడం వారి సంబంధీకులకు ఆనందంగా ఉంటుంది.

7. మీరు వోదార్చేటప్పుడు వారు కన్నీళ్లు పెట్టుకుంటే, వారిని స్వేచ్చగా ఏడవనివ్వండి. వేదన కన్నీళ్ళ రూపం లో బయటికి వస్తే, మనసు తేలికపడుతుంది.

8. పలకరించడానికి వెళ్ళినపుడు మీకు కూడా కన్నీళ్లు వస్తే రానివ్వండి. దానివల్ల అవతలి వారు మరింత దుఃఖ పడతారు అని సంశయించ వద్దు. వారి బాధలకు మీరు తోడూ ఉన్నారు అన్న ఫీలింగ్ వారిని తేలిక పడేలా చేస్తుంది.

8. బాధకు లోనైన వ్యక్తిని కూడా మాట్లాడనివ్వాలి. వారు ఏమి చెప్పినా ఓపికగా వినాలి. వారు ఒకటే మాట పది సార్లు చెప్పినా వినాలి.

9. ఓదార్చే సమయం లో వారితో కానీ, ఇతరులతో కానీ, అనవసర చర్చలు, అనవసర సంభాషణలు చేయకూడదు.

10. బాధ పడుతున్న వ్యక్తీ ఏమి చెప్పినా, అది మీకు అబద్ధం అనిపించినా, ఆ సమయం లో ఖండించకూడదు.

11. కష్టం వచ్చినపుడు అందరూ ఒక్కసారి కలుస్తారు. తరువాత ఎవరికీ వారె అన్నట్టు ఉంటారు. అలా కాకుండా, తరచూ కలుసుకో గలిగినంత దగ్గరలో ఉన్నట్టయితే, అవకాశం ఉన్నట్టయితే, తరువాత కొంత కాలం వరకూ తరచూ కలుస్తూ ఉండాలి.

12. బాధలో ఉన్న వ్యక్తీ భోజనం మానేయడం, బయటికి రావడం మానేయడం వంటివి చేస్తున్నపుడు వారిని ఒప్పించి నలుగురిలో తిరిగేల చేయాలి.

13. ఆత్మీయులను పోగొట్టుకున్నపుడు, అత్యంత వేదన అనుభవిస్తున్నపుడు, వారు ఆ బాధ నుంచి బయటకు రావడం ఒక్కోసారి చాల కష్టం అవుతుంది. అటువంటప్పుడు వారికీ ఉన్న హాబీలు ఇతరత్రా వాటి ద్వారా ఆ వేదన మర్చిపోయేట్లు చేయాలి.

14. ఇదేమంత పెద్ద విషయం? అందరికి ఉండేదే కదా! లోక సహజం కదా! అన్నట్లు మాట్లాడకూడదు. ఎవరి కష్టం వారికీ పెద్దగానే ఉంటుంది.

15. వారి బాధను పోగొట్టడానికి అన్నట్టు, వారికీ ఇష్టమైన విషయం మాట్లాడాలి. అలా అని, క్రికెట్ గురించో, సినిమాల గురించో మాట్లాడడం చాలా అసందర్భంగా ఉంటుంది.

16. వారి దారిలోనే వెళ్లి వారి మనసు మళ్ళించాలి తప్ప, మన దారిలోకి తెచ్చుకోవాలి అనుకోవడం హాస్యాస్పదం.

17. వారు పోగొట్టుకున్న వ్యక్తీ గురించి వివరాలు తెలుసుకోవాలని వినాలని అనుకుంటారు. అలా అని కోలోపోయిన వ్యక్తీ గురించి నెగటివ్ గా అసలు మాట్లాడకూడదు.

18. మౌనప్రేక్షకుల లాగా ఉండటం కంటే, ఏదో ఒకటి సవ్యంగా మాట్లాడడం మేలు.

19. చివరిగా, మన ఓదార్పు వారికీ శక్తి నిచ్చేదిగా ఉండాలి. వారిలో స్థైర్యం పెంచాలి. ఇలా చేస్తే, వారు జీవితాంతం మనతో బంధం కోరుకుంటారు.

వేదాలు బోధించేది ఏమిటి

 *భగవద్గీత, వేదాంతం, మనకు బోధించేది ఏమిటి?*


*త్వమేవాహమ్‌*


కన్నతల్లి కడుపులోంచి బయటపడి,

తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణంనుంచి, 


పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు,


ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే


నేను = నేనే.


ఈ నేను


ప్రాణశక్తి అయిన "ఊపిరి" కి మారుపేరు.


ఊపిరి ఉన్నంతదాకా *నేను* అనే భావన కొనసాగుతూనే ఉంటుంది.


జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో 


ఈ *నేను* ఎన్నెన్నో పోకడలు పోతుంది. 

మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.


ఈ *నేను* లోంచే, *నాది* అనే భావన పుడుతుంది.


ఈ *నాది* లోంచి  


1. నా వాళ్ళు, 

2. నా భార్య, 

3. నా పిల్లలు, 

4. నా కుటుంబం, 

5. నా ఆస్తి, 

6. నా ప్రతిభ, 

7. నా ప్రజ్ఞ, 

8. నా గొప్ప...


అనేవి పుట్టుకొచ్చి,


చివరికి, 


ఈ *నేను* అనే భావన


భూమండలాన్ని కూడా మించిపోయి,

ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, 

నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి, 

*అహం* గా ప్రజ్వరిల్లుతుంది.


*అహం* అనే మాయపొర కమ్మేసినస్థితిలో 


ఈ *నేను* *నేనే సర్వాంతర్యామిని* 

అని విర్రవీగుతుంది.


నాకు ఎదురేలేదని ప్రగల్భాలూ పలుకుతుంది.


1. పంతాలతో 

2. పట్టింపులతో, 

3. పగలతో

4. ప్రతీకారాలతో 


తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.


1. బాల్య, 

2. కౌమార, 

3. యౌవన, 

4. వార్ధక్య 

దశలదాకా విస్ఫులింగతేజంతో విజేతగా నిలిచిన

*నేను* అనే ప్రభ, 


ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.


వందిమాగధులు ఎన్నో ప్రశంసలు చేసిన శరీరం, కట్టెలా మిగులుతుంది.


సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం, నిస్తేజంగా పడిఉంటుంది.


సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో, తులతూగిన *నేను* చుట్టూచేరిన, బంధుమిత్ర సపరివారపు జాలిచూపులకు కేంద్రబిందువుగా మారుతుంది.


కడసారి చూపులకోసం,

కొన్ని ఘడియల పాటు ఆపిఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.


మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.


మొలకు చుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి, బూడిద అవుతుంది.


*1.నేనే* శాసనకర్తను, 


*2.నేనే* ఈ భూమండలానికి అధిపతిని, 


*3.నేనే* జగజ్జేతను... 

అని మహోన్నతంగా భావించిన


*నేను* లేకుండానే, 


మళ్ళీ తెల్లవారుతుంది. 


రోజు మారుతుంది.


*ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన నేను* కథ 


అలా సమాప్తమవుతుంది.


అందుకే ఊపిరి ఆగక ముందే 

*నేను* 

గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత.


చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది,

శ్మశాన వైరాగ్యం మాత్రమే. 

అది శాశ్వతం కానే కాదు.


నేను గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే,


పరిపూర్ణమైన 'వైరాగ్యస్థితి' సాధ్యమవుతుంది.


వైరాగ్యం = (అంటే) అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. 


దేని మీదా మోహాన్ని కలిగిఉండకపోవడం.


తామరాకు మీద నీటిబొట్టులా జీవించగలగడం.


స్వర్గనరకాలు ఎక్కడోలేవు. 


మనలోనే ఉన్నాయి.


మనిషికి, ఆత్మదృష్టి నశించి, బాహ్యదృష్టితో జీవించడమే (అంటే) = నరకం


అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం (అంటే) = స్వర్గం.


ఈ జీవనసత్యాన్ని తెలియచేసేదే వేదాంతం.


1. నిజాయతీగా,

2. నిస్వార్థంగా, 

3. సద్వర్తనతో,

4. సచ్ఛీలతతో 

5. భగవత్‌ ధ్యానంతో జీవించమనేదే

*వేదాంతసారం*.


*అహం బ్రహ్మాస్మి* (అంటే) =

*అన్నీ నేనే*.

అనే స్థితి నుంచి

*త్వమేవాహమ్‌* (అంటే) = *నువ్వే నేను*  

అని



Tuesday, April 18, 2023

ఇంటికి - పెద్దదిక్కు వుండాలి

 *ఇంటికి  - పెద్దదిక్కు  వుండాలి*

పురాణాల కధనం...


ఇంటికి  - పెద్దదిక్కు  వుండాలి అంటారు...... ఎందుకంటే నాలుగు మంచి మాటలు చెప్పడానికి మరియు ఎవరైనా తప్పు చేస్తే ఖండించడానికి........ మాకు పెద్ద దిక్కే వద్దు, మంచి చెప్పే వాళ్లు వద్దు అని అంటే ఆ కుటుంబం ఎటుపోతుంది........

కళ్లు గానక ఊభిలోనికి కూరుకుపోతారు.........


ఇదే దుర్యోధనుని విషయంలో జరిగింది. దుర్యోధనునికి  -  తల్లిదండ్రులు ప్రేమ వలన చెప్పలేకపోయారు, విదురుడు మంత్రిత్వం వలన చెప్పలేక పోయాడు, భీష్ముడు పాపం తాత గారు, చనువు ఎక్కువ అయినా ఎన్నో సార్లు చెప్పి చూశాడు కానీ ఆయన్నీ లెక్క చేయలేదు.. చివరికి సర్వం రాజ్యమే కూలిపోయింది..


పెద్దలు లేని సంసారం, కుటుంబం ఏమవుతుందో తెలుసుకోవాలి..

నూరుగురు కౌరవులు ఏమయినారో మనం గుర్తుంచుకోవాలి, ధర్మాన్ని చెప్పేవాడు ఓక్కడైనా వుండాలి, 

అదే ధృతరాష్ట్రుని గొప్పతనం...

ధృతరాష్ట్రుడు విదురుడ్ని ప్రక్కన బెట్టుకొన్నాడు, అందుకనే ఆయనకు శ్రీకృష్ణ విశ్వరూప దర్శనం లభించింది.

అదే శకుడ్ని దగ్గర పెట్టుకొన్న దుర్యోధనడు యొక్క స్థితి మనకు తెలుసు..


దుర్మార్గుడైనా సరే ఓ మహాత్ముడ్ని, మంచి వాడ్ని చెంత పెట్టుకోవాలి.. దీనిని మనం బాగా పట్టుకోవాలి.

అదే ధర్మరాజు విషయంలో చూడండి.. అందరి మాట విన్నాడు, ఆయన మాట ఆయన తమ్ముళ్లు విన్నారు, ధర్మ ప్రవర్తనతో బ్రతికారు, 

దుర్యోధనుడు ఎవ్వరి మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, గురువుల మాట వినలేదు, పెద్దల మాట వినలేదు, శ్రేయోభిలాషుల మాట వినలేదు, భగవంతుడి మాట కూడా వినలేదు చివరికి ఏమైయాడు?


మంచి చెప్పే వాళ్లను బ్రతిమలాడి కోనైనా తెచ్చుకోవాలి."అయ్యా మీరు మార్గ నిర్ధేశకులుగా ఉండండి, అధ్యక్షులుగా వుండండి, పెద్దలుగా వుండండి మాకు!" అని ప్రాధేయపడి వుంచుకోవాలి. పెద్దవాళ్లను వుంచుకున్నందు వలన కుటుంబాలకు, సంస్థలకు, సభలకు గౌరవం లభిస్తుంది,చెడ్డవాళ్లను డబ్బులు ఇచ్చి అయినా వదిలించుకోవాలి అంటారు.. రాజు చెడ్డవాడు అయినా మహా మంత్రి మంచివాడుగా, ధర్మం చెప్పేవాడుగా వుండాలి.. అప్పుడే ఆ రాజు, ప్రజలు పది కాలాలు పాటు చల్లగా వుంటారు.. ధర్మం చెప్పే పెద్దలు లేనందువలన లేదా చెప్పినా వినకపోవడం వలన సమాజం దెబ్బతింటుంది.


ఎవడికి వాడు నేనే పెద్ద అంటే ఎలాగా? 

అలాంటి జ్ఞానవంతులు వుంటేనే ఓక్కోసారి పొరబాట్లు, తప్పులు జరిగిపోతూ వుంటాయి..


అయ్యా శ్రీకృష్ణా! నేను ఏమి తప్పుజేసానని? అని భీష్ముడు శ్రీకృష్ణుల వారిని అడుగుతాడు...

"ఓ తప్పు జరిగేచోట పెద్దలు వుండటమే తప్పు" అని అంటాడు. ఓ తప్పును చూస్తూ ఖండించకుండా, అక్కడ నుంచి వెళ్లిపోకుండా మౌనం వహించి చూస్తూ వుండటమే భీష్ముడు చేసిన తప్పు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు ఏమీ చేయలేక అక్కడే వుండిపోయాడు..

అదే విదురుడు చూడకుండా వెళ్లిపోయినాడు....

కావున పెద్దలు ఓ తప్పు జరిగిన చోట వుంటే ఆ పాపం వారి ఖాతాలో కూడా వేస్తారు. అందువలన చెప్పిన మాట విననప్పుడు పెద్దలు ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు...

26+ డిగ్రీల వద్ద AC ఉంచండి

 *26+ డిగ్రీల వద్ద AC ఉంచండి మరియు ఒకటి లేదా రెండు నంబర్‌ పై ఫ్యాన్ ఉంచండి.*

 📣📣📣📣📣

 EB నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంపిన చాలా ఉపయోగకరమైన సమాచారం:

 AC యొక్క సరైన ఉపయోగం

 ఎండాకాలం ప్రారంభమైనందున మరియు మేము ఎయిర్ కండీషనర్లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తాము, సరైన పద్ధతిని అనుసరించండి.


 చాలా మందికి 20-22 డిగ్రీల వద్ద ఏసీలు నడపడం అలవాటు ఉంటుంది మరియు చలిగా అనిపించినప్పుడు, వారు తమ శరీరాన్ని దుప్పట్లతో కప్పుకుంటారు.  ఇది రెట్టింపు నష్టానికి దారితీస్తుంది.  ఎలా ???


 మన శరీర ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ అని మీకు తెలుసా?  శరీరం 23 డిగ్రీల నుండి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను సులభంగా తట్టుకోగలదు.  దీనిని మానవ శరీర ఉష్ణోగ్రత సహనం అంటారు.


 గది ఉష్ణోగ్రత తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరం తుమ్ములు, వణుకు మొదలైన వాటి ద్వారా ప్రతిస్పందిస్తుంది.


 మీరు 19-20-21 డిగ్రీల వద్ద ACని నడుపుతున్నప్పుడు, గది ఉష్ణోగ్రత సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువగా ఉంటుంది మరియు ఇది శరీరంలోని అల్పోష్ణస్థితి అనే ప్రక్రియను ప్రారంభిస్తుంది, ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది, తద్వారా శరీరంలోని కొన్ని భాగాలలో రక్త సరఫరా జరగదు.  తగినంత.  కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలికంగా అనేక ప్రతికూలతలు ఉన్నాయి.


 AC ఆన్‌లో ఉన్నప్పుడు చాలా వరకు చెమట పట్టదు, కాబట్టి శరీరంలోని టాక్సిన్‌లు బయటకు రాలేవు మరియు దీర్ఘకాలంలో చర్మ అలెర్జీ లేదా దురద, అధిక రక్తపోటు మొదలైన అనేక వ్యాధుల ప్రమాదాన్ని కలిగిస్తాయి.


 మీరు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ACని నడుపుతున్నప్పుడు, దాని కంప్రెసర్ పూర్తి శక్తితో నిరంతరం పని చేస్తుంది, అది 5 నక్షత్రాలు అయినప్పటికీ, అధిక శక్తి వినియోగించబడుతుంది & మీ జేబులో నుండి డబ్బును ఊదుతుంది.


 AC నడపడానికి ఉత్తమ మార్గం ఏమిటి ??  26 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను సెటప్ చేయండి.

 ముందుగా AC ఉష్ణోగ్రతను 20 - 21కి సెట్ చేసి, ఆపై మీ చుట్టూ షీట్/సన్నని మెత్తని బొంతను చుట్టడం ద్వారా మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.

 26+ డిగ్రీల వద్ద AC రన్ చేయడం మరియు స్లో స్పీడ్‌లో ఫ్యాన్‌ను పెట్టడం ఎల్లప్పుడూ మంచిది.  28 ప్లస్ డిగ్రీలు ఉత్తమం.


 దీని వల్ల తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది మరియు మీ శరీర ఉష్ణోగ్రత కూడా ఆ పరిధిలో ఉంటుంది మరియు మీ ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం ఉండదు.


 దీని యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే, AC తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది, మెదడుపై రక్తపోటు కూడా తగ్గుతుంది మరియు పొదుపు అంతిమంగా గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఎలా ??


 మీరు 26+ డిగ్రీలో ACని నడపటం ద్వారా ఒక రాత్రికి ACకి దాదాపు 5 యూనిట్లు ఆదా చేశారనుకుందాం మరియు మీలాగే ఇతర 10 లక్షల ఇళ్ళు కూడా ఆదా చేశారనుకోండి, అప్పుడు మేము రోజుకు 5 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేస్తాము.


 ప్రాంతీయ స్థాయిలో ఈ పొదుపు రోజుకు కోట్ల యూనిట్లు కావచ్చు.


 దయచేసి పైన పేర్కొన్న వాటిని పరిగణించండి మరియు మీ ACని 26 డిగ్రీల కంటే తక్కువ వద్ద అమలు చేయవద్దు.  మీ శరీరం మరియు పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.


 ప్రజా ప్రయోజనాల కోసం ఫార్వార్డ్ చేయబడింది

 విద్యుత్ మంత్రిత్వ శాఖ

 మరియు శక్తి, GOI.

మానవ సంబంధాలు

 🍁పలచబడి పోతున్న మానవ సంబంధాలు🍁


 🌷గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు లో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాము .

        🌷  పెద్దగా ఆస్తులు..చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు.. సమాజంలో హోదా.. సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చక్కగా (చిక్కగా )వుండేవి..

          🌷     ఒకరికి ఒకరు చేదోడుగా.. నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు..

      🌷    వున్నంతలో తృప్తిగా వున్నారు.. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం.. అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా వుండేది..

            🌷   కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు..

            🌷   మా మనవడు లేదా మనవరాలు..అని తాతలు.. మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు..

          🌷   కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి priority ఇవ్వడం మొదలైందో.. ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో..ఈ సంబంధాల్లో  కూడా compitetion మొదలైంది... పిల్లలో ఈర్ష్య, పెద్దల్లో అసూయ..


          🌷   మొదట్లో success అయిన వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు.. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు.. తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడ్డారు..


           🌷  కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో.. వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో..

           🌷   అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు.. పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది.... అంతా కమర్షియల్ అయిపోయింది 

           🌷   ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు..  కొన్న ఆస్తులు.. చేయించుకున్న నగలు.. వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్.. వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప..

            🌷   వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే తగ్గిపోయింది..పలకరించుకున్నా ఏదో మొక్కుబడిగానే...


             🌷   ఆనాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా..శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి వుండేవారు..

              తరువాత కూడా ఇంకో వారం రోజులు వుండేవారు..

         🌷   రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు..

          🌷     ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా.. చేసే వారు కూడా ఆప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ మన వాళ్ళను దగ్గరగా నిలుపుకుందాము అని మర్చిపోతున్నారు..


            🌷    అటెండ్ అయ్యే వారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి.. తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ప్రయారిటీ..

        🌷     పారదర్శక సంబంధాల కి ఇవ్వడం లేదు.. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు హజరులు మిగిలిపోతున్నాయి..

       🌷    అందరికి పిల్లలు దూరంగా వుంటున్నా.. ఇరుగు పొరుగు నే వుంటున్న రక్త సంబంధీకులు తో కూడా ఆత్మీయ అనుబంధాలు వుంచుకోవడం లేదు..


🌷నిష్కారణంగా చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం అతిశయం తో వ్యవహరిస్తూ.. అందరికి అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడుతున్నారు..


       🌷   వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు..

        🌷 నూటికి 90% కుటుంబాలలో పిల్లలు దూరంగానే వుంటున్నారు.. వీళ్లకు పెద్ధతనం.. ఒంటరి తనం.. అనారోగ్య సమస్యలు.. మనిషి తోడు అవసరం..

            🌷అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు.. విపరీతమైన స్వార్థం పక్క వాడి నీడ కూడా సహించడం లేదు..

దగ్గరి వాళ్ళ మధ్య కూడా గొడవలు.. మాట్లాడుకోక పోవడం.. షరా మాములు అయిపోయింది...


 🌷సినిమా లో  రాసిన ఓ చక్కని డైలాగ్‌ గుర్తుకొస్తుంది........

‘"మనం బాగున్నప్పుడు లెక్కలు చూసుకుని... కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు" ,


🌷వీలైతే  మనం బాగున్నప్పుడు కూడా అందరితో కలిసి ఉండాలి మన వారికీ అవసరమైన సహాయం అందించాలి.

      🌷 చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు..

          🌷  వలసలు పుణ్యాన.. గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది.. 

      🌷  దానికి తోడు కేవలం కూడూ గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు పర్యవసానం.., 


కాలం మహిమ

 *కాల మహిమ ఎలా ఉంటుందంటే, కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది అనడానికి  కొన్ని ఉదాహరణలు.*


1. మహానటుడు, ఆంధ్ర ప్రజలు గర్వించే ఎన్టీఆర్ మీద, వైస్రాయ్ సాక్షిగా చెప్పులు పడ్డాయి. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎంత దారుణ పరిస్థితిలో పడ్డారో చూసాం. పిల్లలు పట్టించుకోలేదు. ఆస్తులు కలసి రాలేదు.


2. 2009 ఎలక్షన్ ప్రచారంలో  మెగాస్టార్ చిరంజీవి మీద కోడిగుడ్లతో దాడి చేశారు.ఆ తరవాత రాజకీలయాల నుంచి నిష్క్రమణ.


3. , మహా మేధావి  మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 420 case లో  బోనులో  నిలబడవలసి వచ్చింది. చివరికి శవానికి దహన సంస్కారాలు కూడా సరిగా జరగలేదు.


4. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, అంత్యక్రియలు చేయడానికి కనీసం శవం కూడా దొరకలేదు.


5. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  16 నెలలు జైలులో ఉన్నారు.


6. 1978 లో  మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని, కంటెంట్ ఆఫ్ హౌస్ కింద సాక్షాత్తు మన పార్లమెంటే జైలుకు పంపింది.


7. తమిళ ప్రజలతో "అమ్మ" అని పిలిపించుకున్న తిరుగులేని ఉక్కుమహిళ, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీ సాక్షిగా చీర లాగి వివస్త్రను చేశారు.టాన్సి కేస్ లో కోర్టుల చుట్టూ తిరిగింది. చివరికి ఏ స్థితి లో చనిపోయిందో చూసాం.


8. ఆంధ్ర బిల్ గేట్స్ గా పేరుపొందిన సత్యం రామలింగరాజు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.


9. ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్, చివరకు నిస్సహాయంగా చనిపోయాడు.


10. జాత్యహంకారానికి  మారుపేరుగా నిలిచి, లక్షల మందిని ఊచకోత కోయించి,  రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్ దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.


11.  గొప్ప విజన్ ఉన్న నాయకుడు గా చెప్పుకునే  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం గుమ్మం బయట చేతులు కట్టుకుని వేచి చూసిన కేసీఆర్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాగే NDA అధికారంలో ఉన్నప్పుడు NDA కన్వీనర్  చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసి విఫలమైన నరేంద్ర మోడీ, దేశ ప్రధాని అయ్యాడు. ఒకప్పుడు చంద్రబాబు  అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన నరేంద్ర మోడీ,  కెసిఆర్ లు 15 సంవత్సరాల తర్వాత PM, CM అవడం..చంద్రబాబుకి 2019 ఎలక్షన్స్ లో చరమగీతం పాడడం కాలమహిమ కాక మరి ఏమిటి! .ఇప్పుడు అదే చంద్రబాబు భోరున ఏడ్చిన సంఘటన చూస్తున్నాం.


ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.


ఈ సృష్టి అంతా కాలస్వరూపం. కాలమే దైవం. మనల్ని ఈ భూమి మీదకు తీసుకువచ్చేది కాలం, మనల్ని ఈ భూమి మీద నుంచి తీసుకు వెళ్ళి పోయేది కాలం.


*అందువల్ల "నేనే" అన్న అహంకారంతో విర్రవీగవలసిన అవసరం లేదు. నేనే గొప్ప నా వల్లనే అంతా జరుగుతుంది నా సంఘమే గొప్ప, నా పార్టీ నే గొప్ప మా నాయకుడే గొప్ప మాదే అంతా అనే వ్యక్తి అహంకార విధానం అవసరం లేదు*


ఈ నేనే అన్నఈ భూమికి మనం *అరువు* గా వచ్చాం కొన్నాళ్లకు ఈ భూమికే *ఎరువు* గా మారిపోతాం ఈ మధ్యలో *పరువు* గా బతికేద్దాం , ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం *కాలం* కంటే *వేగంగా* మనసులు మారే *మనషుల* మద్య మనం *బ్రతుకుతున్నాం* అందుకే ఎవరితో ఎంతవరకూ *ఉండాలో* అంతవరకే ఉండాలి మనం . 


జీవితంలో అన్నీ *కోల్పోయినా* ఒకటి మాత్రం మనకోసం ఎప్పుడూ *సిద్దంగా* ఉంటుంది దాని పేరే *భవిష్యత్తు* మనిషి జీవితం *మేడిపండు* లాంటిది మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది కానీ లోపల అన్ని *పురుగులే* ఉంటాయి మనిషి జీవితం కూడా అంతే ఒకరి జీవితం మరోకరికి *అందంగానే* కనబడుతుంది కానీ ఆ జీవితంలో దాగి ఉన్న *కష్టాలు కన్నీళ్ళు* ఎవరికీ కనిపించవు .


మనం మనిషిగా పుట్టడమే ఒక *అద్భుతం* బతికి ఉండటం ఒక *అదృష్టం* ముడి పడుతున్న *బంధాలన్ని* వరాలు ఎదురు పడుతున్న అడ్డంకులన్ని మనకు విలువైన *పాఠాలు* కష్టం గురించి *చింతించక* ఉన్నన్నాళ్లు *ఆనందంగా* గడిపేద్దాం .  అహంకారాన్ని దాటాలంటే ప్రతి మనిషి కొంత ఫిలాసఫీని అర్థం చేసుకోవడం  అవసరం

సంస్కారం – నాగరికత

 *సంస్కారం – నాగరికత*


🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸


వాసు, వీణ గుజరాత్‌ లోని ఒక నగరంలో నివసిస్తున్నారు. ఒకే మెడికల్ కాలేజీలో కలిసి చదువుకున్న వీరిద్దరి స్నేహం  ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం కుటుంబసభ్యుల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక బ్యాంకులో లోన్ తీసుకుని సొంతంగా ఒక ఆసుపత్రి తెరవాలని నిర్ణయించుకున్నారు. వీణ గైనకాలజిస్ట్, వాసు డాక్టర్ ఆఫ్ మెడిసిన్. వారి నైపుణ్యాల వల్ల ఆసుపత్రి బాగానే నడుస్తూ ఉంది. వారికి ఇంకా పిల్లలు లేరు, కాబట్టి వారు సరదాగా చిన్న చిన్న ప్రయాణాలు చేస్తున్నారు.

వారు వృత్తిరీత్యా వైద్యులు అవడం వల్ల తరచుగా సెలవలు తీసుకోలేరు. అయితే రెండు మూడు రోజులు విరామం దొరికినప్పుడల్లా చిన్నపాటి ప్రయాణాలు చేస్తూ ఎదో ఒక చోటికి వెళ్లేవారు. ఈసారి వారికి మూడు రోజుల విరామం లభించడంతో ఇండోర్, ఉజ్జయిని వెళ్లాలని అనుకున్నారు.


వారు ప్రయాణానికి బయలుదేరినప్పుడు, ఆకాశమంతా మేఘావృతమై ఉంది. మధ్యప్రదేశ్ సరిహద్దు దాదాపు 200 కి.మీ దూరంలో ఉండగా వర్షం ప్రారంభమయింది. మధ్యప్రదేశ్ సరిహద్దుకి 40 కి.మీ దూరంలోనే ఓ చిన్న గ్రామాన్ని దాటడానికి వారికి చాలా సమయం పట్టింది. బురదమయమైన రోడ్లు, విపరీతమైన ట్రాఫిక్ మధ్య, వారు అతికష్టం మీద ఆ గ్రామాన్ని దాటగలిగారు.

మధ్యప్రదేశ్ చేరుకున్న తర్వాత భోజనానికి ఆగుదామని  నిర్ణయించుకున్నారు, కానీ ఇప్పుడు సాయంత్రపు టీ సమయం అయింది. ఆ చిన్న ఊరు నుండి 4-5 కి.మీ దూరం వెళ్లాక రోడ్డు పక్కన చిప్స్ ప్యాకెట్లు వేలాడదీసి ఉన్న ఒక చిన్న ఇల్లు కనిపించింది. టీ కొట్టు అనుకుని, వాసు అక్కడ కారు ఆపి షాప్ లోకి వెళ్ళాడు, అక్కడ ఎవరూ లేరు. 


ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు! ఒక స్త్రీ బయటకు వచ్చి "ఏం కావాలి అన్నా?" అనడిగింది.


వాసు రెండు చిప్స్ ప్యాకెట్లు, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని, "అక్క, రెండు కప్పులు టీ ఇవ్వరా, దయచేసి కొంచెం త్వరగా చేయండి, మేము ఇంకా చాలా దూరం ప్రయాణించాలి." అన్నాడు. ప్యాకెట్లు తీసుకుని కారు దగ్గరకు వెళ్లాడు. ఇద్దరూ చిప్స్, బిస్కెట్లు తిన్న తర్వాత కూడా టీ ఇంకా రాలేదు. కారు దిగి షాపు వద్ద ఉన్న కుర్చీలపై కూర్చున్నారు. వాసు మళ్ళీ పిలిచాడు.

కొద్దిసేపటికి ఆ స్త్రీ బయటకు వచ్చి, "అన్నా! పెరట్లో తులసి ఆకులు తీసుకురావడానికి వెళ్ళాను, దానికి కొంచెం సమయం పట్టింది, టీ తయారవుతోంది." అంటూ కొద్దిసేపటి తర్వాత ప్లేట్‌ లో రెండు పాత కప్పుల్లో వేడి వేడి టీ తెచ్చింది.

మురికిగా ఉన్న ఆ పాత కప్పులను చూసి,  వాసు పూర్తిగా నిరాశ చెంది, ఏదో అనాలనుకున్నాడు; కానీ వీణ చేయి నొక్కి, అతనిని ఆపింది. కప్పులు తీసుకోగానే తులసి, అల్లం సువాసన వెదజల్లింది. ఇద్దరూ టీ తాగారు. వారు తమ జీవితంలో ఇంత రుచికరమైన, సువాసనగల టీ మొదటిసారిగా తాగారు, ముందున్న సంకోచం అంతా మాయమైపోయింది.


టీ తాగిన తర్వాత, వారు ఎంత ఇవ్వాలని ఆ మహిళను అడిగారు. "ముప్పై రూపాయలు" అని బదులిచ్చింది. వాసు ఆమెకి వంద రూపాయల నోటు ఇచ్చాడు. ఆ స్త్రీ, "అన్నా, నా దగ్గర చిల్లరలేదు, దయచేసి నాకు ₹30 చిల్లర ఇవ్వండి" అని చెప్పింది.


 డాక్టర్ వాసు ఆమెకు చిల్లర ఇవ్వడంతో, ఆ మహిళ వంద రూపాయల నోటును తిరిగి ఇచ్చేసింది.


"చిప్స్, బిస్కెట్లు కూడా కొన్నాం కదా !" అన్నాడు వాసు. 

"ఈ డబ్బు దాని కోసమే, టీ కోసం కాదు" అని ఆ మహిళ చెప్పింది.

"ఐతే టీకి డబ్బులు ఎందుకు తీసుకోలేదు?" అని అడిగాడు.

"మేము టీ అమ్మం. ఇది హోటల్ కాదు" అని ఆమె సమాధానం ఇచ్చింది.


"మరి టీ ఎందుకు చేసిచ్చావు?" అడిగాడు వాసు.


"మీరు మా అతిధులుగా వచ్చి... టీ అడిగారు !! మా వద్ద  పాలు కూడా లేవు. పిల్లాడి కోసం ఉంచిన కాసిని పాలు మాత్రమే ఉన్నాయి, నేను మిమ్మల్ని కాదనలేక, ఆ పాలతో టీ చేసి ఇచ్చాను."


"ఇప్పుడు నువ్వు పిల్లవాడికి ఏమి ఇస్తావు ?" అడిగాడు .

ఒక్కరోజు పాలు తాగకపోతే ఏమీ అవదు. బాబు తండ్రికి అనారోగ్యంగా ఉంది, లేకుంటే ఊళ్లోకి వెళ్లి పాలు తెచ్చేవాడు. కానీ అతనికి  నిన్నటి నుంచి జ్వరం. ఈరోజు తగ్గితే రేపు పొద్దున్నే వెళ్లి పాలు తెస్తాడు", అంది.


ఆమె మాటలు విని వాసు, వీణ ఇద్దరూ నిశ్చేష్టులయ్యారు. నోరు మెదపలేకపోయారు!


వాసు ఇలా అనుకున్నాడు, “వాళ్ళు టీ అమ్మకపోయినా, ఈ అమ్మాయి తన బిడ్డ కోసం ఉంచిన పాలతో మనకు టీ చేసి ఇచ్చింది, అది కూడా నేను అడిగానని .... ఒక అతిధిగా అనుకుని?  సంస్కారంలో, నాగరికత చూపడంలో ఈ మహిళ నాకంటే చాలా ఎత్తులో ఉంది."


"మేమిద్దరం డాక్టర్లం, మీ భర్త ఎక్కడ ఉన్నాడు ?" అనడిగాడు వాసు.


స్త్రీ వారిని లోపలికి తీసుకువెళ్లింది; ఆ ఇంట్లో ప్రతీది 'పేదరికం' తో అరుస్తోంది. ఒక పెద్దమనిషి మంచం మీద పడుకుని ఉన్నాడు; అతను చాలా సన్నగా ఉన్నాడు. డాక్టర్ వాసు వెళ్ళి అతని నుదుటి మీద చెయ్యి వేసాడు. అతని నుదురు, చేతులు చాలా వేడిగా ఉంది, వణుకుతున్నాడు కూడా.డాక్టర్ వాసు కారు దగ్గరకు వెళ్లి మందుల బ్యాగ్ తీసుకొచ్చాడు. రెండు-మూడు మాత్రలు ఇచ్చి, "ఈ మాత్రలు వల్ల అతనికి పూర్తిగా నయం అవదు, నేను నగరానికి తిరిగి వెళ్లి ఇంజెక్షన్లు, మందు బాటిల్ తీసుకొస్తాను" అని చెప్పాడు. వీణను పేషెంట్ దగ్గరే ఉండమన్నాడు.


అతను తన కారును తీసుకొని అరగంటలో, సిటీ నుండి మందు సీసాలు, ఇంజెక్షన్లు, కొన్ని పాల ప్యాకెట్లతో పాటు తిరిగి వచ్చాడు. పేషెంట్ కి ఇంజెక్షన్ ఇచ్చాడు, డ్రిప్ బాటిల్ పెట్టాడు. సెలైన్ బాటిల్ ఖాళీ అయ్యే వరకు ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. ఆ స్త్రీ తులసి అల్లం టీ మరోసారి తయారు చేసింది. ఇద్దరూ టీ తాగి, దానిని మెచ్చుకున్నారు. రెండు  గంటల్లో పేషెంట్ కాస్త బాగుపడడంతో అక్కడి నుంచి ఇద్దరూ వెళ్లిపోయారు.


ఇండోర్ - ఉజ్జయినిలో మూడు రోజులు ఉండి తిరిగి వచ్చిన తర్వాత, వారు ఆ పిల్లాడి కోసం కొన్ని బొమ్మలు, పాల ప్యాకెట్లు తీసుకువచ్చారు. వారు ఆ దుకాణం ముందు ఆగి ఆ మహిళను పిలిచారు. భార్యాభర్తలిద్దరూ బయటకు వచ్చి వారిని చూసి చాలా సంతోషించారు. “మీ మందులతో ఆ మరుసటి రోజే అతను  పూర్తిగా కోలుకున్నాడు’’, అని ఆ మహిళ చెప్పింది.

డాక్టర్ వాసు చిన్నారికి బొమ్మలు, పాల ప్యాకెట్లు ఇచ్చారు. మళ్ళీ టీ తయారుచేయబడింది, సంభాషణలు జరిగాయి, స్నేహం ఏర్పడింది. వాసు తన అడ్రస్ ఇచ్చి, "నువ్వు మా ఊరు వచ్చినప్పుడల్లా నన్ను కలువు", అన్నాడు.


 ఆపై వారిద్దరూ వారి నగరానికి చేరుకున్నారు.


సిటీకి చేరుకోగానే డాక్టర్ వాసు ఆ మహిళ మాటలు మరిచిపోకుండా ఓ నిర్ణయం తీసుకున్నాడు. అతను తన ఆసుపత్రిలోని రిసెప్షనిస్ట్‌ తో ఇలా చెప్పాడు, "ఇక నుండి ఎవరైనా పేషెంట్లు వచ్చినప్పుడు, వారి పేర్లు రాయండి, ఎటువంటి రుసుము వసూలు చేయవద్దు, ఇక నుండి ఫీజులు నేనే వసూలు చేసుకుంటాను."


అప్పటి నుండి పేద పేషెంట్ల వద్ద నుంచి ఫీజులు వసూలు చేయడం మానేశాడు. పేషెంట్లు సంపన్నులు అని తెలిస్తే మాత్రం ఫీజు వసూలు చేసేవాడు.

క్రమంగా, అతను నగరం అంతటా ప్రసిద్ధి చెందాడు. ఇతర వైద్యులు తెలుసుకుని, ఇది మా ప్రాక్టీస్ ను తగ్గిస్తుందని, ప్రజలు తమని విమర్శిస్తారని వారు భావించారు. వైద్య సంఘం ప్రెసిడెంట్ ని కలిసి వారు ఆందోళనకు దిగారు.


అసోసియేషన్  ప్రెసిడెంట్ డాక్టర్ వాసుని కలవడానికి వచ్చి "ఎందుకు ఇలా చేస్తున్నావు?" అనడిగాడు.


  కానీ డాక్టర్ వాసు చెప్పిన సమాధానం విని అతను ఆశ్చర్యపోయాడు.


డాక్టర్ వాసు మాట్లాడుతూ.." జీవితంలో ప్రతి పరీక్షలోనూ మెరిట్‌ లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధిస్తూ వచ్చాను .... ఎంబీబీఎస్‌, ఎండీ చదివే సమయంలోనూ గోల్డ్‌ మెడలిస్ట్‌ నే.. సభ్యత, సంస్కారం, ఆతిథ్యంలో మాత్రం ఆ గ్రామానికి చెందిన ఆ పేద మహిళ నాకంటే ముందున్నది, ఇప్పుడింక నేను ఎలా వెనుకబడి ఉండగలను?అందుకే నేను ఆతిథ్యం, మానవ సేవలో కూడా గోల్డ్‌ మెడలిస్ట్‌ ని అవుదామనుకుంటున్నాను. అందుకే నేను ఈ సేవను ప్రారంభించాను. నిజానికి, మన వృత్తి మానవాళికి సేవ చేయడానికి కానీ, డబ్బు సంపాదించడానికి కాదు. మానవాళికి సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు మనకు ఇచ్చాడు", అన్నాడు.


"ఇకపై నేనూ అదే స్ఫూర్తితో వైద్యసేవ చేస్తాను’’ అంటూ సంఘం అధ్యక్షుడు డాక్టర్ వాసుకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు.


♾️


మనం చేసే సేవలో ఉత్సాహం ఉండాలి; మనం ఏమి చేసినా, ప్రతిఫలంగా ఏమీ పొందాలనే ఉద్దేశ్యం లేకుండా హృదయపూర్వకంగా చేయాలి. 🌼

   🙏మానవత్వం ఉన్న  ప్రతి వ్యక్తీ తెలుసుకోవలసిన విలువైన  కథ.నిజమైన  కథ🌸🌼🌸🙏🏻

బాధ్యత

 బాధ్యత           

   

రైల్వే స్టేషన్ లో రైలు కోసం జనాలు ఎదురుచూస్తున్నారు.


ఒక మధ్య వయసు జంట పిల్లలతో ఒక బెంచ్ దగ్గర కూచున్నారు.


పక్కన ఒక వృద్ధ జంట కూచున్నారు.ఆయన ఎదో పుస్తకం చదువుతున్నారు.


ఎక్కడి వరకు వెళ్తున్నారు మాట కలిపాడు మద్య వయసాయన.మేము విజయవాడ వెళుతున్నాం.

మరి మీరో అంటూ అడిగాడు ఆ వృద్ధుడు అతన్ని .

మేమూ విజయవాడ వరకే అని చెప్పి మీకు రిజర్వేషన్ వుందా అని అడిగాడు మద్యవయసాయన.

ఆ ఉందండీ మా అబ్బాయి చేశాడు. S5 లో చెప్పాడు పెద్దాయన.


అరే మాది కూడా S5 బోగీనే అన్నాడు, వాళ్ళవి ఎదురెదురు సీట్లు అని తెలుసుకున్నారు.


'ఆ పుస్తకం ఏమిటండీ అడిగాడు' మద్యవయసాయన, ఆ పెద్దాయనని

పుస్తకం అట్ట చూపిస్తూ "రామాయణం"

చెప్పాడు పెద్దాయన.

'ఇపుడు ఎంత వరకు చదివారు' అడిగాడు మధ్యవయసాయన.


'సీతా సమేతంగా రామ లక్ష్మణులు అడవికి వెళ్లారు. అక్కడ మద్యలో గుహుడు కలిశాడు.'


'ఆ అవన్నీ ఈ వయసులో ఇపుడు నాకు ఎందుకు లెండి రిటైర్ అయ్యాక తీరిక గా చదువుకుంటా' అన్నాడు మద్యవయసాయాన. ఆ వృద్ధుడు నవ్వి మళ్లీ పుస్తకం చదవటం లో మునిగిపోయాడు.


రైలు ఇక్కడ 3 నిమిషాలు మాత్రమే ఆగుతుంది.

జనాలు కాస్త ఎక్కువగానే వున్నారు.త్వరగా రైలు ఎక్కేయాలి పిల్లలు, జాగ్రత్త, ఆ లగేజి అంతా ఒకేచోట పెట్టు. అటు ఇటు వెళ్లకండి. రైలు రాగానే జనాలు తోసుకుని వస్తారు. బొమ్మల్లా కూర్చోకుండా నా వెంటే రండి....

అంటూ భార్య కీ ఆదేశాలు జారీ చేస్తున్నాడు మథ్యవయసాయన.


మరి కాసేపట్లో రైలు వచ్చింది.

లగేజీ తీసుకుని రా రా అలా నిలబడిపోతవేంటి అని భార్యను అరుస్తూ ముందుకు కదిలాడు మద్యవయసాయన. జనాలని తోసుకుంటూ ముందు ఆయన ఎక్కేసాడు. వెనకే భార్య పిల్లలు వస్తున్నారులే అనుకున్నాడు.


తీరా ఎక్కి చూశాక భార్య, పిల్లలు కనపడలేదు,

లగేజి బెర్త్ మీద పెట్టి, పెద్దాయన కి లగేజి చూస్తుండండి అని చెప్పి వెనక్కి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి చూసాడు. ఇంకా అతని భార్య పిల్లలు ఎక్కడం లోనే వున్నారు. అంతలో రైలు కూత పెట్టింది. కసురుకుంటూ భార్య చేయిని పట్టుకుని లోపలికి లాగేసాడు. పిల్లలని కూడా లోనికి లాగేసాడు.


అంతటితో ఆగకుండా ఇందుకే మిమ్మల్ని బయటికి తీసుకు రాను. లోక జ్ఞానం లేదు, నీకు రైలు ఎక్కడం కూడా రాదా, నా వెంటే ఎక్కు అంటే వినపడదా.

నిన్ను కాదు మీ నాన్నని అనాలి. నిన్ను నాకు అంటగట్టారు అని గెట్టిగా అరుస్తున్నాడు. రైలు కదిలింది.


కాసేపటికి ఆయన శాంతించాడు. వాళ్ళ ఎదురు బెర్త్ లో కూచున్న వృద్ధుడు మళ్లీ రామాయణం చదవటం మొదలు పెట్టాడు.


'ఏముందండి ఆ పుస్తకం లో ఎప్పుడో జరిగిందట, రాసారట, ఇంత టెక్నాలజీ వచ్చింది. ఇంకా ఆ పుస్తకం పట్టుకుని చదువుతున్నారు,' అన్నాడు మద్యవయసాయన.


పెద్దాయన అతని వైపు చూసి చిన్నగా నవ్వి,


"ఇందాక రైలు ఎక్కేపుడు మీరు ఎంత కంగారు పడ్డారు. మీ భార్య, పిల్లలు, లగేజీ ని రైలు ఎక్కించటానికి కాస్త ప్రయాస పడ్డారు. నేను, నా భార్య కాస్త ముసలి వాళ్ళం అయినా కూడా మేము హడావిడి లేకుండా రైలు ఎక్కేసాం."


"ఫ్లాట్ ఫారం మీద వున్నపుడు మీరు అడిగారు, పుస్తకం ఏమిటి అని. నిజానికి నేను రామాయణం మొదటి సారి చదువుతున్నాను. సీతా సమేతంగా రామ లక్ష్మణులు అడవికి వెళ్లారు. అక్కడ మద్యలో గుహుడు కలిశాడు అని చెప్పాను."


"అవును, గుహుడు పడవలో వాళ్ళను ఎక్కించుకుని అవతలి ఒడ్డుకు చేర్చాడు" అంతేగా ఏముంది అందులో అన్నాడు మద్యవయసాయన.


"ఆ ఆ అంతే కాకపోతే, ముందుగా పడవని సీతమ్మ ఎక్కింది, తరువాత లక్ష్మణుడు ఎక్కాడు, ఆఖరున రాముడు ఎక్కాడు. తరువాత పడవ ముందుకు కదిలింది. ఈ వృత్తాంతం అంతా నేను ఫ్లాట్ ఫారం మీదనే చదివాను. ముందు మనల్ని నమ్ముకుని మనతో వచ్చిన వారిని బాగా చూసుకోవాలి..తరువాత మన గురించి మనం ఆలోచించాలి. అని దాని భావం..అందుకే రైలు ఎక్కెటపుడు ముందు నా భార్యని ఎక్కించా, లగేజి తీసుకుని తన వెనక నేను ఎక్కేసా... మనం ఎలా బతకాలి అని ఏ టెక్నాలజీ మనకి చెప్పదు" అన్నాడు పెద్దాయన. ఇలాగే మహాగ్రంథాలలో మనకు జీవన విధానాన్ని, నైతిక విలువలను నేర్పించే సంఘటనలు ఉంటాయండి, వాటిని మన పరిస్థితులకు అన్వయించుకుంటే చాలా సమస్యలకు పరిష్కారాలు ఇలాంటి పుస్తకాల్లో దొరుకుతాయి..


టెక్నాలజీ ఎంతపెరిగినా జీవనవిధానంలో ఎంత మార్పు వచ్చినా, సరైన పద్దతిలో జీవించేందుకు టెక్నాలజీ కన్నా మన నడవడిక మాత్రమే ముఖ్యం, ఆ నడవడిక ఎలా ఉండాలో చెప్పేవే మహాగ్రంథాలు, ఈ పుస్తకాలు లైఫ్ టైం అప్ డేటెడ్ అంటూ వివరించారు పెద్దాయన..

Monday, April 17, 2023

తెలుగా మజాకా

 తెలుగా మజాకా

*అదే మరి మన భాష ప్రత్యేకత!*


 *నెలవంక* ఉంటుంది గానీ...

 *"వారంవంక"* ఉండదు అదేంటో!!!


 *"పాలపుంత"* ఉంటుంది గానీ...

 *"పెరుగుపుంత"* ఉండదు.


 *"పలక'రింపు"* ఉంటుంది గానీ...

 *"పుస్తకంరింపు"* ఉండదెందుకు?


 *"పిల్ల"కాలవ"* ఉంటుంది గానీ...

 *"పిల్లోడి కాలవ"* ఉండదు...ఎందువల్లనో?

 

 *"పామా"యిల్"* ఉంటుంది గానీ...

 *"తేలు ఆయిలు"* ఉండదండి.


 *"కారు మబ్బులు"* ఉంటాయి గానీ...

 *"బస్సు మబ్బులు"* ఉండవేమిటో!


 *"ట్యూబ్ లైటు"* ఉంది గానీ...

 *"టైర్ లైటు"* ఉండదు.


 *"ట్రాఫిక్ జామ్"* ఉంటాది గానీ...

 *"ట్రాఫిక్ బ్రెడ్"* ఉండదు.


 *"వడ"దెబ్బ"* ఉంటుంది గానీ...

 *"ఇడ్లీ దెబ్బ"* ఉండదండి.


 *"నిద్రగన్నేరు చెట్టు"* ఉంటుంది గానీ....

 *"మెలకువ గన్నేరు చెట్టు"* ఉండదండి.


 *"ఆకురాయి"* ఉంటాది గానీ...

 *"కొమ్మరాయి"* ఉండదండి.


 *"పాలపిట్ట"* ఉన్నది గానీ...

 *"పెరుగు పిట్ట",* గానీ, *"మజ్జిగ పిట్ట"* గానీ ఉంటే ఒట్టు.


 *"వడ్రంగి పిట్ట"* ఉన్నాది గానీ...

 *"కంసాలి పిట్ట"* లేదు


"చుట్టరికాలు" మాత్రమే ఉంటాయి గానీ...

 *"సిగరెట్టరికాలు"..* *".బీడీరికాలూ"* ఉండవేమిటో.


 *"రంగులరాట్నం"* ఉంటది గానీ...

 *"బ్లాక్ అండ్ వైట్ రాట్నం"* ఉండదెందుకని?


 *"ఫైర్ స్టేషన్"* లో *ఫైర్* ఉండదండి.

"పులిహారలో" *పులి* ఉండదండి.

 *"నేతి బీరకాయ"* లో *నెయ్యి* ఉండదు.

 *"మైసూర్ పాక్"* లో *మైసూర్* ఉండనే ఉండదు.

 *"గాలిపటంలో"* *గాలి* ఉండదండి.

 *"గల్లాపెట్టిలో"* *గల్లా* ఉండదండి.


చివరాఖరుగా...

 *"ఫేసు బుక్కులో"* *పుస్తకం* , *"యూ ట్యూబులో"* *గొట్టం* ఉండవు!


ఏమిటో ఈ తెలుగు మాయ!   

ఏమిటో ఈ తిరకాసు???!!!🤔🤔🤔😃

మానవ సంబంధాలు

 *పలచబడి పోతున్న మానవ సంబంధాలు*


 గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు లో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాము .

          పెద్దగా ఆస్తులు..చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు.. సమాజంలో హోదా.. సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చక్కగా (చిక్కగా )వుండేవి..

               ఒకరికి ఒకరు చేదోడుగా.. నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు..

          వున్నంతలో తృప్తిగా వున్నారు.. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం.. అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా వుండేది..

               కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు..

               మా మనవడు లేదా మనవరాలు..అని తాతలు.. మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు..

             కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి priority ఇవ్వడం మొదలైందో.. ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో..ఈ సంబంధాల్లో  కూడా compitetion మొదలైంది... పిల్లలో ఈర్ష్య, పెద్దల్లో అసూయ..


             మొదట్లో success అయిన వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు.. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు.. తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడ్డారు..


             కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో.. వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో..

              అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు.. పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది.... అంతా కమర్షియల్ అయిపోయింది 

              ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు..  కొన్న ఆస్తులు.. చేయించుకున్న నగలు.. వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్.. వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప..

               వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే తగ్గిపోయింది..పలకరించుకున్నా ఏదో మొక్కుబడిగానే...


                ఆనాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా..శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి వుండేవారు..

              తరువాత కూడా ఇంకో వారం రోజులు వుండేవారు..

            రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు..

               ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా.. చేసే వారు కూడా ఆప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ మన వాళ్ళను దగ్గరగా నిలుపుకుందాము అని మర్చిపోతున్నారు..


                అటెండ్ అయ్యే వారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి.. తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ప్రయారిటీ..

             పారదర్శక సంబంధాల కి ఇవ్వడం లేదు.. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు హజరులు మిగిలిపోతున్నాయి..

           అందరికి పిల్లలు దూరంగా వుంటున్నా.. ఇరుగు పొరుగు నే వుంటున్న రక్త సంబంధీకులు తో కూడా ఆత్మీయ అనుబంధాలు వుంచుకోవడం లేదు..

            నిష్కారణంగా చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం అతిశయం తో వ్యవహరిస్తూ.. అందరికి అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడుతున్నారు..


          వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు..

         నూటికి 90% కుటుంబాలలో పిల్లలు దూరంగానే వుంటున్నారు.. వీళ్లకు పెద్ధతనం.. ఒంటరి తనం.. అనారోగ్య సమస్యలు.. మనిషి తోడు అవసరం..

            అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు.. విపరీతమైన స్వార్థం పక్క వాడి నీడ కూడా సహించడం లేదు..

దగ్గరి వాళ్ళ మధ్య కూడా గొడవలు.. మాట్లాడుకోక పోవడం.. షరా మాములు అయిపోయింది...


 సినిమా లో  రాసిన ఓ చక్కని డైలాగ్‌ గుర్తుకొస్తుంది........

‘"మనం బాగున్నప్పుడు లెక్కలు చూసుకుని... కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు" ,


వీలైతే  మనం బాగున్నప్పుడు కూడా అందరితో కలిసి ఉండాలి మన వారికీ అవసరమైన సహాయం అందించాలి.

       చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు..

            వలసలు పుణ్యాన.. గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది.. 

        దానికి తోడు కేవలం కూడూ గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు పర్యవసానం..

                బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వేళ పిల్లలు కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా..రిలేషన్స్ లో ఎమోషన్ వుంచుకుందాము అనుకున్నా మెజారిటీ కుటుంబాలలో పెద్ద వాళ్ళు దూరిపోయి అగాధం పెంచుతున్నారు..

           చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి..

              నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో..

      రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని..  మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము..

        నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు? నా ఇంటికి వస్తె ఏమి తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి..

           అందరూ కొద్దిగా ఆలోచించండి.. మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ.. మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము..

               ఎవ్వరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము? 

           ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్ళిపోయారు.. మనకి ఎంత టైం వుంటుందో తెలియదు..

           మనం సక్రమంగా ఆరోగ్యంగా వున్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం, అతిశయం, వదిలి వెద్ధాము....


ఒక్కడై రావడం... ఒక్కడై పోవడం...

ఈ నడుమ అయినా అందరితో కలసి మెలసి ఉందాం...

🙏🙏🙏

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE