NaReN

NaReN

Friday, July 21, 2023

Development_is_a_Culture..

 *#Development_is_a_Culture..*

*దీరూబాయ్ అంబానీ మరణించిన తర్వాత కుటుంబ ఆస్తిని.. నాలుగు వాటాలుగా పంచారు*. 

*10 శాతం భార్యకి..,*

*10 శాతం కూతురికి..,*

*40 శాతం పెద్దకొడుకు ముఖేష్ అంబానీకి.., మిగిలిన 40 శాతం చిన్న కొడుకు అనిల్ అంబానీకి...*


*పదేళ్ల తర్వాత చూస్తే.., అన్నదమ్ములు ఇద్దరి మధ్య ఆస్తిలో తేడా సుమారు లక్ష కోట్లు. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ ఉంటే.., అప్పుల ఊబిలో అనిల్ అంబానీ.*


*ఒకే కుటుంబంలో పెరిగిన ఇద్దరు వ్యక్తులు..,*

*ఒకే వాతావరణంలో పెరిగిన ఇద్దరు వ్యక్తులు..,*

*ఒకే రకమైన అవకాశాలను పొందిన ఇద్దరు వ్యక్తులు..,*

*సమాన సంపదతో వ్యాపారాలు ప్రారంభించిన ఇద్దరు వ్యక్తులు...*

*పది సంవత్సరాల్లో లక్ష కోట్ల తేడా....*


*ఇలాంటి వేలాది ఉదాహరణలు మన బంధువుల్లో, మన ఊర్లో, మన స్నేహితుల్లో  కూడా చూడవచ్చు*


*26 సంవత్సరాలుగా సివిల్ సర్వీస్ అభ్యర్థులకు Public Administration అనే సబ్జెక్టు బోధిస్తున్న ఒక వ్యక్తి ఇటీవలే  ఇదే సబ్జెక్టు మీద ఒక పుస్తకం కూడా రాశాడు. దాని సిలబస్లో భాగంగా DEVELOPMENT ADMINISTRATION అనే చాప్టర్ కూడా చెప్పటం జరిగింది..*


*ఇందులో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే,*

*#Development_is_a_Culture అనే* *అద్భుతమైన విషయం.*

*అంటే అభివృద్ధి అనేది ఒక జీవన విధానం*.


*ఒక కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు ఉద్యోగం చేస్తున్నా సరే.. ఎప్పుడు చూసినా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని కొంతమందిని చూస్తాం.*


*కుటుంబంలో ఒకరే ఉద్యోగం చేస్తున్నా.. ఎప్పుడూ నిండుకుండలా ఉండే మరికొన్ని కుటుంబాలను చూస్తాం*.


*తేడా ఏంటి..?*

*కొంత మంది ఎంత సంపాదించినా ఎందుకు ఎదగలేక పోతున్నారు?*

 *ప్రభుత్వాలు ఎంత ప్రోత్సహించినా ఎందుకు ఎదగలేక పోతున్నారు?*


*కొంత మందికి తల్లిదండ్రులు అన్నీ సమకూర్చినా ఎందుకు ముందుకు వెళ్ళలేక పోతున్నారు..?*


*ఈ అంశాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది..* *#Development_is_a_Culture ...*

*అభివృద్ధి ఒక జీవన విధానం.*


*ఆర్థికాభివృద్ధిలో ఇతరుల కన్నా ఎక్కువ అభివృద్ధి చెందడానికి ఒక ప్రధాన కారణం...*

*Development Orientation (అభివృద్ధి దృక్పథం) ఉండటం...*


*అది ఉన్న వాళ్ళు, వచ్చిన ప్రతి అవకాశాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటారు. అవకాశాలు లేకపోతే సృష్టించుకుంటారు. ఏదో విధంగా ముందుకు దూసుకుపోతారు.*


*నేను కూడా ధీరుబాయ్ అంబానీ కొడుకుని అయితే.., ముకేశ్ అంబానీ లా సంపాదించేవాడిని అని చెబుతారు చాలా మంది. కానీ ధీరుబాయ్ అంబానీ తండ్రి సామాన్యుడు అన్న విషయం గుర్తించరు..*


*నాకు తెలిసిన కొందరు వ్యక్తులలో ఫుల్ బాటిల్ మద్యం తాగి కూడా.., చాలా సాధారణంగా ఇంటికి వెళ్లిపోయేవారు ఉన్నారు.. అలానే ఇంకొంత మంది మాత్రం నాలుగే పెగ్గులు తాగి చేసే పనిని, డబ్బుని, ఆరోగ్యాన్ని, కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకున్న వారు ఉంటారు..*


*అంటే.. ఒక చెడు అలవాటును కూడా నియంత్రించే కొంతమంది జీవితంలో ఎదుగుతూనే ఉంటే...*


*ఆ బలహీనతను నియంత్రించలేని ఎంతో మంది రోడ్డున పడుతున్నారు...*


*అందుకే.......*

*#Development_is_a_Culture...*


*మనలో చాలామందికి ఒక మానసిక జబ్బు ఉంది..*

*ఎవడైనా ముందుకు పోతుంటే... అతని కష్టాన్ని, అతని వ్యక్తిత్వం లోని మంచి లక్షణాలను చూడకుండా..*


*తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని., పెళ్లిలో వచ్చిన కట్నాన్ని., అందరినీ మోసం చేసి సంపాదించాడు అని.., వాడికి అన్నీ కలిసొచ్చాయి అని తీర్పు చెప్తారు... వీళ్లు చూసినట్టుగా..*


*పాపం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి* *_డబ్బులు ఎవరికి ఊరికే రావు_* *అని లలిత జ్యువెలర్స్ గుండాయన ఎంత చెప్పినా....* *ఎవరూ సీరియస్ గా తీసుకోరు.*


*ఈ అంశం మీద చాలా చెప్పాలని ఉంది..*


*కానీ ఒక్క మాటతో ముగిస్తా....*


*ముందుకెళ్లాలన్న కసి....*

*కఠోర శ్రమ...*

*క్రమశిక్షణ...*

*ఎన్నో విషయాల్లో త్యాగాలు లేకుండా.....*


*ఒక వ్యక్తి కానీ....*

*ఒక కుటుంబం కానీ....*

*ఒక కులం గాని....*


*అభివృద్ధి చెందినట్టు చరిత్రలో లేదు...*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE