NaReN

NaReN

Sunday, July 16, 2023

వివిధ వ్రుత్తుల్లో ఉన్నవారి భార్యల రియాల్టీ తిట్లు😜*

 *వివిధ వ్రుత్తుల్లో ఉన్నవారి భార్యల రియాల్టీ తిట్లు😜*



*పైలెట్ భార్య :* 

*నా దగ్గర మరీ అంతలా ఎగరకండి. ఆ తర్వాత ఎగరడానికేమీ ఉండదు.*


*డాక్టర్ భార్య :* 

*ఎవరి రోగం ఎలా కుదర్చాలో మీకే కాదు నాకూ తెలుసు.*


*టీచర్ భార్య :* 

*ఓ పీకారులెండి పేద్ద క్లాసు. ఈ  క్లాసులు ఏవో మీ స్కూల్లో పీకండి.*


*జడ్జి భార్య :*

*ఇది చెప్పడానికి ఇన్ని వాయిదాలెందుకు, నేను ఒక్క ముక్కలో చెప్పేదాన్ని. ఇప్పటికైనా నేను చెప్పేదే ఫైనల్.*


*న్యాయవాది భార్య :* *సరియైన ఆధారాలు నా చేతికి దొరకనివ్యండి అప్పుడు మీకుంటుంది.* 


*యాక్టర్ భార్య :* 

*ఓవర్ యాక్షన్ వద్దు. ఈ మాత్రం యాక్షన్ మాకూ వచ్చు.*


*ఇంజనీర్ భార్య :*

 *పనికిమాలిన ప్లాన్లు వేయడం ఆపండి. ఆ మాత్రం మాకూ తెలుసు.*


*సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య :* 

*మీ బుర్రకి పట్టిన వైరస్ కి ఏ సాఫ్ట్వేర్ వాడాలో నాకు బాగా తెలుసు.*


*పొలిటీషియన్ భార్య :*

 *మీ అధిక ప్రసంగం ఆపకపోతే నేను వాకౌట్ చేయాల్సుంటుంది. మా అమ్మనాన్నలతో అత్యవసర సమావేశం పెడితే తెలుస్తుంది.*


*వ్యాపారి భార్య :* 

*మీ లావాదేవీలు అన్నీ బయట చూపించండి, నాకాడ కాదు.*


*జర్నలిస్ట్ భార్య :* 

*ఈ పాటి కవరేజులు మీ ఛానెల్లో చూపించి ఉంటే కనీసం ప్రమోషన్ ఐనా వచ్చేది. ఎక్స్ ట్రాలు చేస్తే ఇంట్లో మీ లైవ్ కవరేజ్ ని నేను వీధిలో చూపించాల్సి ఉంటుంది.*


*అంటే "యదా భర్త తథా భార్య" అన్నమాట.😀*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE