NaReN

NaReN

Saturday, July 8, 2023

పాత మొబైల్ డేటా కొత్త మొబైల్ లో ఎలా?.

 పాత మొబైల్ డేటా  కొత్త మొబైల్ లో ఎలా..

మన పాత మొబైల్ టు లోని ముఖ్యమన డేటా కొత్త మొబైల్ లో ఎలా రీస్టోర్ చేసుకోవాలో వివరణ




నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. మొబైల్ పోయినప్పుడు గాని లేదా, మీరు వాడుతున్న మొబైల్ పాతదైనప్పుడు గాని కొత్త మొబైల్ కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాము.


అయితే మన పాత మొబైల్ లోని ముఖ్యమన డేటా.. కొత్త మొబైల్ లో ఉండదు. దాంతో చాలా మంది పాత మొబైల్ లోని డేటా.. కొత్త మొబైల్ లోకి వచ్చేటట్లు చేసుకోవడం తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి పాత మొబైల్ లోని డేటాను కొత్త మొబైల్ లోకి ఎలా రికవరీ చేసుకోవాలో చూద్దాం !..


ముందుగా మనం వాడుతున్న పాత మొబైల్ లో డేటా బ్యాక్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. అదెలాగో చూద్దాం..


మొబైల్ లో సెట్టింగ్ ఆన్ చేయాలి.

సెట్టింగ్ ఓపెన్ చేసిన తరువాత బ్యాక్ అప్ డేటా & రిస్టోర్ ( backup deta & factory reset ) అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

అక్కడ బ్యాక్ అప్ మై డేటా అనే ఆప్షన్ ఆన్ చేయాలి.

కింద మన డేటా బ్యాక్ అప్ కావల్సిన మెయిల్ ఐడి ని ఎంచుకోవాలి.

అప్పుడు పాత మొబైల్ లోని మన డేటా అంతా కూడా ఇచ్చిన మెయిల్ ఐడి లో నిక్షిప్తం అవుతుంది.

ఇప్పుడు కొత్త మొబైల్ లో ఆ డేటాను ఎలా పొందాలో చూద్దాం..

కొత్త మొబైల్ తీసుకున్న తరువాత మనం పాత మొబైల్ లో బ్యాక్ అప్ ఏ మెయిల్ ఐడికి పెట్టుకున్నామో అదే మెయిల్ ఐడితో కొత్త మొబైల్ లో లాగిన్ అవ్వాలి.

అప్పుడు ఆటోమాటిక్ గా మన పాత మొబైల్ లోని డేటా మొత్తం బ్యాక్ అప్ రూపంలో కొత్త మొబైల్ లో కనిపిస్తుంది.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE