NaReN

NaReN

Wednesday, July 12, 2023

ఆషాఢంలో స్త్రీలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు..

 

*ఆషాఢంలో స్త్రీలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు.. ప్రత్యేకత ఏమిటి?*




గోరింటాకును ఇష్టపడని మహిళలంటూ ఉండరు. పండుగైనా, ఫంక్షనైనా గోరింటాకు పెట్టాల్సిందే. అలాంటి గోరింటాకును ముఖ్యంగా ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే..? ఆషాడంలో ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోవాల్సిందే. ..

పెళ్లికాని అమ్మాయిల ఊహలకు గోరింటాకు అందాలు అద్దడానికే ఆషాడం వచ్చినట్లు ఉంటుంది. ఎందుకంటే ఎర్రగా పండిన అతివ అరచేతులను కళ్లింతలు చేసుకుని చూడటానికి ఆషాడం పుట్టి ఉంటుంది. చినుకు తడిచి చిద్విలాసంగా తట్టుకునేలా తరుణులకు అండగా ఉండటానికే ఆషాఢం సిద్ధపడి ఉంటుంది.

గోరింటాకును ఇష్టపడని మహిళలంటూ ఉండరు. పండుగైనా, ఫంక్షనైనా గోరింటాకు పెట్టాల్సిందే. అలాంటి గోరింటాకును ముఖ్యంగా ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే..? ఆషాడంలో ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోవాల్సిందే. ..

పెళ్లికాని అమ్మాయిల ఊహలకు గోరింటాకు అందాలు అద్దడానికే ఆషాడం వచ్చినట్లు ఉంటుంది. ఎందుకంటే ఎర్రగా పండిన అతివ అరచేతులను కళ్లింతలు చేసుకుని చూడటానికి ఆషాడం పుట్టి ఉంటుంది. చినుకు తడిచి చిద్విలాసంగా తట్టుకునేలా తరుణులకు అండగా ఉండటానికే ఆషాఢం సిద్ధపడి ఉంటుంది.
 
హెన్నా(గోరింటాకు)తో అద్భుతమైన హెయిర్ బెనిఫిట్స్ ఆషాఢమాసాన అరచేతుల్లో అందంగా మెరిసిపోయే గోరింట ఆధునిక జీవనంలో ఎన్ని పుంతలు తొక్కిందో తెలుసుకుందాం...కోమలమైన చేతుల కోసం ఎర్రని గోరింట మోసుకువచ్చే ఊసులేమిటో కనుక్కొందాము...

దుస్తుల మీద గోరింటాకు మరకలు తొలగించే చిట్కాలు గోరింటాకు చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుళ్లు తొడుక్కుంటుంది. ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి, చేతులకు పెట్టి, రెండు నుంచి 6గంటల సేపు ఉంచితే చాలు ఎరుపు రంగులో మారుతుంది. ఔషధ గుణాలు మెండుగా ఉండే గోరింటాకును చేతులు, పాదాలకు అలంకరించుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు దరిచేరవని చెబుతుంటారు పెద్దలు.

ప్రాచీన కాలం నుండి సౌందర్య సాధానాలలో గోరింటాకు ప్రధాన పాత్రపోషిస్తూ వస్తోంది. చర్మ సంరక్షణలో మరొకటి సాటిలేదనిపించే ఈ ఆకు నుంచి అందమైన డిజైన్లెన్నో సృష్టించారు సృజనకారులు.....

ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది.

అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి.. బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

అందుకే ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా.. డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని.. ఆషాడంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు.

వేదాలలో: గోరింటాకు పూయించి ఎరుపు రంగు సూర్యునికి పత్రీకగా చెప్పారు. అందుకే అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు. జ్ఝాన కాంతిని గోరింట ద్వారా మేలుకొలపడంగా భావించేవారు.

అరబిక్ భాషలో: ‘హెన్నా' అనే పదం నుంచి ‘హెన్నా' వచ్చింది. గోరింటాకు పొడిని హెన్నాగా పేర్కొంటుంటారు. సంసృతంలో గోరింట చెట్టును ‘మేంధికా' అంటారు. ఆ పదం నుంచి మెహిందీ వచ్చింది.

ఐదువేల ఏళ్ల వయస్సు: అదృష్టానికి, ఆరోగ్యానికి గోరింటాకును ప్రతీకగా అరబ్ దేశాలలో ఐదువేల ఏళ్ల క్రితమే వాడినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గోరింట చెట్లు ఇంట్లో ఉంటే ఆత్మలు దరిచేరవని, మంచి భావాలను కలిగిస్తుందిని నమ్మేవారు. కొన్ని తరాల తర్వాత గోరింట ఆకులను ఎండబెట్టి, పొడి చేసి చేతులు, పాదాలపై రేఖాగణిత నమూనాలలో డిజైన్లు వేసుకొనేవారు. వీటి వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందని, అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని భావించేవారు.

ఈజిఫ్ట్ నుంచి: ఈజిఫ్ట్ ‘మమ్మీల' జుట్టు, గోళ్లు ముదురు గోధుమ రంగులోకి రావడానికి గోరింటాకు వాడేవారని వార్త ఉంది. క్రీ. పూ 700 కాలంలో గోరింట మొక్క ఈజిఫ్ట్ నుంచి భారతదేశంలో అడుగుపెట్టిందని వృక్షశాస్త్రజ్ఝలు చెబుతున్నారు.

మతాలకు అతీతం: క్రిస్టియన్, హిందూ, ముస్లిమ్..ఇలా ఏ మతం వారికైనా మెహెందీ విషయంలో భేద భావం లేదు. మనసుకు నచ్చిన డిజైన్ అయితే చాలు. క్రిస్టియన్ పెళ్లివేడుకలలో వెలిగిపోతుంది. తెలుగింటి పల్లెపడచు చేతుల్లో ఒదిగిపోతుంది. ముస్లిమ్ మగువన ముంజేతులను చక్కగా అలంకరిస్తుంది...

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE