NaReN

NaReN

Sunday, July 9, 2023

బై పాస్ సర్జరీ అంటే ఏమిటి?


*బై పాస్ సర్జరీ అంటే ఏమిటి? 

What is bypass surgery?*



❇️గుండె రక్తనాళాలలోని అడ్డులను తొలగించటానికి వివిధ రకాల చికిత్సలున్నాయి. వాటిలో కరోనరీ ఆర్టరీ బై పాస్ గ్రాఫ్ట్ లేదా బైపాస్ సర్జరీ ఒకటి కాగా మరొకటి యాంజియో ప్లాస్టీ స్టెంటింగ్ తో చేసేది దీనినే పెర్కుటేనియస్ ట్రాన్సులూమినల్ కరోనరీ యాంజియో ప్లాస్టీ లేదా పిసిటిఎ అని కూడా అంటారు.


బైపాస్ సర్జరీ అంటే రక్తనాళాలలోని అడ్డంకులను తప్పించి రక్తప్రసరణ పునరుద్ధరిస్తారు. ఈ సర్జరీలో వివిధ ధమనులు, కాలి సిరలు ఉపయోగిస్తారు. దీనిని నిర్వహించేందుకు కొంతమంది డాక్టర్లు, వైద్య సిబ్బంది అవసరమవుతారు. ఈ ఆపరేషన్ చాలా చోట్ల చేస్తున్నప్పటికి అనుభవజ్ఞులైన శస్త్ర చికిత్సకులు చేస్తే రోగులకు మంచి ఫలితాలుంటాయి. ఈ ఆపరేషన్ తర్వాత రోగి కోలుకోటానికి కొంత కాలం పడుతుంది. అయినప్పటికి ఈ ఆపరేషన్ వలన వచ్చే ఫలితాలు దీర్ఘకాలం కొనసాగుతాయి.


బైపాస్ సర్జరీ అనంతరం రోగి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక విశ్రాంతి, తగిన వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించటం చేయాలి. వైద్య పరిశోధనలు బాగా అభివృధ్ధి చెందిన కారణంగా ఆపరేషన్ వ్యయం కూడా నేడు బాగా తగ్గుముఖం పట్టింది. ఆపరేషన్ల సంఖ్య పెరిగింది. చాలావరకు ఆపరేషన్లు విజయవంతమవుతూనే వున్నాయి. ఆపరేషన్ తర్వాత రోగి తీసుకునే జాగ్రత్తలననుసరించి అతని మిగిలిన జీవితకాలం ఆనందంగానే వుంటుంది.


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE