NaReN

NaReN

Saturday, July 8, 2023

ఈ ఫైలింగ్ సులభంగా చేయడం ఎలా

 ఈ ఫైలింగ్ సులభంగా చేయడం ఎలా

ఇన్కమ్ టాక్స్ కొత్త వెబ్ పోర్టల్ లో e filling సులభ తరం చేయడం జరిగింది.

ఈ ఫైలింగ్ లో మొత్తం 5 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది 5 సెక్షన్స్ చాలా సులభంగా fill చేసే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది.

ఈ లింక్ ఓపెన్ చేయండి.

https://eportal.incometax.gov.in/iec/foservices/#/login


కుడి వైపు పైన ఎకౌంట్ సింబల్ కనిపిస్తుంది క్లిక్ చేసినట్లయితే లాగిన్ ఆప్షన్ కనపడుతుంది. అక్కడి నుండి వెబ్సైట్లోకి లాగిన్ చేయవలసి ఉంటుంది.


మీరు మీ  పాన్ నెంబర్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ చేయవలసి ఉంటుంది.

లాగిన్ అయిన తర్వాత 

E-file సెలెక్ట్ చేయాలి 

E-file లో ఫైల్ ఇన్కమ్ టాక్స్ రిటర్న్ సెలెక్ట్ చేయాలి.

Assessment year 2023- 24 select చేసి కంటిన్యూ చేయాలి.

Next Online Return select  ప్రొసీడ్ చేయాలి.

Start new file ➡️ individual ➡️ itr-1 proceed ➡️ let get started

Next 

👉 Others

సెలక్ట్ చేసి continue చేయాలి.


ఈ ఫైలింగ్ లో fill చేయవలసి నటువంటి ఐదు సెక్షన్స్

1. Personal information

2. Gross total income

3. Total deduction

4. Taxes paid

5. Total tax liability

ఒక్కో సెక్షన్ ల వివరాలను fill చేస్తూ కన్ఫమ్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది.


1. Personal information

ఈ సెక్షన్లో మీ యొక్క వ్యక్తిగత వివరాలు చూపించబడతాయి. ఏవైనా తప్పులు గా ఉన్నట్లయితే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి, అడ్రస్ లో మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి లు,రెండు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.

నోట్: (మీ పేరులో ఏదైనా స్పెల్లింగ్ తప్పుగా ఉన్నట్లయితే మార్పు చేయడానికి అవకాశం ఉండదు.)


2. Gross total income


Salary as per sec 17(1) మీయొక్క one year గ్రాస్ శాలరీ ఎంటర్ చేయవలసి ఉంటుంది.

Next మీరు house rent deduction చేసుకోవాలి అంటే U/C 10(13A) ప్రకారం form 16 లో మీకు తగ్గించబడిన ఇంటి అద్దె ఇక్కడ నమోదు చేయాలి.

Net salary చూపిస్తుంది.


Next మీకు స్టాండర్డ్ డిడక్షన్ U/C 16(ia) ప్రకారం ₹ 50 వేలు తగ్గించబడుతుంది.


U/C 16(iii) లో PT ఎంటర్  చేయవలసి ఉంటుంది.

స్టాండర్డ్ డైరెక్షన్ మరియు వృత్తి పన్ను మినహాయించి మీయొక్క గ్రాస్ ఇన్కమ్ చూపించబడుతుంది.

తరువాత home loan interest మినహాయింపు పొందాలనుకునేవారు 

Income from house property లో 

add details  పై click చేయాలి.

House property లో 

Self Occupied   సెలెక్ట్ చేసి: మీయొక్క home loan interest నమోదు చేయాలి.

House rent and home loan interest మినహాయింపు పొందాలనుకునేవారు 

LET OUT select చేయాలి.

ఇక్కడ మొదటగా మీ హౌస్ కి వస్తున్నటువంటి రెంటు నమోదు చేయాలి.

లోకల్ ఆధారిటీ వారికి టాక్స్ రూపంలో చెల్లించిన మొత్తాన్ని నమోదు చేయాలి.

మీకు 30 శాతం annual value తగ్గింపు వస్తుంది. 

     (లేదా)

 మీ సొంత ఇంట్లో మీ తల్లితండ్రులు ఉంటూ,మీరు పని చేసే ప్రాంతం లో రెంటు కు ఉంటే self occupied

Select చేసుకొని హోమ్ లోన్ ఇంట్రెస్ట్ మినహాయింపు పొందవచ్చును.

Next మీ home loan interest నమోదు చేయాలి.

Sec 24 b ప్రకారం 2 లక్షల వరకు,


ఇంకా ఇతర మినహాయింపులు చూపిస్తుంది అర్హత ఉన్నట్లయితే చూపించుకోవచ్చు.


3. Total deductions


👉మీ అక్క అన్ని రకాల తగ్గింపులను ఈ సెక్షన్లో నమోదు చేయవలసి ఉంటుంది.

👉 మొదట మీకు కనిపించే 

any deduction for donation paid లో  

yes అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది  sec.80G


👉 Sec 80C లో మీ యొక్క GPF,GIS, LIC,TSGLI మరియు హోమ్ లోన్ పై ఉన్నటువంటి అసలు మొత్తం, మీ పిల్లల యొక్క ట్యూషన్ ఫీజు తగ్గింపులను మొత్తంగా 

₹ 1,50,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

👉 Sec 80G లో వంద శాతం తగ్గింపు పొందడానికి అవకాశం ఉంటుంది.దీనిలో EWF,సైనిక ఫండ్, CMRF విరాళం వంద శాతం మినహింపు పొందవచ్చు.


👉 హొమ్ లోన్ అదనపు వడ్డీ మిణాయింపు

Sec 84 EE లో ₹ 50,000

ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే

SEC 80EEA లో 1.5 లక్షల మినహాయింపు పొందవచ్చును.


👉 80D హెల్త్ ఇన్సూరెన్స్ అలవెన్స్ చెల్లింపులు, మెడికల్ చెకప్ కోసం చేసిన ఖర్చులు తగ్గింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.


👉 80E Education loan మినహాయింపు

👉 80DD మెడికల్ ట్రీట్మెంట్ 75000 - 125000 వరకు మినహాయింపు పొందవచ్చు.


Next any other deductions లో yes అని క్లిక్ చేయాలి.

ఇక్కడ CPS వారు 

80CCD(1)  cps కాంట్రిబ్యూషన్

80ccd(1B) అదనంగా ₹ 50000 మినహాయింపు పొందవచ్చు.


👉 మీరు ఈ  సెక్షన్ ఓపెన్ చేయగానే మీకు తగ్గింపునకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. మీకు అర్హత ఉన్నటువంటి తగ్గింపు ఎదురుగా  అమౌంట్  ఎంటర్ చేయవలసి ఉంటుంది.

ఈ సెక్షన్లో చివరగా మీ యొక్క పూర్తి తగ్గింపు మొత్తం చూపించబడుతుంది.


4. Taxes paid

ఈ సెక్షన్లు  మనం చెల్లించిన  టాక్స్ చూపించబడుతుంది.

అడ్వాన్స్ గా టాక్స్ పే చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వివరాలు నమోదు చేయవచ్చు.


వివరాలు కనిపించనట్లయితే 

Details of tax deductions లో 

show details క్లిక్ చేసి  add details క్లిక్ చేయండి.

Tan of deductor 

name of the deductor 

Total chargeable income

 total tax deducted

వివరాలు మరియు అడ్వాన్స్ టాక్స్ వివరాలు ఎంటర్ చేయండి.


5. Total tax liability

ఈ సెక్షన్లో మన యొక్క గ్రాస్ ఆదాయం నుండి  డిడక్షన్ మినహాయించిన తర్వాత taxble ఇన్కమ్ ఎంత ఉంటుందనేది చూపిస్తుంది.

టాక్స్ ఎంత పడింది అనేది చేసి చూపించడం జరుగుతుంది. 

ఫార్మ్ 16 లో ఉన్నటువంటి టోటల్ ట్యాక్ష్ 

ఇక్కడ చూపించిన ట్యాక్స్  రెండు  టాలి అయిన తర్వాత మీరు మీయొక్క ఈ ఫైలింగ్ వెరిఫై చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE