మనస్పర్ధలు
ఇద్దరు స్నేహితుల మధ్య మనస్పర్ధలు వస్తే,
మాట్లాడుకోవడం మానేస్తే మంచివాడు మాట్లాడలేకపోతున్నానే అని బాధపడుతూ ఉంటాడు.
కానీ చెడ్డవాడు మాత్రం నీతో మాట్లాడటం మానేసినప్పటినుంచి
నీ గురించి ఇతరుల దగ్గర మాట్లాడటం మొదలుపెడతాడు.
అది కూడా నీ గురించి నెగిటివ్ గా .
కాబట్టి స్నేహం చేసేటప్పుడు ఎదుటివాడి గురించి ఆలోచించి స్నేహం చేయాలి.
అదేవిధంగా మంచి స్నేహితుడైతే ప్రాణాన్ని పణంగా పెట్టిన కాపాడుకోవాలి .
చెడ్డ స్నేహితుడిని అంతకంటే పది రెట్లు ఎక్కువ జాగ్రత్తగా మనతోనే ఉంచుకోవాలి.
నచ్చినా నచ్చకున్నా.
ఎందుకంటే మంచి స్నేహితుడు దూరమైతే బాధే ఉంటుంది.
కానీ చెడ్డ స్నేహితుడు దూరం అయితే కష్టాన్ని కూడా మిగులుస్తాడు కాబట్టి .
స్నేహభందాన్ని ఈ సృష్టిలో ఏ భందాన్ని ఏ బంధం తో పోల్చలేం.
అన్నదమ్ములు విడిపోవడానికి అస్తిపంపకాలున్నాయి .
దాంపత్యానికైనా విడాకులు ఉన్నాయి విడిపోవడానికి .
కానీ స్నేహం విడిపోవాలంటే మరణమే శరణ్యం.
కాబట్టి అట్లాంటి పవిత్రమైన స్నేహం లో మనస్పర్ధలు వస్తే,
మాట్లాడుకోకుండా ఉండాల్సిన తరుణం వస్తే
ఒకరి గురించి ఒకరు possitive గా మాట్లాడుకోండి.
కానీ నెగటివ్ గా మాట్లాడుకుని ఉన్న దూరాన్ని శాశ్వతం చేసుకోకండి ప్లీజ్
No comments:
Post a Comment